Child Rights UNCRC | బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
బాలల హక్కులు
హెలెన్ కెల్లర్
- అమెరికాలోని జన్మించిన హెలెన్ కెల్లర్ 19 నెలల వయస్సులో విషజ్వరం సోకి కంటి చూపు, నోటి మాట కోల్పోయారు.
- ఆమె 8వ ఏట బ్రెయిలీ లిపి నేర్చుకున్నారు.
- ఆమెకు సారాపుట్టర్ అనే ఉపాధ్యాయిని మాట్లాడటం నేర్పింది. మాట్లాడే వారి పెదవులపై, కంఠంపై వేళ్లుంచి భాషను
నేర్చుకున్నారు. - 33వ ఏట నుంచి ప్రత్యేక అవసరాలు గలవారి గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించారు.
- దివ్యాంగుల్లో అత్యున్నత విద్యనభ్యసించిన ఘనత సాధించి ఎంతో మంది దివ్యాంగుల కు ఆదర్శంగా నిలిచారు.
- 88 సంవత్సరాల వయస్సులో చనిపోయిన హెలెన్ కెల్లర్ ఎంతోమందిలో అనేక రకాలుగా స్ఫూర్తి నింపారు.
బాలల హక్కులు - బాలలకు ప్రధానంగా నాలుగు హక్కులున్నాయి. అవి.
1. జీవించే హక్కు
2. రక్షణ పొందే హక్కు
3. అభివృద్ధి చెందే హక్కు
4. భాగస్వామ్య హక్కు - ప్రభుత్వం బాలల కోసం చేసిన చట్టాలు…
1. 1933 నాటి బాలల చట్టం చిన్న పిల్లలను శ్రమ దోపిడీ నుంచి రక్షించుకోవడానికి తల్లిదండ్రులకు ఉపాధి, ఆర్థిక సహాయం చేయడం
2. 1938 నాటి బాలల ఉద్యోగ కల్పన చట్టం కఠిన శ్రమకులోనైన పనుల్లో పిల్లలను వినియోగించొద్దు.
3. 1948 నాటి బాల కార్మికుల చట్టం – కర్మాగారాల్లో పిల్లలతో పని చేయించొద్దు.
మరికొన్ని బాలల హక్కులు - సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే హక్కు
- తల్లిదండ్రుల సంరక్షణలో ఉండే హక్కు
- కోరుకున్న పేరును కలిగి ఉండే హక్కు
- జీవించే హక్కు
- పరిశుభ్రమైన తాగునీటి హక్కు
- సంఘంగా నిర్వహించే హక్కు
- పోషకాహారం పొందే హక్కు
- లైంగిక వేధింపుల నుంచి విముక్తి పొందే హక్కు
- జాతీయతను కలిగి ఉండే హక్కు
- సామాజిక భద్రత పొందే హక్కు
- వినోదం పొందే హక్కు
- నాణ్యమైన ఉచిత విద్య పొందే హక్కు
- విశ్రాంతి పొందే హక్కు
- సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే హక్కు
- ప్రేమ, ఆప్యాయతలను పొందే హక్కు
- ఆడుకొనే హక్కు
- శారీరక, ఆర్థిక దోపిడీ నుంచి విముక్తి పొందే హక్కు
- అవమానం నుంచి రక్షణ పొందే హక్కు
- ప్రశంసలు పొందే హక్కు
- భావ వ్యక్తీకరణ హక్కు
- మనిషిగా గుర్తింపు పొందే హక్కు
- యుద్ధం నుంచి రక్షణ పొందే హక్కు
- మత స్వాతంత్య్రపు హక్కు
- సమాన విద్యావకాశాలు పొందే హక్కు
- సమాన సాంస్కృతిక అవకాశాలు పొందే హక్కు
బాలల పార్లమెంటు - పాఠశాలలో చదవడం, రాయడం రాదని మొదటి స్థానం పొందటం లేదని శారీరకంగా, మానసికంగా హింసించొద్దు.
- 6 నుంచి 18 సంవత్సరాల వయస్సు ఉన్న 30 మంది బాల బాలికలతో ఏర్పాటు చేసినదే బాలల పార్లమెంటు. ఇందులో ఆవాస ప్రాంతంలోని బాలలు సభ్యులుగా ఉంటారు.
- బాలల పార్లమెంటు విద్య,
ఆరోగ్యం, బాలల సమస్యలు, బాలల హక్కుల ఉల్లంఘన వంటి అంశాలతో ప్రతివారం సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించాలి.
బాలల హక్కుల పరిరక్షణ కేంద్రం - బాలలను శారీరకంగా, మానసికంగా హింసించినా, బాలల హక్కులకు భంగం కలిగించినా, బాలల హక్కుల
పరిరక్షణ కేంద్రం వారు తగిన చర్యలు చేపడుతారు. - బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు 2009 ప్రకారం బాలల హక్కులకు భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటారు.
- బాలల హక్కుల పరిరక్షణ కేంద్రం ఉచిత ఫోన్ నంబర్ 1800 425 35 25
- ఈ సంస్థ కార్యాలయం రాజీవ్ విద్యామిషన్, హైదరాబాద్‌లో ఉంది.
బాలల హక్కుల పరిరక్షణ క్లబ్ - ప్రతి పాఠశాలలో బాలల హక్కుల పరిరక్షణ క్లబ్‌లు ఏర్పాటు చేయాలి. దీనిలో పాఠశాలలోని బాలలు సభ్యులుగా ఉంటారు. ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేయాలి.
- బాలల హక్కులకు భంగం వాటిల్లకుండా చూడటం, బాలల అవసరాలు తీర్చడం ఈ క్లబ్ చేయవలసిన పనులు
చైల్డ్‌లైన్ - బాల కార్మికులు, వీధి బాలలు, వివక్షతకు గురైనవారు, లైంగిక వేధింపులకు గురైనవారు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడినవారు. బాల్య వివాహ బాధితులు, హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితుల కోసం ‘చైల్డ్ లైన్’ అనే ప్రత్యేక సహాయ కేంద్రం పని చేస్తుంది.
- దీని ఉచిత ఫోన్ నంబర్ 1098
- వీరికి సమాచారమిస్తే తక్షణం హాజరై బాలల సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తారు.
- వీరు అవసరమైతే బాలలను పునరావాస కేంద్రాలకు పంపించి ఉచితంగా వసతి కల్పించి చదువు చెప్పిస్తారు.
- బాలలు లైంగిక వేధింపులకు గురికాకుండా భారత ప్రభుత్వం 2012లో బాలల లైంగిక వేధింపుల నిరోధ చట్టాన్ని రూపొందించింది.
- బాలలను లైంగిక వేధింపుల నుంచి కాపాడి తగిన న్యాయం అందించడానికి 1098 ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించింది.
ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల బిల్లు
- 18 సంవత్సరాలు నిండని వారంతా బాలలే. బాలల పోషణ, సమగ్రాభివృద్ధి తల్లిదండ్రుల కనీస బాధ్యత. రాజ్యం బాలల హక్కులను గౌరవించి
పరిరక్షిస్తుంది. - కింది బాలల హక్కులు, బాధ్యతలను ఐక్యరాజ సమితి 1989లో ప్రతిపాదించింది. ఇవి ప్రపంచంలోని బాలల, యువకుల హక్కులు. భారత ప్రభుత్వం ఈ పత్రాన్ని 1992లో ఆమోదించింది.
ప్రాక్టీస్ బిట్స్
1. హెలెన్ కెల్లెర్ ఏ దేశానికి చెందినవారు?
ఎ) న్యూజిలాండ్ బి) అమెరికా
సి) బ్రిటన్ డి) ఫ్రాన్స్
2. హెలెన్ కెల్లెర్ ఏ రంగంలో పేరుగాంచారు?
ఎ) ప్రపంచ శాంతి పరిరక్షణ ఉద్యమం
బి) ప్రత్యేకావసరాలు కలిగిన పిల్లల గురించి ఉద్యమం
సి) బాలకార్మిక వ్యతిరేక ఉద్యమం
డి) స్త్రీల హక్కుల ఉద్యమం
3. హెలెన్ కెల్లెర్కు మాట్లాడటం నేర్పిన ఉపాధ్యాయురాలు?
ఎ) సారా మృణాళిని
బి) సారాపుట్టర్
సి) సారా మిల్లర్
డి) సారా టేలర్
4. బాలల పార్లమెంట్‌కు సంబంధించి సరికానిది గుర్తించండి.
ఎ) ఇందులో 6-14 సంవత్సరాల వయస్సు గల వారు మాత్రమే సభ్యులు
బి) ఇందులో సభ్యులు 30 మంది
సి) ఆవాస ప్రాంతాల బాలలు సభ్యులుగా ఉంటారు
డి) కేరళలో 2722 బాలల పార్లమెంటుల్లో 6 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు
5. బాలలకు ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం చేసిన సంవత్సరం?
ఎ) 2002 బి) 2006
సి) 2009 డి) 2010
6. కింది వాటిలో బాలల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఉచిత ఫోన్ సర్వీస్?
ఎ) 1800 245 3525
బి) 1800 542 3525
సి) 1800 425 3525
డి) 1800 254 3525
7. బాలల హక్కుల పరిరక్షణ కేంద్రం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) సర్వశిక్షా అభియాన్
బి) రాజీవ్ విద్యామిషన్, హైదరాబాద్
సి) అక్షర మిషన్
డి) పైవేవీకాదు
8. చైల్డ్‌లైన్ ఉచిత ఫోన్ నంబర్?
ఎ) 1092 బి) 1904
సి) 1098 డి) 1009
9. బ్రెయిలీ లిపి ఎవరికి ఉద్దేశించినది?
ఎ) మూగవారు బి) చెవిటివారు
సి) అంధులు డి) మానసిక వికలాంగులు
జవాబులు
1.బి 2.బి 3.బి 4.ఎ
5.సి 6.సి 7.బి 8.సి 9.సి
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు