Telangana History & Culture | 1952 ముల్కీ ఉద్యమం మొదటిసారి ఎక్కడ ప్రారంభమైంది?
తెలంగాణ చరిత్ర, సంస్కృతి
1. కింద పేర్కొన్న వేములవాడ చాళుక్య రాజుల్లో 42 యుద్ధాల్లో వీరుడిగా ఎవరు నిలిచారు?
1) మొదటి నరసింహ
2) మొదటి అరికేసరి
3) బద్దెగ
4) మూడో యుద్ధమల్లుడు
2. ‘పరమ సోగతస్య’ అనే బిరుదు ధరించిన విష్ణుకుండిన రాజు?
1) రెండో ఇంద్ర భట్టారక వర్మ
2) దేవ వర్మ
3) విక్రమేంద్ర వర్మ
4) మాధవ వర్మ
3. ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ పాట రచయిత?
1) అందెశ్రీ
2) ముదిగంటి సుజాతా రెడ్డి
3) గద్దర్
4) నందిని సిధారెడ్డి
4. పాతకాలపు తెలంగాణలో చెరువు నుంచి నీటి పంపిణీ ఎవరి బాధ్యతగా ఉండేది?
1) నీరటికాడు 2) పట్వారీ
3) పోలీస్ పటేల్ 4) గిర్దావర్
5. తెలుగులో ‘వర్తక స్వాతంత్య్రం’ అనే పేరుతో చిన్న పుస్తకాన్ని ప్రచురణ చేసిన సంస్థ?
1) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్
2) ఆంధ్ర జనకేంద్ర సంఘం
3) ఆర్య సమాజం
4) ఆంధ్ర మహాసభ
6. కాకతీయుల కాలానికి చెందిన ఏ శాసనంలో ‘వినయ భూషణుడు’ అనే బిరుదుతో రుద్రదేవుడిని పేర్కొన్నారు?
1) ఘణపురం శాసనం
2) ద్రాక్షారామం శాసనం
3) వరంగల్ ఖిలా శాసనం
4) హనుమకొండ శాసనం
7. 1946 రెండో అర్ధభాగంలో, దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి దురాగతాలను ఎదిరించిన ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలు కార్యకలాపాలు సాగించిన తాలూకా ఏది?
1) సూర్యాపేట తాలూకా
2) నల్లగొండ తాలూకా
3) మహబూబ్‌నగర్ తాలూకా
4) జనగాం తాలూకా
8. శాతవాహనుల కాలంలో గాహక అమాత్యుల ప్రధాన విధి?
1) ఆస్తి పన్ను వసూలు
2) భూములను కొలవడం, సరిహద్దులు నిర్ణయించి రాళ్లను పాతడం
3) భూమి శిస్తు వసూలు
4) తాత్కాలిక న్యాయస్థానాల ఏర్పాటు
9. 1952 ముల్కీ పోరాటంలో ప్రధానమైన నినాదం?
1) దక్కనీలు గో బ్యాక్
2) ఇడ్లీ సాంబార్ గో బ్యాక్
3) తమిళులు గో బ్యాక్
4) జై బోలో తెలంగాణ
10. హైదరాబాద్ నగరంలో ‘దారుల్ షిఫా’ ఆస్పత్రిని నిర్మించిన కుతుబ్‌షాహీ సుల్తాన్ ?
1) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
2) అబుల్ హసన్ తానీషా
3) సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా
4) అబ్దుల్లా కుతుబ్‌షా
11. కీసర రామలింగేశ్వర దేవాలయం ఎవరి కాలంలో నిర్మించారు?
1) కాకతీయులు
2) విష్ణుకుండినులు
3) ఇక్షాకులు
4) ముదిగొండ చాళుక్యులు
12. రాజగిరిపోతంలో, నాగసముద్రమనే చెరువును ఎవరు నిర్మించారు?
1) నాగాంబిక 2) నాగసేన
3) మీరావాణి 4) దేవకి
13. మొగిలిచర్ల తామ్రశాసనం ఏ వంశ పాలన గురించి చారిత్రక సమాచారం తెలియజేస్తుంది?
1) విష్ణుకుండినులు 2) బాణులు
3) పల్లవులు
4) ముదిగొండ చాళుక్యులు
14. హైదరాబాద్ రాష్ట్రంలో రాజ భూములుగా పేర్కొన్న నిజాం కుటుంబానికి చెందిన వాటిని ఏమని పిలుస్తారు?
1) దివాన్-ఇ-ఖాస్
2) అత్రఫ్-ఇ-బల్ద
3) సర్ఫ్-ఇ-ఖాస్
4) పాన్-మక్త
15. 2010 జనవరి 3న తెలంగాణ విద్యార్థి మహాగర్జన జరిగిన ప్రదేశం?
1) నిజాం కాలేజీ గ్రౌండ్స్
2) కాకతీయ యూనివర్సిటీ
3) ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్, కరీంనగర్
4) ఉస్మానియా యూనివర్సిటీ
16. ‘కలమ’, ‘శాలి’, ‘శిరాముఖి’, ‘పతంగా హోయన’ అనేవి?
1) మిలిటరీ పన్నులు
2) వర్తకులపై వసూలు చేసే పన్నులు
3) మంగళ్లపై వసూలు చేసే పన్నులు
4) వరిలో రకాలు
17. కాకతీయుల కాలంలో ‘కిళిరము’ అనే పన్ను దేనిపై విధించారు?
1) గొర్రెల మందపై
2) చెరువు కాలువలపై
3) పోక తోటలపై
4) వారాంతపు సంతలపై
18. తెలంగాణ వారికి ఉద్యోగ రంగంలో న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన విద్యార్థినాయకుడు?
1) మదన్ మోహన్
2) మల్లికార్జున్
3) శ్రీధర్ రెడ్డి
4) రవీంద్రనాథ్
19. నిజాంకు వ్యతిరేకంగా 1948లో పోలీసు చర్య తరువాత మిలిటరీ గవర్నర్‌గా నియమితులైన వారు ?
1) ఎం కే వెల్లోడి
2) మేజర్ రుద్ర
3) మేజర్ జనరల్ జే ఎస్ చౌదరి
4) అల్ ఎడ్రూస్
20. శ్రీకృష్ణ కమిటీలో సభ్యులు కానివారు?
1) మాడభూషి శ్రీధర్
2) అబూసలేహ్ షరీఫ్
3) రణ్‌బీర్ సింగ్
4) రవీందర్ కౌర్
21. 1952 ముల్కీ ఉద్యమం మొదటిసారి ఎక్కడ ప్రారంభమైంది?
1) హైదరాబాద్ 2) ఖమ్మం
3) వరంగల్ 4) మెదక్
22. 2007 జూన్‌లో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య’ వ్యవస్థాపక అధ్యక్షుడు?
1) గూడ అంజయ్య 2) గోరటి వెంకన్న
3) అందెశ్రీ 4) వి ఎస్ రావు
23. సమ్మక్క-సారలమ్మ ఎవరితో యుద్ధం చేసి అమరులయ్యారు?
1) రుద్రమ దేవి 2) ప్రతాపరుద్రుడు
3) గణపతి దేవుడు 4) శాతవాహనులు
24. ప్రఖ్యాత ‘బండెనక బండి కట్టి’ పాటలో నిజాం ఎవరిని మించిపోయాడని రచయిత యాదగిరి రచించారు?
1) ఆంగ్లేయులు 2) జపనీయులు
3) నాజీలు 4) యూదులు
25. నిరసన తెలపడానికి తెలంగాణ ప్రజలు రోడ్లపైకి వచ్చి తినడానికి ఉపయోగించిన విధానం పేరు?
1) వన భోజనాలు 2) రాస్తారోకో
3) వంటా వార్పు 4) బోనాలు
26. తెలంగాణలో ఒద్దిరాజు సోదరులు ప్రారంభించిన వార్తా పత్రిక ?
1) తెనుగు 2) వెలుగు
3) కృష్ణా 4) గృహలక్ష్మి
27. తెలంగాణపై రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి యూపీఏ ఏర్పాటు చేసిన క్యాబినేట్ సబ్ కమిటీ అధ్యక్షులు?
1) పీ చిదంబరం
2) దయానిధి మారన్
3) ఏకే ఆంటోని
4) ప్రణబ్ ముఖర్జీ
28. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించింది ఎవరు?
1) సోనియా గాంధీ 2) ప్రణబ్ ముఖర్జీ
3) ఏకే ఆంటోనీ 4) పీ చిదంబరం
29. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1) గ్రామ, మండల జిల్లాస్థాయిలో అన్ని వర్గాల ప్రజలతో వేల జేఏసీలు ఏర్పడ్డాయి
2) జేఏసీలను కేవలం విద్యార్థులు, ఉద్యోగులే ఏర్పాటు చేశారు
3) జేఏసీలను కేవలం రాజకీయ పార్టీలే ఏర్పాటు చేశాయి
4) తెలంగాణతో జేఏసీలకు సంబంధం లేదు
30. మొదటి నిజామాంధ్ర మహాసభలు ఎక్కడ జరిగాయి?
1) జోగిపేట 2) భువనగిరి
3) కొల్లాపూర్ 4) షాద్‌నగర్
31. కింది వాటిలో ఏ న్యూస్ పేపర్‌కు సురవరం ప్రతాప్‌రెడ్డి సంపాదకుడుగా ఉన్నారు?
1) చార్మినార్
2) దక్కన్ క్రానికల్
3) రయ్యత్
4) గోల్కొండ పత్రిక
32. తెలంగాణలోని కింది ఏ గ్రామంతో భూదాన్ ఉద్యమానికి సంబంధం ఉంది?
1) మల్లేపల్లి 2) నాంపల్లి
3) సిరిసిల్ల 4) పోచంపల్లి
33. కింది వాటిలో ఏ సంస్థ స్థాపనలో దుర్గాబాయి దేశ్‌ముఖ్ పాత్ర గణనీయమైనది?
1) ఆంధ్ర మాతృభాషా సభ
2) ఆంధ్ర మహిళా సభ
3) ఆంధ్ర జన సభ
4) ఆంధ్ర రైతు సభ
34. ప్రజల మనిషి పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) దేవులపల్లి వెంకటేశ్వరరావు
2) పుచ్చలపల్లి సుందరయ్య
3) రావి నారాయణ రెడ్డి
4) వట్టికోట ఆళ్వార్ స్వామి
35. పి.వి. నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు?
1) 1970 మార్చి 30
2) 1970 సెప్టెంబర్ 25
3) 1971 మార్చి 30
4) 1971 సెప్టెంబర్ 30
36. 1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి ఎన్నిక గుర్తు ?
1) సల్కెపార 2) చేతి కొడవలి
3) ఎద్దుల బండి
4) ఉదయిస్తున్న సూర్యుడు
37. బెల్మోగా గ్రామాన్ని విద్యాదానంగా మొదటి అరికేసరి ఎవరికిచ్చారు?
1) బద్దెన
2) వేములవాడ భీమకవి
3) యుద్ధ మల్లుడు
4) ముగ్దా శివాచార్యుడు
38. తెలంగాణ ప్రాంతం ఎన్ని సంవత్సరాలు నేరుగా మొఘలుల పాలన కింద ఉంది?
1) 32 సంవత్సరాలు
2) 35 సంవత్సరాలు
3) 37 సంవత్సరాలు
4) 39 సంవత్సరాలు
39. ఎవరికాలంలో హైదరాబాద్‌లో సిపాయుల తిరుగుబాటు జరిగింది?
1) నసీరుద్దౌలా
2) అఫ్జలుద్దౌలా
3) మహబూబ్ అలీఖాన్
4) సికిందర్ జా
40. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్మించిన మొదటి భవనం?
1) ఇంజినీరింగ్ కళాశాల
2) లా కళాశాల
3) ఆర్ట్స్ కళాశాల
4) రసాయన శాస్త్ర భవనం
41. కింది ప్రముఖుల్లో ఎవరికి ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది?
ఎ. సీ రాజగోపాలాచారి
బి. వై నాయుడమ్మ
సి. జాకీర్ హుస్సేన్
డి. డా. అబ్దుల్ కలాం
1) ఎ, డి 2) సి, డి
3) ఎ, బి 4) బి, సి
42. మధ్యయుగాల తెలంగాణ గ్రంథం ‘రంగనాథ రామాయణం’ ఎవరికి సంబంధించినది?
1) బమ్మెర పోతన
2) పాల్కురికి సోమనాథుడు
3) గోన బుద్ధారెడ్డి
4) వేములవాడ భీమకవి
43. కింది వారిలో తెలంగాణకు చెందిన హిందీ సినిమా దర్శకులు ఎవరు?
1) లక్ష్మీకాంత్, ప్యారేలాల్
2) శ్యాంబెనెగల్, నగేశ్ కుకునూర్
3) గురుదత్, మహేశ్ భట్
4) ఖ్వాజా అహ్మద్ అబ్బాస్, అక్కు అక్బర్
44. 1969 ఉద్యమ సమయంలో మిగులు నిధుల లెక్క తేల్చడానికి నియమించిన కమిటీ?
1) శ్రీకృష్ణ కమిటీ
2) జయభారత రెడ్డి కమిటీ
3) వాంఛూ కమిటీ
4) వశిష్ట భార్గవ కమిటీ
45. మీర్ తురాబ్ అలీ ఖాన్ ఏ పేరుతో ప్రఖ్యాతి పొందారు?
1) సాలార్ జంగ్-1
2) నసీరుద్దౌలా
3) మీర్ మెహబూబ్ అలీఖాన్
4) అఫ్జలుద్దౌలా
46. పూర్వపు నల్లగొండ జిల్లాలోని తుమ్మలగూడెం శిలాశాసనం ఎవరి గురించి తెలుపుతుంది?
1) చాళుక్యులు
2) రాష్ట్ర కూటులు
3) శాతవాహనులు
4) విష్ణుకుండినులు
47. ఉమ్మడి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఏ సెక్షన్ వివాదాస్పదమైంది?
1) సెక్షన్-2 2) సెక్షన్-4
3) సెక్షన్-8 4) సెక్షన్-10
48. ఏ సమస్యపై నిరసనలు తెలిపిన ప్రజల ర్యాలీపై బషీర్‌బాగ్ పోలీసు కాల్పుల సంఘటన జరిగింది?
1) ధరల పెరుగుదల
2) ఒక ‘రేప్’ సంఘటన
3) అవినీతి
4) విద్యుత్ ఛార్జీల పెరుగుదల
49. తెలంగాణ డాక్టర్స్ ఫోరానికి అధ్యక్షుడు ఎవరు?
1) పీ అశోక్ కుమార్
2) పీ హరినాథ్
3) ఎ గోపాల్ కిషన్ రావు
4) మధు కె రెడ్డి
50. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్‌లో 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయమని ఆదేశించిన న్యాయమూర్తి ?
1) జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి
2) జస్టిస్ జె. చలమేశ్వర్
3) జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి
4) జస్టిస్ బి. చంద్రకుమార్
జవాబులు
1.3 2.3 3.3 4.1
5.2 6.2 7.4 8.2
9.2 10.1 11.2 12.1
13.4 14.3 15.4 16.4
17.1 18.4 19.3 20.1 21.3 22.1 23.2 24.3
25.3 26.1 27.4 28.4
29.1 30.1 31.4 32.4
33.2 34.4 35.4 36.1
37.4 38.3 39.2 40.3 41.3 42.3 43.2 44.4 45.1 46.4 47.3 48.4 49.3 50.3
విజేత కాంపిటీషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు