Geography | ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని ఏ మహాసముద్రాన్ని పిలుస్తారు?
1. జతపరచండి.
1. గుజరాత్‌లోని భుజ్ భూకంపం
2. మహారాష్ట్రలోని కొయనా భూకంపం
3. మహారాష్ట్రలోని లాతూరు భూకంపం
4. అసోం భూకంపం
ఎ. 1967 బి. 2001
సి. 1950 డి. 1999
1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
2. సునామీ అంటే?
1) ఉవ్వెత్తున లేచిన సముద్ర కెరటాలు
2) సముద్ర గర్భంలో భూకంపం సంభవించటం వల్ల పెద్ద ఎత్తున కెరటాలు ఏర్పడటం
3) పై రెండు 4) ఏదీ కాదు
3. సునామీలు ఎక్కువగా సంభవించే ప్రాంతం ఏది?
1) పసిఫిక్ మహాసముద్రం
2) హిందూ మహాసముద్రం
3) అరేబియా మహాసముద్రం
4) ఏదీకాదు
4. కింది వాటిలో సరైనది ఏది?
1) భూకంప నాభి లోతు, భూకంపం సంభవించే వైశాల్యం మధ్యగల సంబంధం అనులోమానుపాత సంబంధం
2) భూకంప నాభి లోతుకు, భూకంప తీవ్రతకు మధ్యగల సంబంధం విలోమానుపాత సంబంధం
3) పై రెండు 4) ఏదీకాదు
5. సమాన కంపన పరిమితి కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు?
1) ఐసోబార్స్ 2) ఐసోథర్మ్
3) ఐసో కైనటిక్స్ 4) ఐసోసిస్మల్ లైన్స్
6. సునామీ అనే పదం ఏ భాషకు సంబంధించినది?
1) జపనీస్ 2) అరబిక్
3) ఐరిస్ 4) ఏదీకాదు
7. భూమి లోపల భూకంపం ప్రారంభమయ్యే ప్రాంతం ఏది?
1) ఆది కేంద్రం 2) నాభి
3) భూమధ్య రేఖ 4) ఏదీకాదు
8. కింది వాటిలో సరైనది గుర్తించండి?
1) భూకంపాలు స్వతసిద్ధంగా సంభవించటం అనేది వాటి సహజ లక్షణం
2) భూకంపాలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆకస్మికంగా సంభవిస్తాయి
3) భూకంపాలను ముందుగా ఊహించడానికి లేదా నివారించడానికి ఎటువంటి అవకాశం ఉండదు 4) పైవన్నీ
9. కింది వాటిలో ఏ భూకంపాలు అత్యంత ప్రమాదకరమైనవి?
1) అగాథ భూకంపాలు
2) గాథ భూకంపాలు
3) మాధ్యమిక గాథ భూకంపాలు
4) ఏదీ కాదు
10. జతపరచండి.
1. భూమి ఉపరితలం నుంచి 60 కి.మీ లోతులో సంభవించే భూకంపాలు
2. భూమి అంతర్భాగంలో 60 కి.మీ నుంచి 300 కి.మీ లోతులో సంభవించే భూకంపాలు
3. భూమి అంతర్భాగంలో 300 కి.మీ ల కంటే ఎక్కువ లోతులో సంభవించే భూకంపాలు
ఎ. మాధ్యమిక భూకంపాలు
బి. గాథ భూకంపాలు
సి. అగాథ భూకంపాలు
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-బి, 2-సి, 3-ఎ
3) 1-బి, 2-ఎ, 3-సి
4) 1-ఎ, 2-సి, 3-బి
11. జతపరచండి.
1. పసిఫిక్ పరివేష్టిత మేఖల
2. ప్రపంచ మధ్య పర్వత
3. ప్రపంచంలో భూకంపాలు సంభవించని ప్రాంతం
4. ఇండియాలో భూకంపాలు అధికంగా సంభవించే రాష్ర్టాలు
ఎ. మధ్యధరా సముద్ర ద్వీపాలు, కాకసస్, హిమాలయ పర్వతాలు
బి. ఉత్తర, దక్షిణ అమెరికా మేఖల పశ్చిమ తీరం, జపాన్, ఫిలిప్పీన్స్
సి. ఆస్ట్రేలియా
డి. అసోం, మహారాష్ట్ర, గుజరాత్
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
12. భూకంప వైపరీత్యాలకు గురయ్యే తీవ్రత దృష్ట్యా భారతదేశాన్ని ఎన్ని జోన్లుగా విభజించారు?
1) 5 2) 4 3) 6 4) 7
13. జతపరచండి.
1. మెర్కాలీ స్కేలుపై విభాగాల సంఖ్య
2. రిక్టర్ స్కేలుపై విభాగాల సంఖ్య
3. ప్రాథమిక తరంగాలు
4. ద్వితీయ తరంగాలు
ఎ. I-XII
బి. 0 నుంచి 9 వరకు సంఖ్య
సి. P తరంగాలు
డి. S తరంగాలు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
14. మెర్కాలీ స్కేలు తీవ్రత ఆధారంగా దేశాన్ని ఎన్ని భూకంప మండలాలుగా విభజించారు?
1) 5 2) 6 3) 4 4) 3
15. కింది వాటిలో అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే ప్రాంతంగా గుర్తించినది ఏది?
1) ఈశాన్య భారతదేశం 2) జమ్ముకశ్మీర్
3) గుజరాత్ 4) పైవన్నీ
16. జతపరచండి.
1. పసిఫిక్ పరివేష్టిత మేఖలలో సంభవించే భూకంపాల శాతం
2. ప్రపంచ మధ్య పర్వత మేఖలలో సంభవించే భూకంపాల శాతం
3. ప్రపంచంలోని ఇతర ప్రదేశాల్లో సంభవించే భూకంపాల శాతం
ఎ. 21 శాతం బి. 68 శాతం
సి. 11 శాతం
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-సి, 2-బి, 3-ఎ
3) 1-బి, 2-ఎ, 3-సి
4) 1-ఎ, 2-సి, 3-బి
17. భూకంపాలను గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఏమంటారు?
1) సిస్మాలజీ 2) సిస్మోగ్రాఫ్
3) పెడాలజీ 4) సిస్మోగ్రామ్
18. భూమి పొరల లోపల ఆకస్మికంగా జరిగిన కదలిక వల్ల ఉత్పత్తి అయ్యేవి ఏవి?
1) కంపన తరంగాలు
2) ప్రకంపన తరంగాలు
3) పై రెండు 4) ఏదీ కాదు
19. జతపరచండి.
1. భూకంప తరంగాలన్నింటిలో అత్యంత ప్రమాదకరమైనవి
2. ఘన పదార్థాల గుండా మాత్రమే ప్రయాణించే తరంగాలు
3. ధ్వని తరంగాలు (అనుదైర్ఘ్య తరంగాలు)
ఎ. S తరంగాలు బి. L తరంగాలు
సి. C తరంగాలు
1) 1-ఎ, 2-సి, 3-బి
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-సి, 2-బి, 3-ఎ
4) 1-బి, 2-ఎ, 3-సి
20. భూ అంతర్భాగంలో సంభవించే ఆకస్మిక చలనాల కారణంగా ఉద్భవించిన శక్తి కంపన తరంగాలు భూ ఉపరితలాన్ని చేరే సమయం ఎంత?
1) నిమిషం కంటే తక్కువ
2) నిమిషం కంటే ఎక్కువ
3) రెండు నిమిషాల కంటే తక్కువ
4) రెండు నిమిషాల కంటే ఎక్కువ
21. చరిత్రలో సంభవించిన పెద్ద పెద్ద భూ కంపాలన్నీ ఏ రకానికి చెందినవి?
1) విరూపకారక భూకంపాలు
2) అగ్ని పర్వత భూ కంపాలు
3) పాతాళ సంబంధ భూకంపాలు
4) ఉపరితల భూకంపాలు
22. ఆస్ట్రేలియాలో భూకంపాలు సంభవించకపోవడానికి గల కారణం ఏమిటి?
1) ఇది భూకంప ఛాయా మండలంలో ఉండటం
2) ఇది భూకంప ఛాయా మండలంలో లేకపోవడం
3) పై రెండు 4) ఏదీ కాదు
23. జతపరచండి.
1. భూకంపాలను నమోదు చేసే పరికరం
2. భూకంపాలను నమోదు చేసి చిత్ర రూపంలో తెలియజేసేది
3. భూకంపాలను కొలిచే పరికరం
ఎ. సిస్మోగ్రామ్ బి. సిస్మోగ్రాఫ్
సి. రిక్టర్ స్కేలు
1) 1-బి, 2-సి, 3-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-బి, 2-ఎ, 3-సి
4) 1-సి, 2-బి, 3-ఎ
24. కింది వాటిలో సరైనది ఏది?
1) భూకంపాల గురించి భారతదేశం చేపట్టిన ప్రాజెక్టు- వసుంధర ప్రాజెక్టు
2) భూకంపాల గురించి మొదట పరిశోధనలు చేసినది- చైనీయులు
3) భూకంప తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతం- ఆది కేంద్రం 4) పైవన్నీ
25. భూకంపం వచ్చినప్పుడు ఏ తరంగాలు నెమ్మదిగా పయనిస్తాయి?
1. ఉపరితల తరంగాలు
2. ద్వితీయ తరంగాలు
3. ప్రాథమిక తరంగాలు
4. ధ్వని తరంగాలు
26. దేని లోతును బట్టి భూకంపశక్తి సామర్థ్యాలు ఆధారపడి ఉంటాయి?
1) భూకంప తీవ్రత 2) ఎపి సెంటర్
3) ఫోకస్ 4) భూకంప సమయం
27. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0 ఉన్నప్పుడు విడుదలయ్యే శక్తి ఎంత?
1) 2.5 ఎర్గ్స్ 2) 80 ఎర్గ్స్
3) 446 ఎర్గ్స్ 4) 2,500 ఎర్గ్స్
28. సునామీలు సంభవించడానికి అతి ఎక్కువగా కారణమవుతున్నవి?
1) భూకంపాలు 2) అగ్నిపర్వతాలు
3) భూపాతాలు
4) వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు
29. జతపరచండి.
1. ఇటలీ ఎ. సంబోలి, మౌంట్ ఎట్నా
2. హవాయి బి. కోటోపాక్సి
3. ఈక్వెడార్ సి. మౌనలోవా
4. సిసిలీ డి. వెనూవియస్
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
30. కింది వాటిని జతపరచండి.
అగ్ని పర్వతాలు ఉదాహరణలు
1. నిద్రాణ ఎ. బారన్
2. క్రియాశీల బి. కిలిమంజారో
3. విలుప్త సి. ప్యూజియామ
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-బి, 2-సి, 3-ఎ
3) 1-సి, 2-బి, 3-ఎ
4) 1-ఎ, 2-సి, 3-బి
31. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని ఏ మహాసముద్రాన్ని పిలుస్తారు?
1) హిందూ మహాసముద్రం
2) అట్లాంటిక్ మహాసముద్రం
3) పసిఫిక్ మహాసముద్రం
4) ఏదీకాదు
32. జతపరచండి.
1. క్రియాశీల అగ్నిపర్వతాలు
2. నిద్రాణ అగ్నిపర్వతాలు
3. విలుప్త అగ్నిపర్వతాలు
ఎ. జీవితకాలంలో ఒకేసారి విస్ఫోటనం చెందేవి
బి. జీవితకాలంలో తరచుగా విస్ఫోటనం చెందేవి
సి. జీవితకాలంలో విస్ఫోటనం సంభవించినట్లు ఆధారాలు లేని అగ్నిపర్వతాలు
1) 1-సి, 2-బి, 3-ఎ
2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-బి, 2-సి, 3-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి
33. దేశంలో వేడినీటి బుగ్గలు గల ప్రాంతం ఏది?
1) కులుమనాలి 2) రాజమహల్ కొండలు
3) హిమాలయ పర్వతాలు
4) పైవన్నీ
34. కింది వాటిలో భూతాప విద్యుచ్ఛక్తి కేంద్రం ఏది?
1) హిమాచల్ ప్రదేశ్‌లోని మణికరన్
2) లఢక్‌లోని పుగాలోయ
3) పై రెండు 4) ఏదీకాదు
35. జతపరచండి.
1. పసిఫిక్ పరివేష్టిత మేఖల పరిధి
2. ప్రపంచ మధ్య పర్వత
3. ఆఫ్రికా పగులులోయ మేఖల పరిధి
ఎ. ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పీన్స్, అర్జెంటీనా, అలస్కా, ఈక్వెడార్
బి. హిమాలయ పర్వతాలు, మేఖల పరిధి ఆల్ఫ్స్ పర్వతాలు, కాకసన్ పర్వతాలు
సి. ఆఫ్రికా ఖండంలోని ప్రాంతం
1) 1-సి, 2-బి, 3-ఎ
2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-ఎ, 2-సి, 3-బి
4) 1-ఎ, 2-బి, 3-సి
36. జతపరచండి.
1. ఎగ్లామరేటా 2. స్కోరియా
3. లాపిలి 4. ప్యూమిస్
ఎ. శిలాభస్మం లావా నురగతో కలిసి ఘనీభవించి ఏర్పడిన అగ్నిశిల
బి. శిలాభస్మం, స్కోరియా, ప్యూమిస్, లాపిలి కలిసి ఘనీభవించి ఏర్పడిన అగ్నిశిల
సి. అగ్నిపర్వత విస్ఫోటనం సమయంలో గాలిలోకి ఎగిరిపడే చిన్న చిన్న రాతిముక్కలు
డి. లావా నురగ మాత్రమే ఘనీభవించి ఏర్పడిన అగ్నిశిల
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
37. కింది వాటిలో ఏది సరైనది?
1) అండమాన్ నికోబార్ దీవుల్లోని నార్కొండం క్రియాశీల అగ్నిపర్వతం
2) అండమాన్ నికోబార్ దీవుల్లోని బారెన్ విలుప్త అగ్నిపర్వతం
3) పై రెండు 4) ఏదీ కాదు
సమాధానాలు
1. 3 2. 3 3. 1 4. 3 5. 4
6. 4 7. 2 8. 4 9. 2 10. 3
11. 4 12. 1 13. 1 14. 3 15. 4
16. 3 17. 1 18. 1 19. 4 20. 1
21. 1 22. 1 23. 3 24. 4 25. 1
26. 3 27. 2 28. 1 29. 1 30. 2
31. 3 32. 2 33. 4 34. 3 35. 4
36. 4 37. 4
టాపర్స్ ఇన్స్టిట్యూట్
మేడిపల్లి, హైదరాబాద్
9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు