CRPF Recruitment | సీఆర్పీఎఫ్లో 9360 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు మే 02 చివరి తేదీ
CRPF Constable Recruitment 2023 | కేంద్ర హోంశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9360 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 27 నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభంకానున్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్‌ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 9360
పోస్టులు : కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్)
పురుషుల పోస్టులు : డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్మన్, బార్బర్, సఫాయి కర్మచారి తదితరాలు.
మహిళా పోస్టులు: బగ్లర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ ఉమెన్, హెయిర్ డ్రస్సెర్, సఫాయి కర్మచారి, బ్రాస్ బ్యాండ్ తదితరాలు.
అర్హతలు: పోస్టును బట్టి గుర్తింపు పొందిన బోర్డు/ విశ్వవిద్యాలయం నుంచి పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత, హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దీంతోపాటు నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ( పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు) 18 నుంచి 23 మధ్య వయస్సు వారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్‌ల ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేదు
పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: 2023 మార్చి 27
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 02
పరీక్ష: జూన్ 20 నుంచి 25 మధ్య
వెబ్సైట్: www.crpf.nic.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?