Economy | సత్వర సమ్మిళిత వృద్ధి .. సుస్థిర అభివృద్ధి
పదకొండవ పంచవర్ష ప్రణాళిక (2007-12)
- 11వ ప్రణాళిక కాలం 2007-12
- 11వ ప్రణాళిక రూపకర్త మాంటెక్‌సింగ్ అహ్లువాలియా
- 11వ ప్రణాళిక నమూనా ఎల్పీజీ నమూనా
- 11వ ప్రణాళిక ప్రాధాన్యం సత్వర, సమ్మిళిత వృద్ధి
- 11వ ప్రణాళిక అధ్యక్షులు: మన్మోహన్సింగ్
- ఉపాధ్యక్షులు మాంటెక్ సింగ్ అహ్లువాలియా
- 11వ ప్రణాళిక అంచనా వ్యయం రూ. 36,44,718 కోట్లు
- వాస్తవిక వ్యయం రూ. 35,82,767 కోట్లు
- 11వ ప్రణాళికలో అధిక వనరుల కేటాయింపు మాజిక సేవలు – 30.3శాతం, శక్తి -23.4 శాతం
- 11వ ప్రణాళికలో ఆశించిన వృద్ధిరేటు 8.1 శాతం
- సాధించిన వృద్ధిరేటు 7.5 శాతం
11వ ప్రణాళిక ప్రత్యేకతలు
- 11వ ప్రణాళిక అధిక వనరులు సాంఘిక సేవలకు కేటాయించినప్పటికీ సాంఘిక సేవలో భాగంగా ఉన్న విద్యకు అధిక వనరులు అంటే 9.5 శాతం కేటాయించారు. కాబట్టి 11వ ప్రణాళికను అప్పటి ప్రధాన మంత్రి డా. మన్మోహన్సింగ్ విద్యా ప్రణాళిక అని పేర్కొన్నారు.
- 2007 ఆగస్టు 16న వ్యవసాయ రంగంలో సగటున ప్రతి సంవత్సరం 4 శాతం వృద్ధిరేటు సాధించాలని రాష్ట్రీయ క్రిషీ వికాస్ యోజన (RKVY) ప్రారంభం.
- 2007 అక్టోబర్1న రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (RSBY) ప్రారంభించారు.
- 2007 అక్టోబర్ 2న అమ్ఆద్మీ బీమా యోజన (AABY) ప్రారంభించారు.
- 2007 డిసెంబర్లో వ్యభిచార వృత్తిలో ఉన్నవారికి పునరావాసం కల్పించేందుకు ‘ఉజ్వల పథకం’ ప్రారంభించారు.
- 2007 నవంబర్ 19న ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పథకం ప్రారంభం.
- 2008లో ధనలక్ష్మి పథకం(బాల్యవివాహాల నిషేధం, బాలికల విద్య ప్రోత్సాహం) ప్రారంభం.
- 2008లో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) ప్రారంభం.
- 2008లో ఆదర్శ పాఠశాలలు(Model Schools) విధానం ప్రారంభం.
- 2009లో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (RMSA) ప్రారంభం.
- 2009లో సాక్షర భారత్ ప్రారంభం
- 2009లో విద్యాహక్కు చట్టం రూపొందించారు. (6-14 సం.ల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అమలుకు ఏర్పాటు చేశారు. ఇది 2010 నుంచి అమల్లోకి వచ్చింది)
- 2009 జూన్ 25 UIDAI ఏర్పాటు దేశంలోని ప్రతిపౌరుడికి 12 అంకెల ఆధార్ నంబర్‌ను అందించడానికి నందన్ నీలేకని అధ్యక్షుడిగా ఏర్పడింది. ఆధార్ నంబర్ జారీచేసిన మొదటి వ్యక్తి రజనా సోనావాని గ్రామం తెంబ్లి, మహారాష్ట్ర
- 2010లో IGMSY ప్రారంభం (బీపీఎల్ పరిధిలో ఉన్న గర్భిణీలకు 6000/- రూ.ల నగదు ఇవ్వడం)
- 2010 ఏప్రిల్ 1న స్వావలంబన్ పథకం ప్రారంభం (అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు పెన్షన్ అందించడం)
- 2011లో జననీ శిశు సురక్షా కార్యక్రమం.
- 2011 రాజీవ్ ఆవాస్ యోజన ప్రారంభం.
- 2011 జూన్ 3 జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం / అజీవిక పథకం గతంలో ఉన్న SGSY పథకాన్ని NRLM గా పునర్ వ్యవస్థీకరించారు.
- RKVY – Rashtriya Krishi Vikas Yojana
- RSBY – Rashtriya Swasthya Bima Yojana
- AABY – Aam Aadmi Bima Yojana
- PMEGP – Prime Ministers Employment Generation Programme
- RMSA- Rashtriya Madhyamik Shiksha Abhiyan
- UIDAI-Unique Identification Authority of India
- IGMSY-Indira Gandhi Matrtva Sahyog Yojana
- NRLM- National Rural Livelihood Mission
- RAY- Rajiv Awas Yojana
పన్నెండో పంచవర్ష ప్రణాళిక 2012 – 17
- 12వ ప్రణాళిక కాలం 2012 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చి 31 వరకు
- 12వ ప్రణాళిక రూపకర్త మాంటెక్‌సింగ్ అహ్లువాలియా
- 12వ ప్రణాలిక నమూనా ఎల్పీజీ నమూనా రూర్బన్ నమూనా
- 12 వ ప్రణాళిక ప్రాముఖ్యం సత్వర, అధిక సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి
- 12వ ప్రణాళిక అధ్యక్షులు మన్మోహన్సింగ్, నరేంద్రమోడీ
- ఉపాధ్యక్షులు మాంటెక్ సింగ్ అహ్లువాలియా
- 12వ ప్రణాళిక అంచనా వ్యయం రూ. 80,50,153 కోట్లు
- వాస్తవిక వ్యయం రూ. 76,69,807 కోట్లు
- 12వ ప్రణాళికలో అధిక వనరుల కేటాయింపు సామాజిక సేవలు 34.7 శాతం
- శక్తి 18.8 శాతం
- 12వ ప్రణాళికలో ఆశించిన వృద్ధిరేటు 8.0 శాతం, సాధించిన వృద్ధిరేటు 6.7 శాతం
12వ ప్రణాళిక ప్రత్యేకతలు
- 12వ పంచవర్ష ప్రణాళికలో 25 పర్యవేక్షించదగిన లక్ష్యాల (Monittorable Targets)ను 7 అంశాలుగా విభజించారు. అవి
- ఆర్థిక వృద్ధి (4), పేదరికం & ఉపాధి (2), విద్య (3), ఆరోగ్యం (3), అవస్థాపన సౌకర్యాలు (8), పర్యావరణం & సుస్థిరత (3), సేవలు (2)
- 2012లో జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ పథకాన్ని ప్రజల ఆరోగ్యం కోసం ప్రారంభించారు.
- 2013లో జాతీయ ఆరోగ్య మిషన్ పథకాన్ని జాతీయ స్థాయిలో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రారంభించారు.
- 2013 జనవరి 1న నగదు బదిలీ పథకం ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందే వారికి నేరుగా తమ బ్యాంకు ఖాతాలోనికి నగదును బదిలీ చేయడం .
ఉదా: సబ్సిడీ, పెన్షన్ - 2013లో రూసా పథకాన్ని ఉన్నత విద్య కోసం ప్రారంభించారు,
- 2013 జనవరి 7న రోషిణి పథకాన్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో గిరిజన యువతకు స్వయం ఉపాధిలో శిక్షణ కల్పించడం.
- 2014 అక్టోబర్ 2న స్వచ్ఛభారత్మిషన్ను బహిరంగ మల విసర్జన నిర్మూలన కోసం ప్రారంభించారు.
- 2014 సెప్టెంబర్ 25న మేక్ ఇన్ ఇండియాను భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రారంభించారు.
- 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్‌ధన్‌యోజనను ప్రారంభించారు. దీని ఉద్దేశ్యం జీరో బ్యాలెన్స్ జీరో అకౌంట్ అందించడం.
- 2014 సెప్టెంబర్ 25న దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజనను (DDUGKY) గ్రామీణ నైపుణ్య శిక్షణ కోసం ప్రారంభించారు.
- 2015 మార్చి 20న ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన (PMKVY) జాతీయస్థాయిలో నైపుణ్య శిక్షణ కోసం ప్రారంభించారు.
- 2016లో దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన(DDUAY)ను పట్టణ నైపుణ్య శిక్షణ కోసం ప్రారంభించారు.
- 2014లో నమామి గంగే పథకాన్ని గంగానది ప్రక్షాళన కోసం ప్రారంభించారు.
- 2014లో పడే భారత్-బడే భారత్ యోజనను చిన్న పిల్లల విద్యకు సంబంధించి ప్రారంభించారు.
- 2015 జనవరి 22న బేటీ బచావో బేటీ పడావోను లింగ నిష్పత్తి పెంచడం కోసం రూపొందించారు.
- 2015 జూన్ 25న AMRUT Cities పథకాన్ని 500 నగరాలను అభివృద్ధి చేయడం కోసం ప్రవేశపెట్టారు.
- 2015 జూన్ PRASAD Cities పథకాన్ని వారసత్వ నగరాలను అభివృద్ధి చేయడం కోసం రూపొందించారు.
- 2015 జనవరి 22న సుకన్య సమృద్ధి యోజనను ఆడపిల్లల పేరుమీద సేవింగ్ అకౌంట్ ఏర్పాటు చేశారు.
- 2015 జూన్ 1న ప్రధాన మంతి ఆవాస్ యోజన పట్టణ గృహనిర్మాణం కోసం ప్రారంభించారు.
- 2016 ఏప్రిల్ 1న ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ గృహ నిర్మాణం కోసం ప్రారంభించారు.
- 2015 జూలై 15న స్కిల్ ఇండియా మిషన్‌ను నైపుణ్య శిక్షణను పెంపొందించడం కోసం ప్రారంభించారు.
- 2015 జూలై 1 డిజిటల్ ఇండియా పథకాన్ని డిజిటల్ అనుసంధానతను కల్పించడం కోసం ప్రారంభించారు.
- 2015 ఈనామ్ పథకం ద్వారా జాతీయ స్థాయిలో వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేశారు.
- 2016 జనవరి 16న స్టార్టప్ ఆఫ్ ఇండియాను అంకుర పరిశ్రమల ఏర్పాటు అభివృద్ధి కోసం రూపొందించారు.
- 2016 ఏప్రిల్ 5న స్టాండ్ ఆఫ్ ఇండియాను ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం కల్పించడం కోసం ఏర్పాటు చేశారు.
- 2016 మార్చి 4న సేతు భారత్‌ను రైల్వే క్రాసింగ్‌ల వద్ద బ్రిడ్జిల నిర్మాణం కోసం రూపొందించారు.
- 2016 ఏప్రిల్ 30న ఉజాలాను ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు కోసం రూపొందించారు.
- 2016 మే 1న ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా ఉచిత వంటగ్యాస్ కల్పించారు.
- 2016 నవంబర్ 4న ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌ను MMR, IMRలను తగ్గించడం కోసం ఏర్పాటు చేశారు.
- 2017 జనవరి 1న ప్రధానమంత్రి మాతృవందన యోజనను గర్భిణి, బాలింతల కోసం ప్రారంభించారు.
- 2017 ఫిబ్రవరి 8న ప్రధానమంత్రి గ్రామీణ సాక్షరత అభియాన్‌ను గ్రామీణ విద్య కోసం ఏర్పాటు చేశారు.
- 2017 ఏప్రిల్ 1 రాష్ట్రీయ వయోశ్రీయోజనను వయో వృద్ధుల కోసం రూపొందించారు.
ప్రాక్టీస్ బిట్స్
1. 11వ ప్రణాళిక రూపకర్త ఎవరు?
ఎ) మాంటెక్ సింగ్ అహ్లువాలియా
బి) మన్మోహన్ సింగ్
సి) వాజ్‌పేయి
డి) పి.వి. నర్సింహారావు
2. 11 వ ప్రణాళిక సాధించిన వృద్ధిరేటు ఎంత శాతం?
ఎ) 2.1 శాతం బి) 7.5 శాతం
సి) 6.5 శాతం డి) 7.8 శాతం
3. 11వ ప్రణాళికలో అధిక వనరులు దేనికి కేటాయించారు?
ఎ) వ్యవసాయం బి) పారిశ్రామిక రంగం
సి) సామాజిక సేవలు డి) శక్తి
4. 11వ ప్రణాళికను విద్యా ప్రణాళిక అని ఎవరు పేర్కొన్నారు?
ఎ) అహ్లువాలియా బి) మన్మోహన్ సింగ్
సి) వాజ్‌పేయి డి) కె.సి. పంత్
5. అమ్ ఆద్మీ బీమా యోజనను ఎప్పడు ప్రారంభించారు?
ఎ) 2007 అక్టోబర్ 2
బి) 2007 ఆగస్టు 15
సి) 2002 అక్టోబర్ 2
డి) 2006 అక్టోబర్ 2
6. ఆధర్శ పాఠశాలలను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
ఎ) 2007 బి) 2008
సి) 2009 డి) 2010
7. 6-14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 2008 బి) 2009
సి) 2010 డి) 2011
8. NRLM ను విస్తరించండి?
ఎ) National Rural Labour Mission
బి) National Rural Livelihood Mission
సి) National Regional Labour Mission
డి) National Rural Labour Mark
సమాధానాలు
1-ఎ 2-బి 3-సి 4-బి
5-ఎ 6-బి 7-సి 8-బి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు