Current Affairs | క్రీడలు
వెర్స్టాపెన్
రెడ్‌బుల్ స్టార్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ స్పానిష్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. జూన్ 4న స్పెయిన్‌లో జరిగిన ఈ రేసులో పోల్ పొజిషన్ నుంచి మొదలుపెట్టి 26 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మెర్సిడెజ్ స్టార్ లూయిస్ హామిల్టన్ రన్నరప్‌గా నిలువగా, రసెస్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 7 రేసులు జరిగితే అందులో ఐదు వెర్స్టాపెన్ గెలిచాడు.
ఎంబాపె
పారిస్ సెయింట్ జర్మన్ జట్టు స్ట్రైకర్ కిలియన్ ఎంబాపె రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి ‘ఫ్రెంచ్ గోల్డెన్ బూట్’ దక్కించుకున్నాడు. జూన్ 4న యూరోపా లీగ్‌లో పారిస్ సెయింట్ జర్మన్ జట్టు చేతిలో 2-3 తేడాతో ఓడిపోయింది. అయినప్పటికీ ఎంబాపె లీగ్‌లో తన 29వ గోల్ నమోదు చేసి గోల్డెన్ బూట్ గెలుచుకున్నాడు.
సిద్ధార్థ్
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సిద్ధార్థ్ చౌదరి స్వర్ణ పతకం సాధించాడు. దక్షిణ కొరియాలో జూన్ 5న ఈ టోర్నీలో సిద్ధార్థ్ షాట్‌పుట్‌ను 19.52 మీ. దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. జావెలిన్ త్రోలో శివం (72.34 మీ.), 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో షారుఖ్ ఖాన్ (8 నిమిషాల 51.74 సెకన్లు), లాంగ్‌జంప్‌లో సుస్మిత (5.96 మీ.) రజత పతకాలు గెలుచుకున్నారు.
ధనుష్
ఐఎస్ఎస్ఎఫ్ (ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్) జూనియర్ ప్రపంచకప్‌లో తెలంగాణకు చెందిన షూటర్ ధనుష్ స్వర్ణం గెలుచుకున్నాడు. జర్మనీలోని షుల్లో జూన్ 5న జరిగిన పోటీలో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ధనుష్ స్వర్ణం సాధించాడు. కలిన్ పొంటోస్ (స్విట్జర్లాండ్)కు రజతం, రోమైన్ (ఫ్రాన్స్)కు కాంస్య పతకాలు దక్కాయి. 628.4 పాయింట్లతో ఆరో స్థానంతో ధనుష్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. అలాగే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో ధనుష్ రజత పతకం గెలుచుకున్నాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?