UPSC Sociology | పితృస్వామిక వ్యవస్థ గురించి ‘సిల్వియా వాల్చి’ ఏమన్నారు?
1 ప్ర. సెక్యులరైజేషన్ వల్ల మారుతున్న ప్రపంచ ధోరణుల గురించి రాయండి?
వివరణ:
1.సామాజిక వేత్తల అభిప్రాయం – లౌకికత్వం నిర్వచనం.
2.ప్రపంచ ధోరణులు- చారిత్రక సంఘటనలు.
3.ముగింపు
జవాబు :-
- దురైమ్, కార్ల్ మార్క్స్, వెబర్, స్పెన్సర్ల అభిప్రాయం ప్రకారం సంప్రదాయ మతం అనేది శాస్త్రీయ బద్ధమైన జీవన విలువలతో కూడిన దిగా మార్పులు చోటుచేసుకుంటున్నది.
- లౌకికత్వం అనేది, చరిత్రలో అన్ని రాజ్యాల్లో, రాచరిక ప్రభుత్వాల్లో కూడా కనిపిస్తున్నది. మానవులు మతసంస్థలతో తక్కువ అనుబంధం కలిగి ఉంటూ, జీవితం పైన వారి నమ్మకాలపైన
- మతవిశ్వాసాలను కలిగి ఉండటంలో (కొంత మార్పు) మతం పాత్ర తగ్గుతూ వస్తుంది.
ధోరణులు :-
1. నమ్మకాలలో శాస్త్రీయత, హేతుబద్ధతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాని అలౌకిక, అతీత శక్తులను అంతగా విశ్వసించటం లేదు. ఇది ఆధునికీకరణ, ప్రపంచీకరణ వలన వచ్చిన మార్పు అని చెప్పవచ్చును.
2. ఫెంచ్ విప్లవం తర్వాత వచ్చిన రాజకీయ తాత్విక ఉద్యమంగా సెక్యులరిజం అవతరించి 1854లో జార్జ్ జాకోబ్ హెూల్యఓక్ George Jacob Holyoake ఈ పదాన్ని ఇవ్వడం జరిగింది.
3. గ్రేస్ దేవిడ్ లాంటి వారి అభిప్రాయం ప్రకారం మతం పాత్ర తగ్గడం లేదు, కానీ మారుతుంది. నమ్మకం అనేది వ్యక్తగతమైనది. కావున తమ స మూహాలలో వారు ప్రత్యక్షంగా పాల్గొనక పోయినప్పటికీ వ్యక్తిగతంగా అనుసరిస్తున్నారు.
4. థామస్ లుక్మాన్ ( Thomas Luck man) అతని The Invisible Religion 1967 పుస్తకంలో మతం చాలా అభివృద్ధి చెందుతూనే ఉంది. కానీ ప్రజల దైనందిన జీవితాల్లో అంతర్లీనమై ఉంది. దీన్నే Invisible Religion అన్నాడు.
ముగింపు :- కావున మతం అనేది క్షీణించటం లేదు. వివిధ దిశలలో దాని అనువర్తనాల రూపంలో వ్యాప్తి చెందుతూనే ఉంది. నూతన మత ఉద్యమం వల్ల లౌకికతత్వం సవాళ్లను ఎదుర్కొంటుంది. మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా దేశాలలోని ముఖ్యంగా తాలిబన్ దేశాన్ని గమనిస్తే మతం ఆధారిత రాజ్యాల ఏర్పాటు ఇంకా తీవ్రంగానే ఉన్నది.
2 ప్ర :- ప్రపంచ మతాలు అన్నీ పితృస్వామిక స్వభానాన్ని కల్గి ఉన్నాయా? ఉదాహరణలతో సమర్థించండి? (substantiate) వివిధ మతాలు – ‘పి తృస్వామిక లక్షణాలు వివరించండి. ? పితృస్వామిక వ్యవస్థ గురించి ‘సిల్వియా వాల్చి ఏమన్నారు?
వివరణ: –
1. పితృస్వామిక వ్యవస్థ :- - Sylvia Walhy అనే ఆమె ‘Theorising Patriarchy (1990) అనే పుస్తకంలో నిర్వచించినది. సామాజిక నిర్మితిలో ఆచార వ్యవహారాల్లో పురుషులు – స్త్రీలను అణచి వేస్తున్నారు. పురుషులు ఆర్థిక ఆదాయ వనరులకు యజమానులుగాను, స్త్రీలు గృహిణులుగా, పిల్లలను పెంచే వారిగా మాత్రమే గుర్తిస్తున్నారు. ఇది స్వాభావికము/సహజమైనది గానే భావిస్తూ వస్తున్నామన్నారు.
మతం :- భారత సమాజంలో స్త్రీ పాత్రను నిర్వచిస్తుంది. ఉమా చక్రవర్తి గారి ప్రకారం ‘పతివ్రత అనగానే మర్యాదలతో కూడి, ఆచారాలను పాటిస్తున్న స్త్రీ అనే భావన బ్రాహ్మణుల సంప్రదాయాల్లో కనిపిస్తుంది. మాతృత్వం మహిళల ప్రధాన కర్తవ్యం అని ఆచరణలో ఉంది. - ఒక వైపు ’దేవి’ అనే శిల్పాలను చెక్కి దేవతగా మరోవైపు దాసి అనే కోణంలో సేవలు చేయించుకుంటున్నారు.
- జుడాయిజం, కాథలిజంలలో మత ప్రచారకుల హెూదాలో పురుషులు మాత్రమే ప్రీస్ట్లుగా వ్యవహరిస్తున్నారు.
- ఖురాన్లో మత ప్రార్థనల సమయంలో స్త్రీలు, పురుషులు వేర్వేరుగా ప్రార్థనలు చేసుకోవాలని ఉంది.
- Holm ’హెూమ్ (1994) అనే సామాజిక వేత్త ఇది మహిళల స్థాయిని తగ్గించినట్లవుతుంది. అని అభిప్రాయ పడినారు.
- విడాకులు, డ్రెస్క్కోడ్ – దుస్తుల నియమావళి అనే అంశాలలో మహిళలకు కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ నూతన సంస్కృతులు, నాగరికతల వలన పురుషులతో సమానంగా జీవించగలుగుతున్నారు. పురుషులతో సమానమైన ఉద్యోగాలు మహిళలు నిర్వర్తిస్తున్నారు. ప్రేమ అనే అంశంతో కూడిన వివాహాలు నూతనంగా కనిపిస్తున్నాయి. కుటుంబ విధుల్లో మార్పులు వస్తున్నాయి.
- కావున వర్తమాన (పరిస్థితులలో) కాలంలో లౌకికత్వ భావాలు పెరగడం వలన పితృస్వామికత అనేది మతంలో తగ్గుతూ వస్తుంది.
3 ప్ర:- భారతదేశంలో మతతత్వం (Comm unalism) పెరగడానికి సామాజిక, ఆర్థిక కారణాలు కారణ భూతమయినాయి చర్చించండి.
వివరణ:
1. సామాజిక – ఆర్థిక కారణాలు మాత్రమే చర్చించండి. 2 .ముగింపు
జవాబు :- మతం పట్ల అభిమానం ఇతర మతాల పట్ల విపరీతమైన ద్వేషం కలిగి ఉండటాన్ని మతతత్వం అంటారు. - సమస్యను సృష్టించే సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితుల వలన మతవాదం పెరిగితే దాన్ని మతతత్వం అంటారు. అని బిపిన్ చంద్ర గారు తెలియజేశారు. మతవాదం భారతదేశంలో తరచూ సామాజిక ఘర్షణలకు కారణమవుతుంది.
- సంస్కృతి పరమైన గుర్తింపుతో కూడిన సమస్యలు, అణగారిన వర్గాలపై చిన్న చూపు, ప్రాంతీయ / సామాజిక అసమానతలు అభివృద్ధి పరంగా అవకాశాలు పొందలేకపోవడం కారణాలుగా చెప్పవచ్చును.
- రాజకీయ నాయుకులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.
- బ్రిటీష్ వారు ’విభజించు – పాలించు అనే సిద్ధాంతం ద్వారా మతపరమైన నియోజకవర్గాల కేటాయింపు చేయడం జరిగింది.
- ముస్లింల విద్యాపరమైన వెనుకబాటుతనం వలన ప్రభుత్వ ఉద్యోగాల్లో తక్కువ సంఖ్య లో ఉన్నారు .
- బ్రిటిష్ వారు 1857 తిరుగుబాటు తర్వాత ముస్లిం వ్యతిరేక విద్వేషాలు కల్పించి, పాకిస్థాన్ అనే డిమాండ్‌కు తెరలేపిందని చెప్పవచ్చు.
- మొపిల్లా తిరుగుబాటు – కేరళలో పేద ముస్లిం రైతులపై జరిగిన తిరుగుబాటుగా చెప్పవచ్చు.
సచార్ కమిటీ :- స్వాతంత్య్రం అనంతర కాలంలో సచార్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ముస్లింల స్థితిగతులు కింది విధంగా ఉన్నాయి.
1. తక్కువ అక్షరాస్యత రేటు
2. గ్రామీణ శ్రామిక నిష్పత్తి చాలా తక్కువ.
3 స్వయం ఉపాధి గల – చిన్న చిన్న వ్యాపారులుగా ఉన్నారు.
4. బ్యాంకు రుణాలు పొందడంలో తక్కువ అవకాశాలు కలిగి ఉన్నారు. - ముగింపు:- కావున ముస్లింలు ఆర్థిక, విద్యా పరమైన వెనకబాటును కలిగి ఉన్నారు. కావున ముస్లిం యువత అసంతృప్తి, మత విద్వేష భావాలకు లోనైనారు. కావున సచార్ కమిటీ సలహాలను అమలుచేసి, ఒక వైపు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సమానత్వం దిశగా అడుగులు ముందుకు వేయాలి.
4ప్ర:- మతవాదం సంఘటనల గురించి రాయండి? (5 మార్కులు)
జవాబు: 1. ఆవు మాంసం తినడం వలన మత సెంటిమెంట్ చెలరేగి గత 2010-2017 మధ్య కాలంలో 28 మంది భారతీయులు చనిపోయారు.
2. ఘర్ వాపసి ప్రోగ్రామ్ -VHP RSS వంటి సంస్థలు హిందూ యేతరులను & ముస్లిం మతంలోకి మారిన వారిని తిరిగి హిందువులుగా మార్చే L పక్రియలలో గల ఘర్షణలు.
3. హదియ కేస్:- అఖిల అనే 24 సం.ల మహిళ(హిందూ) ఇస్లాం మతాన్ని స్వీకరించి ’హదియ’గా పేరు మార్చుకుంది. కానీ ఆమె తండ్రి హెబియస్ కార్పస్ పిటీషన్ వేయడం వల్ల తిరిగి ఆమెను కేరళ హైకోర్టు తల్లిదండ్రులకు అప్పగించింది. - సుప్రీంకోర్టు ఆమె విషయంలో స్పందించి – ఆమెకు మతాన్ని ఎంచుకొనే స్వేచ్ఛ ఉందని, ఆమెను విద్యాభ్యాసం కోసం కళాశాలలో చేర్పించాలని అభిప్రాయపడింది.
యువతలో మత విద్వేషాలు :- ముఖ్యంగా కశ్మీరీ యువతలో దేశ వ్యతిరేక భావాలు కొన్ని అంతర్జాతీయ టెర్రరిజం గ్రూపులు కల్పించాయి. ISIS లాంటి టెర్రరిస్టు సంస్థల్లో 75 మంది భారతీయులు చేరారని కేంద్ర శాఖ తెలియజేసింది.
5 ప్ర :- మతవాదమును అరికట్టడంలో తీసుకోవాల్సిన చర్యలను గురించి తెలియజేయండి?
- జవాబు: 1. అన్ని మతాల వారు ఐక్యంగా ఉండే విధంగా విద్యార్థి స్థాయిలోనే పాఠశాలల్లో ఐక్యత భావాన్ని నేర్పించాలి.
2. మతాంతర పండగలను కలిసి జరుపుకోవడం.
3. రాడికల్ భావాలను పోలీసులు ఎప్పటి కప్పుడు అణచివేస్తూ యువతకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. 4) రాజకీయ పార్టీలు ఓట్లు అడిగే సందర్భాలలో మతం ప్రాతిపదికన అడిగితే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి.
5. CBI లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా మత కల్లోలాలు జరిపిన వారి మీద శిక్షణ చర్యలు తీసుకుని వారికి తగిన శిక్షణ ఇవ్వాలి.
6. పోలీసులు రాజకీయ ఒత్తిడికి లోనుకాకుండా FIR కింద కేసు నమోదు చేయవలెను.
7. పాఠ్య పుస్తకాల్లో చరిత్రను హిందువులు, ముస్లింల, క్రిస్టియన్ల యుగంగా వక్రీకరించారు. దీన్ని మార్చాలి.
8 . సచార్ కమిటీ సిఫారసులను అమలు చేయాలి.
9. ఉమ్మడి పౌరస్మృతి ఆర్టికల్- 44ను అందరి సహకారంతో తీసుకురావాలి.
10. మీడియా, సినిమాలు మత సామరస్యాన్ని అందించేలా చూడాలి.
6 ప్ర: త్రిపుల్ తలాఖ్ అనగానేమి ? దీనికి సంబంధించిన ఇటీవల జరిగిన పరిణామాలు, త్రిపుల్ తలాఖ్ కేసును వివరించండి?
వివరణం:
1. నిర్వచనం
2. Triple Talaq కేసు
3. పాజిటివ్, నెగెటివ్ అంశాలు?
జవాబు :- - త్రిపుల్ తలాఖ్ :- భారతదేశంతో త్రిపుల్ తలాఖ్ అనేది విడాకులు అనే అంశానికి సంబంధించినది. ముస్లిం పురుషులు నోటితో / ఎలక్ట్రానిక్ రూపంలో 3 సార్లు ’తలఖ్’ అని సంభోదించటం వల్ల చట్టబద్ధంగా తన భార్య నుంచి ఏకపక్షంగా విడాకులు పొందవచ్చును.
- ఈ సందర్భంలో స్త్రీ సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కులు, లౌకికత్వం అంశాలు చర్చనీయంగా మారినాయి.
- షయరాబానో Vs U.O.I Case 2017. సుప్రీంకోర్టు 3:2 మెజారిటీతో త్రిపుల్ తలాఖ్ అనేది రాజ్యాంగ విరుద్ధం అని తీర్పునిచ్చింది.
సానుకూల అంశాలు:
1). ప్రాథమిక హక్కులైన ఆర్టికల్ -14, 21 ద్వారా స్త్రీకి సమానత్వం కల్పించారు.
2. లింగ సమానత్వం, సామాజిక అంతస్థు, గౌరవం పెంపొందించాయి.
3. వ్యక్తిగత చట్టాలపై రాజ్యాంగం ఎలాంటి మార్పులనైనా చేసి ప్రాథమిక హక్కులకు ఆ హామీ ఇస్తుంది.
వ్యతిరేక అంశాలు:
1. ఇది ఆర్టికల్ 26 ప్రకారం – మతపరమైన ఆచారాలు, వ్యవహారాల్లో స్వేచ్ఛను కలిగి ఉండవచ్చు. కానీ ఇక్కడ న్యాయస్థానాలు జోక్యం చేసుకొన్నాయి.
2. ముస్లిం పర్సనల్ లా (షరియత్) చట్టం – 1937 అనేది ఒక చట్టం లాగా తలాఖ్-ఇ-బిద్దత్‌ను చూపడం లేదు. ఒక ఆచారంలా కలిగి ఉంది. ఇలాంటి సందర్భంలో ఆర్టికల్ 13ను ఇక్కడ ఉపయోగించరాదు.
3. ముస్లిం పురుషుల ఆచారాలకు త్రిపుల్ తలాఖ్ అనేది వ్యతిరేకం కాదు. కేవలం ఇస్లాం నిజ స్వరూపం/ నిజ సిద్ధాంతాలకు భంగం కలిగిస్తుంది అని వివరించడంలో విజయం సాధించలేదు అని చెప్పవచ్చు.
7 ప్ర:- UCC – (Uniform Civil Code) ఉమ్మడి పౌరస్మృతి గురించి రాయండి?
జవాబు: - ఉమ్మడి పౌరస్మృతి :- ఆర్టికల్ 44 ప్రకారం ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ఒక ఉమ్మడి చట్టాలను నియమావళిని అందించవలెను. మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే చట్టం – ఒకే నియమం – ఒకే న్యాయం అందించాలన్న స్ఫూర్తిని కలిగి ఉన్నప్పుడే ఒకే దేశం అన్న భావన వస్తుందని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు.
సవాళ్లు:-
1. ఆర్టికల్ 25, 26 మత స్వేచ్ఛను ప్రసాధించినది. కావున అన్ని మతాల వారికి ఒకే రకమైన చట్టాలను ఏర్పాటు చేయాలన్న అంశంలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.
2. హిందూ మతంలో కుల పంచాయతీలు, పితృస్వామ్య వ్యవస్థ, ముస్లిం మతంలోని షరియత్ చట్టాలు ఎవరికి వారే వ్యక్తిగతంగా కలిగి ఉన్నారు.
3. మనోభావాలు దెబ్బతినడం వల్ల తూర్పు పాకిస్థాన్, శ్రీలంకలో చట్టం ఉమ్మడి పౌరస్మృతి చట్టం అమలు చేయడంలో అనేక ఘర్షణలు తలెత్తాయి.
బి.పురుషోత్తం రెడ్డి
ఫ్యాకల్టీ,
21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ
9030925817
Previous article
UPSC CMS Recruitment | యూపీఎస్సీలో 1261 పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు