ECONOMY | వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఎక్కువగా గల రాష్ట్రం ఏది?
ఎకానమీ
1. కింది వాటిని జతపరచండి?
ఎ) మూల్యానుగత పన్ను 1) ఆదాయం పెరిగిన కొలది పన్నురేట్లు పెరుగును
బి) నిర్దిష్టపన్ను 2) ఆదాయం పెరిగిన కొలది పన్నురేటు తగ్గుట
సి) పురోగామి పన్ను 3) వస్తు విలువను బట్టి పన్ను విధించుట
డి) తిరోగామి పన్ను 4) వస్తువు బరువు, పరిమాణం బట్టి పన్ను విధించుట
ఎ) 1, 2, 3, 4 బి) 1, 3, 4, 2
సి) 3, 4, 1, 2 డి) 3, 1, 2, 4
2. కిందివాటిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి?
1) లోహద్రవ్యం 2) వస్తు ద్రవ్యం
3) ప్లాస్టిక్ ద్రవ్యం 4) కాగితపు ద్రవ్యం
ఎ) 2, 1, 4, 3 బి) 2, 1, 3, 4
సి) 1, 2, 4, 3 డి) 1, 2, 3, 4
3. ముందు అనుబంధాల గురించి వివరించినది ఎవరు?
ఎ) మార్షల్ బి) హర్షమన్
సి) రాగ్నర్ నర్క్స్ డి) గుర్నాల్ మిర్ధాల్
4. జతపరచండి.
ఎ) సామాజిక ద్వంద్వత్వం 1) మింట్
బి) సాంకేతిక ద్వంద్వత్వం 2) జె.హెచ్.బొకె
సి) విత్త ద్వంద్వత్వం 3) బెంజిమన్ హిగ్గిన్స్
డి) వినిమయ ద్వంద్వత్వం 4) ఇమ్మాన్యుయల్
ఎ) 1, 2, 3, 4 బి) 2, 4, 3, 1
సి) 2, 3, 1, 4 డి) 2, 3, 4, 1
5. బ్రిటిష్‌వారు మనదేశం నుంచి అక్రమంగా తరలించిన సంపదను ఏమంటారు?
ఎ) పన్నులు బి) రుణాలు
సి) హోం చార్జీలు డి) పైవన్నీ
6. అవస్థాపన సౌకర్యాలు అంటే ఏమిటి?
1. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వృద్ధి
2. శక్తి, నీటిపారుదల, రోడ్ల రవాణా
3) విద్య, వైద్యం, ఆరోగ్యం
4) బ్యాంకింగ్, బీమా, సమాచారం
ఎ) 2, 3 బి) 3, 4
సి) 2, 3, 4 డి) పైవన్నీ
7. బ్రిటిష్‌పాలనలో భారతీయ వనరుల తరలింపు పుస్తక రచయిత ఎవరు?
ఎ) నెహ్రూ
బి) దాదాభాయ్ నౌరోజీ
సి) హోన్స్ సింగర్
డి) డ్యూసెవ్ బెర్రి
8. ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటే సరైనది ఏది?
1) పల్లెల్లో ఒక ఆర్థిక విధానం పట్టణాల్లో మరొక ఆర్థిక విధానం
2) ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది
3) ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది
4) పైవేవీకావు
ఎ) 1 బి) 1, 2 సి) 1, 3 డి) 3
9. తలసరి ఆదాయం పెరగాలంటే?
ఎ) జాతీయాదాయ వృద్ధి కన్నా జనాభా పెరగాలి
బి) జాతీయాదాయం, జనాభా ఒకే నిష్పత్తిలో పెరగాలి
సి) జాతీయాదాయం వృద్ధి కన్నా జనాభా వృద్ధి తగ్గాలి
డి) జీవన ప్రమాణ స్థాయి తగ్గాలి
10. కిందివాటిలో హరించుకుపోయే సహజ వనరు ఏది?
1) నీరు 2) గాలి
3) పెట్రోలు 4) కలప
ఎ) 1 బి) 1, 3
సి) 3 డి) పైవన్నీ
11. కింది వాటిలో ఏది సరైనది?
ఎ) భారత పేదరిక సమస్య సాపేక్ష పేదరిక సమస్య
బి) అమల్లో ఉన్న కుల వ్యవస్థ వల్లనే భారత్‌లో పేదరిక సమస్య ఏర్పడినది
సి) ఆదాయ సంపద పంపిణీలో వ్యత్యాసాల వల్ల భారత్‌లో పేదరిక సమస్య ఏర్పడినది
డి) అమెరికా, బ్రిటన్ పేదరికం వల్ల భారత్‌లో పేదరిక సమస్య ఏర్పడింది
12. ఆర్థిక ఆంక్షలు అంటే
ఎ) వాణిజ్య విస్తరణ
బి) వాణిజ్య సంబంధాల కోత
సి) పన్ను విధింపు
డి) నష్టపరిహారం విధింపు
13. భారతదేశంలో సేవింగ్స్ అధికంగా ఏ రంగం నుంచి వస్తున్నాయి?
ఎ) కార్పొరేటు రంగం
బి) ప్రభుత్వ రంగం
సి) కుంటుంబ రంగం
డి) బ్యాంకింగ్ రంగం
14. నియమిత ఆర్థిక వ్యవస్థ అంటే
ఎ) దిగుమతులు మాత్రమే
బి) ఎగుమతులు మాత్రమే
సి) ద్రవ్య పంపిణీని అదుపులో ఉంచుట
డి) ఎగుమతులు, దిగుమతులు ఏమి ఉండవు
15. స్వాతంత్య్రం వచ్చేనాటికి భారతదేశం ఆర్థికంగా వెనుకబడి ఉండుటకు కారణం
ఎ) రాజకీయ అంశాలు
బి) ఆర్థిక అంశాలు
సి) సామాజిక అంశాలు డి) పైవన్నీ
16. ఒక కుటుంబ ఆదాయం పెరిగితే దాని వినియోగం?
ఎ) ఎక్కువగా పెరుగును
బి) ఆదాయం పెరిగినంతగా పెరుగుతుంది
సి) మారదు
డి) ఆదాయాల కన్నా తక్కువగా పెరుగుతుంది
17. ఒక వెనుకబడిన పేద దేశం?
ఎ) వ్యవసాయ అభివృద్ధి రేటు హెచ్చుగా ఉంటుంది
బి) మూలధనానికి గల సప్లయ్, డిమాండ్ తక్కువగా ఉండటం
సి) జనాభా పరిమాణం తక్కువగా ఉండటం
డి) దేశ వైశాల్యం తక్కువగా ఉండటం
18. పారిశ్రామిక విప్లవం సంభవించిన దేశం ఏది?
ఎ) అమెరికా బి) ఇంగ్లండ్
సి) జపాన్ డి) రష్యా
19. వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ ఏ విధంగా జరిగింది?
ఎ) మొదట 6 రెండోసారి 14 వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ జరిగింది
బి) మొదట 14 రెండోసారి 6 వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ జరిగింది
సి) మొదట 8 రెండోసారి 12 వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ జరిగింది
డి) మొదట 12 రెండోసారి 8 వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ జరిగింది
20. హరిత విప్లవం వల్ల చేకూరిన అంశం
ఎ) వరి, గోధుమ ఉత్పత్తి పెరిగింది
బి) రసాయనిక వినియోగం తగ్గింది
సి) ద్రవ్యోల్బణం పెరిగింది
డి) పైవన్నీ
21. భారతదేశంలో ప్రధాన భూ కమతాలు?
ఎ) సహకార కమతాలు
బి) లాభసాటి కమతాలు
సి) కుటుంబ కమతాలు
డి) ప్రాథమిక కమతాలు
22. కనీస అవసరాల కార్యక్రమం కిందకు రాని అంశం
ఎ) వయోజన విద్య
బి) గ్రామీణ విద్యుదీకరణ
సి) మంచినీటి సరఫరా
డి) నిరుద్యోగ భృతి
23. భూమి అభివృద్ధి బ్యాంకు దీనిలో భాగం?
ఎ) పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు
బి) వాణిజ్య బ్యాంకు
సి) సహకార పరపతి సంఘాలు
డి) పైవన్నీ
24. సోనా-358 అనేది?
ఎ) ఒక వాయిద్యం బి) ఆధునిక తుపాకీ
సి) గోధుమ విత్తనం డి) యుద్ధ విమానం
25. ఉపాంత కమతం అంటే?
1) ఒక హెక్టారులోపు
2) రెండు హెక్టార్ల లోపు
3) ఐదు హెక్టార్లలోపు
4) రెండున్నర ఎకరాలలోపు
ఎ) 1 మాత్రమే బి) 1, 2 మాత్రమే
సి) 4 మాత్రమే డి) 1, 4
26. వీరు చేసే ఉత్పత్తిలో మార్కెట్ మిగులు ఉండదు?
ఎ) జమిందారులు బి) భూస్వాములు
సి) చిన్న రైతులు
డి) మధ్యతరగతి రైతులు
27. ఖాయిలా పడిన యూనిట్ అంటే
1) కోలుకోలేని నష్టాల్లో ఉన్నది
2) దాని సామర్థ్యం కన్నా తక్కువ స్థాయిలో పని చేయుట
3) తమ ఉత్పత్తులను కొనుగోళ్లను పెంచలేక పోవుట
4) ఉత్పత్తి, ఉత్పాదకత తక్కువగా ఉండటం
ఎ) 1, 2 బి) 2, 4
సి) 4 డి) 1, 2, 3, 4
28. వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఎక్కువగా గల రాష్ట్రం ఏది?
ఎ) గుజరాత్ బి) పంజాబ్
సి) కేరళ డి) పశ్చిమబెంగాల్
29. దేశ విభజన ఫలితంగా బాగా దెబ్బతిన్న పరిశ్రమలు ఏవి?
1) కాగితం పరిశ్రమ
2) జనపనార పరిశ్రమ
3) వస్త్ర పరిశ్రమ
4) పంచదార పరిశ్రమ
ఎ) 3 బి) 2, 3 సి) 4 డి) 2
30. భారతదేశంలో ఏర్పడిన తొలి కార్మిక సంఘం
ఎ) సీఐటీయూ బి) ఐఎన్టీయూసీ
సి) ఏఐటీయూసీ డి) ఆర్ఎన్యూసీ
31. ‘ప్లాన్డ్ ఎకానమీ ఫర్ రష్యా’ విధానాన్ని ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
ఎ) 1915 బి) 1916
సి) 1917 డి) 1920
32.కింది వాటిలో సరైనది ఏది?
1) మొదటి ప్రణాళిక కాలం 1951 ఏప్రిల్ 1 నుంచి 1956 మార్చి 31 వరకు
2) మొదటి ప్రణాళిక వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చింది
3) మొదటి ప్రణాళిక ఊహించింది 2.1 శాతం, సాధించింది 3.4 శాతం
4) మొదటి ప్రణాళిక హరడ్ డోమర్ నమూనా
ఎ) 1, 2 సి) 2, 3
సి) 2 డి) 1, 2, 3, 4
33. స్థిరత్వంతో కూడిన వృద్ధి లక్ష్యంతో గల ప్రణాళిక ఏది?
ఎ) మూడో ప్రణాళిక
బి) నాలుగో ప్రణాళిక
సి) ఐదో ప్రణాళిక
డి) ఆరో ప్రణాళిక
34. గుణక సూత్రాన్ని సాధారణంగా ఇలా సూచిస్తారు?
ఎ) ఆదాయంలోని మార్పు / పెట్టుబడిలోని మార్పు
బి) ఆదాయంలోని మార్పు / వినియోగంలోని మార్పు
సి) ఆదాయంలోని మార్పు/ పొదుపులోని మార్పు
డి) పెట్టుబడిలోని మార్పు / ఆదాయంలోని మార్పు
35. ఆదాయం పెరిగే కొద్ది ఉపాంత వినియోగ ప్రవృత్తి?
ఎ) పెరుగును బి) తగ్గును
సి) స్థిరం డి) మారదు
36. పొదుపు పెట్టుబడి కన్నా అధికంగా ఉంటే ధరలు?
ఎ) పెరుగును బి) తగ్గును
సి) స్థిరం డి) మారవు
37. జీవన ప్రమాణాన్ని తెలుసుకొనుటకు మంచిసూచిక?
1) జాతీయాదాయం 2) పేదరికం
3) తలసరి వినియోగం 4) నిరుద్యోగం
ఎ) 2, 4 బి) 1
సి) 3 డి) పైవన్నీ
38. భారతదేశంలో మొదటి కేంద్ర బ్యాంకును ఎప్పుడు ఏర్పాటు చేసి ఎప్పుడు జాతీయం చేశారు?
ఎ) 1935, 1949 బి) 1935, 1955
సి) 1949, 1955 డి) 1934, 1949
39. ద్రవ్యం కొనుగోలు శక్తికి గల పేరు?
ఎ) ద్రవ్య పరిమాణం
బి) ద్రవ్య విలువ
సి) ద్రవ్య సప్లయ్
డి) ద్రవ్య డిమాండ్
40. భారతదేశంలో బ్యాంకుల రెగ్యులేషన్ చట్టం చేసిన సంవత్సరం?
ఎ) 1934 బి) 1935
సి) 1949 డి) 1955
41. కింది వాటిలో వాంఛు కమిటీ దేనికి సంబంధించినది?
ఎ) భారతదేశంలో నల్లధనాన్ని అంచనా వేయుటకు
బి) నిరుద్యోగిత అంచనా వేయుటకు
సి) చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం
డి) భారీ పరిశ్రమల అభివృద్ధి కోసం
42. జనాభా పెరుగుదల ఒక సమస్య అని మొదట గుర్తించినది ఎవరు?
ఎ) ఆడమ్ స్మిత్ బి) మాల్థస్
సి) గుర్నార్ మిర్ధాల్ డి) మార్షల్
43. జాతీయాదాయంలో…?
ఎ) వ్యవసాయ రంగం వాటా ఎక్కువ
బి) వ్యవసాయ రంగం వాటా తగ్గి పారిశ్రామిక, సేవారంగం వాటా పెరుగుదల
సి) పారిశ్రామిక రంగం వాటా పెరుగుదల
డి) వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగం వాటా క్రమంగా పెరగడం
44. లోటు బడ్జెట్ పూడ్చుటకు మార్గం.
ఎ) రుణాలు బి) ద్రవ్య ముద్రణ
సి) ఎ, బి డి) పన్నులు విధించుట
45. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణానికి కారణమైన పన్ను లేవి?
ఎ) ప్రత్యక్ష పన్నులు బి) పరోక్ష పన్నులు
సి) అనుపాత పన్ను డి) ఏదీకాదు
46. వ్యయంపై పన్నును సూచించిన వారు?
ఎ) కె.ఎన్ రాజ్ బి) కాల్థార్
సి) రాజా చెల్లయ్య
డి) మన్మోహన్సింగ్
47. ఉత్పత్తి దేని ఫలం
ఎ) ధర బి) పెట్టుబడి
సి) ఉత్పత్తి కారకాలు డి) పైవన్నీ
48. పరిశ్రమలు కేంద్రీకరణకు ముఖ్యం?
ఎ) వ్యక్తిశ్రద్ధ
బి) ప్రభుత్వ అనుమతి
సి) ముడి పదార్థాల లభ్యత
డి) రాజకీయ పలుకుబడి
49. ధరలు తగ్గినపుడు వాస్తవిక వేతనాలు?
ఎ) ఎక్కువ బి) తక్కువ
సి) స్థిరం డి) పైవేవీకావు
50. మిగులు దోపిడీ అనే భావనను చెప్పినవారు?
ఎ) కీన్స్ బి) కారల్‌మార్క్స్
సి) ఆడమ్‌స్మిత్ డి) రికార్డో
51. భూమి సప్లయ్
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) స్థిరంగా ఉంటుంది డి) ఏదీకాదు
52. ఎగ్జిమ్‌బ్యాంక్ ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1935 బి) 1949
సి) 1955 డి) 1982
జవాబులు
1-సి 2-ఎ 3-బి 4-సి
5-సి 6-సి 7-బి 8-సి
9-సి 10-సి 11-సి 12-బి
13-సి 14-డి 15-డి 16-డి
17-బి 18-బి 19-బి 20-ఎ
21-సి 22-డి 23-సి 24-సి
25-డి 26-సి 27-డి 28-బి
29-బి 30-సి 31-సి 32-డి
33-బి 34-ఎ 35-బి 36-బి
37-సి 38-ఎ 39-బి 40-సి
41-ఎ 42-బి 43-బి 44-సి
45-బి 46-బి 47-సి 48-సి
49-ఎ 50-బి 51-సి 52-డి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు