Telangana History | సాంఘిక దురాచారాలు … చైతన్య ఉద్యమాలు
ఆడపాప వ్యవస్థ
తెలంగాణలో రాజులు భూస్వాములు, పట్టేదారుల భార్యలకు సేవలు చేయటానికి వచ్చే చెలికత్తెలు, స్త్రీలను కూడా జమీందారులు, రాజులు, భూస్వాములు, పట్టేదార్లు అనుభవించే వ్యవస్థను ఆడపాప వ్యవస్థ అంటారు.
భగేలా
- ఎటువంటి ఫలితం లేకుండా భూస్వాముల వద్ద పనిచేసే వాడు
- భూస్వాముల వద్ద తీసుకున్న అప్పుకు వడ్డీ కోసం పని చేసేవారు. వీరికి ఇచ్చే జీతం వడ్డీకి సరిపోతుంది. ఈ వ్యవస్థను నిజాంలు 1930లో నిషేధించారు.
బేగార్/ వెట్టి - నిజాం రాజ్యంలో ప్రజలు అనేక కులాల వారుగా విభజించి ఉండేవారు. వివిధ కులాల వారు రాజులకు, భూస్వాములకు, దేశ్‌ముఖ్‌లకు పట్టేదారులకు ఆయా కులాలకు చెందిన వారు ఉచితంగా సేవలు చేయాల్సి ఉండేది.
ఉదా: చాకలి- ఉచితంగా బట్టలు ఉతికి, ఇంటిపని చేయటం. గొర్రెలు మేపేవారు ఉచితంగా మాంసం ఇవ్వాలి. ఈ వ్యవస్థను నిజాం -1911లో రద్దు చేశాడు.
పరదా పద్ధతి - నిజాం పాలనాకాలంలో ముస్లిం మహిళలతో పాటు ఉన్నత కులాల్లోని స్త్రీలు కూడా పరదా పద్ధతి పాటించేవారు.
- నిజాం కాలంలో స్త్రీలు మగవారు ఉన్నచోటుకు రావడానికి ఇష్టపడేవారు కాదు ఒకవేళ వస్తే మొహం పైనా గుడ్డను వేసుకొని వచ్చేవారు.
- వేశ్యావృత్తి, బాల్య వివాహాలు, బహుభార్యత్వం, కన్యాశుల్కం వంటి దురాచారాలు కూడా ఉండేవి.
- ఈ పరదా పద్ధతిని మొదట త్యజించిన మహిళ సుగ్రహుమయున్ మీర్జా
- ఈమె రాసిన ఉర్దూ పుస్తకం ‘పర్దా చోడో’ నిజాం కాలంనాటి వివిధ భూములు
- హైదరాబాద్ రాజ్యంలో 5.3 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది.
దివానీ ఖలీఫా భూములు - నిజాం రాజ్యంలోని భూముల్లో 60 శాతం భూములు దివానీ భూములు. ఇవి 2 రకాలు.
ఎ) పట్టాదారు భూములు: ఒక రైతుకు మాత్రమే భూమిపైన యాజమాన్య హక్కులు ఉండేవి.
బి) పోర్ట్ పట్టేదార్ భూములు: ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి భూమిపైన యాజమాన్య హక్కులుండేవి. ఈ భూమిపైన పన్నులను వసూలు చేసే అధికారం కాంట్రాక్టర్లకు ఇచ్చేవారు.
ఇజారా వ్యవస్థ - సాలార్జంగ్-I ఇజారా వ్యవస్థ (పన్నులు లేని భూమి) ను ప్రవేశ పెట్టాడు. ఎందుకంటే అధిక పన్నులు చెల్లించి లేదా గ్రామాలు వదిలి వెళ్లిన రైతులను తిరిగి రప్పించి తక్కువ రేటుకు భూములను లీజ్‌కు ఇచ్చే పద్ధతిని ఇజారా వ్యవస్థ అంటారు.
జాగీరు భూములు - నిజాం రాజులు ఉద్యోగులకు జీతాలను ఇవ్వకుండా భూములు ఇచ్చేవారు. ఈ భూములను జాగీరు భూములు అంటారు.
- ఈ భూములపైన సర్వాధికారాలు ఉద్యోగులకు ఉంటాయి. ఈ భూములకు ఎలాంటి పన్నులు ఉండవు.
సర్ఫేఖాస్ భూములు - నిజాం రాజుల వ్యక్తిగత భూములు. ఈ భూములను నిజాం రాజ్యంలో సర్ఫేఖాస్ భూములు అంటారు. వీటి నుంచి వచ్చే ఆదాయం నిజాంకు మాత్రమే చెందుతుంది. వీటి నుంచి వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానాకు ఎట్టి పరిస్థితుల్లో అందదు.
అగ్రహార బ్రహ్మదేయ భూములు - పురోహితులకు ఇచ్చిన భూములు. వీటిపై పూర్తి అధికారం పురోహితుడికే ఉంటుంది
- వీటి నుంచి వచ్చే మొత్తం ఆదాయం పురోహితుడికి వర్తిస్తుంది.
- దేవాదాయ మాన్యాలు హిందూ దేవాలయాలకు, మతాలకు, ఇతర మత సంస్థలకు ఇచ్చిన భూములు
ఇనాం భూములు - ముస్లిం మత గురువులైన ఖాజీ, ఉలేమా, మౌలాలి వంటి పురోహిత వర్గానికి ఇచ్చిన భూములు. వీటి ఆదాయాన్ని పురోహితులు వ్యక్తిగతంగా అనుభవించవచ్చు.
వక్ఫ్ భూములు - ముస్లిం మత సంస్థలైన మసీదు, మదర్సా, దర్గా, ఖాన్బాబా వంటి సంస్థలకు కేటాయించిన భూములు.
పేస్కర్ భూములు - నిజాం ఆధీనంలో ఉండే భూములపై విధించే పన్నును-పేష్కార్ పన్ను అంటారు. ఈ భూములను పేష్కార్ భూములు అంటారు.
సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, చైతన్య ఉద్యమాలు
- భారత దేశంలో చైతన్య ఉద్యమం 19వ శతాబ్దంలో ప్రారంభమైంది.
- తెలంగాణలో మాత్రం 20వ శతాబ్దం ప్రారంభంలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, చైతన్య ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.
- 20 వశతాబ్దం ఆరంభంలో తెలంగాణలో చైతన్య ఉద్యమాలు ప్రారంభం కావటానికి అనేక కారణాలు ఉన్నాయి. అవి
1) నిజాం రాజ్యంలో ప్రజలకు కనీస హక్కులు, స్వేచ్ఛ ఉండేది కాదు.
2) నిజాం గస్తీనిషాన్-35 ద్వారా సభలు, సమావేశాలు నిషేధించాడు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ప్రభుత్వ విధానాలు విమర్శించడం నేరం. ప్రజలకు వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన హక్కులు కానీ లేవు.
3) నిజాం రాజ్యంలో పత్రికలపైన అంక్షలు ఉండేవి.
4) ప్రభుత్వ విధానాలను విమర్శించిన పత్రిక ‘ది హైదరాబాద్ రికార్డ్’ ఈ పత్రికను 1885-1892 వరకు నిషేధించారు.
5. పయనీర్ పత్రికను రాసిన బారిస్టర్ రుద్ర అనే మేధావిని రాజ్యం నుంచి బహిష్కరించారు. - దాదాపు 40శాతం భూమిని దొరలు, దేశ్ ముఖ్లు, జాగీరుదారుల ఆధీనంలో ఉండేది.
- ఈ దొరలు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, పట్టేదార్లు బేగార్, వెట్టిచాకిరి, జీతగాడు, పడుపు వృత్తి వంటి పద్ధతులతో ప్రజలను హింసించేవారు.
- దాదాపు 90 శాతం ఉన్న హిందువులను వివక్షకు గురిచేశారు.
- తెలంగాణలో అనేక పట్టణాలకు నిజాం రాజులు ముస్లిం పేర్లు పెట్టారు.
ఉదాహరణకు కొన్ని ప్రాంతాల పేర్లు
ఎలగందుల- కరీంనగర్
పాలమూరు- మహబూబ్‌నగర్
నీలగిరి- నల్లగొండ
మెతుకు సీమ – మెదక్
ఎదులాబాద్ – ఆదిలాబాద్
ఇందూరు – నిజామాబాద్
మానుకోట – మహబూబాబాద్
దారశివ- ఉస్మానాబాద్
పోచంచర్ల- హుజూర్ నగర్ - హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు 48 శాతం ప్రజలు తెలుగు మాట్లాడేవారు. మరాఠి -26 శాతం, కన్నడ -12 శాతం, ఉర్దూ-10 శాతం ఉండేవారు .
- అయినా నిజాంలు ఉర్దూను అధికారభాషగా ప్రవేశ పెట్టారు. తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కాపాడటం కోసం ఎంతోమంది మేధావులు ఆంధ్రోద్యమాన్ని ప్రారంభించి ప్రజల్లో చైతన్యం నింపారు.
- హైదరాబాద్‌లో చైతన్య ఉద్యమం రావటానికి మరొక కారణం -నిరక్షరాస్యత.
- 1921లో కొత్త గొప్ప ఆర్థిక జనాభా సూచీని తయారు చేశారు. 1921 గణాంకాల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత -8 శాతం ఉండగా నిజాం రాజ్యంలో కేవలం 4.8 శాతంగా ఉండేది.
- ప్రభుత్వ పాఠశాలతోపాటు ఖాన్గి అని పిలిచే ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా ఆ రోజుల్లో విద్యను అందించేవి.
గ్రంథాలయోద్యమం
- తెలంగాణలో ప్రజా చైతన్యానికి నాంది పలికిన ఉద్యమమే గ్రంథాలయోద్యమం.
- ఊరురా గ్రంథాలయాలను అందుబాటులో ఉంచి ప్రజల్లో విజ్ఞానంతోపాటు చైతన్యాన్ని పెంచడమే గ్రంథాలయోద్యమ ప్రధాన లక్ష్యం.గ్రంథాలయోద్యమ పితామహుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు.
- 20వ శతాబ్దంలో గ్రంథాలయోద్యమాన్ని ప్రారంభించారు.
- ఈయన కృష్ణాజిల్లా పెనుగంచి గ్రామంలో పుట్టి భువనగిరిలో స్థిరపడ్డాడు.మునగాల జమీందారు వద్ద దివాన్‌గా పనిచేశాడు.
- ఐయ్యంకి వెంకట రమణయ్య ఆంధ్ర గ్రంథాలయోద్యమ పితామహుడిగా పిలుస్తారు.
- జాతీయ గ్రంథాలయోద్యమ పితామహుడిగా బరోడా మహరాజు షాజియారావు గైక్వాడ్‌ను పిలుస్తారు.
- ఈ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన మరొక వ్యక్తి కోదాటి నారాయణరావు
- నారాయణ రావు స్వీయచరిత్ర- నారాయణత్రయం.
1. అసఫ్‌జాహీ వంశ స్థాపకుడు?
ఎ) అసఫ్ జా నిజాం-ఉల్-ముల్క్
బి) ఉస్మాన్ అలీఖాన్
సి) సికిందర్ జా డి) పై ఎవరూకాదు
2. మీర్ ఖమ్రుద్దీన్‌ఖాన్ లేదా అసఫ్‌జా నిజాం-ఉల్-ముల్క్కు ‘చిన్కిలిచ్ఖాన్’ అనే బిరుదును ప్రదానం చేసినది?
ఎ) ఔరంగజేబు బి) షాజహాన్
సి) సయ్యద్ డి) మహమ్మద్ షా
3. అసఫ్ జా బిరుదును ప్రదానం చేసినది?
ఎ) మహమ్మద్ షా బి) ఔరంగజేబు
సి) షాజహాన్ డి) ఫరూక్‌షియర్
4. అసఫ్ జా నిజాం-ఉల్-ముల్క్ పాల్గేట్ వద్ద ఎవరి చేతిలో ఓడి ముషిగావ్ సంధికి అంగీకరించాడు
ఎ) శివాజీ బి) సాహు
సి) బాలాజీరావు డి) త్రియంబక్
5. నిజాం ఉల్ ముల్క్ ఏ సంధి ప్రకారం మహారాష్ర్టులకు చౌత్ సర్దేశ్ముఖ్ పన్నులు చెల్లించడానికి ఒప్పుకున్నాడు?
ఎ) ముషిగావ్ సంధి
బి) వార్నా సంధి
సి) దురారీ సరాయి సంధి
డి) ఏదీకాదు
6. నిజాం ఉద్దౌలా బిరుదు పొందినది?
ఎ) నాజర్‌జంగ్ బి) ముజఫర్ జంగ్
సి) హిమ్మత్ఖాన్ డి) ఘాజీ ఉద్దీన్
7. ఫ్రెంచి గవర్నర్ డూప్లే సహాయంతో దక్కన్ సుబేదారు అయినది?
ఎ) నాజర్‌జంగ్ బి) ముజఫర్ జంగ్
సి) హిమ్మత్ఖాన్ డి) ఘాజీ ఉద్దీన్
8. ఆంగ్లేయులతో సంధి చేసుకొని గుంటూరు తప్ప ఉత్తర సర్కారులన్నింటినీ ఆంగ్లేయుల పరం చేసినది?
ఎ) నాజర్‌జంగ్ బి) సలాబత్ జంగ్
సి) హిమ్మత్ఖాన్ డి) పై ఎవరూకాదు
9. రెండో అసఫ్‌జా బిరుదుతో నిజాం అయిన వారు?
ఎ) నిజాం అలీఖాన్ బి) సికిందర్ జా
సి) నాజర్‌జంగ్ డి) హిమ్మత్ఖాన్
10. ఎవరి కాలం నుంచి అసఫ్‌జాహీ ప్రభువులు నిజాం ప్రభువులుగా ప్రసిద్ధి చెందారు?
ఎ) నిజాం అలీఖాన్ బి) నాజర్ జంగ్
సి) సలాబత్సంగ్ డి) సికిందర్ జా
11. ఫ్రెంచి సేనాని రేమండ్ సాయంతో తుపాకుల కర్మాగారాలు నెలకొల్పినది ఎవరు?
ఎ) సికిందర్ జా బి) నిజాం అలీఖాన్
సి) ముజఫర్ జంగ్ డి) నాజర్ జంగ్
12. వెల్లస్లీ ప్రవేశ పెట్టిన సైన్య సహకార పద్ధతికి అంగీకరించినది?
ఎ) సికిందర్ జా బి) నిజాం అలీఖాన్
డి) నాజర్ జంగ్ సి) ముజఫర్ జంగ్
13. నిజాం అలీఖాన్ నిర్మించినవి?
ఎ) మోతీ మహల్
బి) గుల్షన్ మహల్
సి) రోషన్ బంగ్లా డి) పైవన్నీ
14. ఎవరి పేరుతో సికిందరాబాద్ నిర్మాణం జరిగింది?
ఎ) ఉస్మాన్ అలీఖాన్
బి) నిజాం ఉల్ ముల్క్
సి) నిజాం అలీఖాన్
డి) సికిందర్ జా
15. రస్సెల్ దళం( హైదరాబాద్ సైన్యం) ఎవరి కాలంలో ఏర్పాటు చేశారు?
ఎ) ఉస్మాన్ అలీఖాన్
బి) నిజాం ఉల్ ముల్క్
సి) నిజాం అలీఖాన్ డి) సికిందర్ జా
16. నిజాం ప్రభుత్వం ఎవరి వద్ద నుంచి నెలకు రెండు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నది?
ఎ) పామర్ అండ్ కో కంపెనీ
బి) జాన్ ఆడమ్
సి) చందులాల్ డి) మార్టిన్ కంపెనీ
17. వహాబీ ఉద్యమం ఎవరి కాలంలో జరిగినవి?
ఎ) ఉస్మాన్ అలీఖాన్
బి) నిజాం అలీఖాన్
సి) సికిందర్ జా
డి) నాసిరుద్దౌలా
18. వహాబీ ఉద్యమం ఎవరికి వ్యతిరేకంగా ప్రారంభమైంది?
ఎ) సిక్కులు యూరోపియన్లు
బి) అరబ్బులు, సిక్కులు, ముస్లింలు
సి) యూరోపియన్లు, గ్రీకులు
డి) హిందువులు, బౌద్ధులు, జైనులు
సమాధానాలు
1-ఎ 2-ఎ 3-ఎ 4-బి
5-ఎ 6-ఎ 7-బి 8-బి
9-ఎ 10-ఎ 11-బి 12-బి
13-డి 14-డి 15-డి 16-ఎ
17-డి 18-ఎ
ఆంజి, ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు