Indian Polity | జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది?
చట్టబద్ధ సంస్థలు
1. చట్టబద్ధ సంస్థలకు సంబంధించి సరికానిది?
1) పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏర్పడిన సంస్థలను చట్టబద్ధ సంస్థలు అంటారు
2) వీటి అధికార విధులు చట్టం ద్వారా నిర్ణయించబడతాయి
3) జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక చట్టబద్ధ సంస్థ
4) జాతీయ వెనుకబడిన కమిషన్ కూడా ఒక చట్టబద్ధ సంస్థ
2. మానవ హక్కుల రకాల్లో లేనిది?
1) ప్రాథమిక హక్కులు
2) సహజ హక్కులు
3) నైతిక హక్కులు
4) చట్టబద్ధ హక్కులు
3. కింది వాటిలో పౌరహక్కు కానిది?
1) ప్రాణ రక్షణ హక్కు, భావ ప్రకటన హక్కు
2) మత స్వాతంత్య్రపు హక్కు, విద్యా హక్కు
3) ఆర్థిక హక్కు, వారసత్వపు హక్కు
4) కుటుంబ హక్కు, సాంస్కృతిక హక్కు
4. కింది వాటిలో ఆర్థిక హక్కు కానిది?
1) కుటుంబ, సాంస్కృతిక హక్కు
2) పని, ఆస్తి హక్కు
3) ఒప్పందాలను కుదుర్చుకునే హక్కు
4) వ్యక్తి వ్యాపార హక్కు
6. హక్కులు, ప్రకటనలు, తీర్మానాలకు సంబంధించి సరికానిది?
1) హక్కులకు సంబంధించిన మొదటి ప్రకటన మాగ్నాకార్టా 1215 జూన్‌లో ప్రకటన చేశాడు
2) బిల్ ఆఫ్ రైట్స్ ఇంగ్లిష్ ప్రకటన 1690లో జారీ చేశారు
3) 1789లో స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం ఫ్రెంచి విప్లవం నుంచి పుట్టాయి.
4) అమెరికా బిల్ ఆఫ్ రైట్స్‌ను 1791లో జారీ చేశారు
7. ఐక్యరాజ్యసమితి చార్టర్ హక్కుల్లో సరికానిది?
1) అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన 1948 డిసెంబర్ 10
2) జాతి వివక్ష, నిషేధ, అంతర్జాతీయ సమావేశం 1965
3) చిత్రహింస వ్యతిరేక సమావేశం 1984
4) ధరిత్రి సమావేశం రియో డిజెనీరో 1984
8. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు సంబంధించి సరికానిది?
1) ఈ కమిషన్‌ను 1948 డిసెంబర్ 10న రూపొందించారు
2) భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను 1993లో ఏర్పాటు చేశారు
3) జాతీయ మానవ హక్కుల చట్టాన్ని 2008లో సవరించారు
4) మానవ ప్రగతికి వికాసానికి దోహదం చేసేవే మానవ హక్కులు
9. కిందివాటిలో సరికానిది గుర్తించండి?
1) భారతదేశంలో జాతీయ మానవహక్కులను 1993 అక్టోబర్ 12న అమలు చేశారు
2) 1991లో పారిస్‌లో మానవ హక్కుల పరిరక్షణ కోసం ఒక సదస్సు జరిగింది
3) దీనిలో చైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు
4) దీనిలో ఉపాధ్యక్షుడు కూడా ఉంటాడు
10. రాష్ట్రపతి మానవ హక్కుల సంఘాన్ని నియమించేటప్పుడు ఎవరిని సంప్రదించరు?
1) కేంద్ర హోంశాఖ మంత్రి
2) రాజ్యసభలో ప్రతిపక్షనాయకుడు
3) లోక్‌సభ స్పీకర్
4) గవర్నర్
11. మానవహక్కుల కమిషన్‌కు సంబంధించి సరికానిది?
1) మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవీకాలం 3 సంవత్సరాలు
2) 2019 సవరణ చట్టం ద్వారా చైర్మన్ పదవీకాలాన్ని తగ్గించారు
3) చైర్మన్, సభ్యులు తమ రాజీనామాను ప్రధాన మంత్రికి సమర్పిస్తారు
4) మానవ హక్కుల చైర్మన్ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు
12. మానవ హక్కుల చైర్మన్ అర్హతలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి?
1) సుప్రీంకోర్టు ప్రధాన/ సాధారణ న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసి ఉండాలి
2) ఒక మహిళా సభ్యురాలు కచ్చితంగా ఉండనవసరం లేదు
3) ఒక సభ్యుడు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసి ఉండాలి
4) ముగ్గురు సభ్యులు మానవ హక్కుల రంగంలో అనుభవజ్ఞులై ఉండాలి
13. మానవ హక్కుల సంఘం విధి కానిది?
1) మానవ హక్కుల ఉల్లంఘనను నివారిస్తుంది
2) న్యాయస్థానాల అనుమతితో హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసును విచారిస్తుంది
3) ఇది ప్రతి ప్రాథమిక హక్కును విచారిస్తుంది
4) ప్రజాస్వామ్య పరిరక్షణ కర్తగా పనిచేస్తుంది
14. మానవ హక్కుల కమిషన్ పరిధిలోకి వచ్చే అంశం?
1) సహజ హక్కులు, నైతిక హక్కులు
2) చట్టబద్ధ్ద పౌర హక్కులు
3) న్యాయ స్థాన పరిధిలో ఉన్న అంశాలు
4) ఉద్యోగ పని షరతులకు చెందిన విషయాలు
15. కేంద్ర మానవ హక్కుల కమిటీకి సంబంధించి సరికానిది?
1) ఎస్సీ, ఎస్టీ మహిళల వరకట్న అత్యాచార కేసులపై ఈ కమిషన్‌కు ఫిర్యాదులు వచ్చాయి
2) ప్రాథమిక హక్కులు కూడా ఈ చట్టం దృష్టికి వచ్చాయి
3) మొదటి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ రంగనాథ్ మిశ్రా
4) 2016-20 మధ్య చైర్మన్‌గా ఉన్నది హెచ్.ఎల్. దత్తు
16. కిందివాటిలో సరైనది ఏది?
1) మాగ్నకార్టా -1215
2) ఇంగ్లిష్ బిల్స్ ఆఫ్ రైట్స్ 1689
3) అమెరికన్ బిల్స్ ఆఫ్ రైట్స్ -1781
4) పైవన్నీ సరైనవే
17. కింది వాటిలో సరైనది?
1) 1984లో భోపాల్ గ్యాస్‌లీక్ సంఘటన
2) 2013లో కేదార్నాథ్ జల ప్రళయం
3) 1996లో తెహ్రీ డ్యామ్ ఆందోళన
4) పైవన్నీ
18. కిందివాటిలో సరైనది
1) అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20
2) అంతర్జాతీయ వృద్ధుల సంవత్సరం 1999
3) వికలాంగుల హక్కుల సదస్సు 2006
4) పైవన్నీ
19. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గురించి సరైంది?
1) రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్‌ను 1993లో ఏర్పాటు చేశారు
2) ఈ కమిటీ 2005 నుంచి అమల్లోకి వచ్చింది
3) ఈ కమిటీలో ఒక చైర్మన్ ఇద్దరు సభ్యులు ఉంటారు
4) పైవన్నీ సరైనవే
20. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గురించి సరికానిది?
1) వీరి పదవీకాలం 3 సం.లు
2) ముఖ్యమంత్రి రాజముద్రతో ఈ కమిటీని ప్రారంభిస్తాడు
3) వీరు తమ రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పిస్తారు
4) రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌ను గవర్నర్ నియమిస్తాడు
21. జాతీయ మైనారిటీ కమిషన్ గురించి సరైనది?
1. ప్రకరణ 29, 30 ప్రకారం మైనారిటీలకు భాషా సాంస్కృతిక హక్కులను కల్పిస్తున్నారు
2. 350(బి) ప్రకరణ ప్రకారం మైనారిటీల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి
3) ఈ కమిటీ 1979 నుంచి అమల్లోకి వచ్చింది 4) పైవన్నీ
22. కిందివాటిలో సరికానిది ఏది?
1) 1929లో పార్లమెంటు ఒక చట్టం ద్వారా మైనారిటీ కమిషన్‌కు ప్రతిపత్తిని కల్పించింది
2) 2014 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా జైనులను అల్ప సంఖ్యాక వర్గాలుగా గుర్తించింది
3) ఈ కమిటీకి 2020లో సవరణ చేశారు
4) ఈ కమిటీలో ఒక చైర్మన్, ఆరుగురు సభ్యులుంటారు
23. కింది వాటిలో సరైనది?
1) రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ను 1979లో ఏర్పాటు చేశారు
2) రాష్ట్ర మైనారిటీ కమిషన్‌కు 1995లో చట్టబద్ధతను కల్పించారు
3) తెలంగాణ రాష్ట్ర మైనారిటీ చైర్మన్‌గా ప్రస్తుతం తారిఖ్ అన్సారీ పనిచేస్తున్నారు
4) పైవన్నీ సరైనవే
24. జాతీయ మహిళా కమిషన్ గురించి సరైంది ఏది?
1) దీన్ని 1992లో ఏర్పాటు చేశారు
2) ఈ కమిషన్‌కు సంబంధించి పార్లమెంట్ 1990లో చట్టం చేసింది
3) దీనిలో ఒక చైర్ పర్సన్, ఐదుగురు సభ్యులుంటారు
4) పైవన్నీ సరైనవే
25. జాతీయ మహిళా కమిషన్ గురించి సరికానిది ఏది?
1) దీని పదవీకాలం మూడేళ్లు
2) మొదటి మహిళా కమిషన్ చైర్పర్సన్ జయంతి పట్నాయక్
3) ఆరో మహిళా కమిషన్ చైర్ పర్సన్ లలిత్‌కుమార్ మంగళం
4) ప్రస్తుత మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ
26. రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్ గురించి సరైనది?
1) 1998లో దీన్ని ఏర్పాటు చేశారు
2) దీనిలో ఒక చైర్మన్ నలుగురు సభ్యులుంటారు
3) వీరి పదవీకాలం మూడేళ్లు
4) పైవన్నీ సరైనవే
27. రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్ గురించి సరికానిది?
1) ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
2) ఆంధ్రప్రదేశ్ రెండో మహిళా కమిషన్ చైర్పర్సన్ సుశీలాదేవి
3) ప్రస్తుత తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
4) వీరిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది
28. జతపరచండి?
ఎ) 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1991 1) రాష్ట్రస్థాయి రెంట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు
బి) 75వ రాజ్యాంగ సవరణ చట్టం 1994 2) అరుణాచల్ ప్రదేశ్‌లోని పంచాయతీల్లో ఎస్సీ కులాలకు రిజర్వేషన్
లేకుండా చేయడం
సి) 80వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 3) గ్రామాల్లో లేదా ఇతర స్థానిక స్థాయి పంచాయతీల ఏర్పాటు
డి) 83వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 4) ఢిల్లీకి జాతీయ రాజధాని హోదా కల్పించడం
1) ఎ-3, బి-1, సి-4, డి-2 2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-3, డి-4 4) ఎ-1, బి-3, సి-4, డి-2
29. కిందివాటిలో సరికానిది
1) జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులకు విద్య, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమ రంగాల్లో మంచి అనుభవం ఉండాలి
2) జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మొదటి చైర్మన్ శాంతాసిన్హా
3) ఈ కమిటీ దేశంలోని అన్ని విధులను నిర్వర్తిస్తుంది
4) ప్రస్తుత జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ ప్రియాంక్ కుమాన్గో
30. జాతీయ సఫాయి కర్మచారి హక్కుల కమిషన్ గురించి సరికానిది.
1) దీన్ని 1993లో రూపొందించారు
2) ఇది 1994 ఆగస్టు 12న అమల్లోకి వచ్చింది
3) దీని పదవీకాలం మూడేళ్లు
4) దీనిలో ఒక చైర్మన్ ఐదుగురు సభ్యులుంటారు
31. జాతీయ బాలల పరిరక్షణ కమిషన్‌కు సంబంధించి సరికానిది ఏది?
1) జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను 2007 మార్చిలో ఏర్పాటు చేశారు
2) 2005లో పార్లమెంట్ బాలల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించింది
3) వీరి పదవీకాలం మూడేళ్లు
4) వీరిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది, తొలగిస్తుంది
32. కింది వాటిలో మిగిలిన మూడింటిలో భిన్నమైంది ఏది?
1) 8వ రాజ్యాంగ సవరణ -1959
2) 23వ రాజ్యాంగ సవరణ -1980
3) 45వ రాజ్యాంగ సవరణ -1980
4) 61వ రాజ్యాంగ సవరణ 1989
33. ఏ సంవత్సరంలో చేసిన ఏ సవరణ చట్టం ద్వారా భారతదేశంలో ఓటింగ్ వయస్సును 21 నుంచి 18 సం.లకు తగ్గించారు?
1) 1991- 34వ రాజ్యాంగ సవరణ
2) 1996 76వ రాజ్యాంగ సవరణ
3) 1989 – 61వ రాజ్యాంగ సవరణ
4) 1986- 57వ రాజ్యాంగ సవరణ
34. భారత రాజ్యాంగం 86వ సవరణ చట్టం 2002 ప్రకారం?
1) ఢిల్లీ యూనియన్ ప్రాంతానికి ప్రత్యేక హోదాను కల్పించింది
2) ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించారు
3) షెడ్యూల్డ్ తగరతుల కోసం జాతీయ సంఘాన్ని ఏర్పాటు చేసింది
4) కేంద్ర రాష్ర్టాల మధ్య ఆదాయ సంక్రమణ/ అభివృద్ధికి కొత్త పథకాన్ని సమకూర్చుట కోసం చేసింది
35. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో మొదట ఎన్ని భాషలకు గుర్తింపు ఉంది?
1) 14 2) 18 3) 22 4) 25
36. ప్రకరణ 344 ప్రకారం మొట్టమొదటి అధికార భాషా సంఘం ఎప్పుడు ఎవరి అధ్యక్షతన ఏర్పడింది?
1) 1955 బి.జి. ఖేర్ అధ్యక్షతన
2) 1957 బల్వంతరాయ్ మెహతా అధ్యక్షతన
3) 1965 సునీల్ శాస్త్రి అధ్యక్షతన
4) ఏదీకాదు
37. కిందివాటిలో సరికానిది.
1) ప్రకరణ 326 ప్రత్యేక మెజారిటీతో సవరించాలి
2) ప్రకరణ 368 – సాధారణ మెజారిటీతో సవరించాలి
3) ప్రకరణ 246 ప్రత్యేక మెజారిటీతో సవరించాలి
4) ప్రకరణ 32 ప్రత్యేక మెజారిటీతో సవరించాలి
సమాధానాలు
1-4 2-1 3-3 4-2
5-1 6-2 7-4 8-3
9-4 10-4 11-3 12-2
13-3 14-1 15-2 16-4
17-4 18-4 19-4 20-2
21-4 22-3 23-4 24-4
25-3 26-4 27-2 28-1
29-3 30-4 31-4 32-4
33-3 34-2 35-1 36-1
37-2
అంజి
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు