Current Affairs May 24 | తెలంగాణ
తెలంగాణ
టీ హబ్
దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌గా టీ హబ్‌కు జాతీయ అవార్డు లభించింది. నేషనల్ టెక్నాలజీస్ డేని పురస్కరించుకొని ఢిల్లీలో మే 14న జరిగిన నేషనల్ టెక్నాలజీ వీక్-2023 కార్యక్రమంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డా. జితేంద్రసింగ్ ఈ అవార్డును టీ హబ్ సీఈవో ఎంఎస్ రావుకు అందజేశారు. ఫిబ్రవరిలో దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్ అవార్డు టీ హబ్‌కు లభించింది.
ఏఎస్సీఐ, టీ హబ్
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ), టీ హబ్ మధ్య మే 16న అవగాహన ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఆవిష్కరణల ప్రోత్సాహం, టెక్నాలజీ ఆధారిత స్టార్టప్ కంపెనీలకు మద్దతు ఇవ్వనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఇన్నోవేషన్ చాలెంజ్‌లు, హ్యాకథాన్లు, ఇంక్యుబేషన్, యాక్సిలరేషన్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తారు. ఈ ఒప్పందంపై ఏఎస్సీఐ డైరెక్టర్ జనరల్ డా. నిర్మల్య బాగ్చి, టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు సంతకాలు చేశారు.
ఫాక్స్‌కాన్
దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ (ఎఫ్ఐటీ) సంస్థ ఏర్పాటుకు మే 15న మంత్రి కేటీఆర్, ఎఫ్ఐటీ చైర్మన్ అండ్ సీఈవో సిడ్నీ లియూ భూమి పూజ చేశారు. 500 మిలియన్ డాలర్ల (రూ.4,114 కోట్లు)తో ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్ తయారీ యూనిట్‌ను రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో 200 ఎకరాల్లో నిర్మించనున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆసియాపసిఫిక్ గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ గోల్డ్ రికగ్నిషన్ అవార్డు మే 18న లభించింది. పర్యావరణహితమైన చర్యల్లో భాగంగా 15-35 మిలియన్ ప్రయాణికుల సామర్థ్యంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేసినందుకు ఈ అవార్డు దక్కింది. 2018 నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరుసగా ఆరోసారి ఈ అవార్డును గెలుచుకుంది.
సాహస్
తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సాహస్’ కార్యక్రమ లోగోను మే 19న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దేశంలో ఇదే తొలిసారి. దేశంలోనే ఎక్కువ శాతం మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న తెలంగాణలో వారి భద్రత కోసం సాహస్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమల్లో మహిళలపై జరుగుతున్న వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు అంతర్గత కమిటీలుంటాయి. అక్కడ సరైన న్యాయం జరగకుంటే సాహస్ అండగా నిలుస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?