Economy | యుద్ధాలతో వైఫల్యం… స్థిరత్వం సుస్థిరాభివృద్ధి లక్ష్యం
మూడో పంచవర్ష ప్రణాళిక(1961-66) (Third Five Year Plan)
- మూడో ప్రణాళిక కాలం 1961 ఏప్రిల్ 1 నుంచి 1966 మార్చి 31 వరకు.
- మూడవ ప్రణాళిక రూపకర్త పీతాంబర్ సేథ్ / పంత్- అశోక్‌మెహతా
- పీతాంబర్ పంత్ రచించిన సిద్ధాంతం ఆధారంగా అశోక్‌మెహతా రూపొందించారు.
- మూడవ ప్రణాళికను 15 సంవత్సరాలు దృష్టిలో ఉంచుకొని దీర్ఘదర్శి ప్రణాళికగా రూపొందించారు.
- మూడవ ప్రణాళిక నమూనాను అశోక్ మెహతా నమూనా (పితాంబర్ పంత్ నమూనా) అంటారు.
- మూడవ ప్రణాళిక అధ్యక్షులు
1) జవహర్లాల్ నెహ్రూ (1964 మే 27 వరకు)
2) గుల్జారీలాల్ నందా (1964 మే 27 నుంచి 1964 జూన్ 9)
3) లాల్ బహుదూర్ శాస్త్రి (1964 జూన్9 నుంచి 1966 జనవరి 11) - ఉపాధ్యక్షులు : సి.ఎమ్. త్రివేది (1961-63)
అశోక్ మెహతా (1963-67) - మూడవ ప్రణాళిక ప్రాధాన్యం స్వయం సమృద్ధి, స్వావలంబన
అంచనా వ్యయం రూ.7500 కోట్లు
వాస్తవిక వ్యయం రూ.8577 కోట్లు - మూడవ ప్రణాళికలో అధిక వనరుల కేటాయింపు రవాణా సమాచారం 24.6 శాతం
- వ్యవసాయం, నీటి పారుదల 20.5 శాతం
- పరిశ్రమలు, ఖనిజాలు 20.1 శాతం
- 3వ ప్రణాళికలో ఆశించిన వృద్ధిరేటు 5.6 శాతం
- సాధించిన వృద్ధి రేటు 2.8 శాతం
మూడవ ప్రణాళిక వైఫల్యానికి కారణం
- 1962లో చైనాతో యుద్ధం, 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం, 1965-66లో కరువు కాటకాలు, జాతీయాదాయం తగ్గుదల
- భారత ప్రణాళికలన్నింటిలోకి అత్యంత విఫలమైన ప్రణాళిక 3వ ప్రణాళిక.
- 3వ ప్రణాళికను వైఫల్య ప్రణాళిక, జబ్బుపడిన ప్రణాళిక, అనారోగ్య ప్రణాళిక(సిక్ప్లాన్) వాష్ప్లాన్ అని అంటారు.
- 1961లో వరకట్న నిషేధ చట్టం రూపొందించారు
- 1962లో భారత్ చైనా మధ్య యుద్ధం
- 1963లో ఏఆర్డీసీ వ్యవసాయ రీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు
- 1964లో బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ప్రారంభం. ఐడీబీఐ, యూటీఐ ఏర్పాటు.
- 1965లో భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధం
- ఎఫ్‌సీఐ భారత ఆహార సంస్థ ఏర్పాటు
- వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు
- 1965-66లో విపరీతమైన కరువు పరిస్థితులు
- ఏఆర్డీసీ – అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ARDC)
- ఐడీబీఐ- ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- యూటీఐ- యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
- ఎఫ్‌సీఐ – ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
ప్రణాళిక విరామం \ వార్షిక ప్రణాళికలు (1966-69)
- 3వ ప్రణాళిక తర్వాత 4వ ప్రణాళిక ప్రారంభం కాకుండా మూడు వార్షిక ప్రణాళికలు అమలు చేశారు.
- దీనికి కారణం 3వ ప్రణాళిక విఫలం చెందడం, నిధుల కొరత, ద్రవ్యోల్బణ ఒత్తిడి, ఇద్దరు ప్రధాన మంత్రుల మృతి, డాలర్‌తో రూపాయి విలువ తగ్గడం మొదలైనవి.
- మూడు వార్షిక ప్రణాళికల కాలం 1966-69
- మొదటి వార్షిక ప్రణాళిక కాలం 1966-67లో రూ. 2221 కోట్లు
- రెండవ వార్షిక ప్రణాళిక కాలం 1967-68లో రూ. 2246 కోట్లు
- మూడవ వార్షిక ప్రణాళిక కాలం 1968-69లో రూ. 2376కోట్ల పెట్టుబడులను పెట్టారు.
- ఈ మూడు వార్షిక ప్రణాళికల కాలాన్ని ప్రణాళిక సెలవు (ప్లాన్ హాలిడే) ప్రణాళిక విరామం/ ప్రణాళిక విశ్రాంతి (ప్లాన్ ఇంటర్వెల్) అని అంటారు.
- వీటిని పిగ్మీ ప్రణాళిక, స్వల్పకాలిక ప్రణాళికలు అని కూడా అంటారు.
- 1966 ఖరీఫ్ కాలం నుంచి హరిత విప్లవం ప్రారంభమైంది.
- 1966 జూన్‌లో రూపాయి మూల్యహీనీకరణ (Devalution) (2వ సారి) జరిగింది. మొదటిసారి 1949లో జరిగింది.
- 1968 నేషనల్ టెక్స్టైల్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేశారు.
- 1968 మొదటి జాతీయవిద్యా విధానం రూపొందించారు.
- 1969లో నారీమన్ కమిటీ సూచనల మేరకు లీడ్ బ్యాంక్ స్కీమ్ ప్రారంభం.
నాలుగో పంచవర్ష ప్రణాళిక 1969 – 74
- నాలుగో డకాలం 1969 ఏప్రిల్ 1 నుంచి 1974 మార్చి 31 వరకు.
- నాలుగో ప్రణాళిక రూపకర్త -డి.ఆర్.గాడ్గిల్ (ధనుంజయ్ రామచంద్ర గాడ్గిల్).
- నాలుగో ప్రణాళిక నమూనా అశోక్ రుద్ర- అలెన్ మన్నె
- నాలుగో ప్రణాళిక అధ్యక్షులు ఇందిరాగాంధీ.
- ఉపాధ్యక్షులు డి.ఆర్. గాడ్గిల్
- నాలుగో ప్రణాళిక ప్రాధాన్యం స్థిరత్వంతో కూడిన వృద్ధి, ఆర్థిక స్వావలంబన.
- నాలుగో ప్రణాళిక అంచనా వ్యయం రూ.15,902 కోట్లు.
- వాస్తవిక వ్యయం రూ. 15,779 కోట్లు .
- నాలుగో ప్రణాళికలో అధిక వనరుల కేటాయింపు వ్యవసాయం, నీటిపారుదల 28.3 శాతం.
- పరిశ్రమలు, ఖనిజాలు 19.7 శాతం.
- రవాణా, సమాచారం 19.5 శాతం.
- నాలుగో ప్రణాళికలో ఆశించిన వృద్ధిరేటు 5.7 శాతం.
- సాధించిన వృద్ధి రేటు 3.3 శాతం.
నాలుగో ప్రణాళిక వైఫల్యం చెందడానికి కారణం
- 1971లో పాక్‌తో యుద్ధం, బంగ్లాదేశ్ కాందిశీకుల భారం, 1973లో చమురు ధరలు పెరగడం, ప్రణాళిక చివరి మూడు సంవత్సరాల్లో ప్రతికూల వాతావరణం, విద్యుత్ కొరత, పారిశ్రామిక అశాంతి మొదలైనవి.
- 1969లో ఏకస్వామ్య వ్యాపార నిరోధక చట్టం (ఎంఆర్టీపీ యాక్ట్ 1969)
- 1969 జూలై 14న హజారీ కమిటీ సూచనతో 14 వాణిజ్య బ్యాంకుల జాతీయం
- 1970లో రాజాభరణాల రద్దు
- 1970-71 గ్రామీణ పనుల కార్యక్రమం
- 1970లో పాల ఉత్పత్తిని పెంచుటకు ఆపరేషన్ ఫ్లడ్‌ను వర్గీస్ కురియన్ ప్రారంభించాడు
- 1971 ఈశాన్య రాష్ర్టాల మండలి ఏర్పాటు
- 1972-73 మహారాష్ట్ర ఉపాధి హామీ పథకం ప్రారంభం
- 1972 జీఐసీ జాతీయం
- 1973-74 క్షామ పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకం (డీపీఏడీపీ)
- సన్నకారు రైతుల, వ్యవసాయ కూలీల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎఫ్డీఏ) (ఎంఎఫ్ఏఎల్)
- 1973 – ఫెరా(FERA) ఏర్పాటు ఇది 1999లో FEMA గా మారింది.
- 1974లో గరీబీ హఠావో నినాదం ఇందిరాగాంధీ ఇచ్చారు.
- 1974- ఏపీ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ ఏర్పాటు.
- MRTP Act -Monopolistic and Restrictive Trade Practices Act
- RWP- Rural Network Programme
- GIC – General Insurance Corporation
- DPADP- Drought Prone Area Development Programme
- SFDA-Small Farmers Development Agency
- MFDA – Marginal Farmers Develo pment Agency
- FERA-Foreign Exchange Regu lation Act
- FEMA – Foreign Exchange Management Act
ప్రాక్టీస్ బిట్స్
1. మూడో పంచవర్ష ప్రణాళిక కాలం
ఎ) 1960 ఏప్రిల్ 1- 1965 మార్చి 31
బి) 1961 ఏప్రిల్ 1-1966 మార్చి 31
సి) 1960 మార్చి 1 1965 ఏప్రిల్ 1
డి) 1961 మార్చి 1 -1966 ఏప్రిల్ 1
2. మూడో ప్రణాళికలో దేనికి ప్రాధాన్యం ఇచ్చారు?
ఎ) స్థిరత్వంతో కూడిన వృద్ధి
బి) స్వయం సమృద్ధి
సి) స్వావలంబన
డి) స్వయం సమృద్ధి స్వావలంబన
3. మూడో ప్రణాళిక నమూనా ఏది?
ఎ) హరడ్ డోమర్ నమూనా
బి) మహల నోబిస్ నమూనా
సి) అశోక్ మెహతా నమూనా
డి) పైవన్నీ
4. మూడో ప్రణాళిక వైఫల్యానికి కారణాలు ఏవి?
ఎ) భారత్ చైనా యుద్ధం
బి) ఇండో-పాక్ యుద్ధం
సి) కరువు కాటకాలు డి) పైవన్నీ
5. మూడో ప్రణాళికకు మరో పేరు?
ఎ) వైఫల్య ప్రణాళిక
బి) జబ్బుపడిన ప్రణాళిక
సి) వాష్ ప్లాన్ డి) పైవన్నీ
6. వరకట్న నిషేధ చట్టం ఏ ప్రణాళిక కాలంలో రూపొందించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
7. మూడో ప్రణాళికలో ఆశించిన వృద్ధిరేటు ఎంత?
ఎ) 5.6 శాతం బి) 2.8 శాతం
సి) 3.8 శాతం డి) 4.5 శాతం
8. మూడో ప్రణాళిక కరువు పరిస్థితులు ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి?
ఎ) 1962-63 బి) 1963-64
సి) 1964-65 డి) 1965-66
9. కింది వాటిలో మూడు వార్షిక ప్రణాళికల కాలం?
ఎ) 1963-66 బి) 1964-67
సి) 1966-69 డి) 1967-70
10. రెండోసారి మూల్యహీనీకరణ ఎప్పుడు జరిగింది?
ఎ) 1965 జూన్ బి) 1966 జూన్
సి) 1969 జూలై డి) 1965 ఆగస్టు
11. మూడు వార్షిక ప్రణాళికల (1966-69) కాలానికి మరొక పేరు?
ఎ) ప్రణాళిక విరామం బి) ప్రణాళిక విశ్రాంతి
సి) పిగ్మీ ప్రణాళిక డి) పైవన్నీ
12. నాలుగో ప్రణాళిక కాలం?
ఎ) 1969-74 బి) 1970-75
సి) 1971-76 డి) 1965-70
13. నాలుగో ప్రణాళిక రూపకర్త ఎవరు?
ఎ) అశోక్ మెహతా బి) డి.ఆర్. గాడ్గిల్
సి) మహలనోబిస్ డి) అశోక్ రుద్ర
14. నాలుగో ప్రణాళిక ఏ రంగానికి అధిక నిధులను కేటాయించింది?
ఎ) వ్యవసాయం, నీటి పారుదల
బి) పరిశ్రమలు, ఖనిజాలు
సి) రవాణా, సమాచారం
డి) సామాజిక సేవలు
15. నాలుగో ప్రణాళిక వైఫల్యం చెందడానికి కారణం?
ఎ) 1971 ఇండో పాక్ యుద్ధం
బి) బంగ్లాదేశ్ కాందిశీకుల భారం
సి) చమురు ధరలు పెరగడం
డి) పైవన్నీ
16. రాజభరణాల రద్దు ఏ ప్రణాళిక కాలంలో జరిగింది?
ఎ) 3 బి) 4 సి) 5 డి) 2
17. 14 వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ ఏ ప్రణాళిక కాలంలో జరిగింది?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
18. గరీబీ హఠావో నినాదం ఎవరిచ్చారు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) ఇందిరాగాంధీ
సి) రాజీవ్‌గాంధీ
డి) మన్మోహన్ సింగ్
19. మూడో ప్రణాళికను ఎన్ని సంవత్సరాల కాలంతో కూడిన దీర్ఘదర్శి ప్రణాళికను రూపొందించారు?
ఎ) 5 బి) 10 సి) 15 డి) 20
20. మూడో ప్రణాళిక సాధించిన వృద్ధి రేటు ఎంత?
ఎ) 5.6 బి) 4.5 సి) 3.5 డి) 2.8
21. మూడోప్రణాళికలో ఏ రంగానికి అధిక వనరులు కేటాయించారు?
ఎ) వ్యవసాయం, నీటిపారుదల
బి) పరిశ్రమలు, ఖనిజాలు
సి) రవాణా, సమాచారం
డి) సామాజిక సేవలు
22. బొకారో ఇనుము ఉక్కు కార్మాగారం ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
23. వాష్ప్లాన్ , సిక్ ప్లాన్ అని ఏప్రణాళికను పేర్కొంటారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 6
24. ఐడీబీఐ, యూటీఐ, ఎఫ్‌సీఐ ఏ ప్రణాళికా కాలంలో ఏర్పాటైనవి?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
25. హరిత విప్లవం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 1965-ఖరీఫ్ బి) 1966 ఖరీఫ్
సి) 1966 రబీ డి) 1965 రబీ
26. నాలుగో ప్రణాళిక నమూనా?
ఎ) అశోక్రుద్ర -అలెన్ మన్నే నమూనా
బి) నాలుగు రంగాల నమూనా
సి) అశోక్ మెహతా పితాంబర్ పంత్ నమూనా
డి) మహలనోబిస్ నమూనా
27. నాలుగో ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఎవరు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) గుల్జారీలాల్ నందా
సి) ఇందిరాగాంధీ
డి) పి.వి. నర్సింహారావు
28. ఆపరేషన్ ఫ్లడ్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
ఎ) 1965 బి) 1966
సి) 1975 డి) 1970
29. జీఐసీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1970 బి) 1971
సి) 1972 డి) 1973
30. డీపీఏడీపీ, ఎస్ఎఫ్డీఏ, ఎంఎఫ్డీఏ మొదలైన పథకాలను ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
31. 14 వాణిజ్య బ్యాంకులను ఏ కమిటీ సూచనల మేరకు జాతీయం చేశారు?
ఎ) మల్హోత్రా కమిటీ
బి) హజారీ కమిటీ
సి) రంగరాజన్ కమిటీ
డి) కాల్దార్ కమిటీ
32. ఎంఆర్టీపీ చట్టం ఎప్పుడు రూపొందించారు?
ఎ) 1965 బి) 1967
సి) 1969 డి) 1961
33. లీడ్‌బ్యాంకు పథకాన్ని సూచించిన కమిటీ ఏది?
ఎ) గాడ్గిల్ కమిటీ బి) నారీమన్ కమిటీ
సి) హజారీ కమిటీ డి) పైవన్నీ
సమాధానాలు
1-బి 2-డి 3-సి 4-డి
5-డి 6-బి 7-ఎ 8-డి
9-సి 10-బి 11-డి 12-ఎ
13-బి 14-ఎ 15-డి 16-బి
17-సి 18-బి 19-సి 20-డి
21-సి 22-బి 23-బి 24-బి
25-బి 26-ఎ 27-సి 28-డి
29-సి 30-సి 31-బి 32-సి
33-బి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు