National Current Affairs May 24 | జాతీయం
జాతీయం
బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని మరోసారి విజయవంతంగా పరీక్షించినట్లు నేవీ అధికారులు మే 14న వెల్లడించారు. నేవీకి చెందిన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మోర్ముగావ్పై నుంచి దీన్ని ప్రయోగించారు. నిర్దేశిత లక్ష్యాన్ని బ్రహ్మోస్ అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. భారత్-రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశాయి. ఈ క్షిపణిని శబ్ద వేగం కంటే దాదాపు 3 రెట్లు అధిక వేగంతో ప్రయోగించవచ్చు. ఈ క్షిపణులను భారత్ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది.
పహల్
ఉత్తరప్రదేశ్‌లో ఆన్లైన్ గ్రామీణ విద్యా కార్యక్రమం ‘పహల్’ను మే 15న ప్రారంభించారు. సరోజినీ నగర్‌లోని యూపీ సైనిక్ ఇంటర్ కాలేజీలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఐఐటీ కాన్పూర్ భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేశారు. దీని లక్ష్యం ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా గ్రామీణ వర్గాల వారికి విద్యను అందించడం. ప్రారంభ దశలో ఉత్తరప్రదేశ్‌లోని 10 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత ఆన్లైన్ విద్యను అందిస్తాయి.
స్కైవాక్ బ్రిడ్జి
దేశంలోనే అతిపెద్ద స్కైవాక్ బ్రిడ్జిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మే 16న ప్రారంభించారు. ఇది తమిళనాడులోని మాంబళం, టీ నగర్ బస్ టెర్మినస్‌ను కలుపుతుంది. ఈ బ్రిడ్జిని 570 మీ. పొడవు, 4.2 మీ. వెడల్పుతో నిర్మించారు. దీన్ని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) స్మార్ట్ సిటీ నిధుల కింద రూ.28.45 కోట్లతో నిర్మించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?