Geography | దేశంలో నోటిఫై చేసిన మూడు జాతీయ పార్కులు గల నగరం?
1. దేశంలో షెడ్యూల్డ్ తెగల జనాభా అధికంగా గల రాష్ర్టాల అవరోహణ క్రమాన్ని గుర్తించండి.
ఎ) మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఒడిశా
బి) మధ్యప్రదేశ్-అరుణాచల్‌ప్రదేశ్- మహారాష్ట్ర
సి) మధ్యప్రదేశ్-మహారాష్ట్ర- అరుణాచల్‌ప్రదేశ్
డి) మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్-మహారాష్ట్ర
2. ‘శూన్య జనాభా పెరుగుదల రేటు’ అంటే?
ఎ) ఒక దేశంలో పోయే వలసలు, జననాల రేటు, మొత్తం ఆ దేశ మరణాల రేటుతో సమానం కావడం
బి) ఒక దేశంలోకి వచ్చే వలసలు, జననాల రేటు, మొత్తం ఆ దేశ మరణాల రేటుతో సమానం కావడం
సి) ఒక దేశంలోకి వచ్చే వలసలు, మరణాల రేటు, మొత్తం ఆ దేశ జననాల రేటుతో సమానం కావడం
డి) ఒక దేశంలో జనాభా పరిమాణం, ఆ దేశ భూభాగంలోని వనరుల పరిమాణానికి అనుగుణంగా ఉండటం
3. కింద తెలిపిన ఏ దశాబ్ద కాలంలో భారతదేశంలో దశాబ్దపు జనాభా పెరుగుదల రేటు అల్పంగా ఉంది?
ఎ) 1911-21 బి) 1921-31
సి) 1951-61 డి) 1991-2001
4. కింది వాటిలో సరికాని జతను పేర్కొనండి.
ఎ) మిజోరం – అత్యధిక బాలల లింగ నిష్పత్తి
బి) హర్యానా – అత్యల్ప బాలల లింగ నిష్పత్తి
సి) కేరళ – అత్యధిక అక్షరాస్యత శాతం
డి) నాగాలాండ్ – అత్యధిక జనాభా వృద్ధి రేటు
5. కింది వాటిలో 2011 జనాభా లెక్కల సేకరణ నినాదం?
ఎ) మన జనాభా, మిలియన్ సంవత్సరాల భవిష్యత్తు
బి) ఒక జనాభా, మిలియన్ సంవత్సరాల భవిష్యత్తు
సి) ఒక జనాభా, ఒక భవిష్యత్తు
డి) మన జనాభా, మన భవిష్యత్తు
6. కింది వాటిలో స్త్రీ, పురుష నిష్పత్తి తక్కువ ఉండటానికి కారణాలు?
1. ప్రసూతి మరణాల రేటు ఎక్కువగా ఉండటం
2. ఆడ శిశువుల విషయంలో గర్భస్రావాలు చేయించుకోవడం
3. ప్రసవ సమయంలో స్త్రీ, శిశువుల నిష్పత్తి తక్కువగా ఉండటం
ఎ) 1 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 2, 3
7. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యధిక పట్టణీకరణ చెందిన రాష్ర్టాల అవరోహణ క్రమాన్ని కింది వాటిలో
గుర్తించండి.
ఎ) గోవా – తమిళనాడు – కేరళ – మిజోరాం
బి) గోవా – మిజోరాం – తమిళనాడు – కేరళ
సి) గోవా – కేరళ – మిజోరాం – తమిళనాడు
డి) తమిళనాడు – గోవా – మిజోరాం – కేరళ
8. దేశంలో నగరీకరణ ప్రక్రియలో కింద తెలిపిన ఏ జనాభా లెక్కల సేకరణలో మెగా సిటీ అనే భావనను ప్రవేశ పెట్టారు?
ఎ) 1981 బి) 1991
సి) 2001 డి) 2011
9. గోదావరి – ప్రాణహిత లోయ కింది వాటిలో ఏ నిల్వలకు ప్రసిద్ధి?
ఎ) గ్రాఫైట్ బి) గ్రానైట్
సి) బొగ్గు డి) డోలమైట్
10. తెలంగాణలోని ఖనిజ ఆధారిత పరిశ్రమలో కిందివాటిలో ఏ రంగం ఆధిపత్యాన్ని కలిగి ఉంది?
ఎ) స్పాంట్ ఐరన్ ప్లాంట్
బి) గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లు
సి) సిమెంట్ ప్లాంట్లు
డి) రెడిమిక్స్ కాంక్రీట్ యూనిట్లు
11. భారతదేశపు మొదటి ఇంధన సమర్థవంతమైన ఎ-1 క్యాటగిరీ రైల్వేస్టేషన్ కింది వాటిలో ఏది?
ఎ) సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
బి) కాచీగూడ రైల్వేస్టేషన్
సి) బెంగళూరు రైల్వేస్టేషన్
డి) ఛత్రపతి శివాజీ టర్మినల్ రైల్వేస్టేషన్
12. ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం’ కు సంబంధించి కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.
ఎ) గోదావరి నది నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా సాగు కోసం అందించాలని ప్రతిపాదించింది
బి) దాదాపు 45,000 ఎకరాల భూమిని సాగు చేయాలని ప్రతిపాదించారు
సి) ఇది ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్టు
డి) కన్నెపల్లి గ్రామ సమీపంలో ఈ ప్రాజెక్టు ఉంది
13. తెలంగాణలో ఏ పట్టణాన్ని దక్షిణ భారతదేశపు బొగ్గుగని అని పిలుస్తారు?
ఎ) సిద్దిపేట బి) కొత్తగూడెం
సి) కరీంనగర్ డి) బెల్లంపల్లి
14. జనాభా గణాంకాల ప్రకారం, భారత స్వాతంత్య్ర అనంతరం తెలంగాణలో జనాభా వృద్ధి రేటు అత్యధికంగా ఉన్న దశాబ్దం ఏది?
ఎ) 1961-71 బి) 1971-81
సి) 1981-91 డి) 1991-2001
15. 2011 జనాభా గణాంకాలు, తెలంగాణ ప్రభుత్వ ‘సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్’ 2018 ప్రకారం, తెలంగాణ జనాభా సంబంధిత కింది జతలను పరిశీలించండి.
1. 2011లో తెలంగాణలో అక్షరాస్యత రేటు 66.54 శాతం
2. తెలంగాణలో 2001-2011 దశాబ్ద కాలపు జనాభా వృద్ధి రేటు 15.57 శాతం
3. 2011 తెలంగాణలో మొత్తం జనాభాలో పట్టణ జనాభా 40.88 శాతం
4. 2011లో తెలంగాణలో లింగ నిష్పత్తి 988
5. 2011లో తెలంగాణలో జనాభా సాంద్రత 342
ఎ) 2, 3, 4, 5 బి) 1, 2, 4, 5
సి) 2, 3, 4, 1 డి) 1, 2, 4
16. కింది వివరణలను పరిశీలించండి.
1. తెలంగాణలో అత్యంత ఎత్తయిన జలపాతం దాదాపు 150 అడుగుల ఎత్తులో కడెం నదిమీద ఉంది
2. మల్లెల తీర్థం జలపాతం ప్రాణహిత మీద ఉంది
3. కావేరి నదికి భీమా ఒక ఉపనది
4. హైదరాబాద్ శివారులో గల వనస్థలిపురం వద్ద గల మహావీర్ హరిణీ వనస్థలి పార్క్ జింకలకు ప్రసిద్ధి చెందింది
ఎ) 1, 4 బి) 2, 3
సి) 1, 2 డి) 3, 4
17. కింద పేర్కొన్న సాగునీటి పథకాల్లో ఏవి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి?
1. చనాకా – కొరటా ప్రాజెక్ట్
2. మత్తడి వాగు ప్రాజెక్ట్
3. నాల్వాయి ప్రాజెక్ట్
4. సదర్మత్ ప్రాజెక్ట్
5. సాత్నాలా ప్రాజెక్ట్
ఎ) 3, 4, 5 బి) 1, 2, 3
సి) 1, 2, 4, 5 డి) 1, 2, 5
18. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్స్టైల్స్ పార్కులు?
1. టెక్స్టైల్ పార్క్ – సిరిసిల్ల – రాజన్న సిరిసిల్ల జిల్లా
2. టెక్స్టైల్ పార్క్ – పాశమైలారం – సంగారెడ్డి జిల్లా
3. టెక్స్టైల్ పార్క్ – మల్కాపూర్ – యాదాద్రి భువనగిరి
ఎ) 1, 2, 3 బి) 1, 3
సి) 2, 3 డి) 1, 4
19. కింది వాటిని వ్యవస్థాపక సంవత్సరం ఆధారంగా క్రమపద్ధతిలో తెలపండి.
1. హైదరాబాద్ ఆస్బెస్టస్
2. వజార్ సుల్తాన్ టొబాకో
3. ప్రాగా టూల్స్
4. అల్విన్ మెటల్ వర్క్స్
ఎ) 2, 4, 3, 1 బి) 4, 1, 3, 2
సి) 2, 3, 4, 1 డి) 1, 4, 3, 2
20. జతపరచండి.
1. మెట్పల్లి ఎ. ఇత్తడి సామాను
2. పెంబర్తి బి. ఖాదీ
3. గద్వాల సి. గాజులు
4. హైదరాబాద్ డి. చేనేత చీరలు
ఎ) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
బి) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
21. గోదావరి నదిపై ఇచ్చంపల్లి ప్రతిపాదిత ప్రాజెక్ట్ స్థలానికి దిగువన గంగారం గ్రామం దగ్గర నిర్మాణమైన ఎత్తిపోతల పథకం?
ఎ) గుత్తి ఎత్తిపోతల పథకం
బి) దేవాదుల ఎత్తిపోతల పథకం
సి) అలీసాగర్ ఎత్తిపోతల పథకం
డి) సింగూరు ఎత్తిపోతల పథకం
22. తెలంగాణలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి మొదటి ఫేజ్‌లో కింది వాటిలోని ఏ కారిడార్ భాగం కాదు?
ఎ) హైదరాబాద్-నల్లగొండ
పారిశ్రామిక కారిడార్
బి) హైదరాబాద్-వరంగల్
పారిశ్రామిక కారిడార్
సి) హైదరాబాద్-నాగ్‌పూర్
పారిశ్రామిక కారిడార్
డి) హైదరాబాద్-బెంగళూరు
పారిశ్రామిక కారిడార్
23. తెలంగాణలో అత్యంత విసృ్తతంగా ఉన్న నేలలు?
ఎ) ఒండ్రు నేలలు
బి) నల్లరేగడి నేలలు
సి) ఎర్ర నేలలు డి) చిత్తడి నేలలు
24. దేశంలో నోటిఫై చేసిన మూడు జాతీయ పార్కులు గల ఏకైక నగరం?
ఎ) నాగ్‌పూర్ బి) హైదరాబాద్
సి) ముంబై డి) పుణె
25. భారత ప్రభుత్వం వన్యమృగ సంరక్షణ కోసం ‘ఇండియన్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్’ అనే సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1952 బి) 1954
సి) 1953 డి) 1951
26. తెలంగాణ ఊటీగా పేరు గాంచినది?
ఎ) నీలగిరి కొండలు
బి) అనంతగిరి కొండలు
సి) దుమకొండలు
డి) నల్లమల కొండలు
27. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1. రాష్ట్రంలో పట్టు పరిశ్రమలో మహిళల భాగస్వామ్యం 60 శాతం కంటే ఎక్కువ
2. రాష్ట్రంలో టస్సర్ పట్టును ఎక్కువగా గిరిజన కుటుంబాలు సాగు చేస్తున్నాయి
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) పైవేవీ కావు
28. తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదుల దిశ?
ఎ) వాయవ్యం నుంచి నైరుతి
బి) వాయవ్యం నుంచి ఆగ్నేయం
సి) ఈశాన్యం నుంచి ఆగ్నేయం
డి) ఈశాన్యం నుంచి నైరుతి
29. కింది వాటిలో గోదావరి నదికి ఉపనది కానిది?
ఎ) కొయనా బి) శబరి
సి) పూర్ణ డి) ప్రవరా
30. కింది వాటిలో ఏ నది సింకరం వద్ద తూర్పు కనుమల్లో పుట్టి కోలబ్ నదిగా మారుతుంది?
ఎ) ప్రాణహిత బి) కృష్ణా
సి) శబరి డి) గోదావరి
31. తెలంగాణలో శీతాకాలంలో నమోదయ్యే సగటు ఉష్ణోగ్రత?
ఎ) 220c – 230c బి) 250c – 260c
సి) 200c – 250c డి) 300c – 320c
32. వేసవి కాలంలో సంభవించే వర్షాలు ఏవి?
ఎ) చక్రవాత వర్షాలు
బి) సంవహన వర్షాలు
సి) పర్వతీయ వర్షాలు
డి) పైవేవీ కావు
33. వ్యవసాయం చేయడం ‘రుతుపవనాలతో జూదం’ అనే నానుడి ఏ రాష్ట్రంలోవాడుకలో ఉంది?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) మహారాష్ట్ర
సి) కర్ణాటక డి) తెలంగాణ
34. అత్యల్ప ఉష్ణోగ్రత ఏ జిల్లాల్లో నమోదవుతుంది(మొదటి రెండు జిల్లాలు వరుసగా)?
ఎ) పెద్దపల్లి, కామారెడ్డి
బి) మెదక్, ఆదిలాబాద్
సి) ఖమ్మం, హైదరాబాద్
డి) భద్రాద్రి, ఖమ్మం
35. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏ ప్రాంతానికి చెందుతుంది?
ఎ) ఉపశుష్క ప్రాంతం
బి) శుష్క ప్రాంతం
సి) ఆర్ద్ర శుష్క ప్రాంతం
డి) ఆర్ద్రత ప్రాంతం
36. నైరుతి రుతుపవనాల వల్ల తక్కువ వర్షపాతం పొందే జిల్లా?
ఎ) జగిత్యాల బి) వనపర్తి
సి) వికారాబాద్
డి) గద్వాల-జోగులాంబ
37. నైరుతి రుతుపవనాల వల్ల అత్యధిక వర్షపాత పొందే జిల్లా?
ఎ) ఆదిలాబాద్ బి) కరీంనగర్
సి) జగిత్యాల డి) పెద్దపల్లి
జవాబులు
1-ఎ 2-బి 3-ఎ 4-డి
5-డి 6-డి 7-బి 8-సి
9-సి 10-బి 11-బి 12-సి
13-బి 14-ఎ 15-ఎ 16-ఎ
17- డి 18-ఎ 19-ఎ 20-ఎ
21- బి 22-ఎ 23-సి 24-బి
25- ఎ 26-బి 27-సి 28-బి
29- ఎ 30-సి 31-ఎ 32-బి
33- డి 34-బి 35-ఎ 36-డి
37-ఎ
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
మీకు తెలుసా?
బాల్య వివాహాల నిషేధ చట్టం – 2006
- వివాహ సమయంలో వరుడి కనీస వయస్సు 21, వధువు వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి
- వీరిరువురి వయస్సులో ఏ ఒక్కరి వయస్సైనా పేర్కొన్నదాని కంటే తక్కువగా ఉంటే దాన్ని బాల్య
వివాహంగా పరిగణిస్తారు. - ఒకవేళ 21 ఏళ్లు నిండిన వ్యక్తి బాల్య వివాహం చేసుకుంటే తనకు 2 ఏళ్ల జైలుశిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తారు
- బాల్యవివాహం రద్దయిన తర్వాత ఈ బాలికకు తిరిగి వివాహం అయ్యేవరకు పురుషుడు మనోవర్తి చెల్లించాలి. ఒకవేళ ఈ వ్యక్తి మైనర్ అయితే అతని తల్లిదండ్రులు చెల్లించాలి.
- ఈ చట్టం ప్రకారం ఇలాంటి వివాహాన్ని ప్రోత్సహించినవారు కూడా నేరస్థులే అవుతారు.
- ఈ బాల్యవివాహం సమయంలో ఇచ్చిన కానుకలను వివాహం రద్దయిన తర్వాత తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు