Telangana Geography | పీఠభూమి ప్రాంతం.. స్ఫటికాలతో నిర్మితం
పరిచయం
- పూర్వం తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. ఆ సమయంలో తెలంగాణ 8 జిల్లాలు కలిగి ఉంది. హైదరాబాద్ సంస్థానంపై 1948 సెప్టెంబర్ 17న పోలీసు చర్య ఫలితంగా భారతదేశంలో విలీనమైంది.
- 1948 చివరివరకు జె.ఎన్.చౌదరి హైదరాబాద్ రాష్ర్టానికి మిలిటరీ గవర్నర్‌గా కొనసాగారు. 1950 జనవరి నుంచి 1952 సాధారణ ఎన్నికల వరకు ఎం.కె. వెల్లోడి ముఖ్యమంత్రిగా పౌర ప్రభుత్వం ఏర్పడింది. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది.
- 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. 1953 అక్టోబర్ 1న దేశంలోని రాష్ర్టాలను పునర్విభజించడానికి నెహ్రూ ప్రభుత్వం రాష్ర్టాల పునర్విభజన సంఘాన్ని ప్రకటించింది. ఈ సంఘానికి సయ్యద్ ఫజల్ అలీని అధ్యక్షుడిగా నియమించింది. ఈ సంఘం ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ర్టాన్ని విలీనం చేయడం వల్ల కలిగే లాభనష్టాలను వివరిస్తూ తన నివేదికను 1955 సెప్టెంబర్ 30న సమర్పించింది.
- విశాలాంధ్ర ఏర్పాటుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొదటి నుంచి ఆశాభావంతో ఉండగా, హైదరాబాద్ రాష్ట్ర తెలుగు ప్రజలు (తెలంగాణ ప్రాంతం వారు) ఆందోళన చెందారు. 1956 ఫిబ్రవరి 20న ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య అభిప్రాయ భేదాలు తొలగించడానికి రెండు ప్రాంతాల నాయకులను ఢిల్లీలో సమావేశపరిచారు. దీన్నే పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. ఈ ఒప్పందంలో తెలంగాణ ప్రాంతానికి కొన్ని రక్షణలు కల్పించారు. దీని ఫలితంగా 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం కలిపి ఆంధ్రప్రదేశ్ అవతరించింది. రాజధానిగా హైదరాబాద్‌ను నిర్ణయించారు. హైకోర్టు కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు.
- ఆంధ్ర రాష్ట్రంలోని 11 జిల్లాలు, తెలంగాణ ప్రాంతంలోని 9 జిల్లాలు కలిపి 20 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం హైదరాబాద్, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలు ఉన్నాయి.
- ఎంతో మంది మేధావులు కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, సకల జనుల మనోభావాల ఆకాంక్షతో పాటు విద్యార్థుల బలిదానాలు, అన్ని పార్టీలు కలిసి తెలంగాణ కోసం పోరాటం సాగించడంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వక తప్పలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ప్రాంతాలు.. - ఖమ్మం జిల్లాకు చెందిన 5 మండలాలను పూర్తిగా, 2 మండలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలపడం జరిగింది. వేలేరుపాడు, కుకునూరు, కూనవరం, వీఆర్ పురం, చింతూరు మండలాలను పూర్తిగా కలిపారు. భద్రాచలం, బూర్గంపహాడ్ మండలాలను పాక్షికంగా కలిపారు.
అక్షాంశ, రేఖాంశాలు:
అక్షాంశాలు 150.50’10”-190.55’4”
రేఖాంశాలు 770.14’8”-810.19’16”
జిల్లాలు 33
రెవెన్యూ డివిజన్లు 74
రెవెన్యూ మండలాలు 612
జిల్లా పరిషత్‌లు 32
పట్టణ స్థానిక సంస్థలు 142
మున్సిపల్ కార్పొరేషన్లు 13
మున్సిపాలిటీలు 129
నగర పంచాయతీలు 13
గ్రామ పంచాయతీలు 12,769
రెవెన్యూ గ్రామాలు 10,909
నివాస గ్రామాలు 9,834
ఆవాసం లేని గ్రామాలు 600
కంటోన్మెంట్ బోర్డు 1 - తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం: 1,12,077 చ.కి.మీ. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం 3.41. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ స్థానం 11గా ఉంది.
- రాష్ట్రంలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లాలు
1. నల్లగొండ 7222 చ.కి.మీ.
2. భద్రాద్రి కొత్తగూడెం 7015 చ.కి.మీ.
3. నాగర్‌కర్నూల్ 6395 చ.కి.మీ. - విస్తీర్ణం రీత్యా అతి చిన్న జిల్లాలు
- 1. హైదరాబాద్ 217 చ.కి.మీ.
- 2. మేడ్చల్ మల్కాజిగిరి 1084 చ.కి.మీ.
- 3. హనుమకొండ 1653 చ.కి.మీ.
జనాభా-2011 లెక్కల ప్రకారం..
- తెలంగాణ జనాభా – 3,50,03,674
దేశ జనాభాలో తెలంగాణ శాతం – 2.89
దేశ జనాభాలో తెలంగాణ స్థానం – 12
పురుష జనాభా- 1.76 కోట్లు
స్త్రీల జనాభా- 1.74 కోట్లు
పట్టణ జనాభా- 1.36 కోట్లు
జనసాంద్రత - తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత 312గా ఉంది. హైదరాబాద్‌లో అత్యధికంగా 18,161 చ.కి.మీ. జనసాంద్రత ఉంది. తక్కువగా ములుగులో 71 చ.కి.మీ ఉంది. స్త్రీ-పురుష నిష్పత్తి 988:1000 ఉంది. స్త్రీ-పురుష నిష్పత్తి నిర్మల్ (1046), నిజామాబాద్ (1044)లలో ఎక్కువగా ఉండగా రంగారెడ్డి (950), హైదరాబాద్ (954) జిల్లాల్లో తక్కువగా ఉంది.
తెలంగాణలోని జిల్లాలు
- తెలంగాణలో పాత జిల్లాలు 10. తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం పరిణామ క్రమంలో పది జిల్లాలను ప్రస్తుతం 33 జిల్లాలుగా విభజించారు.
- 2016 అక్టోబర్ 11న ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు : 21
- మొత్తం జిల్లాల సంఖ్య 21+10= 31 జిల్లాలు అమల్లోకి తెచ్చారు. 2019 ఫిబ్రవరి 17న మహబూబ్‌నగర్ జిల్లా నుంచి నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు అయ్యాయి. హైదరాబాద్ ఏ మార్పునకు గురికాలేదు.
మున్సిపల్ కార్పొరేషన్లు – 13
1. ఖమ్మం 2. బడంగ్పేట్
3. బండ్లగూడ-జాగీర్
4. హైదరాబాద్
5. మీర్పేట్-జిల్లెలగూడ 6. కరీంనగర్
7. రామగుండం 8. నిజామాబాద్
9. వరంగల్ 10. బోడుప్పల్
11. పిర్జాదీగూడ 12. నిజాంపేట
13. జవహర్‌నగర్
భౌగోళిక అంశాలు - Geography భౌగోళిక శాస్త్రం అనే పదం గ్రీకు భాష నుంచి పుట్టింది. గ్రీకు భాషలో Geo అంటే భూమి, graphy అంటే వర్ణన. భూస్వరూపాలు, శీతోష్ణస్థితి, ఉద్భిజ సంపద, జంతు జాలాల విస్తరణల అధ్యయనమే జాగ్రఫీ.
- తెలంగాణ ఉనికి రీత్యా ఉత్తరార్ధ గోళంలో ఉంది. తెలంగాణ ఉనికిరీత్యా దక్షిణాసియా ప్రాంతంలో ఉంది. పీఠభూమి పరంగా చూస్తే దక్కన్ పీఠభూమిలో ఉంది.
రాష్ట్రం – చిహ్నాలు - రాష్ట్ర జంతువు మచ్చల జింక. దీని శాస్త్రీయనామం ఏక్సిస్ ఏక్సిస్.
- రాష్ట్ర వృక్షం జమ్మి. దీని శాస్త్రీయనామం ప్రొసోఫిస్ సినరేరియా.
- రాష్ట్ర పుష్పం తంగేడు. దీని శాస్త్రీయనామం కేసియా అరిక్యులేటా.
- రాష్ట్ర పక్షి పాలపిట్ట. శాస్త్రీయనామం కొరాషియస్ బెంగాలెన్సిస్.
- వీటిని ముఖ్యమంత్రి కేసీఆర్ 2014, నవంబర్ 18న ప్రకటించారు.
- రాష్ట్ర చిహ్నం: కాకతీయ కళాతోరణం, చార్మినార్. దీన్ని రూపొందించిన చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ (నల్లగొండ)
- రాష్ట్ర పండగలు: బతుకమ్మ, బోనాలు
- రాష్ట్ర అధికారిక మాస పత్రిక: తెలంగాణ
- రాష్ట్ర అధికారిక వార్తా చానల్: యాదగిరి
- రాష్ట్ర చేప: కొరమీను.
- రాష్ట్ర ఫలం: సీతాఫలం, శాస్త్రీయనామం అనోనా స్కామోసా
- రాష్ట్ర క్రీడ: కబడ్డీ
- రాష్ట్రం – సరిహద్దులు
- ఉత్తరం, వాయవ్యం: మహారాష్ట్ర
- ఈశాన్యం: ఛత్తీస్‌గఢ్
- పశ్చిమం: కర్ణాటక
- దక్షిణం, తూర్పు: ఆంధ్రప్రదేశ్
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీలేరు బేసిన్ పరిధిలో ఉన్న ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల తెలంగాణ ఒడిశాతో సరిహద్దును కోల్పోయింది.
- భూపరివేష్టిత రాష్ట్రం అంటే ఇతర దేశాలతో ఎలాంటి భూసరిహద్దులుగాని, జల సరిహద్దులు గాని లేనటువంటి రాష్ట్రం.
- ఇతర రాష్ట్ర సరిహద్దులు లేని జిల్లాలు/భూ పరివేష్టిత జిల్లాలు: రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, జనగామ, మెదక్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల
తెలంగాణ నైసర్గిక స్వరూపాలు
- తెలంగాణ ప్రాంత నిర్మాణం, స్వరూపాన్ని బట్టి రాష్ర్టాన్ని 3 ప్రాంతాలుగా విభజించవచ్చు.
1. తెలంగాణ పీఠభూమి
2. గోదావరి బేసిన్ ప్రాంతం
3. కృష్ణా పర్వత పాద ప్రాంతం
తెలంగాణ పీఠభూమి - తెలంగాణలో అతిపెద్ద భౌగోళిక ప్రాంతం దీని వాలు తూర్పు దిశగా ఉన్నది. ఈ పీఠభూమి సుమారుగా 59,903 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది. ఈ ప్రాంతం ఆర్కియన్ శిలలైన నీస్, హార్న్బ్లెండ్, బయోటిస్ వంటి స్ఫటికాలతో నిర్మితమై ఉంది. ఈ ప్రాంతం సగటున సముద్రమట్టానికి 500 మీ. నుంచి 600 మీ. ఎత్తులో ఉంటుంది.
- హైదరాబాద్ పీఠభూమి మధ్య ప్రాంతంలో ఉండి సుమారుగా 500 మీటర్ల ఎత్తులో కలదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ గ్రానైట్ శిలలు గోళాభి శైథిల్యం చెంది గుమ్మటాలుగా టార్స్, బోల్డర్స్ మొదలైన ఆకారంలో కొండలు కనిపిస్తాయి.
- తెలంగాణ పీఠభూమి ఉత్తర, వాయవ్య దిశల్లో పశ్చిమ కనుమలు (లేదా) సహ్యాద్రి పర్వతాలు అజంతా శ్రేణి నుంచి విడిపోయి ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, నిజామాబాద్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ జిల్లాల్లో పశ్చిమ కనుమల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.
1. ఆదిలాబాద్- నిర్మల్ గుట్టలు, సాత్నాల కొండలు
2. నిర్మల్- నిర్మల్ గుట్టలు (నిర్మల్ గుట్టలు అత్యంత వెడల్పైన కొండలు. ఇందులో పశ్చిమ కనుమలలోనే అత్యంత ఎత్తయిన శిఖరమైన మహబూబాఘాట్ ఉంది)
3. రాజన్న సిరిసిల్ల- రాఖీ గుట్టలు
4. జగిత్యాల- జగిత్యాల కొండలు, రాఖీ గుట్టలు
5. పెద్దపల్లి- రామగిరి కొండలు
6. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం- కందికల్/కంగల్ కొండలు
7. నిజామాబాద్, కామారెడ్డి-సిర్నపల్లి గుట్టలు
8. కామారెడ్డి- రాతి కొండలు
9. కుమ్రంభీం ఆసిఫాబాద్-సిర్పూర్ కొండలు, కెరమెరీ ఘాట్స్
10. జయశంకర్ భూపాలపల్లి- పాండవ గుట్టలు - తెలంగాణలో ఎత్తయిన ప్రాంతం ధోలిగుట్ట (965 మీ.) ఇది ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో (తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సరిహద్దులో) ఉంది.
- పీఠభూమికి తూర్పు కనుమలు ఈశాన్య ఆగ్నేయ సరిహద్దుగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల్, వికారాబాద్ జిల్లాలోవిస్తరించి ఉన్నది. ఇవి అగ్నిమయ, క్వార్ట్ శిలలతో ఏర్పడి ఉన్నాయి.
ప్రాక్టీస్ బిట్స్
1. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
1) 2014 మే 2 2) 2014 జూన్ 2
3) 2014 జూలై 2 4) 2014 మార్చి 2
2. రంగారెడ్డి జిల్లా ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది?
1) 1878 జూలై 10
2) 1978 ఆగస్టు 15
3) 1988 ఆగస్టు 12
4) 1978 జూలై 10
3. తెలంగాణలో కొత్తగా 21 జిల్లాలను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2016 సెప్టెంబర్ 11
2) 2016 అక్టోబర్ 11
3) 2016 నవంబర్ 11
4) 2016 డిసెంబర్ 11
4. తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా?
1) మహబూబ్‌నగర్
2) జయశంకర్ భూపాలపల్లి
3) నల్లగొండ 4) రంగారెడ్డి
5. తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా?
1) జోగులాంబ గద్వాల 2) హైదరాబాద్
3) మెదక్ 4) సిద్దిపేట
6. తెలంగాణలో అత్యల్ప జనసాంద్రత గల జిల్లా?
1) జోగులాంబ గద్వాల 2) ములుగు
3) జయశంకర్ భూపాలపల్లి
4) నాగర్‌కర్నూలు
7. తెలంగాణలో ముంపునకు గురయ్యే 7 మండలాలు ఏ రాష్ట్రంలో కలిపారు?
1) మహారాష్ట్ర 2) ఆంధ్రప్రదేశ్
3) ఛత్తీస్‌గఢ్ 4) కర్ణాటక
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 9959361278
సమాధానాలు
1. 2 2. 2 3. 2 4. 3
5. 2 6. 2 7. 2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు