Telangana Government Schemes | ప్రజల పాలిట వరాలు.. అభివృద్ధికి ప్రతీకలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
ధరావత్ పథకం
- రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కింద ఎలాంటి ధరావత్ హామీ లేకుండా 180 రోజుల వరకు లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక రుణ సహాయం అందజేయడం జరుగుతుంది.
- 2019-20 సంవత్సరానికి రూ. 5.23 కోట్లను కేటాయించగా 2019 డిసెంబర్ నాటికి 348 మంది రైతులు లబ్ధిపొందారు.
చేప పిల్లల పంపిణీ కార్యక్రమం
- 2016 అక్టోబర్ 3న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు.
- రూ. 48 కోట్లతో 467 చెరువుల్లో/ రిజర్వాయర్లలో 80-100 mm పరిమాణం గల కట్ల, రోహూ మొదలైన రకాల చేప పిల్లలు ఉచితంగా విడుదల.
- గ్రామ పంచాయతీల పరిధిలో 19 వేల చెరువుల్లో ఉచితంగా చేప పిల్లల విడుదల.
- ప్రస్తుత మత్స్య ఉత్పత్తి 40 శాతం పెరుగుదలకు అవకాశం
- 20 లక్షల మత్స్యకారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందుతున్నారు.
పొదుపు పథకం
- 2018 జనవరి నుంచి ప్రారంభించారు.
- మరమగ్గాల కార్మికుల కోసం ఈ పథకం అమలు చేస్తారు.
- ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల పవర్లూమ్ కార్మికులు లబ్ధి పొందుతున్నారు.
- కార్మికులు వారి నెల జీతంలో 8 శాతం తమ వాటాగా బ్యాంక్‌లో జమ చేస్తే ప్రభుత్వం మరో 8 శాతం జమ చేస్తుంది.
- 3 సంవత్సరాల తర్వాత జమ చేసిన మొత్తం కార్మికులు తీసుకోవచ్చు. బ్యాంక్ దీనిపై వడ్డీ చెల్లిస్తుంది.
- రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మంది మరమగ్గ కార్మికులు, అనుబంధ కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ విదేశీ విద్యానిధి
- ఈ పథకాన్ని 2016 దసరా పండుగ సందర్భంగా ప్రవేశపెట్టారు.
- విదేశాల్లో(అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్) ఉన్నత విద్యను అభ్యసించడానికి బీసీ, ఈబీసీ విద్యార్థుల కోసం ప్రారంభించారు.
- ప్రతి విద్యార్థికి గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం చేయనున్నారు.
- ప్రతి సంవత్సరం 300 మందికి ఆర్థిక సహాయం అందజేయబడుతుంది. (జనవరిలో 150 మందికి, సెప్టెంబర్‌లో 150 మందికి).
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి
- ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు రూ.20 లక్షలు అందిస్తారు.
- సంవత్సర ఆదాయ పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం జరిగింది.
- గరిష్ఠ అర్హత వయస్సు – 35 సంవత్సరాలు
- ఈ పథకం కింద విద్యార్థులు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా వంటి దేశాల్లో చదువుకోవడానికి అవకాశం ఉంది.
డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం
- 2014 డిసెంబర్ 26న హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
- ఈ పథకంలో భాగంగా ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఫోర్ వీలర్ వెహికల్స్‌ను అందించడం జరిగింది.
- ఈ పథకం కింద 500 మంది గిరిజన డ్రైవర్లకు రూ.25 కోట్ల సబ్సిడీ అందించి, వారికి స్వయం ఉపాధిని అందించాలని ప్రభుత్వ యోచన.
- రూ. 19.82 కోట్ల వ్యయంతో 446 వాహనాలను లబ్ధిదారులకు అందించడం జరిగింది.
వివేకానంద విదేశీ విద్యా పథకం
- విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించింది.
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే అభ్యర్థులు అందుకు సంబంధించి అర్హత కోర్సులో కనీసం 65 శాతం, పీహెచ్డీ చేసే అభ్యర్థులకు పీజీ కోర్సులో కనీసం 65 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
- ఈ పథకానికి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉన్నవారు అర్హులు.
BEST (Brahmin Enterpreneurship Development Scheme of Telangana) - 21-55 సంవత్సరాల మధ్యగల బ్రాహ్మణ యువతను పారిశ్రామిక రంగంలో
ప్రోత్సహించేందుకు ఈ పథకం ప్రారంభించారు. - వారి కుటుంబ ఆదాయం రూ.5 లక్షలు మించి ఉండరాదు.
సబ్సిడీ
- లక్ష రూపాయల లోపు ఉన్న యూనిట్లకు 80 శాతం వరకు సబ్సిడీ
- 2 లక్షల రూపాయల లోపు ఉన్న యూనిట్లకు 70 శాతం సబ్సిడీ
- 2 లక్షల రూపాయల పైబడిన యూనిట్లకు 60 శాతం వరకు సబ్సిడీ
తెలంగాణ డిజిధన్
- 2015 ఆగస్టు 27న జేఎన్టీయూలో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.
- తెలంగాణ ప్రభుత్వం నాస్కామ్ సహకారంతో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ డిజిధన్ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
- గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ ఉపయోగించడంలో అవగాహన ఉన్నవారు, విద్యార్థులు, ఇతర పని వారి కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు.
- తెలంగాణ రాష్ట్ర ఇ-లిటరసీ సాధనకు ఈ పథకం ఉపయోగపడుతుంది.
టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్)
- ఇది లాభాపేక్షలేని సంస్థ. ఇది పరిశ్రమలకు, విద్యా సంస్థలకు మధ్య వారధిగా పనిచేస్తుంది.
- యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, పరిశ్రమలకు నాణ్యమైన మానవ వనరులు, సేవలు అందించడం దీని లక్ష్యం.
- ప్రత్యేకమైన పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలతో ఏర్పాటు చేయబడింది.
- నవ కల్పన గల కంపెనీలను ప్రారంభించడానికి, వాటికి గ్రేడింగ్ ఇవ్వడానికి అవసరమైన సహాయాన్ని వ్యవస్థాపకులకు చేయూత ఇవ్వడానికి విస్తృతమైన నెట్వర్క్ భాగస్వామ్యంతో పనిచేస్తుంది.
- దీన్ని తెలంగాణ రాష్ట్ర సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.
- ఈ సంస్థ అమలు చేసిన విభిన్న నైపుణ్య ఆధారిత కార్యక్రమాలు, నీతి ఆయోగ్ వారి ఆల్ ఇండియా స్కిల్లింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ సంచికలో ప్రచురితం చేశారు.
అన్నపూర్ణ పథకం
- 2014 జూలై 17న హైదరాబాద్‌లో ప్రారంభించారు.
- నిరుపేదలకు, భిక్షాటన చేసేవారికి అడ్డాకూలీలు, చిరు వ్యాపారుల కోసం జీహెచ్ఎంసీ, హరేకృష్ణ మిషన్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 159 కేంద్రాల్లో ప్రారంభించారు.
- భోజనంలో 400 గ్రాముల అన్నం, 100 గ్రాముల పప్పు, 100 గ్రాముల కర్రీ, పచ్చడిని కేవలం రూ. 5లకు అందిస్తున్నారు. ప్రతిఒక్కరికీ అయ్యే ఖర్చు రూ.24.25లు కాగా హరేకృష్ణ మిషన్ చారిటబుల్ ఫౌండేషన్ రూ.19.25ను భరిస్తుంది.
పోషణ్ అభియాన్
- పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఈ పథకాన్ని 2018 డిసెంబర్ 26న ప్రకటించింది.
- దీన్ని 2020 జనవరి 1 నుంచి హనుమకొండ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు.
బాలామృతం పథకం
- ఈ పథకం కింద 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలకు నెలకు 16 గుడ్లు అందజేస్తారు.
- 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు పిల్లలకు నెలకు 30 గుడ్లు అందజేస్తారు.
- ప్రతి చిన్నారికి 2.5 కిలోల ప్యాకెట్లలో బాలామృతం పంపిణీ చేస్తారు.
గిరిపోషణ పథకం
- తెలంగాణలో గిరిజన జనాభా పోషకాహార స్థితిని మెరుగుపరచడానికి గిరిజన సంక్షేమశాఖ, అగ్రి బిజినెస్ అండ్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫాం, ఇక్రిశాట్ సహకారంతో ఏర్పాటుచేశారు.
- 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, పాలిచ్చే తల్లులకు మెరుగైన
పోషకాహారం అందిస్తారు.
గిరిబాల వికాస్ పథకం
- తెలంగాణలో గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన ‘గిరిబాల వికాస్’ పథకం ప్రారంభమైంది. ఈ పథకాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏటూరు నాగారం పరిధిలోని
గిరిజన పాఠశాలల్లో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ 2018 జూలై 6న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఏడాదిలో మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితి అంచనా వేస్తారు.
టి-హబ్
- టి-హబ్ అనేది 2015లో ప్రారంభించారు.
- తెలంగాణలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి హైదరాబాద్‌లో ఉన్న ఒక ఇన్నోవేషన్ మధ్యవర్తి, వ్యాపార ఇంక్యుబేటర్.
- ప్రారంభం నుంచి ఇప్పటివరకు 1800 కంటే ఎక్కువ జాతీయ, అంతర్జాతీయ స్టార్టప్‌లకు మెరుగైన
సాంకేతికత, ప్రతిభను అందించింది. - వినూత్న స్టార్టప్‌ల ఆవిష్కరణల్లో దేశంలోనే రికార్డు సృష్టించిన టి-హబ్ మరింత
విస్తరించింది. - టి-హబ్ (టి-హబ్ 2.0) రెండవ దశను 2022 జూన్ 28న ప్రారంభించారు.
- టి-హబ్ 2.0ను సీఎం ప్రారంభించారు. భారత ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2022లో టి-హబ్ దేశంలోనే ‘ఉత్తమ ఇంక్యుబేటర్’గా నిలిచింది.
- ల్యాబ్ 32 రాష్ట్రవ్యాప్తంగా 240 స్టార్టప్ సంస్థలతో 8వ విడత సంప్రదింపులు, చర్చలు జరిపింది. టి-హబ్ రాష్ట్రంలోని పారిశ్రామికాభివృద్ధి సంస్థతోనూ, ఇదే తరహా ఇతర భాగస్వాములతోనూ కలిసి రాష్ట్రంలోని స్టార్టప్‌లను ప్రోత్సహించి సాయపడేందుకు కృషి చేస్తుంది.
వి-హబ్ (విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్)
- మహిళా వ్యవస్థాపకుల హబ్ (వి-హబ్), 2017లో ప్రారంభించారు.
- ఇది మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించి, పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోని అంకురసంస్థ
- 2018 నుంచి నేటి వరకు వి-హబ్ 1495 స్టార్టప్‌లు, చిన్న (లేదా) మధ్యస్థ వ్యవస్థాపకులను ప్రోత్సహించింది.
- 2023 జనవరికి మొత్తం 2,194 స్టార్టప్ కంపెనీలను ఇంక్యుబేట్ చేసింది. 1,495 స్టార్టప్‌లకు సహకారం అందించింది. దీనికి 66.3 కోట్ల రూపాయలను ఫండ్ సేకరించి 2,823 జాబ్స్‌ను ప్రవేశపెట్టారు. మహిళా ఎంట్రప్రెన్యూర్స్ 5,235 మంది ఉన్నారు.
విజేత కాంపిటేషన్స్ సౌజన్యంతో
040-27429494
Previous article
TS EAMCET | టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?