POLITY | జోనల్ కౌన్సిల్స్ని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు?
8 ఏప్రిల్ తరువాయి
70. సామాజికాభివృద్ధి పథకం – జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం పనితీరును మెరుగుపరచడానికి బల్వంతరాయ్ మెహతా కమిటీ అధ్యయన బృందం ఏయే చర్యలను సూచించింది?
1) రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ
2) మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ
3) నాలుగంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ
4) ఐదంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ
71. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి దిగువ వాటిలో అశోక్ మెహతా కమిటీ సిఫారసు కానిదేది?
1) పంచాయతీరాజ్‌లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనడం
2) రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ
3) రాజ్యాంగపరమైన రక్షణ
4) జిల్లా పరిషత్‌లకు పరిమిత అభివృద్ధి కార్యక్రమ విధులు
72. అర్బన్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్‌కు సంబంధించిన రీజినల్ సెంటర్స్ ఏయే నగరాల్లో ఉన్నాయి?
1) కోల్‌కతా, లక్నో
2) హైదరాబాద్, ముంబై
3) 1, 3
4) ఏదీకాదు
73. కింది వాటిలో సరైనది?
ఎ) అశోక్‌మెహతా కమిటీ – రెండంచెల
బి) ఎం.ఎం.సింఘ్వి కమిటీ – న్యాయ పంచాయతీలు
సి) హనుమంతరావు కమిటీ -జిల్లా ప్రణాళిక
డి) దంత్వాలా కమిటీ – బ్లాక్‌లెవల్ ప్రణాళిక
1) ఎ, బి 2) సి, డి
3) అన్నీ సరైనవే 4) పైవేవీకావు
74. స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన ప్రకరణలేవి?
1) 243A, 243F వరకు గల ప్రకరణలు
2) 243A, 243O వరకు గల ప్రకరణలు
3) 243O, 243M వరకు గల ప్రకరణలు
4) 243O, 243Z వరకు గల ప్రకరణలు
75. జిల్లా కలెక్టర్‌తో సంబంధం లేకుండా ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారి జిల్లా అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న రాష్ట్రం ఏది?
1) గుజరాత్ 2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక 4) మహారాష్ట్ర
76. ఎంత జనాభా ఉన్న ప్రాంతంలో క్లాస్-1 కంటోన్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తారు?
1) సివిల్ జనాభా 5 వేల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో
2) సివిల్ జనాభా 10 వేల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో
3) సివిల్ జనాభా 15 వేల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో
4) పైవేవీకావు
77. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
ఎ) హబ్ హౌస్ కమిటీ-1909
బి) బల్వంతరాయ్ మెహతా కమిటీ -1951
సి) అశోక్‌మెహతా కమిటీ 1976
డి) జీవీకే రావు కమిటీ 1993
1) ఎ 2) బి 3) బి, సి 4) డి
78. పంచాయతీ వ్యవస్థ ఉద్దేశం కానిది?
1) ప్రజాస్వామ్య వికేంద్రీకరణ
2) భాగస్వామ్య ప్రజాస్వామ్యం
3) స్థానిక నాయకత్వాన్ని పెంపొందించడం
4) సామాజిక న్యాయాన్ని అధించడం
79. గ్రామసభకు సంబంధించి సరికానివి?
1) ఎంపీటీసీ సభ్యులు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారు కాని ఓటు హక్కు ఉండదు
2) స్వయం సహాయ గ్రూప్ నుంచి ఒక సభ్యుడిని కో ఆప్ట్ చేస్తారు
3) స్థానిక శాసన సభ్యుడు హోదా రీత్యా సభ్యుడు
4) పైవేవీకావు
80. నూతన పంచాయతీ చట్టంలో కొన్ని అధికారాలను రాష్ర్టాల విచక్షణకు వదిలివేశారు. వాటిని గుర్తించండి?
1) సర్పంచ్ ఎన్నిక పద్ధతి
2) అధికారుల బదలాయింపు
3) స్థానిక శాసన సభలకు ప్రాతినిధ్యం
4) పైవన్నీ
81. స్థానిక సంస్థల అధికార దత్త సూచీకి…?
1) కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ విక్రయిస్తుంది
2) అధికారాల బదలాయింపును ప్రామాణికంగా తీసుకుంటారు
3) పై రెండు సరైనవే
4) పై రెండు సరికావు
82. కింది వాటిలో సరికానివేవి?
1) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలను ఆధారంగా రాజకీయ వ్యవస్థలను సమాఖ్య లేదా ఏక కేంద్ర ప్రభుత్వాలుగా వర్గీకరించారు.
2) కేంద్ర రాష్ర్టాల మధ్య అధికార విభజన ఉంటే సమాఖ్య వ్యవస్థ అంటారు
3) అధికారలన్నీ ఒకే ప్రభుత్వంతో కేంద్రీకృతమయ్యి ఉంటే ఏక కేంద్ర ప్రభుత్వం అంటారు.
4) సమాఖ్య అనే పదాన్ని పర్షియా భాష నుంచి స్వీకరించారు
83. కింది వాటిలో సరికాని వాక్యాన్ని రాయండి?
1) సమాఖ్య అనే పదం లాటిన్ భాష నుంచి ఉద్భవించింది
2) సమాఖ్య వ్యవస్థకు ఉదా: అమెరికా, కెనడా, పాకిస్థాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా
3) ఏక కేంద్ర వ్యవస్థకు ఉదా: బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, ఇటలీ
4) సమాఖ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ ఆధిక్యత ఉంటుంది
84. సమాఖ్య వ్యవస్థ లక్షణం కానిది ఏది?
1) లిఖిత దృఢ రాజ్యాంగాలు తప్పనిసరిగా ఉంటాయి
2) ద్వంద్వ పౌరసత్వాలు అమల్లో ఉంటాయి
3) ఇక్కడ రాజ్యాంగ అధిక్యత ఉంటుంది
4) అధికారం అంతా కేంద్రీకృతమై ఉంటుంది
85. కింది వాటిలో సరికాని వాక్యాన్ని రాయండి?
1. కేంద్ర రాష్ర్టాల మధ్య శాసన సంబంధాలను రాజ్యాంగంలో 11వ భాగంలో 245 ప్రకరణ నుంచి 255 మధ్య పేర్కొన్నారు.
2. కేంద్ర రాష్ర్టాల మధ్య పరిపాలన సంబంధాలను రాజ్యాంగంలో 11వ భాగంలో 256-263 వరకు పేర్కొన్నారు
3. కేంద్ర రాష్ర్టాల మధ్య ఆర్థిక సంబంధాలను రాజ్యాంగంలో 11వ భాగంలో 264-300 వరకు పేర్కొన్నారు
4. సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల నియామకం రాష్ట్రపతి చేయడు
86. కింది ప్రకరణలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) 245- కేంద్ర పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల చట్టాల భౌగోళిక పరిస్థితులను తెలుపుతుంది
2) 246 – కేంద్ర, రాష్ర్టాల మధ్య అధికార విభజనను తెలుపుతుంది
3) 246(1) – కేంద్ర జాబితా గురించి తెలుపుతుంది
4) 246(3) – ఉమ్మడి జాబితా గురించి తెలుపుతుంది
87. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) ఉమ్మడి జాబితా గురించి తెలిపే ప్రకరణ 246(3)
2) ఉమ్మడి జాబితా గురించి తెలిపే ప్రకరణ 246(2)
3) కేంద్ర జాబితాలో 97 అంశాలు ఉంటాయి
4) కేంద్ర జాబితాలోకి కొత్తగా 3 అంశాలను చేర్చారు
88. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) రాష్ట్ర జాబితాలో 66 అంశాలు ఉంటాయి
2) రాష్ట్ర జాబితాలో ప్రస్తుతం 59 అంశాలు మాత్రమే ఉన్నాయి
3) కేంద్ర జాబితాలో కొత్తగా చేరిన అంశాలు కేంద్ర బలగాలను రాష్ర్టాలకు పంపడం అంతరాష్ర్టాల మధ్య వస్తువుల అమ్మకం
4) రాష్ట్ర జాబితా నుంచి 7 అంశాలను తొలగించారు
89. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) ఉమ్మడి జాబితాలో రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పుడు 47 అంశాలు ఉన్నాయి
2) ప్రస్తుతం ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఉన్నాయి.
3) ఉమ్మడి జాబితాలోనికి 5 అంశాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు
4) ఉమ్మడి జాబితా మీద కేంద్రానికి మాత్రమే అధికారం ఉంటుంది
90. అవశిష్ట జాబితాకు సంబంధించి సరికాని వాక్యాన్ని రాయండి?
1) అవశిష్ట జాబితాలోని అంశాలపై పార్లమెంట్‌కు మాత్రమే అధికారం ఉంటుంది
2) అమెరికా, ఆస్ట్రేలియాలో అవశిష్ట జాబితాలపై రాష్ర్టాలకు అధికారం ఇచ్చారు
3) రాష్ట్ర ఉమ్మడి జాబితాల్లో లేని అంశాలను అవశిష్ట జాబితా కిందకు చేర్చారు
4) ఆర్టికలల్ 252 ప్రకారం అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన ఆ సంవత్సరం తర్వాత చట్టాలు రద్దు అవుతాయి
91. కింది వాటిలో సరికాని దాన్ని రాయండి?
1) 253 ప్రకరణ ప్రకారం అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకోవడం, అమలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది
2) 254 ప్రకరణ ప్రకారం ఉమ్మడి జాబితాలోని అంశాలపైన కేంద్రానికే అధిక్యత
3) 251 ప్రకరణ ప్రకారం రాష్ట్ర చట్టాలే అమలవుతాయి
4) ఎస్టేట్ సుంకం చట్టం 1955లో చేశారు
92. కింది వాటిలో ఏడో షెడ్యూల్లోని కేంద్ర జాబితాలో ఉన్న అంశం?
1) గనులు, చమురు క్షేత్రాల్లో పనిచేసే శ్రామికులు, వారి భద్రతను క్రమబద్దీకరించడం
2) వ్యవసాయం
3) మత్స్య పరిశ్రమ
4) ప్రజాస్వామ్యం
93. కింది వివరాలను పరిశీలించి సరైనవి గుర్తించండి?
ఎ) దేశ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాల్లోని అంశంపై పార్లమెంటు చట్టం చేసేందుకు తీర్మానం చేసే అధికారం రాజ్యసభకు మాత్రమే ఉంది
బి) అత్యవసర పరిస్థితి విధించడానికి సంబంధించిన తీర్మానాలను లోక్‌సభ మాత్రమే అమోదిస్తుంది
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) రెండు సరైనవి 4) రెండూ సరికావు
94. కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
ఎ) భారత ప్రణాళికలను నిర్ణయించే అత్యున్నత సంస్థ భారత ప్రణాళికా సంఘం
బి) ప్రణాళిక సంఘం కార్యదర్శి జాతీయాభివృద్ధి మండలి కార్యదర్శిగా కూడా ఉంటారు
సి) ఏడో షెడ్యూల్లోని ఉమ్మడి జాబితాలో క్రీడలు చేర్చారు
1) ఎ, బి 2) బి, సి 3) ఎ 4) సి
95. భారత సమాఖ్య, అమెరికా సమాఖ్యకు గల సాధారణ లక్షణం ఏది?
1) ఏక పౌరసత్వం
2) రాజ్యాంగంలో మూడు జాబితాలు
3) ద్వంద్వ న్యాయవ్యవస్థ
4) రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు ఒక సమాఖ్య న్యాయవ్యవస్థ
96. ఆదాయపు పన్ను విధింపు, వసూలు, పంపిణీకి సంబంధించి కింది వాటిలో సరైంది?
1) కేంద్రం విధించి వసూలు చేసి ఆ మొత్తాన్ని కేంద్ర రాష్ర్టాల మధ్య పంపిణీ చేస్తుంది
2. అన్ని పన్నులు కేంద్రం విధించి వసూలు చేసిన మొత్తాన్ని తానే పొందుతుంది
3. అన్ని పన్నులు కేంద్రం విధించి వసూలు చేసిన మొత్తాన్ని రాష్ర్టాలకు పంపిణీ చేస్తుంది
4) ఆదాయపు పన్నుపై వసూలు చేసిన సర్ఛార్జీని మాత్రం కేంద్రం రాష్ర్టాల మధ్య పంపిణీ చేస్తుంది
97. జోనల్ కౌన్సిల్స్ (ప్రాంతీయ మండలాలు)ని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు?
1) జోనల్ కౌన్సిళ్ల చట్టం
2) రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ చట్టం
3) స్టేట్ కౌన్సిల్ చట్టం 4) ఏదీకాదు
98. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఏ అంశాన్ని మున్సిపల్ సంబంధాలుగా పేర్కొంటారు?
1) రాష్ట్ర శాసన సంబంధమైన విషయాల్లో కేంద్ర నియంత్రణ
2) రాష్ట్ర ఆర్థిక విషయాల్లో కేంద్ర నియంత్రణ
3) రాష్ట్ర పరిపాలనలో కేంద్ర నియంత్రణ
4) పైవన్నీ
99. ఆర్థిక సంఘానికి సంబంధించి సరైనవి?
1) ఈ సంఘంలో నలుగురు సభ్యులు ఉంటారు
2) ఈ సంఘం తన సిఫారసులను రాష్ట్రపతికి సమర్పిస్తుంది
3) ఈ సంఘం సలహా విధులను మాత్రమే కలిగి ఉంటుంది
4) పైవన్నీ
100. సాధారణ పరిస్థితుల్లో పార్లమెంటు రాష్ట్ర జాబితాలో ఎప్పుడు చట్టాలు చేస్తుంది?
1) రెండు రాష్ట్ర శాసనసభలు తీర్మానం ద్వారా కోరినప్పుడు
2) రాజ్యసభ ప్రత్యేక తీర్మానం ద్వారా అవసరాన్ని గుర్తించినప్పుడు
3) అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేసే సందర్భంలో
4) పైవన్నీ
101. షెడ్యూల్ కులాల, తెగల నిర్వచనానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) షెడ్యూల్డ్ కులాల వారిని పంచములు, ఆదివాసులు, అస్పృశ్యులు అనే పేర్లతో పిలుస్తారు
2) 1935 చట్టంలో షెడ్యూల్డ్ కులాల గురించి మొదట పేర్కొన్నారు
3) రాజ్యాంగంలో 341లో షెడ్యూల్డ్ కులాల నిర్వచనాన్ని పొందుపరిచారు.
4) ప్రస్తుతం షెడ్యూల్డ్ కులాల గురించి 8వ షెడ్యూల్లో రాజ్యాంగ పరమైన ఆదేశాలు ఉన్నాయి
102. కిందివాటిలో సరికానిది ఏది?
1) రాజ్యాంగంలో 366 (25)లో షెడ్యూల్డ్ తెగల నిర్వచనాన్ని ప్రస్తావించి 342లో వివరణ ఇచ్చారు
2) రాష్ట్రపతి ఆ రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించి ఒక నోటిఫికేషన్ ద్వారా షెడ్యూల్డ్ తెగలను నిర్ణయిస్తారు
3) 15వ ఆర్టికల్ ప్రకారం కుల, లింగ వివక్ష చూపరాదు
4) 16(4) ప్రకారం మత, కుల, లింగ వివక్షత ఉద్యోగాల్లో చూపరాదు
103. రాష్ట్రపతి షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించడానికి జారీ చేసిన నోటిఫికేషన్లో ఉండకూడని లక్షణం?
1) ఆదివాసీ లక్షణాలు
2) భౌగోళిక ప్రత్యేకత
3) ప్రత్యేక సంస్కృతి, ఆర్థిక వెనుకబాటు తనం
4) వేషధారణ
104. కింది నిబంధనల్లో సరికానిది?
1) 17వ నిబంధన ప్రకారం అంటరానితనం నేరం
2) 45వ నిబంధన ప్రకారం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
3) 46వ నిబంధన ప్రకారం సామాజిక, విద్యా పరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడం
4) 164 నిబంధన ప్రకారం అన్ని రాష్ర్టాల్లో షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం
సమాధానాలు
70-2 71-3 72-3 73-3
74-2 75-1 76-2 77-4
78-4 79-4 80-4 81-3
82-4 83-4 84-4 85-4
86-4 87-1 88-1 89-4
90-4 91-3 92-1 93-1
94-1 95-4 96-1 97-2
98-3 99-4 100-4 101-4
102-4 103-4 104-2
ఆంజి
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు