Telangana History | ఆధునిక కాలం.. సంస్కరణలకు మూలం
తెలంగాణలో భూ సంస్కరణలు
- ప్రధాన న్యాయాన్ని సాధించడం భూ సంస్కరణల సామాజిక లక్ష్యం. ప్రపంచంలో మొదట గ్రీస్ దేశంలో భూ సంస్కరణలు అమలు చేశారు. ఆధునిక కాలంలో మొదటగా రష్యా దేశం 1920వ దశకంలో భూ సంస్కరణలను అమలు చేసింది. కాగా భారతదేశంలో స్వాతంత్య్రం తర్వాత భూ సంస్కరణలు అమల్లోకి వచ్చాయి.
- భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో భూ సంస్కరణలు అనే అంశం పొందుపరచబడింది. దేశంలో మొదటిసారి కేరళ రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు చేశారు.
- దేశంలో విజయవంతంగా భూ సంస్కరణలు చేపట్టిన రాష్ర్టాలు- పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్
- అధిక లోపాలు గల భూ సంస్కరణల చట్టాలు చేసిన రాష్ర్టాలు- బీహార్, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్
భూ సంస్కరణలు-రాజ్యాంగ సవరణలు - 1వ రాజ్యాంగ సవరణ : 1951
- 17వ రాజ్యాంగ సవరణ: 1964
- 28వ రాజ్యాంగ సవరణ: 1971
- 47వ రాజ్యాంగ సవరణ: 1984
- 66వ రాజ్యాంగ సవరణ: 1990
- 78వ రాజ్యాంగ సవరణ: 1995
జమీందారీ విధానం
- ఈ విధానం ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్- లార్డ్ కారన్వాలీస్. రూపకర్త- జాన్ షోర్. ఈ విధానాన్ని 1793 సంవత్సరంలో అమలు పరిచారు. మొదటగా బెంగాల్లో ప్రవేశపెట్టారు. ఈ విధానంలో రైతుకు, ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఉండదు.
- ఈ విధానంలో శిస్తు 20 నుంచి 40 సంవత్సరాల వరకు మారకుండా ఉండేది. భూమి శిస్తు వసూలు చేసే హక్కును వేలంపాట ద్వారా పొందినవారే జమీందారుగా గుర్తించబడేవారు. ఈ విధానం బెంగాల్, వారణాసి, ఉత్తర కర్ణాటక (కూర్గ్) మద్రాస్లలో అమల్లో ఉండేది.
రైత్వారీ విధానం
- ఈ విధాన రూపకర్తలు రీడ్, మన్రో. రైతులు నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తారు. శిస్తు అధికంగా ఉండేది. బొంబాయి, అసోం, మద్రాస్ ప్రాంతాల్లో ఈ విధానం అమల్లో ఉండేది.
- 1796లో తమిళనాడులోని బారామల్ జిల్లాలో మొదటిసారిగా అమలు చేశారు. తెలంగాణలో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. 1820 సంవత్సరంలో మార్క్స్వెస్ట్ ఆఫ్ హేస్టింగ్స్ కాలంలో ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు చేశారు.
మహల్వారీ విధానం - దీన్ని అమలు పరిచిన గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్. 1833 సంవత్సరంలో అమలు చేశారు. ఈ విధానంలో భూమికి సంబంధించిన హక్కులు గ్రామం ఆధీనంలో ఉంటాయి. పంజాబ్, మధ్య భారతదేశం, ఆగ్రా ప్రాంతాల్లో ఈ విధానం అమలు చేశారు.
- దేశంలో స్వాతంత్య్రం నాటికి వివిధ భూమి శిస్తు విధానాల కింద సేద్యం చేసిన భూమి శాతం.
1. జమీందారీ విధానం : 19 శాతం
2. రైత్వారీ విధానం : 52 శాతం
3. మహల్వారీ విధానం : 29 శాతం
తెలంగాణ ప్రాంతం ఇనాముల రద్దు చట్టం-1955 - హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ సూచనల మేరకు హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం 1955లో ఇనాం భూములను రద్దు చేస్తూ బిల్లును రూపొందించింది.
- మత సంబంధమైన ఇనాంలు, సేవల నిమిత్తం ఇచ్చిన ఇనాంలను మినహాయించి మిగతా ఇనాంలు అన్నీ రద్దవుతాయని ఈ చట్టం స్పష్టం చేసింది.
- ఈ చట్టం కౌలుదార్లకు యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ రక్షణ ఇచ్చింది.
- ఇనాందారు కుటుంబం కమతంగా నిర్ధారించిన భూమికి 4 1/2 రెట్ల భూమిని ఇనాందారు దగ్గర ఉంచి, మిగతా భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు.
- చట్టం నిర్ధారించిన భూమి కంటే ఇనాందారు వద్ద ఎక్కువ భూమి ఉండి, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు అతనికి నష్టపరిహారం చెల్లించాలి.
- ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తుకు, అప్పటివరకు ఇనాందారు చెల్లిస్తున్న బాటకానికి మధ్య గల తేడాకు 25 రెట్లు పరిహారంగా నిర్ణయించడం జరిగింది.
- కౌలుదార్ల విషయంలోనూ కుటుంబ కమతానికి 4 1/2 రెట్ల భూమి కౌలుదారు సాగు చేసుకోవచ్చు.
- కౌలుదారు కుటుంబ కమతం నిర్ధారించేటప్పుడు అతనికి గల సొంత భూమిని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- శాశ్వత, రక్షిత, అరక్షిత కౌలుదార్లకు కూడా ఈ చట్టం ద్వారా నష్ట పరిహారం చెల్లించారు. ఈ చట్టం 1967 వరకు అమలైంది.
- 1970 మార్చిలో హైకోర్టు ఈ చట్టాన్ని కొట్టివేస్తూ ఇనాంలు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
గమనిక: 1985లో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలు అనుసరించి ఇనాందార్లకు రూ.15.2 కోట్ల నష్ట పరిహారం చెల్లించి ఇనాం భూములను స్వాధీనపరచుకుంది. ఇనాం భూములు పొందిన రైతులకు స్పష్టమైన హక్కులు సంక్రమించలేదు. ఇనాం భూములు సాగు చేస్తున్న లబ్ధిదారులకు చట్టపరమైన హక్కులు లేకపోవడం వల్ల ఇది వ్యవసాయరంగ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడింది. - ఈ అంశాలను పరిశీలించిన కోనేరు రంగారావు కమిటీ 1973 వరకు ఇనాం భూమి స్వాధీనంలో ఉన్నవారి వివరాలు, సంబంధిత భూమి రికార్డుల పరిశీలన చేసి లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని కమిటీ తెలిపింది. అయినా అవి ఆశించిన స్థాయిలో అమలు కాలేదు.
తెలంగాణలో కౌలు సంస్కరణలు - వ్యవసాయమే జీవన వృత్తి గల వ్యవసాయదారులు భూములపై యాజమాన్యపు హక్కులను, అనుభవపు హక్కులను కోల్పోయి కౌలుదారులుగా మారిపోయారు.
- కౌలు పరిమాణం అధికంగా ఉండేది. కౌలు భద్రత లేదు.
- కౌలుదారులు ప్రతి సంవత్సరం కౌలును పునరుద్ధరించుకోవాలన్నా (లేదా) కొత్తగా భూమిని కౌలుకు పొందాలన్నా భూ యజమానులకు కానుకలను సమర్పించుకోవాలి.
- కౌలుదారులు ఎలాంటి వేతనాలు తీసుకోకుండా సేవలు చేయాలి. తెలంగాణలో
3 రకాల కౌలు విధానాలుండేవి. అవి:
1. గల్లా మక్తా 2. బెతాయి
3. సర్ఫేఖాస్
1. గల్లా మక్తా: పండిన పంటతో సంబంధం లేకుండా నిర్ధిష్ట పరిమాణంలో (లేదా) స్థిరమైన కౌలు చెల్లించడం. ఉదా: ఎకరానికి ఐదు బస్తాలు (లేదా) ఆరు బస్తాలు.
2. బెతాయి: ఈ విధానంలో పండిన పంట ఆధారంగా కౌలును నిర్ణయిస్తారు. పండిన పంటలో నిర్ధిష్ట భాగం 1/4 (లేదా) 1/5 వంతు కౌలుగా చెల్లించడం.
3. సర్ఫేఖాస్: ఈ విధానంలో కౌలును నగదు రూపంలో చెల్లించేవారు. ఒక ఎకరానికి రూ.20 (లేదా)
25 చెల్లించేవారు. - హైదరాబాద్ రాష్ట్రంలో కౌలు విధానాలను సంస్కరించాలని నిర్ణయించి 1907లో తీసుకొచ్చిన మొదటి చట్టం- మల్ ఘజరీ ల్యాండ్ రెవెన్యూ చట్టం.
గమనిక: ఇది మొదటి భూ సంస్కరణ చట్టం - ఈ చట్టం ప్రకారం కౌలుదార్లకు కౌలు భద్రతను కల్పించారు. కౌలుదార్ల స్థితిగతులను పరిశీలించడానికి 1939 సంవత్సరంలో నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ- ఎంఎస్ భరూచా కమిటీ. దీని ప్రకారం కౌలుదార్లను 2 రకాలుగా విభజించారు.
1. షక్మీదార్ 2. ఆసామి షక్మీదార్
1. షక్మీదార్: షక్మీదార్ అంటే జిరాయితీ హక్కుదారులు (లేదా) రక్షిత కౌలుదారులు అని అర్థం.
12 సంవత్సరాల పాటు కౌలు చేసిన కౌలుదారులను షక్మీదారులుగా గుర్తించారు. ఈ కౌలుదారులు భూ యజమానికి కౌలు చెల్లిస్తున్నంత కాలం కౌలు నుంచి తొలగించరు.
2. ఆసామీ షక్మీదార్: జిరాయితీ హక్కులు లేనివారు. అరక్షిత కౌలుదారులు/తాత్కాలిక కౌలుదారులు. ఈ కౌలుదారులు 12 సంవత్సరాల కంటే తక్కువ కాలం సాగు చేస్తున్న కౌలుదారులు. ఈ కౌలుదారులను భూస్వామి కౌలు నుంచి ఎప్పుడైనా తొలగించవచ్చు.
గమనిక: ఎంఎస్ భరూచా కమిటీ సిఫారసుల మేరకు 1944లో ఆసామీ షక్మీ చట్టాన్ని ప్రకటించారు.
ఆసామీ షక్మీ చట్టం
- ఈ చట్టం ప్రకారం ఆరు సంవత్సరాలు వరుసగా కౌలు చేసిన వారిని షక్మీదారు అని, ఆరు సంవత్సరాల కంటే తక్కువ కాలం కౌలు చేసిన కౌలుదారులను ఆసామీ షక్మీదారులుగా గుర్తించారు.
- దీని ప్రకారం ఆరు సంవత్సరాలు వరుసగా కౌలు చేసిన ఆసామీ షక్మీదారుడిని తొలగించే హక్కు భూస్వామికి ఉండదు.
- హైదరాబాద్లోని వ్యవసాయ సంస్కరణల కమిటీ ఇచ్చిన సూచనల మేరకు 1950, జూన్లో హైదరాబాద్ కౌలు చట్టం అమల్లోకి వచ్చింది.
- ఈ చట్టానికి సవరణలు చేస్తూ 1952లో హైదరాబాద్ తొలగింపుల నిలుపుదల ఆర్డినెన్స్ తీసుకొచ్చారు.
హైదరాబాద్ కౌలు చట్టం-1950
- హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ సిఫారసుల మేరకు 1950లో కౌలుదారులకు భద్రత కల్పించడానికి ఈ చట్టాన్ని ప్రకటించారు.
- మత సంబంధమైన, చారిటబుల్ ట్రస్ట్ ఇనాం భూములకు తప్ప మిగతా అన్ని భూములకు ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం కౌలు ఒప్పందం తప్పనిసరిగా లిఖితపూర్వకంగా ఉండాలి.
- 1933 నుంచి 1943 మధ్య కాలంలో వరుసగా ఆరు సంవత్సరాలు (లేదా) 1948 నుంచి ఆరు సంవత్సరాలు కౌలుదారులుగా ఉన్నవారిని రక్షిత కౌలుదారులుగా గుర్తించారు. వీరిని తొలగించడానికి వీలు లేదు.
- ఆరు సంవత్సరాల కంటే తక్కువ కాలం కౌలు చేసిన వారిని అరక్షిత కౌలుదారులుగా గుర్తించారు. వారిని ఎప్పుడైనా తొలగించవచ్చు.
- కౌలు పరిమాణానికి సంబంధించి భూమి యజమానికి, కౌలుదారుకు మధ్య అంగీకారం లేనట్లయితే ఎవరైనా న్యాయ స్థానాన్ని ఆశ్రయించవచ్చు.
- కౌలుదారు కౌలు భూమిని ఉప కౌలుకు ఇచ్చినా మొత్తంగా ఇతరులకు కౌలు ఇచ్చినా కౌలు ఒప్పందం రద్దవుతుంది.
- భూ యజమాని సొంతంగా సేద్యం చేయాలనుకున్న, కౌలుదారు భూమిని అన్యాక్రాంతం చేశాడని భావించినా న్యాయస్థానం నుంచి నెల ముందు నోటీసును జారీ చేసి కౌలు నుంచి తొలగించవచ్చు.
- కౌలుదారు కౌలు భూమిని ఏ సహకార సంఘంలో అయినా తనఖా పెట్టి రుణం పొందవచ్చు. ఈ చట్టంలోని లోపాలను ఆధారంగా చేసుకొని రక్షిత కౌలుదారులను బలవంతంగా కౌలు నుంచి తొలగించారు.
- తెలంగాణ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కౌలుదార్లను కౌలు నుంచి తొలగించారు. దీన్ని గమనించిన హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం 1952లో Hyderabad Prevention of Aviction Ordinance ( హైదరాబాద్ తొలగింపుల నిలుపుదల)ను ప్రకటించింది.
- దీన్నే హైదరాబాద్ కౌలు, వ్యవసాయ భూముల సవరణ బిల్లు 1953గా తీసుకొచ్చారు.
భూకమతాల గరిష్ఠ పరిమితి చట్టం
- కౌలుదారుల రక్షణ చట్టాల వైఫల్యం, భూస్వాముల వద్ద వేలాది ఎకరాల భూమిని, భూమిలేని వారికి ఇవ్వాలంటే గరిష్ఠ పరిమితి చట్టాలు తీసుకురాక తప్పలేదు.
- 1966లో ప్రణాళిక సంఘం, జాతీయ అభివృద్ధి మండళ్ల ఆధ్వర్యంలో భూ సంస్కరణల అమలు తీరు అధ్యయనానికి కమిటీ వేశారు.
- ఈ కమిటీ 1963 నాటికి 8.6 లక్షల ఎకరాలు సాగు చేస్తున్న 1.35 లక్షల మంది కౌలుదార్లకు ఎలాంటి రక్షణ లేదని, వేలాది ఎకరాలు భూస్వాముల చేతుల్లో ఉన్నాయని తెలిపింది.
- గత చట్టాలు ఇచ్చిన రక్షణలు కౌలుదార్లకు సక్రమంగా చేరలేదని 55 శాతం కౌలుదార్లకు రక్షణ కల్పించాలని అభిప్రాయపడింది.
- హైదరాబాద్ రాష్ట్రంలో కౌలు వ్యవసాయ ఖర్చులు (50 శాతం) తీసివేయగా రూ.800 నికర ఆదాయం ఇచ్చే కమతం కుటుంబ కమతం.
- 1958లో ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ భూములపై పరిమితి విధించడానికి రాష్ట్ర అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు.
భూ గరిష్ఠ పరిమితి చట్టం- 1961 - 1961, జూన్ 1న ఈ బిల్లు చట్టంగా రూపొందింది.
ముఖ్యాంశాలు - ఈ చట్టం ప్రకారం కుటుంబానికి ప్రాంతం, పంట, సాగునీటి వసతిని బట్టి కుటుంబ కమతం నిర్ణయించాయి. కుటుంబ కమతం అంటే కుటుంబానికి సంవత్సరం పొడవు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కనీస అవసరాలకు కావాల్సిన ఆదాయాన్ని ఆర్జించడానికి గల భూ విస్తీర్ణం.
- భూమి శిస్తు పంట ఆధారంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమికి కొంత నష్టపరిహారం చెల్లించాలి.
- ఒక వ్యక్తికి సంవత్సరానికి నికర ఆదాయం రూ.3,600 ఇచ్చే భూమిని గరిష్ఠ పరిమితిగా నిర్ణయించారు.
- ఈ చట్టం ప్రకారం మాగాణి భూమిని 5 రకాలు (A, B, C, D, E)గా మెట్ట భూమిని మూడు రకాలు (F, G, H) గా వర్గీకరించారు. ఈ చట్టం ప్రకారం భూమి గరిష్ట పరిమితి, కనిష్ఠ పరిమితికి నాలుగున్నర రెట్లుగా నిర్ణయించారు.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 9959361278
Previous article
ENGLISH GRAMMER | Cardinal numbers upto twelve should be written in?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు