Bank Recruitment 2023 | బ్యాంకుల్లో కొలువుల మేళా! ఆర్ఆర్బీల్లో 8612 ఖాళీలు
డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి సువర్ణావకాశం. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో కొలువులతో పాటు ఐడీబీఐలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో పోస్టులు, పరీక్ష విధానం గురించి సంక్షిప్తంగా…
గ్రామీణ బ్యాంకుల్లో….
- రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (ఆర్ఆర్బీ)లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XII ద్వారా వివిధ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ప్రకటన విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు: 8612 (మొదట ప్రకటించిన ఖాళీల సంఖ్య 8594 నుంచి ఈ సంఖ్య 8612కు పెరిగింది)
- పోస్టులు: స్కేల్-3 సీనియర్ మేనేజర్, స్కేల్-2 మేనేజర్, స్కేల్-1 అసిస్టెంట్ మేనేజర్, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)
- అర్హతలు: ఆఫీస్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. మేనేజర్ పోస్టుకు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి/ సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి. సీనియర్ మేనేజర్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. ఐదేండ్ల అనుభవం ఉండాలి.
- వయస్సు: ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18-28 ఏండ్ల మధ్య ఉండాలి. మిగిలిన పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
- ఎంపిక విధానం: పోస్టును బట్టి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల
ఆధారంగా చేస్తారు. - ప్రిలిమ్స్‌లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
- మెయిన్స్‌లో రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్/ హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
- నోట్: రాష్ర్టానికి చెందిన అభ్యర్థులు ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
- నోట్: నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.
ముఖ్యతేదీలు - దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: జూన్ 21
- ప్రిలిమ్స్ ఎగ్జామ్: ఆగస్టులో
- మెయిన్స్ ఎగ్జామ్: సెప్టెంబర్‌లో
- వెబ్సైట్: https://www.ibps.in
ఐడీబీఐ
- ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) కాంట్రాక్టు ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు: 1036
- పోస్టులు: ఎగ్జిక్యూటివ్
- అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం. కంప్యూటర్ ఆపరేషన్స్‌లో డిగ్రీ/సర్టిఫికెట్ లేదా డిప్లొమా కలిగి ఉండాలి. వయస్సు 20- 25 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఆన్లైన్లో దరఖాస్తుకు చివరితేదీ : జూన్ 7,
పరీక్ష తేదీ : జూలై 2. - వెబ్సైట్: https://www.idbibank.in
Previous article
INDIAN POLITY | ప్రకరణల ప్రకారం.. పరిపాలన విధానం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?