Current Affairs | అంతర్జాతీయం
ఎంనెక్
మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ కొమొడో (ఎంఎన్ఈకే-ఎంనెక్)ను జూన్ 4న ప్రారంభించారు. ఐదు రోజులు సాగిన 4వ ఎడిషన్ ఈ ఎక్సర్సైజ్ను ఇండోనేషియా ఆధ్వర్యంలో మకస్సర్ పోర్ట్‌లో నిర్వహించారు. ‘పార్ట్నర్షిప్ టు రికవర్ అండ్ రైజ్ స్ట్రాంగర్’ అనే థీమ్‌తో ఈ ఎంనెక్ను నిర్వహించారు. దీనిలో భారత్, యూఎస్ఏ, యూకే, చైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, బ్రూనై, బంగ్లాదేశ్, జపాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, మయన్మార్, మలేషియా, కెన్యా, కంబోడియా, కెనడా, చిలీ, ఫిజి తదితర దేశాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ ఎక్సర్సైజ్ మొదటి ఎడిషన్ 2014లో నిర్వహించారు.
డెబ్ట్ సీలింగ్
అమెరికా రుణ పరిమితి (డెబ్ట్ సీలింగ్)ని ఎత్తివేసే చట్టంపై అధ్యక్షుడు జో బైడెన్ జూన్ 4న సంతకం చేశారు. చెల్లింపుల కోసం అమెరికా ప్రభుత్వం తీసుకునే రుణాలపై విధించిన గరిష్ఠ పరిమితినే ‘డెబ్ట్ సీలింగ్’ అంటారు. ప్రస్తుతం అమెరికా అప్పుల పరిమితి 31.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఈ పరిమితిని దాటి అప్పులు చేసేందుకు బైడెన్ ప్రభుత్వం కాంగ్రెస్ అనుమతి కోరింది. 314-117 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది.
ఫతా
అత్యాధునిక క్షిపణిని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్‌లోని ఏరోస్పేస్ చీఫ్ జనరల్ అమిర్ అలీ హాజీజాదే జూన్ 6న ప్రారంభించారు. దీనికి ఫతా అని పేరు పెట్టారు. ఇది ధ్వనితో పోలిస్తే 15 రెట్లు వేగంగా దూసుకెళ్లే హైపర్సోనిక్ క్షిపణి. దీనిలో కదిలే నాజిల్ ఉంది. దీంతో అది మార్గమధ్యలో తన గమ్యాన్ని మార్చుకోగలదు. ఇది 14,000 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే
మెర్సర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ర్యాంకులను జూన్ 7న విడుదల చేశారు. ప్రతి నగరంలో వసతి, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం వంటి 200 వరకు అంశాలకయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకుని దీన్ని రూపొందించారు. దీనిలో ప్రపంచ వ్యాప్తంగా చూస్తే హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లోని ముంబై 147, ఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్ 202, కోల్‌కతా 211, పుణె 213వ స్థానాల్లో నిలిచాయి. దేశీయంగా చూస్తే ముంబై మొదటి స్థానంలో నిలువగా.. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, పుణె నిలిచాయి.
వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని (వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆధ్వర్యంలో జూన్ 7న నిర్వహించారు. కలుషిత ఆహారం వల్ల అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు, ప్రజల్లో ఆహార భద్రత పట్ల అవగాహన పెంచేందుకు ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ డేని 2018లో ఏర్పాటు చేసింది. మొదటి ఫుడ్ సేఫ్టీ డేని 2019లో నిర్వహించారు. ఈ ఏడాది దీని థీమ్ ‘ఆహార ప్రమాణాలు ప్రాణాలను కాపాడుతాయి (ఫుడ్ స్టాండర్డ్స్ సేవ్ లైవ్స్)’.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?