POLITY | ఎస్సీ, ఎస్టీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది?
1. షెడ్యూల్డ్ కులాల, తెగల అకృత్యాల నిరోధక చట్టం 1989కి సంబంధించి సరికాని వాక్యం ఏది?
1) ఈ చట్టం దేశ వ్యాప్తంగా 1990 జనవరి 30న అమల్లోకి వచ్చింది
2) 2015లో ఈ చట్టానికి సవరణ చేసి 2016 జనవరి 26న అమలు చేశారు.
3) వీరితో జంతు కళేబరాలను శుభ్రం చేయించవచ్చు
4) వీరిని పబ్లిక్‌గా కులం పేరుతో దూషించడం తప్పు
2. షెడ్యూల్డ్ కులాలు సంస్థాగత ఏర్పాటు, సంక్షేమ పథకాలకు సంబంధించి సరికాని వాక్యం ఏది?
1) ఒక ప్రత్యేక కమిషన్‌ను నియమించాలి
2) వీరికి విద్యలో అన్ని సదుపాయాలను కల్పించాలి
3) 1992లో వీరి కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు
4) ఆడపిల్లలకు మాత్రమే ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి
3. షెడ్యూల్డ్ తెగల ఆర్థిక అభివృద్ధి సంస్థకు సంబంధించి సరికానిది.
1) 2001లో షెడ్యూల్డ్ తెగల మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు
2) ఎస్టీలకు తక్కువ వడ్డీకే ఆర్థిక సహాయం అందించాలి
3) 1988లో TRIFED ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది
4) TRIFED ను 1987లో ఏర్పాటు చేశారు
4. షెడ్యూల్డ్ తెగల సంక్షేమ పథకానికి సంబంధించి సరికాని వాక్యం ఏది?
1) విద్యాభివృద్ధి పథకాలను అమలు చేయాలి
2) రాజీవ్‌గాంధీ జాతీయ స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేస్తారు
3) 6వ షెడ్యూల్లో గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేశారు
4) 1974 నుంచి 21 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉప ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నారు
5. కిందివాటిలో సరికానిది?
1) ఎస్సీ, ఎస్టీలకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను అందించాలి
2) వీరి కోసం వసతి గృహాలను ఏర్పాటు చేయాలి
3) దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి కేంద్ర సంస్థలు రుణాలను మంజూరు చేస్తారు
4) 1992లో జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక ఆభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు
6. కింది కమిటీల్లో సరికానిది ఏది?
1) 1953లో కాకా కాలేల్కర్ కమిషన్‌ను నియమించారు
2) 1979లో బి.పి.మండల్ కమిటీని నియమించారు
3) బి.పి.మండల్ కమిటీ 1980లో నివేదికను సమర్పించింది
4) ఇందిరా సహాని కమిటీ 1990లోనియమించారు
7. బి.పి. మండల్ కమిషన్ ముఖ్యాంశాల్లో సరికానిది ఏది?
1) ఇది 11 ప్రమాణాలను నిర్ణయించింది
2) ఇది ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లను కల్పించనున్నది.
3) దీన్ని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం అమలు చేసింది
4) ఇది 40 సిఫారసులను చేసింది
8. వెనుకబడిన తరగతుల కమిషన్‌కు సంబంధించి సరికానిది?
1) ఈ కమిటీలో ఒక అధ్యక్షుడు ఒక ఉపాధ్యక్షుడు ముగ్గురు సభ్యులుంటారు
2) ఈ కమిటీకి సివిల్ కోర్టుకున్న ఇతర అధికారాలు కూడా ఉంటాయి
3) 338 (బి6) ప్రకారం ఈ కమిటీకి రాష్ట్రపతికి నివేదికను సమర్పిస్తుంది
4) మొదటి బీసీ కమిషన్ చైర్మన్ సూరత్‌సింగ్
9. 2019 నుంచి బీసీ కమిషన్ చైర్మన్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు?
1) శ్యామ్ సుందర్
2) భగవాన్ లాల్ సహాని
3) ఈశ్వరయ్య 4) ప్రసాద్
10. కిందివాటిలో అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని రాయండి?
1) రాజ్యాంగంలో మైనార్టీ అనే పదాన్ని 29వ నిబంధనలో పేర్కొన్నారు
2) మైనార్టీలను రెండు రకాలుగా వర్గీకరించారు
3) 2020లో జైనులను మైనార్టీలుగా గుర్తించారు
4) 1992లో మైనార్టీ చట్టం చేశారు
11. ఎస్స్సీ/ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ చట్టం) చట్టం పీఠిక చేప్పే విషయం ఏది?
1) బాధితులు – పునరావాసం
2) బాధితులను గుర్తించడం
3) బాధితుల నుంచి సాక్ష్యం చెప్పించడం
4) బాధితులు- ఆర్థిక సాయం
12. బేగార్ అంటే ఏమీ ఆశించకుండా పని చేయడం
2) ఏమి ఆశించకుండా బలవంతంగా చేయించడం
3) కొంత మొత్తానికి బలవంతంగా చేయడం
4) చట్టమూలంగా చేయించడం
13. ఎస్సీ, ఎస్టీ చట్టంలో అట్రాసిటీ కింద వస్తుంది?
1) వాళ్లను స్కూళ్లలోకి రాకుండా నిరోధించడం
2) వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్
3) వాళ్లను ఇతర కులస్థులతో వివాహం కాకుండా నిరోధించడం
4) వాళ్ల ఇంటి ముందు / పరిసరాల్లో చెత్త వేయడం
14. రాజ్యాంగంలోని అధికరణ 39(సి) ఉద్దేశం
1) వనరుల పంపిణీ
2) మహిళా సంక్షేమం
3) సంపద కొందరి వద్దే కేంద్రీకృతం కాకుండా అడ్డు కోవడం
4) బాలల సంక్షేమం
15. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ తర్వాత?
1) నష్టపరిహారం చెల్లించమని ఆదేశించడం
2) నష్ట పరిహారం విషయంలో ప్రభుత్వానికి చెప్పడం
3) నష్టపరిహారం విషయంలో అధికారం లేకపోవడం
4) జరిగిన విషయాన్ని తెలియజేయడం
16. మైనారిటీ విద్యా సంస్థల విషయంలో సుప్రీంకోర్టులో చర్చించిన కేసు?
1) మోహిని జైన్ కేసు
2) టి.ఎం.ఎ.పాయ్ ఫౌండేషన్
3) ఉన్ని కృష్ణన్ కేసు
4) సునీల్ బత్ర కేసు
17. భారత ప్రభుత్వ సంక్షేమ మంత్రిత్వశాఖ పేరును ఏ విధంగా మార్చారు.
1) సాంఘిక సంక్షేమ మంత్రిత్వశాఖ
2) సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ
3) సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ
4) షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మంత్రిత్వశాఖ
18. లోక్‌సభలో, రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్‌ను 2020 వరకు పొడిగిస్తూ తీసుకున్న భారతీయ రాజ్యాంగ సవరణ ఏది?
1) 73 2) 95 3) 79 4) 77
19. రెండో బీసీ కమిషన్ ప్రధాన సిఫారసులను పేర్కొనండి?
1) జనాభాలో బీసీలు 52 శాతం ఉన్నారు. వీరికి విద్యా ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం ఉండాలి
2) ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
3) పై రెండూ 4) ఏదీకాదు
20. రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ర్టాలకు గిరిజన సంక్షేమం కోసం మంత్రి ఉండాలి.
1) అస్సాం, నాగాలాండ్, మణిపూర్
2) మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్
3) ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక
4) పైవేవీకావు
21. ఎస్సీ, ఎస్టీలకు ఏ ప్రకరణల ప్రకారం లోక్సభలోను రాష్ర్టాల విధాన సభల్లోను రిజర్వేషన్లు కల్పించబడ్డాయి?
1) ప్రకరణ 330, ప్రకరణ 332
2) ప్రకరణ 332, ప్రకరణ 330
3) ప్రకరణ 332, ప్రకరణ 334
4) ప్రకరణ 334, ప్రకరణ 332
22. రామానందన్ సిఫారసుల మేరకు పార్లమెంటు ఏర్పాటు చేసిన కమిషన్ ఏది?
1) నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్
2) నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్
3) నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్
4) నేసనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్
23. ఎస్సీ, ఎస్టీ క్రీమీలేయర్ గురించి సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది?
1) బాలాజీ Vs కేరళ
2) అశోక్ కుమార్ ఠాకూర్ Vs బీహార్
3) ఇందిరా సహాని Vs ఉత్తరప్రదేశ్
4) ఏదీకాదు
24. కిందివారిలో ఏ వర్గం సంక్షేమం గురించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు?
1) వికలాంగులు
2) విద్యాపరంగా వెనుకబడిన వారు
3) ఆర్థికంగా వెనుకబడినవారు
4) సామాజికంగా వెనుకబడినవారు
25. కింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది?
1) వికలాంగుల హక్కుల చట్టం -1995
2) మానసిక ఆరోగ్య చట్టం – 1987
3) బాల కార్మిక నిషేధ నియంత్రిత చట్టం – 1986
4) పైవన్నీ సరైనవి
26. జాతీయ బాలల విధానం 2013 ప్రకారం అంతర్గతంగా ఉన్న అంశాలు?
1) అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన
2) ఐక్యరాజ్య సమితి బాలల హక్కులపై తీర్మానాలు
3) అంతర్జాతీయ ప్రొటోకాల్
4) పైవన్నీ
27. గ్రామీణ పేదరికానికి కారణాలు?
ఎ) ఆదాయాల్లో వ్యత్యాసం
బి) అవిద్య సి) కులవ్యవస్థ
డి) వ్యవసాయంపై అతిగా ఆధారపడటం
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, డి
28. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకంలో అంశం
1) దీనిని 1973 అక్టోబర్‌లో ప్రవేశ పెట్టారు
2) బాలల భౌతిక మానసిక, సామాజిక
వికాసానికి కృషి చేయడం
3) వివిధ శాఖలు అమలు చేస్తున్న
పథకాలను సమన్వయం చేయడం
4) పైవన్నీ
29. స్వయం సహాయక గ్రూపుల ప్రాముఖ్యతను తెలియజేసే అంశాలు.
1) పేదరిక నిర్మూలన
2) ఉద్యోగ అవకాశాలు పెంపొందించడం
3) ఆదాయ పెరుగుదలకు కృషి చేయడం
4) పైవన్నీ
30. భారత రాజ్యాంగంలో ఆహార భద్రతకు సంబంధించి ప్రత్యక్ష పరోక్ష సంబంధం ఉన్న ప్రకరణలు.
ఎ) 21 బి) 39 సి) 47 డి) 43
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) బి, డి
31. జాతీయ ఆహార కమిషన్‌కు సంబంధించి సరైనది
1) ఇందులో ఒక చైర్మన్ 5 గురు సభ్యులుంటారు
2) ఒక సభ్యుడు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెంది ఉండాలి.
3) ఇద్దరు మహిళ సభ్యులు తప్పనిసరిగా ఉండాలి
4) పైవన్నీ సరైనవే
32. స్వయం సహాయక గ్రూపుల విధులేవి?
1) సభ్యుల సమస్యలను చర్చించడం
2) పొదుపును ప్రోత్సహించడం
3) అంతర్గత రుణాలు ఇవ్వడం
4) పైవన్నీ సరైనవే
33. కిందివాటిలో సరికాని వాక్యాన్ని రాయండి.
1) ఆడవాళ్లను లైంగికంగా హింసించకుండా ఉండటానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిన కేసు మోహిని జైన్ కేసు
19(1)(g)- ఏ వృత్తినైనా చేసుకొనే హక్కును పరిరక్షించే అధికరణం
3) ప్రకరణ 39 ఎ – ఉచిత న్యాయ సహాయం కలుగజేసే అధికరణం
4) ప్రకరణ 39(సి) – బాల్యం, యవ్వనం పరిరక్షించు అధికరణం
34. జాతీయ మైనార్టీ కమిషన్ గురించి సరికాని వాక్యాన్ని రాయండి.
1) 29, 30 మైనార్టీలకు భాష, సంస్కృతిక హక్కులను కల్పించారు
2) 350ఎ ఆర్టికల్ ప్రకారం బాలలకు మాతృభాషలోనే విద్యను బోధించాలి
3) దీన్ని 1976లో ఏర్పాటు చేశారు
4) దీనికి 1980లో చట్టబద్ధత కల్పించారు
35. జాతీయ మైనార్టీ కమిషన్ గురించి సరికాని వాక్యాన్ని రాయండి?
1) దీనిలో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, ఆరుగురు సభ్యులుంటారు
2) దీని పదవీకాలం 3 సంవత్సరాలు
3) ప్రస్తుత జాతీయ మైనార్టీ కమిషన్ చైర్మన్ సయ్యద్ గయారుల్ హసేన్ రజ్వి
4) ఇది ప్రధానమంత్రి ఇచ్చిన 20 సూత్రాల కార్యక్రమాన్ని పర్యవేక్షించేది
36. కిందివాటిలో సరికాని వాక్యాన్ని రాయండి?
1) జాతీయ మైనార్టీల అభివృద్ధి ఆర్థిక సంస్థను 1995లో ఏర్పాటు చేశారు
2) మౌలానా అజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 1989లో ఏర్పాటు చేశారు
3) మైనార్టీ మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే పథకం నయీరోహిణి పథకం
4) ప్రధాన మంత్రి 20 సూత్రాల పథకాన్ని 2006 నుంచి అమలు చేస్తున్నారు
37. 2007లో ముస్లిం మైనార్టీల స్థితిగతులను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది?
1) రాజమన్నార్ కమిటీ
2) రాజేందర్ సింగ్ సచార్ కమిటీ
3) దంత్వాలా కమిటీ
4) హనుమంతరావ్ కమిటీ
38. కింది ప్రకరణల్లో మహిళలకు సంబంధించి సరికాని వాక్యాన్ని రాయండి?
1) 15వ నిబంధన ప్రకారం స్త్రీ, పురుషుల పట్ల వివక్ష చూపరాదు
2) 16వ నిబంధన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్ష చూపరాదు
3) 23వ నిబంధన ప్రకారం స్త్రీలను అసభ్య, అశ్లీ మరియు అవినీతి కార్యక్రమాలకు ఉపయోగించరాదు
4) 48వ నిబంధన ప్రకారం మహిళ జీవన ప్రమాణాలను పెంచాలి
39. కింది చట్టాల్లో సరికానిది ఏది?
1) సతీ నిషేధ చట్టం 1829
2) వితంతు పునర్ వివాహ చట్టం 1855
3) హిందూ వివాహ చట్టం 1956
4) 48వ నిబంధన ప్రకారం మహిళ జీవన ప్రమాణాలను పెంచాలి
40. కింది చట్టాల్లో సరికానిది ఏది?
1) హిందూ వారసత్వ చట్టం 1956
2) అశ్లీల అవినీతి నిరోధక చట్టం 1955
3) వరకట్న నిషేధ చట్టం 1961
4) సమాన వేతన చట్టం 1976
సమాధానాలు
1-3 2-4 3-3 4-4
5-4 6-4 7-3 8-4
9-2 10-3 11-1 12-2
13-4 14-3 15-2 16-2
17-3 18-2 19-3 20-2
21-1 22-1 23-2 24-3
25-4 26-4 27-1 28-4
29-4 30-1 31-4 32-4
33-1 34-4 35-4 36-1
37-2 38-4 39-3 40-2
అంజి
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు