Biology | వెస్ట్రన్ బ్లాట్ పరీక్ష ద్వారా ఏ వ్యాధిని నిర్ధారిస్తారు?
జీవశాస్త్రం
1. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. రాణిఖేట్ అనే వ్యాధి పశువుల్లో వైరస్ ద్వారా సంభవించే వ్యాధి
బి. రింగ్ వార్మ్ అనేది ఒక శిలీంధ్రపు వ్యాధి
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీ సరికాదు
2. కింది వాటిలో సరైనది?
ఎ. టీనియాసిస్ అనేది హెల్మింథిస్ వ్యాధి
బి. ట్రిపనోసోమా అనే వ్యాధి కారకం వల్ల అతినిద్ర వ్యాధి కలుగుతుంది
సి. ప్లాస్మోడియం వైవాక్స్ అనేది ఒక వైరస్
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి 4) సి
3. ప్రతిపాదన (ఎ): కలుషిత ఆహారం వల్ల బొట్యులిజమ్ వ్యాధి సంభవిస్తుంది
కారణం (ఆర్): క్లాస్ట్రీడియమ్ టెటాని అనేది బొట్యులిజమ్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా
1) ఎ సరైనది. ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ సరైనది ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఆర్ మాత్రమే సరైనది
4) ఎ, ఆర్ రెండూ సరైనవి కాదు
4. కింది వాటిలో భిన్నమైనది ఏది?
1) మశూచి 2) డిఫ్తీరియా
3) కలరా 4) న్యుమోనియా
5. కింది వాటిని జతరపరచండి.
వ్యాధి పేరు బ్యాక్టీరియా కారకం
ఎ. డిఫ్తీరియా 1. కార్ని
బి. గనేరియా 2. డిప్లోకోకస్
సి. సిఫిలిస్ 3. ట్రిపానిమా పల్లిడమ్
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-2, బి-1, సి-3
4) ఎ-1, బి-3, సి-2
6. ప్రపంచ వ్యాప్తంగా పూర్తిగా నిర్మూలించిన వ్యాధి?
1) మశూచి 2) కలరా
3) పోలియో 4) క్షయ
7. ప్లాస్మోడియం వల్ల కలిగే మలేరియా దేనివల్ల వ్యాప్తి చెందుతుంది?
1) గాలి 2) స్పర్శ
3) ఆహారంపై వాలే ఈగలు
4) దోమ కాటు
8. పెరుగు తయారు కావడానికి ఉపయోగపడేది?
1) రైజోబియం 2) లాక్టోబాసిల్లస్
3) స్టెఫలోకోకస్ 4) స్ట్రెప్టోకోకస్
9. కింది వాటిలో భిన్నమైనది?
1) మశూచి 2) తట్టు
3) కలరా 4) క్షయ
10. కింది వాటిని జతపరచండి.
ఎ. ప్లాస్మోడియం 1. అమీబియాసిస్
బి. ఎంటామీబా 2. బోదకాలు
సి. టీనియా 3. మలేరియా
డి. ఉకరేరియా 4. సిస్టోసోమియాసిస్
1) ఎ-1, బి-3, సి-4, డి-2
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-3, బి-1, సి-2, డి-4
11. మశూచి : వైరస్ : మలేరియా : ?
1) శిలీంధ్రం 2) ప్రొటోజోవా
3) బ్యాక్టీరియా 4) వైరస్
12. కింది వాటిని జతపరచండి.
ఎ. BCQ 1. న్యుమోనియా
బి. వర్టిసెల్లా 2. ఆటలమ్మ
సి. PCU 3. క్షయ
డి. OPV 4. పోలియో
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
13. కింది వాటిలో వారసత్వంగా వచ్చే వ్యాధి?
1) ల్యుకేమియా 2) వర్ణాంధత్వం
3) మాలిగ్నెన్సీ 4) హెపటైటిస్
14. వైరస్ సంబంధిత వ్యాధి?
1) మశూచి 2) డెంగీ
3) ఎయిడ్స్ 4) పైవన్నీ
15. కింది ప్రవచనాలను అధ్యయనం చేసి సరైన మేళవింపును గుర్తించండి.
ఎ. టైఫాయిడ్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది
బి. సాధారణ జలుబు వైరస్ వల్ల వస్తుంది
సి. మలేరియా బ్యాక్టీరియా వల్ల వస్తుంది
డి. ఎయిడ్స్ వైరస్ వల్ల వస్తుంది
1) సి, డి సరైనవి. ఎ సరైనది కాదు
2) బి, డి సరైనవి. ఎ సరైనది కాదు
3) బి, సి సరైనవి. డి సరైనది కాదు
4) ఎ, బి, సరైనవి. సి సరైనది కాదు
16. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) వ్యాధి కారకం?
1) బ్యాక్టీరియా 2) వైరస్
3) ప్రొటోజోవా 4) శిలీంధ్రం
17. కింది వాటిలో ఏది నీటి వల్ల వచ్చే జబ్బు కాదు?
1) టైఫాయిడ్ 2) కలరా
3) హెపటైటిస్ 4) డెంగీ
18. ఫ్లోరోసిస్కు సంబంధించి కింది ప్రవచనాలు అధ్యయనం చేయండి.
ఎ. దీని వల్ల కాళ్లు, చేతులు తీవ్ర ప్రభావానికి గురవుతాయి
బి. ఫ్లోరోసిస్ వల్ల కలిగే దుష్ఫలితాలను పాలు, ఆకుపచ్చని కూరగాయలు అధికంగా తీసుకోవడం ద్వారా నివారించవచ్చు
సి. తాగే నీటిలో ఫ్లోరైడ్ 1.5 పీపీఎం కన్నా ఎక్కువైతే దంత ఫ్లోరోసిస్ కలుగుతుంది
డి. భారతదేశంలో తాగే నీటిలో ఫ్లోరైడ్ యుక్తతమ స్థాయి 2.5 పీపీఎం పైవాటిలో సరైనది ఏది?
1) ఎ, బి 2) బి, సి, డి
3) ఎ, డి 4) ఎ, బి, సి
19. తామర దేని వల్ల కలుగుతుంది?
1) శిలీంధ్రం 2) వైరస్
3) బ్యాక్టీరియా 4) ప్రొటోజోవా
20. కింది వాటిని జతపరచండి.
వ్యాధి కారణభూత సూక్ష్మజీవి
ఎ. కలరా 1. శిలీంధ్రం
బి. అమ్మోరు 2. వైరస్
సి. మలేరియా 3. బ్యాక్టీరియా
డి. గోధుమ పొట్టు 4. ప్రొటోజోవా
1) ఎ-3, బి-2, సి-4, డి-1
2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-3, బి-4, సి-2, డి-1
21. పిచ్చి కుక్క కాటు వల్ల సంభవించేది?
1) మలేరియా 2) హైడ్రోఫోబియా
3) టైఫాయిడ్ 4) పైవేవీ కాదు
22. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. శాండ్ ఈగ కాటు వల్ల బ్లాక్సిక్నెస్ వ్యాధి కలుగుతుంది
బి. సీసీ ఈగ కాటు వల్ల అతినిద్ర వ్యాధి కలుగుతుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీ కాదు
23. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. ఒక సంవత్సరం లోపు శిశువుల్లో ప్రొటీన్ లోపం వల్ల క్వాషియార్కర్ వ్యాధి కలుగుతుంది
బి. ఒక సంవత్సరం పైబడిన శిశువుల్లో ప్రొటీన్ల లోపం వల్ల మరాస్మస్ వ్యాధి కలుగుతుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీ కాదు
24. కింది వాటిని జతపరచండి.
వ్యాధి పేరు వ్యాధికారక బ్యాక్టీరియా
ఎ. ధునుర్వాతం 1. క్లాస్ట్రీడియమ్ టెటాని
బి. కోరింత దగ్గు 2. హిమోఫిల్లస్ పెర్టుసిస్
సి. గొంతు వాపు 3. స్ట్రెప్టోకోకస్
డి. సిఫిలిస్ 4. ట్రిపనోసోమా పల్లిడమ్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
25. కింద తెలిపిన వ్యాధుల్లో శిలీంధ్రం వల్ల కలిగేది?
1) పసుపు పచ్చ ఈనెల వ్యాధి
2) టొబాకో మొజాయిక్
3) గోధుమ కుంకుమ తెగులు
4) వడలడం
26. గాలి నుంచి వ్యాపించే వ్యాధి?
1) క్షయ 2) ప్లేగు
3) కలరా 4) టైఫాయిడ్
27. సిట్రస్ కాంకర్ ఏ జీవుల్లో ఏ కారకం వల్ల కలుగుతుంది?
1) పశువుల్లో, వైరస్ వల్ల
2) మొక్కల్లో, బ్యాక్టీరియా వల్ల
3) మానవుల్లో, బ్యాక్టీరియా వల్ల
4) మొక్కల్లో, వైరస్ వల్ల
28. ఆంత్రాక్స్ కారకం?
1) వైరస్ 2) బ్యాక్టీరియా
3) ప్రొటోజోవా 4) శిలీంధ్రం
29. వైరస్ వల్ల మానవుడిలో కలిగే వ్యాధి?
1) విషపడిశం (ఇన్ఫ్లూయెంజా)
2) మలేరియా 3) కలరా
4) అతిసారం (డయేరియా)
30. ఎలిసా ఏ వ్యాధి గుర్తింపునకు వాడే పరీక్ష?
1) పోలియో వైరస్ 2) ఎయిడ్స్
3) క్షయ రోగ సూక్ష్మజీవులు
4) క్యాన్సర్
31. పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి కారకం?
1) బ్యాక్టీరియా 2) వైరస్
3) ప్రియాన్ 4) శిలీంధ్రం
32. డీపీటీ దేనికి టీకా మందు?
1) డయేరియా, పోలియో, టైఫాయిడ్
2) డిఫ్తీరియా, కోరింత దగ్గు, టెటానస్
3) డయేరియా, పోలియో
4) దగ్గు, టైఫాయిడ్
33. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. మీజిల్స్ వ్యాధికారక వైరస్ వెరిసిల్లా వైరస్
బి. మంప్స్ వ్యాధి కారక వైరస్ పారామిక్సో వైరస్
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవన్నీ సరైనవి
34. కింది అంశాలు అధ్యాయనం చేయండి.
ఎ. ప్లాస్మోడియం వల్ల మానవుడి కాలేయ కణాలు నాశనం అవుతాయి
బి. ఎంటామీబా హిస్టోలైటికా వల్ల మలేరియా వ్యాధి కలుగుతుంది
సి. ఉకరేరియా వల్ల మానవుడిలో బోద వ్యాధి కలుగుతుంది
డి. లీష్మానియా వల్ల అతినిద్ర వ్యాధి కలుగుతుంది
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, సి
35. వెస్ట్రన్ బ్లాట్ పరీక్ష ద్వారా ఏ వ్యాధిని నిర్ధారిస్తారు?
1) టైఫాయిడ్ 2) సిఫిలిస్
3) గనేరియా 4) ఎయిడ్స్
36. ఎబోలా వ్యాధికారకం?
1) వైరస్ 2) బ్యాక్టీరియా
3) శిలీంధ్రం 4) ప్రొటోజోవా
37. కింది వాటిని జతపరచండి.
వ్యాధి పేరు వ్యాధికారక వైరస్
ఎ. మెదడువాపు 1. ఆర్బోవైరస్ వ్యాధి
బి. మశూచి 2. వరియోల
సి. పోలియో 3. ఎంటిరో
డి. చికున్ గున్యా 4. ఆల్ఫా
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1
38. ఉకరేరియా సాధారణ నామం?
1) మలేరియా పరాన్నజీవి
2) కొంకి పురుగు
3) బోద పురుగు 4) నులి పురుగు
39. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంటస్టైన్ అని ఏ వ్యాధిని పిలుస్తారు?
1) జియార్డియాసిస్ 2) విజినైటిస్
3) బ్లాక్ సిక్నెస్ 4) టీనియాసిస్
40. మలేరియా పరాన్నజీవి శాస్త్రీయనామం?
1) ఎంటామీబా 2) ప్లాస్మోడియం
3) ఉకరేరియా 4) టీనియా
41. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. ట్రిపనోసోమా గాంబియెన్సీ వ్యాధికారకం వల్ల అతినిద్ర వ్యాధి కలుగుతుంది
బి. బ్లాక్ సిక్నెస్ వ్యాధి కారకం లీష్మానియా డోనోవాని
1) ఎ 2) బి 3) ఎ, బి
4) ఏదీకాదు
42. కింది వాటిలో సరైనది?
ఎ. హాన్సెన్ వ్యాధికి మరోపేరు కుష్టు
బి. నిశ్శబ్ద హంతకి అని గుండెపోటును అంటారు
సి. మెదడుకు సంబంధించిన వ్యాధి మెనింజైటిసిస్
1) ఎ, బి, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, సి
43. కింది వాటిలో కంటామినేషన్ వ్యాధికి ఉదాహరణ?
1) ఫ్లూ 2) అమీబియాసిస్
3) తట్టు 4) డిఫ్తీరియా
44. కింది వాటిని జతపరచండి.
వ్యాధి పేరు వ్యాధి కారకం
ఎ. కలరా 1. వైరస్
బి. మలేరియా 2. బ్యాక్టీరియా
సి. చికున్ గున్యా 3. ప్రొటోజోవా
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-2, బి-3, సి-1
3) ఎ-3, బి-2, సి-1
4) ఎ-2, బి-1, సి-3
45. దోమ వల్ల వ్యాప్తి చెందే వ్యాధి?
1) అతినిద్ర వ్యాధి 2) కాలా అజార్
3) ఢిల్లీ బాయిల్స్ 4) మలేరియా
46. కింది వాటిలో భిన్నమైంది?
1) తట్టు 2) పోలియో
3) చికున్ గున్యా 4) క్షయ
47. సీసీ ఈక ద్వారా ఏ వ్యాధి వ్యాప్తి చెందుతుంది?
1) అమీబియాసిస్ 2) మలేరియా
3) కలరా 4) ట్రిపనోసోమియాసిస్
48. ఓరియంటల్ సార్స్ వ్యాధి ఏ క్రిమి వల్ల కలుగుతుంది?
1) లీష్మానియా డోనావాని
2) లీష్మానియా ట్రోపికా
3) ట్రైకోమోనాస్ విజినాలిస్
4) ఎంటామీబా హిస్టోలిటికా
49. జీవి (అతిథేయి) వెలుపల నిర్జీవంగా, జీవి లోపల సజీవంగా ఉండేది?
1) బ్యాక్టీరియా 2) శిలీంధ్రం
3) ప్రొటోజోవా 4) వైరస్
50. కింది వాటిని జతపరచండి.
మొక్కల్లో వచ్చే వ్యాధి
ఎ. సిట్రస్ కాంకర్ 1. బ్యాక్టీరియా
బి. తిక్కా తెగులు 2. శిలీంధ్రం
సి. మొజాయిక్ వ్యాధి 3. వైరస్
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-2, బి-3, సి-1
4) ఎ-3, బి-1, సి-2
సమాధానాలు
1. 2 2. 4 3. 2 4.1
5. 1 6. 1 7.4 8.2
9.4 10.2 11.2 12.2
13.2 14.4 15.4 16.2
17.4 18.4 19.1 20.1
21.2 22.3 23.3 24.1
25.3 26.1 27.2 28.2
29.1 30.2 31.2 32.2
33.2 34.4 35.4 36.1
37.1 38.3 39.1 40.2
41.3 42.4 43.2 44.2
45.4 46.4 47.4 48.2
49.4 50.1
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు