TS Constable Mains Model Paper 2 | 83 సంఖ్యను వరుసగా 7, 3, 2 తో భాగిస్తే వచ్చే శేషం ఎంత?
51. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. ఫారెస్ట్ సర్వే వారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అటవీ నివేదిక ప్రచురిస్తారు.
బి. 2021లో విడుదల చేసిన నివేదిక 17వది
సి. ఈ రిపోర్టు ప్రకారం దేశంలో 71.3 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణం ఉంది.
డి. మన దేశంలో అడవుల విస్తీర్ణం 21.71%
ఎ) ఎ, బి, సి, డి బి) ఎ, బి, సి
సి) ఎ, సి, డి డి) బి, సి, డి
52. నాణ్యత ఆధారంగా ఇనుపధాతువు రకాలను ఆరోహణ క్రమంలో అమర్చండి.
ఎ. మాగ్నటైట్ బి. హెమటైట్
సి. లిమోనైట్ డి. సెడరైట్
ఎ) ఎ, బి, సి, డి బి) ఎ, సి, బి, డి
సి) బి, ఎ, సి, డి డి) బి, ఎ, డి, సి
53. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) జాతీయ వరి పరిశోధన కేంద్రం-కటక్
బి) సెంట్రల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- కొచ్చిన్
సి) ఇక్రిశాట్-హైదరాబాద్
డి) సెంట్రల్ మ్యాంగో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- లక్నో
54. తెలంగాణలో ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి?
ఎ) 16 బి) 12 సి) 13 డి) 15
55. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. తెలంగాణ వైశాల్యం 1,12,077 చ.కి.మీ
బి. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం 3.71%
సి. తెలంగాణలో పెద్ద జిల్లా నల్లగొండ
డి. తెలంగాణ ఆకారం సమబాహు త్రిభుజాకారం
ఎ) ఎ, బి, సి, డి బి) ఎ, సి
సి) ఎ. సి. డి డి) బి, డి
కింది సమాచారాన్ని చదివి దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలను రాయండి.
నలుగురు వ్యక్తులు భవేశ్, సూరజ్, హరి, రామ్‌లు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బోధిస్తారు. కానీ ఇదే వరుసలో కాదు. ప్రతి వ్యక్తి రెండు సబ్జెక్టులను బోధిస్తాడు. ప్రతి సబ్జెక్ట్ ఇద్దరు వ్యక్తులచే బోధించబడుతుంది. సూరజ్ స్టాటిస్టిక్స్ను బోధించడు. కాని కెమిస్ట్రీ బోధిస్తాడు. హరి,రామ్‌లు మ్యాథ్స్ బోధిస్తారు. భవేశ్, హరి, ఫిజిక్స్ బోధించరు.
56. భవేశ్ ఏ సబ్జెక్టులను బోధిస్తాడు.
ఎ) మ్యాథ్స్, ఫిజిక్స్ బి) స్టాటిస్టిక్స్, కెమిస్ట్రీ
సి) కెమిస్ట్రీ, మ్యాథ్స్ డి) మ్యాథ్స్, స్టాటిస్టిక్స్
57. కింది వాటిలో ఫిజిక్స్, కెమిస్ట్రీలను బోధించనివారు ఎవరు?
ఎ) హరి బి) సూరజ్
సి) రామ్ డి) భవేశ్
58. స్టాటిస్టిక్స్ను బోధించనివారు ఎవరు?
ఎ) భవేశ్, హరి బి) హరి, సూరజ్
సి) హరి, రామ్ డి) రామ్, సూరజ్
59. రామ్ ఏయే సబ్జెక్టులను బోధిస్తాడు?
ఎ) ఫిజిక్స్. స్టాటిస్టిక్స్ బి) కెమిస్ట్రీ, మ్యాథ్స్
సి) మ్యాథ్స్, ఫిజిక్స్ డి) స్టాటిస్టిక్స్, మ్యాథ్స్
60. మ్యాథ్స్‌ను బోధించనివారు ఎవరు?
ఎ) సూరజ్, రామ్ బి) భవేశ్, హరి
సి) హరి, రామ్ డి) భవేశ్, సూరజ్
సూచన: (61-65) కింద ఇచ్చిన పదాలకు కోడ్స్, నెంబర్స్ అదే క్రమంలో అమర్చలేదు. వాటిని జాగ్రత్తగా పరిశీలించి, ఆ పదాలకు సరైన కోడ్స్, నెంబర్స్ కనుగొనండి.
FUSS SEAL MALE
7850 9677 7540
SAIL MEALS FAIR
2508 9546 28507
61. FUSS
ఎ) 7540 బి) 7850
సి) 9546 డి) 9677
62. SAIL
ఎ) 9677 బి) 7540
సి) 7850 డి) 9546
63. MALE
ఎ) 7850 బి) 7540
సి) 9546 డి) 2508
64. MEALS
ఎ) 2508 బి) 28507
సి) 9546 డి) 96779
65. FAIR
ఎ) 9546 బి) 9677
సి) 7540 డి) 2508
66. నేను తూర్పు వైపు నిల్చున్నాను. నేను 1000 సవ్యదిశ లోను 1450 అపసవ్య దిశలోనూ తిరుగుతే ప్రస్తుతం నేను ఏ దిక్కు వైపు ముఖం చేసి నిల్చున్నాను?
ఎ) తూర్పు బి) ఈశాన్యం
సి) ఉత్తరం డి) నైరుతి
67. pxq అంటే p, qకి సోదరి అని అర్థం
p+q అంటే p, qకి తండ్రి అని అర్థం
p-q అంటే p, qకి తల్లి అని అర్థం
కింది వాటిలో ఏ సమీకరణం ద్వారా s అనే వ్యక్తి Tకు అత్త/పిన్ని అవుతుందని తెలుసుకోగలం
ఎ) T x M + S బి) S + M x S
సి) S x M + T డి) S x M + R – T
68. CONTEMPRARIES అనే పదంలో మొదటి నాలుగు అక్షరాలను తిప్పి రాసి తర్వాత 6 అక్షరాలను వాటికి ముందు తిప్పి రాసి తర్వాత మిగిలిన వాటికి ముందు తిప్పి రాస్తే కొత్త పదంలో ఎడమ నుంచి 9వ అక్షరం ఏది?
ఎ) R బి) I సి) E డి) O
69. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సరిచేసిన గడియారం సోమవారం 6 గంటలకు 12 ని.. ఎక్కువ చూపింది. మంగళవారం ఉదయం ఈ గడియారం 9 గంటలు చూపించనప్పుడు సరైన సమయం ఎంత?
ఎ) 8:30 A.M బి) 8:00 A.M
సి) 8:30 P.M డి) 9:00 A.M
76. ఆరుగురు వ్యక్తులు A, B, C, D, E, F లు రెండు అడ్డు వరుసలో, మూడు నిలువు వరుసలో ఉత్తర ముఖంగా కూర్చొని ఉన్నారు. B సరిగా D కంటే ముందు కూర్చొని ఉన్నాడు. A సరిగా C కంటే ముందు కూర్చొని ఉన్నాడు. B కు వెనువెంటనే కుడివైపున E కూర్చొని ఉంటే కింది వాటిలో ఏది నిజమవుతుంది?
ఎ) E, C లు ఒకే అడ్డు వరుసలో ఉన్నారు
బి) A అడ్డు వరుసలో F కూర్చొని ఉన్నారు
సి) C అడ్డు వరుసలో F కూర్చొని ఉన్నారు
డి) ఏదీ కాదు
77. ప్రవచనాలు: కొన్ని చతుర్భుజాలు చతురస్రాలు అన్నీ రాంబస్
తీర్మానాలు: I. ఏ చతుర్భుజం రాంబస్ కాదు
II. రాంబస్లు అన్నీ చతురస్రాలు
III. కొన్ని చతుర్భుజాలు రాంబస్లు
ఎ) తీర్మానం II అనుసరిస్తుంది
బి) తీర్మానం III అనుసరిస్తుంది
సి) తీర్మానం ఏవీ అనుసరించవు
డి) తీర్మానం I అనుసరిస్తుంది
78. కింది పదాలను ఒక తార్కికమైన, అర్ధవంతమైన క్రమంలో అమర్చండి.
ఎ. డెకా బి. ఆక్టా
సి. హెప్టా డి. నోనా ఇ. హెక్సా
ఎ) డి, ఇ, బి, సి, ఎ
బి) ఇ, సి, బి, డి, ఎ
సి) ఇ, డి, సి, ఎ, బి
డి) ఇ, సి, డి, బి, ఎ
79. కింది వాటిలో ఏది సత్యం కాదు?
ఎ) 2003 సంవత్సరం క్యాలెండర్ 2014 సంవత్సరానికి సరిపడుతుంది
బి) 1998 డిసెంబర్ 14వ తేదీ సోమవారం అయింది
సి) 2012 ఫిబ్రవరి 1వ తేదీ బుధవారం అయింది
డి) 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ శనివారం అయింది
80-82 ప్రశ్నలకు కింది సమాచారాన్ని అనుసరించి సమాధానాలు రాయండి.
కైలాస్, గోవింద్, హరి తెలివైనవారు. కైలాస రాజేష్, జితేందర్ కష్టపడే స్వభావం కలవారు. రాజేష్, హరి, జితేందర్ నిజాయితీపరులు. కైలాస్, గోవింద్, జితేందర్ లక్ష్యాన్ని సాధించినవారు.
80. తెలివి లేకుండా, నిజాయితీ లేకుండా, కష్టపడి లక్ష్యాన్ని సాధించే వ్యక్తి ఎవరు?
ఎ) కైలాస్ బి) గోవింద్
సి) హరి డి) ఏదీ కాదు
81. నిజాయితీ లేకుండా తెలివితో కష్టపడి లక్ష్యాన్ని సాధించే వ్యక్తి ఎవరు?
ఎ) కైలాస్ బి) గోవింద్
సి) హరి డి) జితేందర్
82. తెలివి లేకుండా నిజాయితీతో కష్టపడి లక్ష్యాన్ని సాధించిన వ్యక్తి ఎవరు?
ఎ) రాజేష్ బి) గోవింద్
సి) కైలాస్ డి) జితేందర్
84. ఒక సంఖ్యను 10తో భాగించనప్పుడు 9 శేషంగా లభిస్తుంది. 9 చే భాగించినప్పుడు 8 శేషంగా లభిస్తుంది. 8చే భాగించినప్పుడు 7 శేషంగా లభిస్తుంది. అయితే ఆ సంఖ్య ఏది?
ఎ) 1539 బి) 539
సి) 359 డి) 1359
85. రెండు సంఖ్యల నిష్పత్తి 3:4 వాటి గ.సా.భా 4 అయితే వాటి క.సా.గు?
ఎ) 48 బి) 42
సి) 36 డి) 24
86. 83 సంఖ్యను వరుసగా 7, 3, 2 తో భాగిస్తే వచ్చే శేషం ఎంత?
ఎ) 6, 3, 1 బి) 2, 1, 2
సి) 6, 3, 5 డి) 6, 2, 1
87. P అనే వ్యక్తి ఒక పనిని 40 రోజుల్లో పూర్తిచేయగలడు. P, Q లు ఇద్దరు కలిసి 14 రోజులు పని చేసిన అదే పనిని Q అనే మరో వ్యక్తి 35 రోజుల్లో పూర్తి చేయగలడు. తర్వాత P వెళ్లిపోయాడు. మిగిలిన పనిని పూర్తి చేయడానికి Q తీసుకునే రోజుల సంఖ్య?
ఎ) 12 1/4 బి) 10 1/2
సి) 9 3/4 డి) 8 3/4
88. ఒక మోసపూరిత దుకాణదారుడు తన వస్తువులను తన కొనుగోలు ధరకు అమ్ముతానని చెప్పాడు. కాని కిలోకు బదులుగా అతను 840 గ్రాముల బరువును ఉపయోగించాడు. అయినా అతని లాభ శాతం ఎంత?
ఎ) 19% బి) 14.28%
సి) 20% డి) 21%
89. 10 మంది ఉపాధ్యాయులు గల ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు రిటైర్ అయ్యి అతని స్థానంలోకి 25 ఏళ్ల వయస్సు కలిగిన మరో ఉపాధ్యాయుడు వచ్చి చేరాడు. దీని వల్ల అందరి వయస్సుల సగటు 3 సంవత్సరాలు తగ్గింది. అయినా రిటైరైన ఉపాధ్యాయుని వయస్సు ఎంత?
ఎ) 60 సం.రాలు బి) 58 సం.రాలు
సి) 56 సం.రాలు డి) 55 సం.రాలు
90. a:b=1:2, b:c=3:4, c:d=5:6 అయినా a:b:c:d=?
ఎ) 15:40:30:48
బి) 18:40:20:48
సి) 15:30:40:48
డి) 18:20:40:48
91. రవి ఒక వ్యాపారాన్ని రూ.25,000లతో ప్రారంభిచాడు. 6 నెలల తర్వాత గోపాల్ రూ.15,000లతో వ్యాపారంలో చేరాడు. మరో 6 నెలల తర్వాత రఘు రూ. 15,000లతో అదే వ్యాపారంలో చేరాడు. మూడేళ్ల తర్వాత మొత్తం లాభం రూ.2,47,000 అయినా అందులో రవి వాటా ఎంత?
ఎ) రూ.1,05,000 బి) రూ.1,11,500
సి) రూ.1,30,000 డి) రూ.1,23,000
92. ఒక పరీక్షలో 20 శాతం మార్కులు సాధించిన వ్యక్తి 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. మరో వ్యక్తి 32 శాతం మార్కులు సాధించి, ఉత్తీర్ణత కంటే 42 మార్కులు అధికంగా సాధించాడు. అయినా ఉత్తీర్ణత అర్హత మార్కుల శాతం ఎంత?
ఎ) 52% బి) 50%
సి) 33% డి) 25%
93. లవానికి, హారానికి 3 కలిపితే ఒక భిన్నం 4/5 అవుతుంది. అదే భిన్నం లవం, హారం నుంచి 1 తీసివేస్తే ఆ భిన్నం 2/3 అవుతుంది. అయితే ఆ భిన్నంలోని లవం, హారాలను కూడితే వచ్చే ఫలితం?
ఎ) 13 బి) 2 సి) 12 డి) 15
94. ఒక సంవత్సరం తర్వాత అసలు, మొత్తం నిష్పతి 10:12 అయినా వార్షిక వడ్డీ రేటు ఎంత?
ఎ) 12% బి) 16% సి) 18% డి) 20%
95. కొంత సొమ్ముపై సాలుకు 10% చొప్పున రెండు చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య భేదం రూ.631 అయినా ఆ మొత్తం సొమ్ము ఎంత?
ఎ) రూ.63,000 బి) రూ.63,100
సి) రూ.63,500 డి) రూ.63,600
96. సాధారణ వేగంలో 6/7 వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వ్యక్తి 25 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానాన్ని చేరుకుంటాడు. అతడు ఈ దూరాన్ని ప్రయాణించటానికి సాధారణంగా తీసుకునే సమయం ఎంత?
ఎ) 2 గం.30ని. బి) 2 గం.15ని.
సి) 2 గం.25ని. డి) 2 గం.10ని.
97. ఒక పైపు ఒక ట్యాంకుని 10 గంటల్లో నింపుతుంది. మరో వైపు 15 గంటల్లో ఖాళీ చేస్తుంది. రెండింటిని ఒకేసారి పని చేయడం ప్రారంభిస్తే 6 గం. తర్వాత రెండో వైపు తీసివేసినా ట్యాంక్ మొత్తం ఎంత కాలంలో నిండుతుంది?
ఎ) 12 గం. బి) 10 గం.
సి) 14 గం. డి) ఏదీ కాదు
98. ఒక వ్యక్తి ప్రవాహ వ్యతిరేక దిశలో 40 కి.మీ దూరాన్ని 8 గంటల్లో, ప్రవాహ దిశలో 36 కిలోమీటర్ల దూరాన్ని 6 గంటల్లో ప్రయాణించగలడు. అయితే ప్రవాహ వేగం ఎంత?
ఎ) 0.5 కి.మీ/గం.
బి) 1.5 కి.మీ/గం.
సి) 1 కి.మీ/గం. డి) 3 కి.మీ/గం.
99. ఒక జంతుశాలలో కుందేళ్లు, పావురాలు కలిసి మొత్తం 340 ఉన్నాయి. వాటి మొత్తం కాళ్ల సంఖ్య 1060. అయినా మొత్తం పావురాలు ఎన్ని ఉన్నాయి?
ఎ) 120 బి) 150
సి) 180 డి) 170
100. కింది వాటిలో కర్ణములు పొడువులు సమానం గల చతుర్భుజం ఏది?
ఎ) రాంబస్
బి) దీర్ఘ చతురస్రం
సి) సమాంతర చతుర్భుజం
డి) సమలంబ చతుర్భుజం
101. ఒక సమబాహు త్రిభుజ వైశాల్యం 4 చ.మీ. అయితే చుట్టు కొలత ఎంత?
ఎ) 12 సెం.మీ. బి) 6 సెం.మీ.
సి) 8 సెం.మీ. డి) 3
ANS
51-ఎ 52-ఎ 53-బి 54-సి 55-బి 56-బి
57-ఎ 58-డి 59-సి 60-డి 61-డి 62-బి 63-డి 64-బి
65-ఎ 66-బి 67-సి 68-సి 69-ఎ 70-డి 71-ఎ 72-సి
73-బి 74-సి 75-ఎ 76-సి 77-బి 78-బి 79-డి 80-డి
81-ఎ 82-డి 83-సి 84-సి 85-ఎ 86-డి 87-డి 88-ఎ
89-డి 90-సి 91-సి 92-సి 93-సి 94-డి 95-బి 96-ఎ
97-సి 98-ఎ 99-బి 100-బి 101-ఎ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?