General Science Chemistry | పరిశ్రమల వృద్ధితోనే.. దేశాభివృద్ధి
పరిశ్రమలు
గాజు
- గాజు పారదర్శక (లేదా) పారభాషిక పదార్థం
- ఇది అస్ఫటిక పదార్థం.
- ఇది ఘనరూపంలో కనిపిస్తున్న నిజమైన ఘనపదార్థం కాదు.
- దీన్ని అతి శీతలీకరణం చెందిన ద్రవంగా గుర్తించవచ్చు. అందుకు గాజును అతిశీతలీకరణం చెందిన ద్రవం అంటారు.
- గాజు రసాయనికంగా సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికా మిశ్రమం
గాజు పరిశ్రమ - సాధారణ గాజు తయారీలో ముడి పదార్థాలుగా సోడా యాష్, సున్నపురాయి, శుద్ధ సిలికాతో పాటు పగిలిన గాజు ముక్కలను ఉపయోగిస్తారు. వీటన్నింటిని కలిపి బాచ్ అంటారు. వీటిలో ఉపయోగించిన పగిలిన గాజు ముక్కలను ‘కట్లెట్’ అంటారు.
- బాచ్‌ని 1000 డిగ్రీలకు వేడిచేసినప్పుడు గాజు తయారవుతుంది
- రసాయనికంగా గాజు అనేది సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికాల అస్ఫటిక అతిశీతలీకరణ ద్రవం.
- గాజు నిజమైన ఘనపదార్థం కాదు.
- వేడి గాజుపై నురగలా, తేలియాడే మలినాలు ఏర్పడతాయి. వీటిని గ్లాస్ గల్ అంటారు.
- వీటిని తెడ్ల సహాయంతో తొలగిస్తారు.
- వేడి గాజును క్రమంగా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నెమ్మదిగా చల్లారుస్తారు. ఈ ప్రక్రియను ‘మంద శీతలీకరణం’ అంటారు.
- మందశీతలీకరణం – గాజు నెమ్మదిగా సజాతీయ మిశ్రమంగా చల్లార్చుటను అనీలింగ్/మందశీతలీకరణం అంటారు.
- గ్లాస్ బ్లోయింగ్ అనేది పైరక్స్ గాజు, బోరోసిలికేట్ గాజుతో మాత్రమే సాధ్యం.
- దీనివల్ల గాజుకు గట్టిదనం వస్తుంది
- గాజుపై అక్షరాలు రాయడాన్ని ‘ఎచింగ్’ అంటారు.
- దీనికోసం హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉపయోగిస్తారు.
- గాజుపై మొదట మైనంపూత పూస్తారు. తర్వాత అక్షరాల రూపంలో మైనాన్ని తీసేసి HF పూత పూస్తారు.
- హైడ్రోక్లోరిక్ ఆమ్లం గాజుతో చర్య జరిపినతర్వాత హైడ్రోఫ్లోరోసిలిక్ ఆమ్లం ఏర్పడుతుంది.
- దీన్ని, మైనాన్ని తొలగించినప్పుడు అక్షరాలు గాజుపై కనిపిస్తాయి.
- లోహ ఆక్సైడ్లు (లేదా) లవణాలు కలిసి ఉండటం వల్ల గాజుకు ప్రత్యేకమైన రంగులు ఏర్పడుతాయి.
- వేడి గాజును చల్లార్చి మెత్తగా అయిన స్థితిలో దానిలోకి గాలిని ఊది బెలూన్ ఆకృతి ఉన్న వస్తువులు తయారు చేస్తారు. ఈ ప్రక్రియను ‘బ్లోయింగ్’ అంటారు.
సిమెంట్ పరిశ్రమ - సిమెంట్‌ను ‘జోసఫ్ అస్పిడిన్’ (1824) అనే శాస్త్రవేత్త కనుగొన్నారు.
- దీంతో కట్టిన కట్టడాలు ఇంగ్లండ్‌లోని పోర్టులాండ్ అనే ప్రదేశంలో ఉండే రాళ్లలా గట్టిగా ఉంటాయి.
- అందువల్ల సిమెంట్‌కు పోర్టులాండ్ సిమెంట్ అనే పేరు వచ్చింది.
- సిమెంట్ తయారీలో సున్నపురాయి, బంకమన్ను జిప్సంలను ముడిపదార్థాలుగా ఉపయోగిస్తారు.
తయారు చేసే విధానం - సున్నపురాయి, బంకమన్నును పొడిచేసి నీటితో తడుపుతారు. దీన్ని స్లర్రీ అని పిలుస్తారు.
- దీన్ని తిరుగుడు కొలిమిలోకి పంపి 1800 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారు. బూడిద రంగు ఉన్న బంతుల లాంటి ‘క్లింకర్’ ఏర్పడుతుంది. దీన్ని పొడిచేసి 2-3% జిప్సం పొడిని కలిపినప్పుడు సిమెంట్
ఏర్పడుతుంది. - క్లింకర్ నీటిని కలిపినప్పుడు అది వెంటనే గట్టిపడుతుంది. దీన్ని నివారించడానికి దానికి 2-3 శాతం జిప్సం పొడిని కలుపుతారు.
- రసాయనికంగా సిమెంట్ అంటే కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్.
- దీనిలో కాల్షియం ఆక్సైడ్ 61శాతం, సిలికా 22.5 శాతం, అల్యూమినియం 7.5 శాతం ఉంటాయి.
- సిమెంట్‌లో 2 శాతం ఫెర్రిక్ ఆక్సైడ్ ఉండటం వల్ల అది బూడిద రంగులో ఉంటుంది.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ - కాల్షియం సల్ఫేట్ డై హైడ్రేట్‌ను జిప్సం అంటారు. దీని ఫార్ములా CaSo4 2H2O
- ఇది దేశంలో రాజస్థాన్‌లో అధికంగా లభిస్తుంది. దీన్ని 120 డిగ్రీల సెల్సియస్‌కు వేడిచేసినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఏర్పడుతుంది.
- CaSO42H2O CaSO4 1/2 H2O+ 3/2 H2O
- ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు నీటిని కలుపగానే వెంటనే గట్టిపడుతుంది. దీన్ని
1. ఫాల్స్ సీలింగ్‌కు
2. సర్జికల్ ప్లానర్‌గా
3. వినాయక విగ్రహాల తయారీలో
4. చాక్‌పీస్‌ల తయారీలో ఉపయోగిస్తారు - దీనికి సాధారణ ఉప్పు చేర్చడం వల్ల త్వరగా గట్టిపడుతుంది.
- ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కి పటికపొడిని కలిపినప్పుడు అది చాలా కఠినంగా తయారవుతుంది.
- జిప్సంను 200 డిగ్రీల సెల్సియస్‌కు వేడిచేసినప్పుడు అది పూర్తిగా నీటిని కోల్పోయి డెడ్ ప్లాస్టర్‌గా ఏర్పడుతుంది.
- దీన్ని డెడ్ బర్ట్న్(Dead Burnt) అని పిలుస్తారు. దీనికి నీటిని కలిపినప్పుడు గట్టిగా మారే స్వభావం ఉండదు.
పింగాణీ పాత్రలు - సిరామిక్స్ అనే పదం గ్రీకు పదమైన ‘కేరామోస్’ నుంచి పుట్టింది. దీని అర్థం కుండలు.
- వీటి తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు
1. బంకమన్ను
2. ఫెల్స్పార్
3. ఇసుక - వీటిని చూర్ణం చేసి తగినంత నీరు కలిపి ఎండబెడతారు
- ఎండిన వస్తువులను కొలిమిలో 2000 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిచేసినప్పుడు మృణ్మయ పాత్రలు ఏర్పడుతాయి.
ఈ పాత్రలు రెండు రకాలు
1. సాధారణ కుండ పాత్రలు
2. మృత్తికా పాత్రలు - సాధారణ కుండ పాత్రలు 1100 డిగ్రీల వద్ద మాత్రమే తయారవడం వల్ల గట్టిగా ఉండవు. వీటిని కుండలు, కూజాలు, ఇంటిపైకప్పు పెంకులుగా ఉపయోగిస్తారు.
- మృత్తికా పాత్రల తయారీకి 1800 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉపయోగిస్తారు. అందువల్ల ఇవి గట్టిగా ఉంటాయి. వీటిని స్పార్క్ ప్లగ్‌లు, పచ్చడి జాడీలు, టాయిలెట్ సామగ్రి, టైల్స్ తయారీలో ఉపయోగిస్తారు.
ఔషధ పరిశ్రమ
1. అనాల్జెసిక్లు – శరీర నొప్పిని తగ్గించేవి. ఉదా : ఆస్ప్రిన్
2. నార్కోటిక్స్ – అపస్మారక స్థితిని, నిద్రను కలిగించేది ఉదా : హెరాయిన్, మార్ఫిన్ వంటి అల్కలాయిడ్లు
3. సెడెటిన్ – బలహీనత, ఆతృతను తగ్గించేవి. ఉదా : సోడియం, పొటాషియం బ్రోమైడ్
4. యాంటీబయాటిక్స్ – శరీర రోగాలను కల్గించే హానికారక సూక్ష్మజీవులను చంపేవి. సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా కలిగించే సూక్ష్మజీవుల నుంచి తయారు చేసిన ఉత్పన్నాలే ‘యాంటీబయాటిక్’లు.
ఉదా : పెన్సిలిన్, అంపిసిల్లిన్
5. యాంటీసెప్టిక్ – వ్యాపించడాన్ని, క్షీణించడాన్ని అరికట్టేవి.
ఉదా : టాంక్చర్ అయోడిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం
6. క్లోరోక్విన్ – మలేరియా తగ్గించడానికి ఉపయోగిస్తారు. మానసిక రుగ్మతను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
7. సల్ఫా డ్రగ్స్ – ‘యాంటీ’ బ్యాక్టీరియల్‌గా ఉపయోగిస్తారు.
8. డీటాక్సోహాల్ – ఈ మధ్యనే కనుగొన్న డ్రగ్. ఇది రక్తంలోని ఆల్కహాల్ శాతాన్ని చాలా తగ్గిస్తుంది.
9. అజడోథైమిడిన్ – ఎయిడ్స్ వ్యాధి నిరోధానికి ప్రయత్నిస్తున్న మందు. ఇది హైదరాబాద్‌లోని ఐఐసిటీలో కనుగొన్నారు.
ఆహార పరిశ్రమ - ఆహార పదార్థాల రంగు, రుచి, వాసన, నిలువ పెంపొందించేందుకు కలిపే పదార్థాలను ఫుడ్ ఆడిటివ్స్ అంటారు.
- వీటిని చట్టపరంగా అనుమతించారు.
ఉదా :
1. వానిల్లీన్ అనే ఆరోమాటిక్ ఆల్డిహైడ్‌ను ‘వనిల్లా ఫ్లేవర్’ కోసం ఐస్‌క్రీంలు మొదలైనవాటిలో ఉపయోగిస్తారు.
2. శాకరిన్ను దాని సోడియం (లేదా) కాల్షియం లవణంగా తీపికోసం ఉపయోగిస్తారు. ఇది మధుమేహం ఉన్నవారికి వరం వంటిది. - శాకరిన్ సాధారణ చక్కెర కంటే 600 రెట్లు అధిక తీపి ఉంటుంది.
3. పళ్లరసాల పొడులు చక్కెర, సోడియం బై కార్బొనేట్, టార్టారిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లమిశ్రమం. - ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి సోడియం మెటాబైసల్ఫేట్ను కలుపుతారు.
4. ఆక్సీకరణ నిరోధకాలు ఆహార పదార్థాలను పాడైపోకుండా కాపాడతాయి.
చక్కెర పరిశ్రమ - చెరకు గడలను క్రషింగ్ చేసినప్పుడు చెరకు రసం వస్తుంది. ఇలా ఏర్పడిన చెరకు పిప్పిని ‘బగాసే’ అంటారు. దీన్ని కాగితం తయారీలో, విద్యుత్ ఉత్పత్తికి ఇంధనంగా ఉపయోగిస్తారు.
- చెరకు రసంలో ఆమ్లత్వం ఉంటుంది. దీన్ని తొలగించడానికి సున్నం Ca(OH)2
కలుపుతారు. ఈ ప్రక్రియను డిఫికేషన్ అంటారు. - ఈ తర్వాత ద్రావణంలో ఎక్కువైన సున్నాన్ని తొలగించడానికి దానిలోకి CO2 వాయువును పంపుతారు. ఈ ప్రక్రియను కార్బోనేషన్ అంటారు.
- ఇంకా మిగిలిన సున్నం అవశేషాలను తొలగించడానికి SO2 వాయువు పంపుతారు. ఈ ప్రక్రియను సల్ఫిటేషన్ అంటారు.
- డిఫికేషన్, కార్బోనేషన్, సల్ఫిటేషన్ల వల్ల ఏర్పడిన అవక్షేపాలను ప్రెస్‌మడ్ అని పిలుస్తారు. ఇది ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఏర్పడిన పారదర్శక రసాన్ని బాష్పీకరణ యంత్రాల్లో ఇగిర్చినప్పుడు చక్కెర స్ఫటికాలు ఏర్పడతాయి.
ఆల్కహాల్ పరిశ్రమ - ఇథైల్ ఆల్కహాల్‌ను సాధారణంగా
ఆల్కహాల్ అని వ్యవహరిస్తారు. మద్యపానంలో మత్తును కలిగించేది ఇదే. అందుకే దీన్ని ‘స్పిరిట్ ఆఫ్ వైన్’ అంటారు. చెరకు రసం నుంచి చక్కెర వేరుచేయగా మిగిలిన చిక్కని జేగురురంగు మాతృ ద్రావణాన్ని మొలాసిస్ అంటారు. - దీనిలో 50 శాతం చక్కెర ఉంటుంది. మొలాసిస్‌కు ఈస్ట్‌ను కలిపి కిణ్వప్రక్రియ జరిపినప్పుడు ఇథైల్ ఆల్కహాల్ ఏర్పడుతుంది.
- శుద్ధ ఆల్కహాల్‌ను తాగడానికి వినియోగించకుండా ఉండేందుకు దానిలో మిథైల్ ఆల్కహాల్ లేదా పిరిడీన్ కలుపుతారు. దీన్ని అసహజ స్పిరిట్ అంటారు. కల్తీ
సారాయిలో మిథైల్ ఆల్కహాల్ కలిసి ఉంచడం వల్ల కంటిచూపు పోయి మరణం సంభవిస్తుంది. - కల్తీ కల్లులో క్లోరాల్ హైడ్రేట్‌ను నురగ కోసం డైజోపామ్ను మత్తు కోసం కల్తీ చేస్తారు.
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
Previous article
IIITDM Recruitment | కాంచీపురం ట్రిపుల్ ఐటీడీఎంలో 42 పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు