Current Affairs May 17 | క్రీడలు
క్రీడలు
లారెస్ అవార్డులు
లారెస్ గ్లోబల్ స్పోర్ట్స్ అవార్డ్స్-2023ను మే 8న పారిస్‌లో ప్రదానం చేశారు. దీనిలో పురుషుల విభాగంలో ఉత్తమ క్రీడాకారుడిగా అర్జెంటీనా ఫుట్‌బాల్ కెప్టెన్ లియోనల్ మెస్సీకి, మహిళల విభాగంలో జమైకా స్ప్రింటర్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైస్లకు లభించాయి. టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు లభించింది. దీంతో మెస్సీ రెండు అవార్డులను అందుకున్నాడు. టెన్నిస్ ఆటగాడు కార్లోస్ అల్కారజ్ (స్పెయిన్)కు బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియన్ ఎరిక్సన్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు.
ఆంటోనియో కార్బజల్
మెక్సికన్ దిగ్గజ ఫుట్‌బాల్ గోల్‌కీపర్ ఆంటోనియో కార్బజల్ మే 9న మరణించాడు. అతడు 5 ఫిఫా ప్రపంచ కప్‌లలో ఆడిన మొదటి ఆటగాడు. అతని రికార్డును లోథర్ మథాస్ (జర్మనీ), జియన్ లుగి బఫోన్ (ఇటలీ), లియోనల్ మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), రాఫెల్ మార్కెజ్ (మెక్సికో), గిలెర్మో ఓచోవా (మెక్సికో), ఆండ్రెస్ గార్డాడో (మెక్సికో) సమం చేశారు. అతడు మెక్సికన్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడి (1988-94)గా పనిచేశాడు.
ఖలీల్
ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) మాజీ వైస్ ప్రెసిడెంట్ ఏఆర్ ఖలీల్ మే 10న మరణించాడు. కర్ణాటక రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ (కేఎస్ఎఫ్ఏ) అధ్యక్షుడిగా 28 ఏండ్లు పనిచేశాడు. ఆయన ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. దాదాపు 6 దశాబ్దాల పాటు భారత ఫుట్‌బాల్ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేశారు.
అద్వైత్
నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో హైదరాబాద్‌కు చెందిన నాలుగేండ్ల అద్వైత్ రెడ్డి మే 11న చోటు సంపాదించాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్సు (నాలుగేండ్ల ఆరు నెలలు) చెస్ ట్రైనర్‌గా అద్వైత్ రికార్డు సృష్టించాడు. అతడు 51 మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు నిర్విరామంగా 30 గేమ్స్‌లో విజయం సాధించాడు. ఈ క్రమంలో 2021లో నటి మంచు లక్ష్మి కుమార్తె నిర్వాణ, 2022లో హీరో అల్లు అర్జున్ కుమార్తె అర్హ సాధించిన రికార్డులను అద్వైత్ బ్రేక్ చేశాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు