Telangana History | ‘హిందూ సోషల్ క్లబ్’ను ఎవరు స్థాపించారు?
గతవారం తరువాయి..
208. కింది వాటిలో ఏది విష్ణుకుండిన రాజధాని కాదు?
a) అమరావతి b) అమరపురం
c) ఇంద్రపాలనగరం d) దెందులూరు
జవాబు: (a)
వివరణ: అమరపురం అంటే ఇప్పటి నాగర్‌కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్. ఇంద్రపాలనగరం నల్లగొండ జిల్లా వలిగొండ మండలం తుమ్మలగూడెం శివారులో ఉంది. దెందులూరు పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి దగ్గర ఉంది.
209. విష్ణుకుండినుల రాజచిహ్నం ఏది?
a) గండబేరుండం b) వరాహం
c) గరుత్మంతుడు d) సింహం
జవాబు: (d)
210. విష్ణుకుండిన రాజులందరిలో గొప్పవాడు ఎవరు?
a) ఇంద్రవర్మ b) రెండో మాధవవర్మ
c) మొదటి విక్రమేంద్రవర్మ
d) గోవిందవర్మ జవాబు: (b)
వివరణ: శాసనాల నుంచి రెండో మాధవవర్మ అనేక యుద్ధాల్లో గెలిచినట్లు తెలుస్తున్నది. శాసనాల్లో ఈయనను ‘ప్రాగ్దక్షిణాపథాంభోనిధిరేవాసరిత్సలిలవలయ’, ‘అనేక సామంత మకుట మణిఖచిత చరణయుగళుడు’ అని పేర్కొన్నారు.
211. ఏ విష్ణుకుండిన రాజు న్యాయ విధానాలకు దేవతలు కూడా సంతోషపడ్డారు?
a) రెండో మాధవవర్మ
b) మూడో మాధవవర్మ
c) గోవిందవర్మ d) ఇంద్రవర్మ
జవాబు: (a)
212. ‘విష్ణుకుండి వాకాటక వంశద్వయాలంకార జన్మ’ అనే మారుపేరు ఎవరికి ఉంది?
a) విష్ణుకుండిన ఇంద్రవర్మ
b) విష్ణుకుండిన రెండో మాధవవర్మ
c) వాకాటక ధ్రువసేనుడు
d) వాకాటక దామోదరసేనుడు
జవాబు: (b)
213. ‘జనాశ్రయ ఛందోవిచ్ఛిత్తి’ అనే ఛందస్సుకు సంబంధించిన గ్రంథాన్ని ఎవరు రచించినట్లు తెలుస్తున్నది?
a) రెండో ఇంద్రభట్టారకవర్మ
b) మూడో మాధవవర్మ
c) రెండో మాధవవర్మ
d) మొదటి విక్రమేంద్రవర్మ జవాబు: (c)
వివరణ: జనాశ్రయ అనేది రెండో మాధవవర్మ బిరుదు.
214. కింది రాజవంశాల్లో ఎవరు తమను తాము ‘శ్రీపర్వతస్వామి పాదానుధ్యాతులమ’ని పేర్కొన్నారు?
a) ఇక్ష్వాకులు b) శాతవాహనులు
c) ఆనందగోత్రికులు d) విష్ణుకుండినులు
జవాబు: (d)
215. విష్ణుకుండుల కాలానికి సంబంధించి ‘దివ్యాలు’ పదం దేన్ని సూచిస్తుంది?
a) దీపాలు b) న్యాయవిధులు
c) ఒక రకం నాణేలు
d) దేవాలయాలకు ఇచ్చే భూములు
జవాబు: (b)
వివరణ: దివ్యాలు అనే పేరుతో న్యాయవిధులను మాధవవర్మ కనిపెట్టాడు. ఈయన బహుశా రెండో మాధవవర్మ కావచ్చు.
216. విష్ణుకుండినులు చేయించిన నగారా భేరీ ఏ ఆలయంలో ఇప్పటికీ ఉంది?
a) శ్రీశైలం మల్లికార్జున ఆలయం
b) అలంపురం జోగులాంబ ఆలయం
c) ఉమామహేశ్వరం ఆలయం
d) కోటప్పకొండ త్రికూటేశ్వరాలయం
జవాబు: (c)
వివరణ: ఉమామహేశ్వరంలో పల్లవుల కాలంనాటి శివలింగం ఉంది.
217. ఉండవల్లి, మొగల్రాజపురం, ఇంద్రకీలాద్రిలో ఉన్న బౌద్ధ, వైదిక గుహాలయాలు ఎవరి కాలంనాటివి?
a) ఇక్ష్వాకులు b) విష్ణుకుండినులు
c) పల్లవులు d) వేంగీ చాళుక్యులు
జవాబు: (b)
218. ఉండవల్లి, మొగల్రాజపురం, ఇంద్రకీలాద్రి గుహల్లో గోడలు, స్తంభాల అడుగు భాగంలో ఏమని రాసి ఉంటుంది?
a) విశ్వేశ కక్కలస b) తొలుచువాండ్రు
c) నాగబు d) శ్రీ ఉత్పత్తి పిడుగు
జవాబు: (d)
వివరణ: నల్లమల అడవుల్లో ఉన్న సలేశ్వరం, భూపాలపల్లి జిల్లా పాండవుల గుట్ట గుహల్లో కూడా ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’ అని రాసి ఉంది.
219. కాకతీయుల లాంటి రాజవంశాలు కూడా ఎవరిని తమ మూలపురుషుడుగా పేర్కొన్నాయి?
a) రెండో మాధవవర్మ b) ఇంద్రవర్మ
c) గోవిందవర్మ
d) మొదటి విక్రమేంద్రవర్మ
జవాబు: (a)
220. ‘సముద్రాల గర్వాన్ని అణచివేసేది’గా పేర్కొన్న ‘చౌండ సముద్రం’ చెరువు ఎక్కడ ఉంది?
a) ఖాజీపేట b) హనుమకొండ
c) కొండపర్తి d) లక్నవరం
జవాబు: (c)
వివరణ: చౌండ సముద్రాన్ని గణపతిదేవుడి సేనాని మల్యాల చౌండరాయలు నిర్మింపజేశాడు. చౌండ సముద్రం ప్రశస్తిలోనే అప్పటి చెరువులను సముద్రాలు ఎందుకనేవారో వివరంగా ఉంది.
221. కింది వారిలో సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో తన వైద్య విద్యను మానేసింది ఎవరు?
a) డా. జయసూర్య
b) అక్బర్ అలీఖాన్
c) పద్మజా నాయుడు
d) హరీంద్రనాథ ఛటోపాధ్యాయ
జవాబు: (a)
వివరణ: జయసూర్య తల్లిదండ్రులు సరోజినీ నాయుడు, గోవిందరాజులు నాయుడు.
222. ‘పయనీర్’ పత్రికలో నిజాం ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఎవరు వ్యాసాలు రాశారు?
a) కేశవరావు కోరాట్కర్
b) వామనరావు నాయక్
c) బారిస్టర్ రుద్ర
d) బూరుగుల రామకృష్ణారావు
జవాబు: (c)
వివరణ: బారిస్టర్ రుద్ర మీద ప్రభుత్వ ఒత్తిడి అధికం కావడంతో, ఆయన హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్లిపోయాడు.
223. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’లో నిజాంను ‘ఇండియన్ డయ్యర్’ అని విమర్శించింది ఎవరు?
a) బారిస్టర్ రుద్ర b) తారానాథ్
c) షోయబుల్లా ఖాన్ d) నరేంద్ర జీ
జవాబు: (b)
224. కింది వారిలో ‘యంగ్‌మెన్ ఇంప్రూవ్మెంట్ అసోసియేషన్’ను ఎవరు ఏర్పాటు చేశారు?
a) రాజా మురళీ మనోహర్
b) రాజా మహీపతి రాయ్
c) అఘోరనాథ ఛటోపాధ్యాయ
d) సరోజినీ నాయుడు జవాబు: (c)
225. ‘హిందూ సోషల్ క్లబ్’ను ఎవరు స్థాపించారు?
a) అఘోరనాథ ఛటోపాధ్యాయ
b) పండిత్ నరేంద్రజీ
c) వినాయకరావు విద్యాలంకార్
d) రాజా మురళీ మనోహర్
జవాబు: (d)
226. కింది వాక్యాలను పరిశీలించి సరైన దాన్ని/ వాటిని ఎంచుకోండి.
1. మొదటి హైదరాబాద్ రాజకీయ సమావేశం 1923లో హైదరాబాద్‌లో జరిగింది
2. ఈ సమావేశానికి మాడపాటి హనుమంతరావు అధ్యక్షత వహించారు
a) 1 b) 2 c) 1, 2
d) 1, 2 సరైనవి కావు జవాబు: (d)
వివరణ: మొదటి హైదరాబాద్ రాజకీయ సమావేశం మాడపాటి హనుమంతరావు, వామనరావు నాయక్ తదితరుల చొరవతో జరిగింది. దీన్ని 1923 కాకినాడలో జాతీయ కాంగ్రెస్ సమావేశంతో పాటు నిర్వహించారు. దీనికి మహారాష్ట్రకు చెందిన జాతీయోద్యమ నాయకుడు మాధవ శ్రీహరి ఆణే అధ్యక్షుడిగా ఉన్నారు.
227. 1926లో రెండో హైదరాబాద్ రాజకీయ సమావేశం ఎక్కడ జరిగింది?
a) పూనా b) బొంబాయి
c) హైదరాబాద్ d) విజయవాడ
జవాబు: (b)
228. బొంబాయిలో జరిగిన రెండో హైదరాబాద్ రాజకీయ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు?
a) వై.ఎం. కాళే b) సేనాపతి బాపట్
c) ఠక్కర్ బప్పా d) ఎం.ఎస్. ఆణే
జవాబు: (a)
229. 1928లో పూనాలో జరిగిన మూడో హైదరాబాద్ రాజకీయ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు?
a) వై.ఎం. కాళే
b) మాధవ శ్రీహరి ఆణే
c) నరసింహ చింతామణి కేల్కర్
d) చిర్రావూరు యజ్ఞేశ్వర చింతామణి
జవాబు: (c)
230. మూడో హైదరాబాద్ రాజకీయ సమావేశంలో హైదరాబాద్ సమస్య గురించి ప్రసంగించిన ప్రమఖ స్వాతంత్య్రోద్యమ నాయకుడు ఎవరు?
a) మహాత్మా గాంధీ
b) జవహర్లాల్ నెహ్రూ
c) సర్దార్ వల్లభాయ్ పటేల్
d) నేతాజీ సుభాష్ చంద్ర బోస్
జవాబు: (d)
231. హైదరాబాద్ రాజకీయ సమావేశాల గురించి కింది వివరాలను పరిశీలించండి.
A. మొదటి సమావేశం
1. రామచంద్ర నాయక్
B. రెండో సమావేశం 2. ఎన్.సి. కేల్కర్
C. మూడో సమావేశం 3. ఎం.ఎస్. ఆణే
D. నాలుగో సమావేశం 4. వై.ఎం. కాళే
పై వాటిని జతపర్చండి.
a) A-2, B-3, C-4, D-1
b) A-3, B-4, C-2, D-1
c) A-2, B-4, C-2, D-3
d) A-3, B-2, C-3, D-1
జవాబు: (b)
232. హైదరాబాద్ రాజకీయ సమావేశాలు, వేదికల వివరాలను పరిశీలించండి.
1. మొదటి సమావేశం: హైదరాబాద్
2. రెండో సమావేశం: బొంబాయి
3. మూడో సమావేశం: పూనా
4. నాలుగో సమావేశం: కాకినాడ
పైవాటిలో సరైన జతలు ఎన్ని?
a) 1 b) 2
c) 2, 3 d) నాలుగూ సరైనవే
జవాబు: (c)
వివరణ: హైదరాబాద్ రాజకీయ సమావేశాలు మొదటిది కాకినాడ (1923)లో, రెండోది బొంబాయి (1926)లో, మూడోది పూనా (1928)లో, నాలుగోది అకోలా (1931)లో జరిగాయి.
233. హైదరాబాద్‌లో రాజ్యాంగ సంస్కరణలకు నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ..
a) రామస్వామి ముదలియార్ కమిటీ
b) పింగళి వెంకటరామారెడ్డి కమిటీ
c) నవాబ్ మెహిదీ నవాజ్ జంగ్ కమిటీ
d) అరవముత్తు అయ్యంగార్ కమిటీ
జవాబు: (d)
వివరణ: రాజకీయ అసంతృప్తి పెరుగుతుండటంతో 1937లో నిజాం ప్రభుత్వం అరవముత్తు అయ్యంగార్ కమిటీని నియమించింది. రెండో ప్రపంచ యుద్ధం, రాజకీయ అనిశ్చితి కారణంగా ఈ కమిటీ సిఫారసులు అమల్లోకి రాలేదు.
234. హైదరాబాద్ చరిత్రకు సంబంధించి 1938 ప్రత్యేకత ఏంటి?
1. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆవిర్భావం
2. ఆర్య సమాజ్ సత్యాగ్రహం
3. హిందూ లిబర్టీ యూనియన్ సత్యాగ్రహం
4. ఉస్మానియా విశ్వవిద్యాలయం వందేమాతరం ఉద్యమం
పై వాటిలో సరైనవి ఏవి?
a) 1, 3 b) 2, 3, 4
c) 1, 2, 3, 4 d) 1, 4
జవాబు: (c)
వివరణ: 1938 జూలైలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటైంది. రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు అదే ఏడాది సెప్టెంబర్ 9న సర్వసభ్య సమావేశానికి నిర్ణయించారు. అయితే అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న సర్ అక్బర్ హైదరీ సెప్టెంబర్ 8న స్టేట్ కాంగ్రెస్‌పై నిషేధం విధించారు. నిషేధం ఎత్తివేతకు జరిపిన చర్చలు ఫలించలేదు. దాంతో అక్టోబర్ 24న కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహం చేశారు. ఇందులో గోవిందరావ్ నానల్, రావి నారాయణ రెడ్డి, రామకృష్ణ ధూత్, జనార్దనరావు దేశాయి అరెస్టయ్యారు. డిసెంబర్ 24 వరకు జరిగిన ఉద్యమాన్ని గాంధీజీ సూచన మేరకు నిలిపివేశారు.
235. 1938లో ఆర్యసమాజ్ సత్యాగ్రహంలో కొరడా దెబ్బలు తింటున్నా ‘వందేమాతరం’ నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
a) వట్టికోట ఆళ్వారుస్వామి
b) రామచంద్రరావు
c) దేవులపల్లి వెంకటేశ్వరరావు
d) నారాయణరావు పవార్
జవాబు: (b)
వివరణ: ఈ సత్యాగ్రహం నుంచే రామచంద్రరావు పేరుకు ముందు ‘వందేమాతరం’ వచ్చి చేరింది.
236. ఆర్యసమాజం సత్యాగ్రహం సమయంలో నిజాం ప్రభుత్వంతో చర్చలు జరిపింది ఎవరు?
a) లాలాదేశబంధు గుప్తా
b) పండిత్ నరేంద్రజీ
c) స్వామి నిత్యానంద సరస్వతి
d) చంద్రకరణ్ శారద జవాబు: (a)
వివరణ: చర్చల తర్వాత 1939 ఆగస్టు 7న ఆర్యసమాజ్ సత్యాగ్రహం విరమించింది.
237. వందేమాతరం ఉద్యమం సమయంలో ఉస్మానియా విద్యార్థుల సమస్యను గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్ర బోస్ దృష్టికి ఎవరు తీసుకెళ్లారు?
a) డా. జయసూర్య
b) పి.వి. నరసింహారావు
c) స్వామి రామానంద తీర్థ
d) రావి నారాయణ రెడ్డి జవాబు: (a)
238. వామపక్ష భావజాలం కలిగిన వారు హైదరాబాదులో కామ్రేడ్స్ అసోసియేషన్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటుచేశారు?
a) 1935 b) 1937
c) 1939 d) 1940
జవాబు: (c)
వివరణ: ఆలం కుందు మీరి, జవ్వాద్ రజ్వీ, మగ్దూం మొహియుద్దీన్, రాజబహదూర్ గౌర్ తదితరులు కామ్రేడ్స్ అసోసియేషన్‌లో కీలకపాత్ర పోషించారు. వీరు రష్యా విప్లవం, సోషలిస్టు సిద్ధాంతాలతో ప్రభావితం అయ్యారు. అసోసియేషన్ మొదటి సమావేశం పాతబస్తీలో దివాన్ దేవిడీలో 1939 డిసెంబర్ 13న జరిగింది.
239. నిజాం రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
a) 1935 b) 1939
c) 1940 d) 1941
జవాబు: (c)
వివరణ: కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కె.ఎల్. మహేంద్ర, మగ్దూం, రాజబహదూర్ గౌర్ ముఖ్యపాత్ర పోషించారు.
240. ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
a) 1940 b) 1941
c) 1945 d) 1946
జవాబు: (b)
వివరణ: ఇందులో ఓంకార్ ప్రసాద్, బి. నర్సింగరావు, రఫీ అహ్మద్ చురుగ్గా పాల్గొన్నారు.
241. కింది వివరాలను పరిశీలించండి.
1. నిజాం రాజు, భారత ప్రభుత్వం మధ్య యథాతథ స్థితి ఒప్పందం 1947 ఆగస్టు 15న కుదిరింది
2. హైదరాబాద్ రాజ్యం చివరి ప్రధానమంత్రిగా సర్ అక్బర్ హైదరీ పనిచేశారు
3. భారత ప్రభుత్వం హైదరాబాద్‌లో ఏజెంట్ జనరల్‌గా కె.ఎం. మున్షీని నియమించింది
పై వాక్యాల్లో సరైనవి ఏవి?
a) 1, 3 b) 1, 2, 3
c) 2 d) 3
జవాబు: (d)
వివరణ: యథాతథ స్థితి ఒప్పందం 1947 నవంబర్ 29న కుదిరింది. హైదరాబాద్ చివరి ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీ.
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు