Zoology for Eamcet & NEET | నిర్జీవుల నుంచి జీవులు ఏర్పడ్డాయని తెలిపింది ఎవరు?
Zoology MCQs for Eamcet & NEET 2023
జంతుశాస్త్రం
1. భౌగోళిక వివక్తత వల్ల నూతన జాతులు ఏర్పడితే దాన్ని ఏమంటారు?
1) అల్లోపాట్రిక్ 2) సింపాట్రిక్
3) ప్రత్యుత్పత్తి వివక్తత
4) హార్డీవెయిన్ బర్గ్ సూత్రం
2. పెరిపేటస్ ఏ రెండు జంతు సమూహాల మధ్య సంధాన సేతువు?
1) అనెలిడా, ఆర్థ్రోపొడా
2) ఆర్థ్రోపొడా, మొలస్కా
3) నెమటోడా, అనెలిడా
4) మొలస్కా, ఇఖైనోడర్మెటా
3. అనేక జంతువుల పిండాభివృద్ధి దశల్లో ఏ దశ తర్వాత ప్రత్యేక లక్షణాలు విచ్ఛిన్నం చెందుతాయి?
1) మార్యులా 2) గ్రాస్టులా
3) బ్లాస్టులా 4) సంయుక్త బీజం
4. ఏ కాలాన్ని చేపల స్వర్ణయుగం అంటారు?
1) కేంబ్రియన్ 2) ఆర్థోవిషియన్
3) సైలూరియన్ 4) డివోనియన్
5. ఏ కాలాన్ని క్షీరదాల స్వర్ణయుగం అంటారు?
1) ప్రీ కేంబ్రియన్ యుగం
2) పేలియోజాయిక్ మహాయుగం
3) మీసోజాయిక్ మహాయుగం
4) సీనోజాయిక్ మహాయుగం
6. సరీసృపాల స్వర్ణయుగం అని ఏ కాలాన్ని పిలుస్తారు?
1) ప్రీకేంబ్రియన్ యుగం
2) పేలియోజాయిక్ మహాయుగం
3) మీసోజాయిక్ మహాయుగం
4) సీనోజాయిక్ మహాయుగం
7. సింపాట్రిక్ జాతుల ఉత్పత్తి దేనిలో పాలుపంచుకోదు?
1) భౌగోళిక వివక్తత
2) ప్రత్యుత్పత్తి వివక్తత
3) జన్యు వికిరణం
4) ప్రకృతి వరణం
8. అభివృద్ధి చెందిన దశలో అవశేష అవయవాలు ఆకస్మికంగా ఏర్పడే విధానాన్ని ఏమంటారు?
1) క్రియాసామ్య అవయవాలు
2) నిర్మాణసామ్య అవయవాలు
3) అటావిజం
4) కెటట్రోపిజం
9. పక్షి రెక్క, కీటకం రెక్క దేనికి ఉదాహరణ?
1) క్రియాసామ్య అవయవాలు
2) నిర్మాణసామ్య అవయవాలు
3) అటావిజం
4) కెటట్రోపిజం
10. గబ్బిలం రెక్కలు, గుర్రం పూర్వాంగం, మనిషి చేతులు, తిమింగలం తెడ్డు దేనికి ఉదాహరణ?
1) క్రియాసామ్య అవయవాలు
2) నిర్మాణసామ్య అవయవాలు
3) అటావిజం 4) కెటాట్రోపిజం
11. ఆవిర్భావం, మూల నిర్మాణంలో సామ్యముండి వేర్వేరు విధులను నిర్వహించే అవయవాలను ఏమంటారు?
1) క్రియాసామ్య అవయవాలు
2) నిర్మాణసామ్య అవయవాలు
3) అటావిజం 4) కెటాట్రోపిజం
12. ఆవిర్భావం, మూల నిర్మాణంలో తేడాలున్నప్పటికీ క్రియల్లో సామ్యముండే అవయవాలను ఏమంటారు?
1) క్రియాసామ్య అవయవాలు
2) నిర్మాణసామ్య అవయవాలు
3) అటావిజం 4) కెటట్రోపిజం
13. మొదట ఏర్పడిన కేంద్రకామ్లం/నత్రజని క్షారం ఏది?
1) అడినిన్ 2) గ్వానిన్
3) సైటోసిన్ 4) థైమిన్
14. మొట్టమొదట ఏర్పడిన జీవి ఏది?
1) సయనోగ్లాసస్ 2) సాకోగ్లాసస్
3) సయనో బ్యాక్టీరియా
4) ప్రొటోజోవా
15. భూమి ఆవిర్భావం జరిగినప్పుడు దాని ఉష్ణోగ్రత ఎంత?
1) 10000C-150000C
2) 4.50C- 50C
3) 2000C 4) 50000C-60000C
16. భూమి ఆవిర్భావం సుమారు ఎన్ని సంవత్సరాల పూర్వం జరిగి ఉండవచ్చు?
1) 4.5- 5 మిలియన్ సంవత్సరాలు
2) 2-5 మిలియన్ సంవత్సరాలు
3) 10-15 మిలియన్ సంవత్సరాలు
4) 21-22 మిలియన్ సంవత్సరాలు
17. జీవ పరిణామం జరగడానికి తోడ్పడే ప్రాథమిక కారకాలు ఏవి?
1) జన్యు ఉత్పరివర్తనాలు, క్రోమోసోమల్ ఉత్పరివర్తనాలు
2) జన్యు పునఃసంయోజనాలు
3) ప్రకృతి వరణం, ప్రత్యుత్పత్తి వివక్తత
4) పైవన్నీ
18. డివ్రీస్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది?
1) నియోడార్వినిజం 2) బయోజెనెసిస్
3) ఉత్పరివర్తనం 4) ప్రళయతత్వం
19. జీవుల్లో హఠాత్తుగా, యాదృశ్చికంగా జరిగే మార్పులను ఏమంటారు?
1) వివక్తత 2) జన్యు పౌనఃపున్యం
3) ఉత్పరివర్తనాలు 4) పైవన్నీ
20. డివ్రీస్ ఏ మొక్కలో ఉత్పరివర్తనాలను అధ్యయనం చేశాడు?
1) ఈనోథీరా లామార్కియానా
2) పైసమ్ సటైవం
3) దతూరా మెటల్
4) లైకోపెర్సికం
21. టీహెచ్ మోర్గాన్ ఉత్పరివర్తనాలను అధ్యయనం చేసిన జంతువు?
1) మస్కా డొమెస్టికా
2) పెడిక్యులస్
3) లాక్సిఫెర్ లక్కా
4) డ్రోసోఫిలా మెలనోగాస్టర్
22. డార్విన్ సిద్ధాంతం ఏది?
1) ప్రతిఘటన 2) ప్రకృతివరణం
3) నియో లామార్కిజం
4) పైవేవీ కాదు
23. డార్విన్ నౌక పేరు?
1) ఆర్ఎంఎస్ బీగల్
2) పీఎంఎస్ బీగల్
3) హెచ్ఎంఎస్ బీగల్
4) కేఆర్ఎస్ హీల్
24. జనాభా అధికోత్పత్తి, జనాభాలో స్థిరత్వం, మనుగడ కోసం పోరాటం, విశ్వవ్యాప్త వైవిధ్యాలు, ప్రకృతి వరణం, నూతన జాతుల ఉత్పత్తి మొదలైన అంశాలు ఏ సిద్ధాంతానికి సంబంధించినవి?
1) లామార్కిజం 2) డార్వినిజం
3) బీజద్రవ్య సిద్ధాంతం
4) పైవేవీ కాదు
25. డార్విన్ ప్రకృతివరణాన్ని ఏ కీటకం పై చేసిన అధ్యయనం ఆధారంగా పారిశ్రామిక శామలత్వాన్ని వివరించాడు?
1) బిస్టర్ బెట్యులేరియా
2) డ్రోసోఫిలా మెలనోగాస్టర్
3) మస్కా డొమెస్టికా 4) పైవన్నీ
26. జిరాఫీ మెడ పొడవు అవటం, పూర్వాంగాలు సాగటం లామార్క్ ప్రకారం దేనికి వర్తిస్తాయి?
1) నిరుపయుక్త సూత్రం
2) ఉపయుక్త సూత్రం
3) 1, 2 4) ఉత్పరివర్తనాలు
27. జీవ పరిణామంలో జీవులపై పరిసరాల ప్రభావం ఉంటుందని తెలిపే సిద్ధాంతం ఏది?
1) బీజద్రవ్య సిద్ధాంతం
2) ప్రకృతివరణ సిద్ధాంతం
3) లామార్కిజం
4) ఉత్పరివర్తన సిద్ధాంతం
28. ప్రాథమిక జీవులు భౌతిక శక్తుల వల్ల అకర్బన పదార్థాల నుంచి రసాయన పరిణామం ద్వారా జీవులు ఆవిర్భవించాయని తెలిపింది ఎవరు?
1) లూయీ పాశ్చర్
2) ఏఐ ఒపారిన్, జేబీఎస్ హాల్డేన్
3) డార్విన్
4) పాల్ కామరస్, గుయర్
29. జీవులు అంతకుముందు ఉన్న జీవుల నుంచి ఏర్పడ్డాయని తెలిపింది ఎవరు?
1) స్మిత్ 2) గుయర్
3) షేర్మార్క్ 4) లూయీ పాశ్చర్
30. ఆవర్తన ప్రళయాలు జీవులను నశింపజేస్తాయని, తిరిగి సృష్టించబడ్డాయని తెలిపింది ఎవరు?
1) థేల్స్ 2) ప్లేటో
3) జార్జి క్యువియర్
4) వాన్ హెల్మాట్
31. జీవులు నిర్జీవుల నుంచి ఏర్పడ్డాయని తెలిపింది ఎవరు?
1) అరిస్టాటిల్ 2) థేల్స్, ప్లేటో
3) వాన్ హెల్మాట్ 4) పైవారందరూ
32. జీవం నిరోధక శక్తి గల కాస్మోజువా రూపం లో విశ్వంలో ఉండి అనుకోకుండా భూమిని చేరిందని తెలిపింది ఎవరు?
1) రిచ్టర్ 2) పాదర్సారజ్
3) జార్జిక్యువియర్ 4) థేల్స్
33. దైవశక్తి వల్ల జీవులు ఏర్పడ్డాయని తెలిపింది ఎవరు?
1) పాల్కామరర్ 2) గుయర్
3) స్మిత్ 4) ఫాదర్ సారజ్
34. జీవ పరిణామం అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
1) బేట్సన్ 2) డివ్రీస్
3) డార్విన్ 4) హెర్బర్ట్ స్పెన్సర్
35. కింది జాతులను అధ్యయనం చేయండి.
ఎ. ఎర్నెస్ట్ హెకెల్ 1. ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు
బి. హెచ్ఎఫ్ నట్టల్ 2.ఉత్పరివర్తన సిద్ధాంతం
సి. వాన్బేయర్ 3. రక్త అవక్షప పరీక్షలు
డి. డివ్రీస్ 4. పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-4, డి-3
36. కింది వాటిని జతపరచండి.
సంధాన సేతువు రెండు సమూహాలు
ఎ. ఈస్తెనాప్టెరాన్ సరీసృపాలు, క్షీరదాలు
బి. సైమూరియా ఉభయచరాలు,సరీసృపాలు
సి. ఆర్కియోప్టెరిక్స్ చేపలు, ఉభయచరాలు
డి. సయనోగ్నాతస్ సరీసృపాలు, పక్షులు
1) ఎ-4, బి-1, సి-3, డి-2
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-1, బి-4, సి-2, డి-3
4) ఎ-3, బి-2, సి-4, డి-1
37. కింది వాటిని జతపరచండి.
ఎ. ఫాదర్సారజ్ 1. రసాయన జీవోత్పత్తి
బి. అర్హీనియస్ 2. ప్రత్యేక సృష్టివాదం
సి. క్యువియర్ 3. పాన్స్పెర్మియా
డి. హాల్డేన్, ఒపారిన్ 4. ప్రళయనాంతర సృష్టివాదం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
38. కింది జాబితాలను అధ్యయనం చేయండి.
ఎ. ప్రోటియస్ 1. బీజద్రవ్య సిద్ధాంతం
బి. ఎలుకలు 2. ఉత్పరివర్తనాలు
సి. ఈనోథీరా 3. నియోలామార్కిజం
డి. పెప్పర్మాత్ 4. పారిశ్రామిక శ్యామలత్వం
1) ఎ-3, బి-1, సి-2, డి-4
2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-1, బి-3, సి-4, డి-2
4) ఎ-2, బి-4, సి-3, డి-1
39. కింది వాటిని జతపరచండి.
ఎ. హెర్బర్ట్ స్పెన్సర్ 1. ఆర్జిత గుణాల అనువంశికత
బి. డార్విన్ 2. ఉత్పరివర్తనాలు
సి. హ్యూగో డివ్రీస్ 3. ప్రకృతివరణం
డి. లామార్క్ 4. యోగ్యతామాల సార్థక జీవనం
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-2, బి-1, సి-4, డి-3
40. జతపరచండి.
ఎ. రిచ్టర్ 1. కోసర్వేట్ సిద్ధాంతం
బి. యాదృశ్చిక సృష్టి 2. లూయీ పాశ్చర్ సిద్ధాంతం
సి. బయోజెనెసిస్ 3. కాస్మోజాయిక్ సిద్ధాంతం సిద్ధాంతం
డి. ఒపారిన్, హాల్డేన్ 4. అరిస్టాటిల్, థేల్స్, ప్లేటో, వాన్హెల్మెట్
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-4, బి-2, సి-4, డి-3
4) ఎ-3, బి-4, సి-2, డి-1
41. కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. అభివృద్ధి చెందిన దశలో అవశేష అవయవాలు ఆకస్మికంగా ఏర్పడే విధానాన్ని అటావిజం అంటారు
బి. ఆవిర్భావం, మూల నిర్మాణంలో సామ్యముండి వేర్వేరు విధులను నిర్వర్తించే అవయవాలను క్రియాసామ్య అవయవాలు అంటారు
సి. ఆవిర్భావం, మూల నిర్మాణంలో తేడాలున్నప్పటికీ క్రియల్లో సామ్యముండే అవయవాలను క్రియాసామ్య అవయవాలు అంటారు
1) ఎ, బి 2) బి, సి
3) సి, ఎ 4) ఎ, బి, సి
42. కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని డివ్రీస్ ప్రతిపాదించాడు
బి. నియోడార్వినిజంను లామార్క్ ప్రతిపాదించాడు
సి. భూమి సుమారు 1000 సంవత్సరాల పూర్వం ఆవిర్భవించింది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఏదీ కాదు
43 కిందివాటిని అధ్యయనం చేయండి.
ఎ. డార్విన్ ప్రకృతివరణ సిద్ధాంతాన్ని పారిశ్రామిక శామలత్వం ఆధారంగా వివరించాడు
బి. డార్విన్ సిద్ధాంతం ఉత్పరివర్తనం
సి. డార్విన్ హెచ్ఎంఎస్ బీగల్ అనే నావ పై ప్రయాణించి అనేక ఖండాలు, ద్వీపాలను అధ్యయనం చేసి ప్రకృతివరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు
1) ఎ, బి 2) బి, సి
3) సి, ఎ 4) ఎ, బి, సి
44. కిందివాటిని అధ్యయనం చేయండి.
ఎ. జన్యు, క్రోమోసోమల్ ఉత్పరివర్తనాలు జీవ పరిణామానికి దోహదపడతాయి
బి. జన్యు పునఃసంయోజనాలు జీవ పరిణామానికి తోడ్పడతాయి
సి. ప్రకృతివరణం, ప్రత్యుత్పత్తి వివక్తత జీవపరిణామానికి తోడ్పడుతాయి
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
జవాబులు
1. 1 2. 1 3. 2 4. 4
5. 4 6. 3 7. 1 8. 3
9. 1 10. 2 11. 2 12. 1
13. 1 14. 3 15. 4 16. 1
17. 4 18. 3 19. 3 20. 1
21. 4 22. 2 23. 3 24. 2
25. 1 26. 2 27. 3 28. 2
29. 4 30. 3 31. 4 32. 1
33. 4 34. 4 35. 1 36. 4
37. 2 38. 1 39. 1 40. 4
41. 3 42. 4 43. 3 44. 4
డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ
9989535675
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు