BIOLOGY | చిన్నపిల్లల్లో డయేరియా వ్యాధికి కారణం?
ఏప్రిల్ 12 తరువాయి
45. నాళాలు లేని గ్రంథులైన అంతస్స్రావిక గ్రంథుల్లో పీయూష గ్రంథి అన్ని గ్రంథులను నియంత్రించినప్పటికీ ప్రధాన గ్రంథిగా, కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్గా పిలుస్తున్నప్పటికి, దీని అధీనంలో లేని గ్రంథి ఏది?
1) పారాథైరాయిడ్
2) థైరాయిడ్
3) అధివృక్క గ్రంథులు
4) పీనియల్ గ్రంథి
46. ఆస్కార్బిక్ ఆమ్లం విధి కానిది?
1) యాంటీ క్యాన్సర్‌గా పనిచేయడం
2) నాడీవ్యవస్థను మేల్కొల్పడం
3) వ్యాధి నిరోధక శక్తిని పెంచడం
4) కొలెస్టిరాల్‌ను తగ్గించడం
47. CPF జీవక్రియను నియంత్రించేవి?
1) థయమిన్ 2) పైరిడాక్సిన్
3) నియాసిన్ 4) 2, 3
48. సల్ఫర్‌ను థయమిన్, ఐరన్‌ను ఫోలిక్ ఆమ్లం కలిగి ఉంటే, కోబాల్ట్‌ను కలిగిన విటమిన్ ఏది?
1) B12 2) B11
3) B5 4) C
49. ఫార్మిక్ ఆమ్లం చీమల్లో ఉండగా, టార్టారిక్ ఆమ్లం చింతలో ఉండగా, లినోలిక్, లినోలెనిక్ ఆమ్లం దేనిలో ఉంటుంది?
1) యాపిల్ 2) కొబ్బరి
3) వేరుశనగ 4) పత్తి
50. కింది వాటిలో కెరోటినాయిడ్ కానిది ఏది?
1) లైకోపీన్ 2) ల్యూటిన్
3) కెరోటిన్ 4) కాప్సిసిన్
51. బీట్రూట్ వర్ణానికి కారణం?
1) హీమోసయనిన్ 2) ఫైకోసయనిన్
3) ఆంథోసయనిన్ 4) ఫైకో ఎరిత్రిన్
52. జంతు సంబంధ ఆహారంలో ఉండక, వేడి చేస్తే నశించేది?
1) రిబోఫ్లావిన్ 2) పైరిడాక్సిన్
3) ఫిల్లోక్వినోన్
4) యాంటీస్కర్వీ విటమిన్
53. సహజీవనానికి మంచి ఉదాహరణ కానిది?
1) రైజోబియం బ్యాక్టీరియం, లెగ్యూమ్ మొక్కలు
2) ఒక శైవలం, శిలీంధ్రం కలవడంవల్ల ఏర్పడే బ్రయోఫైటా
3) నెమరువేసే జంతువులు, బ్యాక్టీరియా
4) మానవుడు, E కోలై బ్యాక్టీరియా
54. పంట మార్పిడి విధానం/సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించనిది?
1) చిక్కుడు 2) ఆవాలు
3) వేరుశనగ 4) బఠాని
55. నత్తలు, ఆల్చిప్పల కర్పరాలు, గుడ్డుపెంకు, ప్రవాళాలు, ముత్యాలు వేటితో నిర్మితమవుతాయి?
1) కాల్షియం పాస్ఫేట్
2) కాల్షియం కార్బైడ్
3) కాల్షియం హైడ్రాక్సైడ్
4) కాల్షియం కార్బోనేట్
56. గౌట్ వ్యాధి అనే ఎముకల సంబంధిత వ్యాధికి కారణం?
1) యూరియా 2) యూరిక్ ఆమ్లం
3) ఎసిటిక్ ఆమ్లం 4) మాలిక్ ఆమ్లం
57. కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, CHOలతో నిర్మితం అయితే, ప్రొటీన్ వేటితో నిర్మితం అవుతుంది?
1) CHO 2) CHONK
3) CHNS 4) CHONS
58. కింది వాటిలో సహజ పాలిమర్ కానిది?
1) సెల్యూలోజ్ 2) రేయాన్
3) సిల్క్ 4) రబ్బర్
59. కింది వాటిలో డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల కోసం ఉపయోగించే తక్కువ క్యాలరీలు గల, అధిక తీపి గల పదార్థం కానిది?
1) ఆస్పిర్టిక్ ఆమ్లం 2) అలీటేమ్
3) సుక్రలోజ్ 4) ఆస్పర్టేమ్
60. చిన్నపిల్లల్లో మాత్రమే ఉండే అమైనో ఆమ్లం, ఎంజైమ్స్ వరుసగా?
1) పెప్సిన్, రెనిన్ 2) ఆర్జినిన్, రెనిన్
3) రెనిన్, హిస్టడిన్ 4) హిస్టడిన్, రెనిన్
61. కింది వాటిలో సరికానిది ఏది?
1) సిల్వికల్చర్ – ఫలాల పెంపకం
2) ఎపికల్చర్ – తేనెటీగల పెంపకం
3) వర్మికల్చర్ – వానపాము
4) ష్రింప్కల్చర్ – రొయ్యలు
62. ACT – మలేరియాకు, ART HIVకి వినియోగించగా, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే కోబాల్ట్-60 అనే రేడియోధార్మిక ఐసోటోప్ విడుదల చేసే కిరణాలు?
1) ఆల్ఫా కిరణాలు 2) బీటా కిరణాలు
3) గామా కిరణాలు
4) అతినీలలోహిత కిరణాలు
63. ైగ్లెకోజన్ నిల్వ ఉండని ప్రదేశం?
1) కాలేయం 2) కండరాలు
3) మెదడు 4) క్లోమం
64. దంతాలకు సంబంధించిన వ్యాధి కానిది?
1) కంజెంక్టివైటిస్ 2) జింజివైటిస్
3) ఫ్లోరోసిస్ 4) పయేరియా
65. ఏనుగు దంతాలు వేటి మార్పు?
1) కుంతకాలు 2) రదనికలు
3) అగ్రచర్వణకాలు 4) చర్వణకాలు
66. చిన్నపేగులోని భాగాలు ఆరోహణ క్రమంలో అమర్చితే?
1) జెజునం, ఆంత్రమూలం, శేషాంత్రికం
2) శేషాంత్రికం, ఆంత్రమూలం, జెజునం
3) ఆంత్రమూలం, జెజునం, శేషాంత్రికం
4) శేషాంత్రికం, జెజునం, ఆంత్రమూలం
67. మానవుని దంత సూత్రం?
1) 2123/2222 2) 2321/2321
3) 2122/2122 4) 2123/2123
68. క్లోరినేషన్, ఓజోనైజేషన్ ప్రక్రియలు నీటిని శుభ్రపరిచే ప్రక్రియలు కాగా హైడ్రోజినేషన్?
1) దంతాలను శుభ్రపరిచేది
2) డాల్డా తయారీ ప్రక్రియ
3) ఒక శ్వాసక్రియ
4) ఎముకలకు సంబంధించిన ప్రక్రియ
69. కణత్వచం దేనితో నిర్మితమవుతుంది?
1) లిపిడ్ 2) ప్రొటీన్
3) కార్బోహైడ్రేట్ 4) లిపో ప్రొటీన్
70. కణత్వచం కింది వాటిలో మాత్రమే కనబడుతుంది?
1) జంతువులు 2) మొక్కలు
3) 1, 2 4) ఏదీకాదు
71. రైబోసోమ్ విధి ఏమిటి?
1) ఆహారం తయారీ 2) ప్రొటీన్స్ తయారీ
3) కార్బోహైడ్రేట్స్ తయారీ
4) లిపిడ్స్ తయారీ
72. కింది వాటిలో జంతుకణాల్లో మాత్రమే ఉండేది?
1) సెంట్రోసోమ్ 2) డిక్టియోసోమ్
3) పెరాక్సీసోమ్ 4) పైవేవీకావు
73. కింది వాటిలో కేంద్రకపూర్వకణానికి సంబంధించినది?
1) కేంద్రకత్వచ లోపం
2) కేంద్రక పదార్థం, కణద్రవ్యంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండటం
3) ఒకే ఒక క్రోమోసోమ్ను కలిగి ఉండటం
4) పైవన్నీ
74. మొక్కలు, జంతువుల వైవిధ్యాన్ని ఏ విధంగా పిలుస్తారు?
1) ఫానా 2) ఫ్లోరా
3) బయోటా 4) ఏదీకాదు
75. ప్రస్తుత జీవవైవిధ్యం ఎప్పుడు ఆవిర్భవించింది?
1) 3.5 బిలియన్ సంవత్సరాల కిందట
2) నాలుగు బిలియన్ ఏళ్ల కిందట
3) ఐదు బిలియన్ ఏళ్ల కిందట
4) పైవేవీ కావు
76. ప్రతి జీవి పేరులో ఉండేది?
1) జన్యువులు 2) జాతి
3) వర్గం 4) విభాగం
77. క్రిప్టోగ్రామ్స్కి సరైనది ఏది?
1) నిమ్న మొక్కలు
2) పుష్ప, విత్తనరహిత మొక్కలు
3) బహిర్గత పుష్పం, ఫలాలు ఏర్పడవు
4) పైవన్నీ
78. కింది వాటిలో స్వయంపోషకాలు?
1) శైవలాలు 2) శిలీంధ్రాలు
3) బ్యాక్టీరియా 4) ప్రోటోజోవా
79. బ్రయోఫైటాకు సంబంధించినది?
1) శరీరం బల్లపరుపుగా ఉండి వేర్లు, పత్రాలు లోపిస్తాయి
2) నాళికా కణజాలాలు ఉండవు
3) లైంగిక అవయవాలు బహుకణయుతం
4) పైవన్నీ
80. కింది వాటిలో వివృతబీజాలకు, అవృత బీజాలకు సరైన తేడాను గుర్తించండి.
1) వివృతబీజాల్లో ఫలం ఉండదు. ఆవృతబీజాల్లో ఉంటుంది.
2) వివృతబీజాల్లో ఫలం ఉంటుంది. ఆవృతబీజాల్లో ఉండదు.
3) వివృతబీజాల్లో, ఆవృతబీజాల్లో ఫలం ఉండదు
4) వివృతబీజాల్లో, ఆవృతబీజాల్లో ఫలం ఉంటుంది
81. కింది వాటిలో ద్విదళ బీజ మొక్క ఏది?
1) బఠాని 2) వరి
3) గోధుమ 4) రాగులు
82. అనెలిడా సమూహపు జీవులు?
1) వానపాము 2) జలగ
3) ఆఫ్రోడైట్ 4) పైవన్నీ
83. ఆర్థ్రోపొడా జీవుల్లోని కీటకాల లక్షణం కానిది?
1) కీళ్లుగల కాళ్లు కలిగి ఉండటం
2) రెండు జతల రెక్కలు, మూడు జతల కాళ్లు ఉండటం
3) శరీరం తల, ఉరం, ఉదరంగా విభజించడం
4) ఇవి జంతురాజ్యంలో అతి పెద్ద వర్గం
84. ఆర్థ్రోపొడా జీవుల శరీర కుహరం కుదించి, రక్తంతో నింపడాన్ని ఏమంటారు?
1) హీమోసీల్ 2) హీమ్
3) ప్లాస్మా 4) పైవేవీ కావు
85. పక్షవాతానికి కారణమయ్యే లాథరిజం అనే వ్యాధి దేనివల్ల వస్తుంది?
1) సోయాబీన్‌ను అధికంగా తీసుకోవడం
2) కేసరిపప్పు అధికంగా తీసుకోవడం
3) విషపూరిత పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం
4) విషపూరిత చేపలను ఆహారంగా తీసుకోవడం
86. పెర్టుసిస్, స్వైన్ ఫ్లూ వ్యాధికారకాలు వరుసగా?
1) ప్రోటోజోవా, వైరస్
2) వైరస్, బ్యాక్టీరియా
3) బ్యాక్టీరియా, ప్రోటోజోవా
4) బ్యాక్టీరియా, వైరస్
87. జతపరచండి.
ఎ. పెన్సిలిన్ 1. మొదటి వ్యాక్సిన్
బి. మశూచి 2. మొదటి డ్రగ్
సి. డీడీటీ 3. మొదటి యాంటీబయాటిక్
డి. ప్రాంటోసిల్ 4. మొదటి కీటకనాశిని
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-4, బి-1, సి-3, డి-2
4) ఎ-3, బి-1, సి-4, డి-2
88. చిన్న పిల్లల్లో డయేరియా వ్యాధికి కారణం?
1) ఎంటిరో వైరస్ 2) కరోనా వైరస్
3) పారామిక్సో వైరస్ 4) రోటా వైరస్
89. కింది వాటిలో ఎయిడ్స్ వ్యాధి లక్షణం కానిది?
1) శోషరస గ్రంథుల వాపు
2) వ్యాధినిరోధక శక్తి, బరువు, జ్ఞాపకశక్తి తగ్గడం
3) లైంగికావయవాలు బహుకణయుతం
4) పైవన్నీ
90. కింది వాటిలో కంటికి సంబంధించని వ్యాధి?
1) కాటరాక్ట్ 2) కంజెంక్టివైటిస్
3) పయేరియా 4) గ్లకోమా
91. జతపరచండి.
ఎ. మయోపియా 1. కుంభాకార కటకం
బి. ప్రెస్ బ్రయోపియా 2. స్థూపాకార కటకం
సి. ఆస్టిగ్మాటిజం 3. పుటాకార కటకం
డి. హైపర్‌మెట్రోపియా 4. ద్వినాభికటకం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-3, బి-4, సి-2, డి-1
92. జన్యు సంబంధ వ్యాధి కానిది ఏది?
1) హీమోఫీలియా 2) వర్ణాంధత్వం
3) డయేరియా 4) ఆల్బునిజం
93. జతపరచండి.
ఎ. ఆడ ఎడిస్ 1. మలేరియా
బి. ఆడ ఎనాఫిలిస్ 2. డెంగీ, చికున్ గున్యా
సి. ఆడ క్యూలెక్స్ 3. మెదడువాపు, ఫైలేరియా
1) ఎ-1, బి-3, సి-4
2) ఎ-2, బి-3, సి-1
3) ఎ-3, బి-1, సి-2
4) ఎ-2, బి-1, సి-3
94. కింది వాటిలో భిన్నమైనది గుర్తించండి.
1) పోలియో, హెపటైటిస్
2) కలరా, టైఫాయిడ్
3) అమీబియాసిస్, డయేరియా
4) డిఫ్తీరియా, టెటానస్
95. జతపరచండి.
ఎ. సార్స్ 1. కరోనా వైరస్
బి. ధనుర్వాతం 2. క్లాస్ట్రీడియం టెటాని
సి. స్వైన్‌ఫ్లూ 3. హెచ్1ఎన్1
డి. జలుబు 4. రైనోవైరస్
5. హెచ్5ఎన్1
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-5, డి-4
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-2, బి-1, సి-3, డి-4
96. జతపరచండి.
ఎ. టిక్కా తెగులు 1. చెరకు
బి. ఎర్రకుళ్లు తెగులు 2. ద్రాక్ష
సి. డౌనీమిల్ డ్యూ 3. బంగాళదుంప
డి. లేట్‌బ్లైట్ తెగులు 4. వేరుశనగ
1) ఎ-3, బి-2, సి-4, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-2, బి-3, సి-4, డి-1
97. సిర్రోసిస్ అనే వ్యాధి అధిక ఆల్కహాల్ సేవించే వ్యక్తుల్లో కనిపిస్తుంది. ఇది ఏ భాగానికి సంబంధించింది?
1) మెదడు 2) గుండె
3) కాలేయం 4) కన్ను
98. శ్వాసవ్యవస్థకు సంబంధించని వ్యాధి?
1) టీబీ 2) సార్స్
3) డెంగీ 4) న్యుమోనియా
99. ఎగ్జిమా, సొరియాస్, విటిలిగో వేటికి సంబంధించినది?
1) కన్ను 2) చర్మం
3) జన్యు సంబంధ వ్యాధులు
4) దంత వ్యాధులు
జవాబులు
45.1 46.2 47.3 48.1
49.4 50.2 51.3 52.4
53.2 54.2 55.4 56.2
57.4 58.2 59.1 60.4
61.1 62.3 63.4 64.1
65.1 66.3 67.4 68.2
69.4 70.3 71.2 72.1
73.4 74.3 75.1 76.2
77.4 78.1 79.4 80.1
81.1 82.4 83.4 84.1
85.2 86.4 87.4 88.4
89.3 90.3 91.4 92.3
93.4 94.4 95.1 96.3
97.3 98.3 99.2
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు