Indian History | అణచివేతపై ధిక్కార బావుటా
1857 సిపాయిల తిరుగుబాటు
- 1857 సిపాయిల తిరుగుబాటును ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అని అన్నవారు. వి.డి. సావర్కర్
- దీన్ని నాగరికులకు, అనాగరికులకు మధ్య జరిగిన తిరుగుబాటు అని అన్నవారు – హోమ్స్
- సిపాయిల తిరుగుబాటు- మహ్మద్ ఆలీజిన్నా
- ఇది హిందువులు, ముస్లింలు కలిసి కుట్రగా చేసిన తిరుగుబాటు – సర్ జేమ్స్
జాతీయ తిరుగుబాటు అని అన్నవారు – బెంజిమన్ - సిపాయిల తిరుగుబాటుపై సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ రాసిన పుస్తకం-ద కాజేస్ ఆఫ్ ఇండియన్ మ్యూటిని.
సిపాయిల తిరుగుబాటు కారణాలు
ఆర్థిక కారణాలు
- 1848లో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని డల్హౌసీ ప్రవేశపెట్టారు.
- రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే స్వదేశీ రాజు/ రాణి ఎలాంటి సంతానం లేకుండా మరణిస్తే వారు సంపాదించిన ఆస్తి, సంపద మొత్తం బ్రిటిష్ ప్రభుత్వానికే చెందుతుంది.
- దీనివల్ల ఝూన్సీ లక్షీబాయి తన ఆస్తిని, సంపదను పోగొట్టుకొని సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నారు.
సాంఘిక కారణాలు: - 1829లో విలియం బెంటింక్ సతీ సహ గమనాన్ని రద్దు చేశాడు.
- 1856లో డల్హౌసి ‘వితంతు పునర్ వివాహ చట్టాన్ని’ ప్రవేశ పెట్టారు. బాల్య వివాహాలను రద్దు చేశారు.
- ఈ చర్యల వల్ల భారతీయులు ముఖ్యంగా హిందువులు, ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారు.
మత కారణాలు: - సిపాయిలు అంటే చిన్నపాటి సైనికులు. వీరిలో హిందువులు, ముస్లింలు ఉన్నారు.
- మంగళవారం, శుక్రవారం అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కూడా క్షవరం తీయించుకుని ఉద్యోగాలకు రావాలని ఒత్తిడి చేశారు.
- హిందువులను సముద్రయానం చేయమని కించపర్చారు.
- పై కారణాల వల్ల భారతీయులు బ్రిటిష్‌వారిపై తిరుగుబాటు చేశారు.
4) సైనిక కారణాలు: - బ్రిటిష్ సైన్యంలో భారతీయ సైనికుల వంతు 7/8
- సిపాయిల తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ సైన్యం 42,000 కాగా, భారతీయ సైన్యం 2, 32,000
- బ్రిటిష్ సైనికులకు, క్రమం తప్పకుండా జీతాలు పదోన్నతులు ఇచ్చారు.
- భారతీయ సైనికులకు ఎలాంటి జీతాలు, పదోన్నతులు లేవు
తక్షణ కారణాలు - లార్డ్ డల్హౌసి – ఆవు, పంది కొవ్వులతో తయారు చేసిన ఎంఫీల్డ్ రైఫీల్డ్ తుటాలను ప్రవేశ పెట్టారు.
- ఆవును హిందువులు పూజిస్తారు. పందిని ముస్లింలు అసహ్యించుకుంటారు.
- ఈ ‘ఎంఫీల్డ్ రైఫీల్డ్’ ను ఉపయోగించడానికి నిరాకరించి, బారక్‌పూర్‌లోని 34వ రెజిమెంట్‌లోని మంగళ్‌పాండే (1446) 1857 మార్చి 29న బ్రిటిష్ అధికారి అయిన ‘కర్నాల్బాగ్’ను కాల్చి చంపాడు.
- 1857 ఏప్రిల్ 08న మంగళ్‌పాండేను ఉరితీశారు.
- మంగళ్‌పాండేను ఉరి తీయవద్దని అడ్డగించిన ఈశ్వర్ పాండే కూడా ఉరి తీశారు. ఇవి సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణాలుగా నిలిచాయి.
- తిరుగుబాటును ప్రారంభించింది – సిపాయిలు. దీనికి కారణమైన బ్రిటిష్ గవర్నర్ జనరల్ – డల్హౌసి
- సిపాయిల తిరుగుబాటు కాలంలో మనదేశ వైస్రాయ్ లార్డ్ కానింగ్
- సిపాయిల తిరుగుబాటు వీధివీదికి, ఇంటింటికి ఉధృతంగా జరిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ (యూపీ)
- 1857 మే 10న (ఆదివారం) సిపాయిల తిరుగుబాటు మీరట్‌లో ప్రారంభమైంది.
- 1857 మే 11న సిపాయిల తిరుగుబాటు ఢిల్లీలో తీవ్రంగా జరిగింది.
వివిధ ప్రాంతాల్లో
ఢిల్లీ
- ఢిల్లీలో సిపాయిల తిరుగుబాటుకు నామమాత్రంగా IIవ బహుదూర్ షా నాయకత్వం వహించాడు
- ఢిల్లీలో అసలైన నాయకుడు – భక్తిఖాన్
- ఢిల్లీలో సిపాయిలు ఇచ్చిన నినాదం ‘బ్రిటిష్‌వారి పాలనను తరిమివేయండి. మొఘల్ పాలనను పునరుద్ధరించండి.’
- ఢిల్లీలో ఈ తిరుగుబాటును అణిచివేసింది – హడ్సన్
- బహదూర్షా IIను 1862లో రంగూన్జైలులో ఉరి తీసారు.
కాన్పూర్ -యూపీ - కాన్పూర్‌లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది నానాసాహెబ్, తాంతియాతోపె
- నానాసాహెబ్ అసలు పేరు -దొదొపంత్
- ఇక్కడ సిపాయిల తిరుగుబాటును అణిచివేసింది – కాన్బెల్
- నానాసాహెబ్ నేపాల్‌కు, తాంతియాతోపే అడవుల్లోకి పారిపోయారు.
- నమ్మక ద్రోహి మాన్సింగ్ వల్ల తాంతియాతోపెను 1859 ఏప్రిల్ 19న బ్రిటిష్‌వారు ఉరి తీశారు.
ఝాన్సీ - ఝాన్సీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది -ఝాన్సీ లక్ష్మీబాయి. అసలుపేరు మణికర్ణిక. ఇంట్లో వారు పిలిచేది మనుబాయి. భర్త గంగాధర్ రావు, ఈమె దత్తపుత్రుడు – దామోదర్ రావు
- ఝాన్సీలో తిరుగుబాటును అణిచివేసినది హ్యురోజ్
- హ్యురోజ్ – లక్షీబాయికి ఇచ్చిన బిరుదు “మహోన్నతమైన విప్లవ జ్యోతి”
- లక్నో – అవధ్, అయోధ్య, ఆగ్రా నాయకత్వం వహించింది – హజ్రత్ మహల్ బేగం. భర్త – వాజిద్ ఆలీస్ఖాన్. ఈమెను అణిచివేసింది – కాన్బెల్
జగదీష్పూర్-బీహార్ - జగదీష్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది- కున్వర్సింగ్ (80 సంవత్సరాలు)
- బిరుదు- బీహార్ కేసరి,
- బీహార్ భీష్మాచార్య, బీహార్ వృద్ధ సింహం
- తిరుగుబాటును అణిచివేసిన వారు విలియం టేలర్, విలియం అయ్యర్.
- కడపలో తిరుగు బాటుకు నాయకత్వం వహించింది. పీర్‌సాహెబ్ ఖాన్
- కర్నూల్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది- గులాం రసూల్‌ఖాన్
- హైదరాబాద్‌లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది – ముబారిజ్‌ఖాన్
భారతీయుల ఓటమికి కారణాలు
- సరైన నాయకత్వం లేకపోవటం
- ఆధునిక ఆయుధాలు లేకపోవటం
- సిపాయిలు ఒకే కాలంలో అనేక ప్రాంతాల్లో తిరుగుబాటు చేయటం
- బ్రిటిష్‌వారు, భారతీయ సిపాయిలను భయ భ్రాంతులకు గురిచేశారు.
- భారతీయ సైనికులను చంపి ఊరిలో చెట్లకు శవాలను వేలాడదీశారు. భారతీయ సిపాయిలను ప్రాణాలతో పట్టుకొని నోట్లో ఫిరంగులను పెట్టి చంపారు.
సిపాయిల తిరుగుబాటు – ఫలితాలు
- ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు
- బ్రిటిష్‌రాణి / రాజు పాలన ప్రారంభం
- విక్టోరియా మహరాణి ప్రకటన 1858 నవంబర్ 1న వెలువడింది.
- ఈ ప్రకటనను అలహాబాద్‌లో చదివింది లార్డ్‌కానింగ్
- గవర్నర్ల పాలన రద్దు అయింది. వైస్రాయ్‌ల పాలన వచ్చింది.
- రాజ్య సంక్రమణ సిద్ధాంతం రద్దు అయింది.
- స్వదేశీ రాజుల హక్కులను గౌరవించారు.
- విద్య, వైద్య రంగాల్లో భారతీయులకు ఉద్యోగావకాశాలు 3:1 (భారతీయులు 3, ఆంగ్లేయులు 1) నిష్పత్తిలో కల్పించారు.
- భారతీయ ఆచార వ్యవహారాలను గౌరవించారు.
జాతీయోద్యమం
- జాతీయోద్యమం అంటే ఒక జాతి మరొక జాతి నుంచి విముక్తి కోసం చేసిన పోరాటం/ ఉద్యమం.
- ఒక దేశం మరొక దేశం నుంచి స్వాతంత్య్రం కోసం చేసిన ఉద్యమాన్ని స్వాతంత్య్రోద్యమం అంటారు.
కారణాలు: - భారతీయులకు ఎలాంటి స్వేచ్ఛ లేకపోవటం
- భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను దెబ్బతీయటం
- విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు లేకపోవటం
- అధిక పన్నులు వసూలు చేయటం
- భారతీయులు అనేక సంస్థలను స్థాపించడం
ఉదా: 1866లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్‌ను దాదాభాయ్ నౌరోజీ లండన్‌లో స్థాపించారు. - బ్రిటిష్ ఇండియా అసోసియేషన్‌ను దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించారు
- మద్రాస్ నేటివ్ ఆసోసియేషన్ – గాజుల లక్ష్మి నర్సుశెట్టి స్థాపించారు. వీరు నడిపిన పత్రిక – క్రిసెంట్ (1852)
- పూర్ణ సార్వజనిక సభ (1870) – ఎం.జి. రనడే స్థాపించారు.
- ఇండియన్ అసోసియేషన్ – సురేంద్రనాథ్ బెనర్జీ- కలకత్తా (1876)
- మద్రాస్ మహాజన సభ – ఆనందమోహన్ బోస్ (1884)
- బ్రిటిష్ ఇండియా సొసైటీ – విలియం ఆడమ్స్ (1839) లండన్
- దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ – జి. జి. అగార్కర్ (1864) పూనే
- బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్- ఫిరోజ్‌షా మెహతా (1885)
భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ)
- కాంగ్రెస్ అనే పదాన్ని మొదటగా వాడింది – దాదాభాయ్ నౌరోజీ
- 1885 డిసెంబర్ 28న కాంగ్రెస్‌పార్టీని ఏ.ఓ. హ్యూమ్ – బొంబాయిలోని ‘సర్ గోకుల్దాస్ సంస్కృత కళాశాల’లో స్థాపించారు.
- ఐఎన్‌సీ స్థాపించినపుడు మనదేశ వైస్రాయ్/ గవర్నర్ లార్డ్ డఫ్రిన్, కార్యదర్శి- లార్డ్ క్రాసీ
- ఎ.ఓ.హ్యూమ్ బిరుదు -సిమ్లా బుష్ .
- ఇతను దివ్యజ్ఞాన సమాజంలో కూడా సభ్యత్వం తీసుకున్నాడు.
- ‘కాంగ్రెస్ పార్టీ -చరిత్ర’ అనే పుస్తకాన్ని రాసింది- పట్టాభి సీతారామయ్య
- కాంగ్రెస్ తొలి సమావేశం 1885లో ముంబైలో W.C. బెనర్జీ అధ్యక్షతన జరిగింది.
- ఈ సమావేశానికి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
- ఐఎన్‌సీ రెండో సమావేశం 1886లో కలకత్తాలో దాదాభాయ్ నౌరోజీ అధ్యక్షతన జరిగింది.
- ఈ సమావేశానికి హాజరైన సభ్యులు 436 మంది.
- ఈ సమావేశానికి హాజరైన మొదటి గ్రాడ్యుయేట్ – కాదంబరి గంగూళి
- ఐఎన్‌సీ 3వ సమావేశం 1887లో మద్రాస్‌లో బద్రుద్దీన్ త్యాబ్జీ అధ్యక్షతన జరిగింది. ఇతను మొదటి ముస్లిం అధ్యక్షుడు.
- కాంగ్రెస్ అతి, మిత వాదులుగా విడిపోయిన సంవత్సరం -1907, సూరత్ ఐఎన్‌సీ సమావేశం అధ్యక్షుడు – రాస్బిహారీ ఘోష్
- కాంగ్రెస్‌లోని మితవాదులు, అతివాదులు మళ్లీ కలిసిన సంవత్సరం-1916, లక్నో సమావేశం ఎ.సి. మజుందార్ అధ్యక్షతన కలిసారు.
- 1917లో ఐఎన్‌సీ కలకత్తా సమావేశానికి అధ్యక్షురాలైన మొదటి మహిళ – అనిబిసెంట్
- 1920 ఐఎన్‌సీ నాగపూర్ గాంధీ కాంగ్రెస్ అభ్యర్థిగా గుర్తింపు.
- 1924 ఐఎన్‌సీ సమావేశానికి అధ్యక్షత వహించింది-గాంధీ
- 1925 ఐఎన్‌సీ కాన్పూర్ సమావేశానికి అధ్యక్షత వహించింది- సరోజిని నాయుడు
- ఈమె అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ.
- 1929 లాహోర్ నెహ్రూ అన్నింటిలో ముఖ్యమైన సమావేశం.
- 1938 హరిపూర్, 1939 త్రిపుర సమావేశానికి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించారు.
- 1947 ఐఎన్‌సీ సమావేశానికి అధ్యక్షత వహించింది – జె.పి. కృపలానీ
- స్వాతంత్య్రోద్యమాన్ని 3 దశలుగా వర్గీకరించినది – ఆర్.సి. మజుందార్
1. మితవాద దశ – 1885-1905
2. అతివాద దశ – 1905-1919
3. గాంధీయ యుగం – 1919-1947
మితవాద దశ
మితవాద పద్ధతులు 3 రకాలు
1) ప్రార్థన 2) విజ్ఞప్తి 3) నిరసన
మితవాదుల లక్ష్యాలు
1) భాగస్వామ్యం
2) పరిశ్రమల స్థాపన
3) ఉద్యోగాల్లో భారతీయులకు భాగస్వామ్యం
4) ఉప్పుపై పన్ను తగ్గించుట
5) సివిల్ సర్వీసుల్లో భారతీయులకు అవకాశాలు కల్పించుట
6. సివిల్ సర్వీసులను భారత్‌లో కూడా నిర్వహించుట దాదాభాయ్ నౌరోజీ, పారశీక మతస్థుడు
బిరుదులు
- గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా / భారతదేశ కురువృద్ధుడు, డ్రైన్ సిద్ధాంతకర్త, మొదటి ఆర్థిక వేత్త.
- మొదటి బ్రిటిష్ పార్లమెంటేరియన్, లేబర్ పార్టీ, నియోజక వర్గం ప్రిన్స్‌బరీ ఇండియన్ గ్లాడ్ స్టోన్
పత్రికలు : రాష్ర్ట్ గోప్తార్
వాయిస్ ఆఫ్ ఇండియా (ఇంగ్లిష్)
పుస్తకాలు
బ్రిటిష్‌వారి కాలంలో పేదరికం
Poverty and British Rule im India
Plender of Economy
Economic Drain
సంస్థలు: ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 1866
పారశీ రిఫార్మ్స్అసోసియేషన్
కాంగ్రెస్ అనే పదాన్ని మొదటగా వాడారు. - దాదాభాయ్ నౌరోజీ జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు 1886, 1803, 1906లో మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
- శిష్యులు మహమ్మద్ ఆలీ జిన్నా, ఎ.ఓ. హ్యూమ్
ఆంజి
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
Previous article
SVNIT Recruitment | సూరత్ నిట్‌లో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు