TSPSC SPECIAL | ప్రభుత్వ పథకాలు.. ఆర్థిక స్వావలంబన మార్గాలు
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు
దళితబంధు
- ఈ పథకాన్ని 2021 ఆగస్టు 4న యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.
- రాష్ట్రంలో దళితులకు ఆర్థిక సాధికారత స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ రూ.1200 కోట్లతో తెలంగాణ దళితబంధు పథకాన్ని 2021 జూన్ 27న ప్రకటించారు.
- ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున మొత్తం 11,800 కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు. నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
- ఈ పథకం కింద ఇచ్చిన సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు.
- 2022 జనవరి వరకు సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రి, ఆలేరు నియోజకవర్గంలోని 76 దళిత కుటుంబాలకు రూ. 7.6 కోట్లు, శాలపల్లి (ఇందిరానగర్), హుజూరాబాద్ మండలం, హూజూరాబాద్ నియోజకవర్గం, కరీంనగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 2021, ఆగస్టు 16న ఎంచుకున్నారు.
- హుజూరాబాద్ నియోజకవర్గంలో 18,211 దళిత కుటుంబాలకు నిధులు విడుదల చేశారు. అదేవిధంగా మరో 5 నియోజకవర్గాల్లో అమలు చేస్తుంది. అవి..
- 1 చింతకాని మండలం, మధిర నియోజకవర్గం (ఎస్సీ), ఖమ్మం జిల్లా
2. తిరుమలగిరి, తుంగతుర్తి నియోజకవర్గం (ఎస్సీ), సూర్యాపేట
3. చారగొండ, అచ్చంపేట నియోజకవర్గం (ఎస్సీ), నాగర్‌కర్నూల్ జిల్లా
4. నిజాంసాగర్, జుక్కల్ నియోజకవర్గం (ఎస్సీ), కామారెడ్డి
5. కల్వకుర్తి, కల్వకుర్తి నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ జిల్లా - ఈ నియోజకవర్గాల్లో 2,500 దళిత కుటుంబాలకు రూ.250 కోట్లు విడుదల చేశారు.
- ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని నియోజక వర్గాల్లో (పైన తెలిపిన 5 నియోజకవర్గాలు, హుజూరాబాద్ నియోజకవర్గం కాకుండా) ప్రతి నియోజకవర్గం నుంచి 100 దళిత కుటుంబాలకు అందించనున్నారు.
- ప్రభుత్వ సాయంతో ఏర్పాటు చేసుకొనే యూనిట్లకు సంబంధించి Scheduled Casts Co-operative Development Corporation (SCCDC) కొన్ని సలహాలు, సూచనలు చేసింది. వివిధ రంగాల్లో డిమాండ్ ఉన్న అంశాలపై అవగాహన కల్పించేందుకు పలు రకాల యూనిట్ల జాబితాలతో ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించింది. ఇవేగాకుండా లబ్ధిదారులు తమకు ఇప్పటికే అవగాహన ఉన్న ఇతర యూనిట్లను కూడా ప్రారంభించుకునే వీలు కల్పించింది.
మూడు స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు - దళితబంధు పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేస్తుంది.
1. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జెడ్పీ సీఈవో, డీఆర్డీఏ/వ్యవసాయ/పశు సంవర్థక/రవాణా పరిశ్రమల విభాగాల నుంచి ఎంపిక చేసిన అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీతో పాటు కలెక్టర్ నామినేట్ చేసే మరో ఇద్దరు సభ్యులుతో కమిటీ ఉంటుంది.
2. మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్, వ్యవసాయ, పశు సంవర్థక శాఖల అధికారులతో పాటు ఇద్దరు నామినేటెడ్ సభ్యులు ఉంటారు.
3. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ రెవెన్యూ అధికారి, ఇద్దరు నామినేటెడ్ సభ్యులతో ఉంటుంది.
లబ్ధిదారులు, ప్రభుత్వ కాంట్రిబ్యూషన్తో
దళిత రక్షణ నిధి - దళితబంధు పథకం లబ్ధిదారులు రక్షణ కోసం జిల్లా స్థాయిలో దళిత రక్షణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, పరిశ్రమల విభాగం జనరల్ మేనేజర్ సభ్యులుగా ఉండే కమిటీ దీన్ని పర్యవేక్షిస్తుంది.
- రూ.10లక్షలు సాయం మంజూరైన లబ్ధిదారుల నుంచి రూ.10 వేల చొప్పున, ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.10 వేల చొప్పున రక్షణ నిధికి కాంట్రిబ్యూషన్‌గా జమ చేస్తారు. దీంతోపాటు లబ్ధిదారులు ఏటా రూ.1000 చొప్పున నిధికి జమ చేయాలి. ఎవరైనా లబ్ధిదారులు ఏదైనా ఆపదకు లోనైనప్పుడు
ఈ నిధి నుంచి సాయం అందిస్తారు.
దళితబంధులో ఆర్థికాభివృద్ధి యూనిట్స్ - దళితబంధులో ఒక్కో కుటుంబానికి ఇచ్చే ఆర్థిక సాయంతో ఏయే ఆస్తులు కొనుగోలు చేయవచ్చు, ఏయే యూనిట్స్ స్థాపించవచ్చో వివరాలతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను 2021 ఆగస్టు 10న విడుదల చేసింది. దళితబంధు జాబితాను 4 రకాలుగా విభజించింది..
1. గ్రామాలు
2. గ్రామాలు-ఉప పట్టణాలు
3. గ్రామాలు-పట్టణాలు
4. పట్టణాలు - నిరంతర విద్యుత్ సరఫరా పథకం
- 2016 ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 9 గంటల ఉచిత నిరంతర విద్యుత్తు సరఫరాను ప్రారంభించారు.
- 2017, జూలై 16 నుంచి పొలాలకు 24 గంటల విద్యుత్తు సరఫరా కార్యక్రమాలను ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 జనవరి 1 నుంచి రాష్ట్రంలోని మొత్తం 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా చేసే పథకాన్ని ప్రారంభించింది.
- ఈ పథకం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని ఓ గ్రామంలో ప్రారంభించారు. ఈ పథకానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.10500 కోట్లు ఖర్చు చేస్తుంది.
గమనిక: 2020 డిసెంబర్ 1 నాటికి రాష్ట్రంలో ఉచిత విద్యుత్తుతో కూడిన వ్యవసాయ పంపెసెట్ల సంఖ్య 24.8 లక్షలు. - రాష్ట్రంలో దాదాపు 40 శాతం విద్యుత్తు వ్యవసాయానికి సరఫరా అవుతుంది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రూ.3196 కోట్లతో కొత్తగా 6.39 లక్షల వ్యవసాయ కనెక్షన్లను అందించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం విద్యుత్తు కనెక్షన్ల సంఖ్య 25.63 లక్షలకు చేరుకుంది.
- 2014-15 నుంచి ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్తు సరఫరా కోసం రూ.39200 కోట్ల సబ్సిడీని అందిస్తుంది. దేశంలోనే వ్యవసాయానికి తెలంగాణ సబ్సిడీని అందిస్తుంది. దేశంలోనే వ్యవసాయానికి తెలంగాణ అతి తక్కువ శాతం (41.25%) విద్యుత్తును వినియోగిస్తుంది.
- తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి
- ఈ పథకాన్ని 2015 మే 19న ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత చదువులు చదవడానికి ఆర్థిక సాయం అందించే పథకం.
- తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకాలకు రూ.20 లక్షల చొప్పున డా.బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లను ప్రభుత్వం అందజేస్తుంది.
- స్కాలర్‌షిప్‌ల సంఖ్య: ఈ పథకం కింద 500 స్కాలర్షిప్లు మంజూరు చేస్తారు.
- కోర్సులు: మెడిసిన్, ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, ప్యూర్ సైన్సెస్, హ్యుమానిటీస్, సోషల్ స్టడీస్
- విదేశీ విశ్వవిద్యాలయాలు (10 దేశాలు): అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, న్యూజిలాండ్.
- ఈ పథకం లబ్ధి పొందటానికి కుటుంబ వార్షిక ఆదాయం రూ.5లక్షలు మించొద్దు. 35 సంవత్సరాల వయస్సు మించి ఉండొద్దు.
షీ-టీమ్స్
- ఈ పథకాన్ని 2014, అక్టోబర్ 24న హైదరాబాద్‌లో ప్రారంభించారు.
- హైదరాబాద్‌లో మహిళల రక్షణకు, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టడానికి షీ-టీమ్స్‌ను ప్రారంభించారు.
- 100 షీ-టీమ్స్ పని చేస్తున్నాయి. పూనం మాలకొండయ్య కమిటీ సిఫారసుల
ఆధారంగా షీ-టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. - 2020, అక్టోబర్ 24 నాటికి 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని హైదరాబాద్‌లో 100
షీ బృందాలు, జిల్లాల్లో 200 షీ-టీమ్స్
పని చేస్తున్నాయి.
గిరిబాల వికాస్ పథకం
- ములుగు జిల్లాలోని ఏటూరునాగారం పరిధిలో గల గిరిజన పాఠశాలలో 2018 జూలై 6న ఈ పథకాన్ని ప్రారంభించారు.
- గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యం కోసం తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఈ పథకాన్ని ప్రారంభించింది.
- ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఒక సంవత్సరంలో మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితి అంచనా వేస్తారు. ప్రభుత్వ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందించడం ఈ పథకం లక్ష్యం.
సీఎం షెడ్యూల్డ్ తెగల పారిశ్రామిక పథకం - 2017-18లో గిరిజన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించటానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.
- పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఉపాధి కల్పన, జిల్లా స్థాయి నుంచి ఆర్థికపరమైన అభివృద్ధి, కొత్త ఆవిష్కరణల కల్పనతోపాటు అంకుర కేంద్రాలు (Startups) ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవడం.
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాల ఉత్పత్తి, సెల్ఫోన్లు, ఫ్యాబ్‌ల తయారీ, వైమానిక, ఆహార శుద్ధి వాహనాల తయారీ, జౌళి, ప్లాస్టిక్ ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, సౌర విద్యుత్ వంటి రంగాల్లో అభివృద్ధికి అవకాశాలు కలవు.
- గిరిజనుల పరిశ్రమల స్థాపనకు రూ.50 లక్షల పరిమితి వరకు 35 శాతం సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుంది.
- గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు రూ. 50 లక్షల పరిమితి వరకు 40 శాతం సబ్సిడీ అందిస్తారు. గిరిజన మహిళా పారిశ్రామికవేత్తలకు 45 శాతం సబ్సిడీ అందిస్తారు.
మహాత్మాజ్యోతిరావు పూలే వెనకబడిన కులాల విదేశీ విద్యానిధి - ఈ పథకాన్ని 2016లో ప్రారంభించారు. బి.సి. విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులను చదవడానికి ఆర్థిక సహాయం అందించే పథకం. బి.సి. కార్పొరేషన్ ద్వారా ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు.
- రెండు విడతల్లో ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది.
- కోర్సులు: మెడిసిన్, ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, ప్యూర్ సైన్సెస్, హ్యుమానిటీస్, సోషల్స్టడీస్
- విదేశీ విశ్వవిద్యాలయాలు: అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఉద్దేశించినది.
- కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షలు మించొద్దు. గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు మించి ఉండొద్దు.
చేనేత కార్మికుల సంక్షేమం - రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం త్రిముఖ వ్యూహం రూపొందించింది.
1. ప్రభుత్వం కొనుగోలు చేసే వస్ర్తాల ఆర్డర్‌ను చేనేత పనివారికి ఇవ్వడం
2. నూలు రసాయనాలపై సబ్సిడీ ఇవ్వడం
3. తగిన మార్కెట్ సదుపాయాలను కల్పించడం - పవర్లూమ్ కార్మికులను ఆదుకునేందుకు, వారికున్న రుణాలను లక్షల రూపాయల వరకు ప్రభుత్వం మాఫీ చేసింది.
- 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్‌లో భాగంగా ప్రతి నెల రూ.2,016 పెన్షన్ అందిస్తుంది.
మర మగ్గాల కార్మికుల పొదుపు పథకం - ఈ పథకం పవర్లూమ్ కార్మికుల కోసం ఉద్దేశించింది. దీన్ని 2018 జనవరిలో ప్రారంభించారు.
- ఈ పథకం ద్వారా సుమారు 15,000 మంది పవర్లూమ్ కార్మికులు లబ్ధి పొందుతున్నారు. కార్మికులు తమ వాటాగా వారి నెల జీతంలో 8 శాతాన్ని బ్యాంకులో జమ చేస్తే ప్రభుత్వం 8 శాతం జమ చేస్తుంది.
- 3 సంవత్సరాల తర్వాత జమ చేసిన మొత్తం కార్మికులు తీసుకోవచ్చు. బ్యాంకు దీనిపై వడ్డీ కూడా చెల్లిస్తుంది.
నేతన్నకు చేయూత పథకం - యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో 2017 జూన్ 24న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
- 18 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు (వీవర్స్, డైయర్స్, వెండర్స్, వైండల్స్, సహాయ వీవర్స్) పథకానికి అర్హులు.
- ఈ పథకం కింద లబ్ధిదారుని వాటాగా వారి వేతనంలో 8 శాతం పొదుపు ఖాతాలో జమ చేస్తే, ప్రభుత్వం తమ వాటాగా 16 శాతం జమ చేస్తుంది.
- 3 సంవత్సరాల తర్వాత ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి తీసుకోవచ్చు. సహకార సంఘంలో లేని చేనేత అనుబంధ కార్మికులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తారు.
బ్రాహ్మణుల సంక్షేమ కార్యక్రమాలు - 21-55 సంవత్సరాల మధ్యగల బ్రాహ్మణ యువతను పారిశ్రామిక రంగంలో ప్రోత్సహించేందుకు ఈ పథకం ప్రారంభించారు.
- అర్హత: కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించి ఉండొద్దు.
- లక్ష రూపాయల లోపు గల యూనిట్లకు 80 శాతం వరకు సబ్సిడీ
- రూ.2 లక్షల లోపు గల యూనిట్లకు 70 శాతం సబ్సిడీ
రూ.2 లక్షల పైబడిన యూనిట్లకు 60 శాతం వరకు సబ్సిడీ
‘ఈ-గోల్కొండ’ వెబ్ పోర్టల్
- హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ 2021 ఏప్రిల్ 1న ప్రారంభించారు.
- ఉద్దేశం: రాష్ట్రంలో తయారవుతున్న సంప్రదాయ హస్తకళాకృతులకు ప్రపంచస్థాయి మార్కెటింగ్ సదుపాయాలను కల్పించేందుకు ‘ఈ-గోల్కొండ’ వెబ్ పోర్టల్‌ను రూపొందించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేటు ఈ కామర్స్ వెబ్సైట్లతో పోలిస్తే ఈ పోర్టల్‌ను మెరుగైన ఫీచర్స్‌లో రూపొందించారు.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 9959361278
Previous article
TS SSC | X CLASS MATHEMATICS MODEL PAPER
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు