TSPSC Hostel Welfare | పరిశీలన అభ్యసనా సిద్ధాంతంలోని దశల వరుస క్రమం?
TSPSC Psychology Hostel Welfare exam special
1. స్కిన్నర్ సిద్ధాంతం ప్రకారం కింది వాటిని జతపరచండి?
ఎ) మీట నొక్కడం 1) నిర్నిబంధిత ఉద్దీపన (ఎ) C.S
బి) ఆహారం 2) నిబంధిత ఉద్దీపన (బి) U.C.R
సి) ఆహారం తినడం 3) నిబంధిత ప్రతిస్పందన (సి) C.S
డి) మీట 4) నిర్నిబంధిత ప్రతిస్పందన (డి) U.C.S
1) ఎ-3-ఎ, బి-2-డి, సి-1-బి, డి-4-సి
2) ఎ-4-బి, బి-3-సి, సి-2-ఎ, డి-1-బి
3) ఎ-2-సి, బి-4-బి, సి-3-డి, డి-1-ఎ
4) ఎ-3-ఎ, బి-2-డి, సి-4-బి, డి-2-బి
2. ఆకృతీకరణ అంటే ….
1) ఆశించిన ప్రవర్తన పూర్తిగా వ్యక్తపరిచిన తర్వాత పునర్బలనం ఇవ్వటం
2) ఆశించిన ప్రవర్తనతో సంబంధం లేకుండా పునర్బలనం ఇవ్వటం
3) ఆశించిన ప్రవర్తన వైపు కనబడే ప్రతి ప్రవర్తనకు పునర్బలనమిస్తూ ఆశించిన ప్రవర్తన రాబట్టడం
4) ఆశించిన ప్రవర్తన కనబరిచిన పునర్బలనం ఇవ్వకపోవటం
3. కింది వాటిని జతపరచండి?
ఎ) The Conditioned Reflexes 1) థారన్డైక్
బి) Animal Intelligence 2) స్కిన్నర్
సి) Behaviourisam 3) పావ్లోవ్
డి) Verbal behaviour 4) వాట్సన్
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-1, సి-4, డి-2
4. కిందివాటిని జతపరచండి?
ఎ) ఫలితం వద్దు, ప్రక్రియ ముద్దు 1) ప్రవర్తనా వాదం
బి) భాగాలు వద్దు, మొత్తం ముద్దు 2) నిర్మాణాత్మక వాదం
సి) ప్రక్రియ వద్దు ఫలితం ముద్దు 3) పరిశీలనా వాదం
డి) పునర్బలనం వద్దు, పరిశీలన ముద్దు 4) గెస్టాల్డ్ వాదం
5) మానవతావాదం
1) ఎ-5, బి-3, సి-4, డి-2
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-3, బి-4, సి-5, డి-1
4) ఎ-3, బి-2, సి-4, డి-1
5. పరిశీలన అభ్యసనా సిద్ధాంతంలోని దశల వరుస క్రమాన్ని గుర్తించండి?
ఎ) పునర్బలనం బి) ధారణ
సి) అవధానం
డి) నిష్పాదనం/ పునరుత్పాదనం
1) సి, బి, డి, ఎ 2) ఎ, డి, సి, ఎ
3) బి, డి, సి, ఎ 4) డి, బి, ఎ, సి
6. శాస్త్రీయ, కార్యసాధక నిబంధనలకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) కార్యసాధక నిబంధనంలో జీవి నిష్క్రి యాత్మకంగా, శాస్త్రీయ నిబంధనంలో జీవి క్రియాత్మకంగా ఉంటుంది
2) శాస్త్రీయ నిబంధనంలో జీవి నిష్క్రియాత్మకంగా, కార్యసాధక నిబంధనంలో జీవి క్రియాత్మకంగా ఉంటుంది
3) కార్యసాధక శాస్త్రీయ నిబంధనలు రెండింటిలో జీవి క్రియాత్మకంగా ఉంటుంది
4) శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధన రెండింటిలో జీవి నిష్క్రియాత్మకంగా ఉండాలి
7. కిందివాటిలో సరికానిది?
ఎ) ఉపాధ్యాయుని నాయకత్వ స్థితి బాగా లేకపోవటం వల్ల పిల్లవాడు పాఠశాల మానివేయటం అసంతృప్తి నియమం
బి) ఆటస్థలం స్నేహితులు నచ్చకపోవడం వల్ల పిల్లవాడు ఆటలు ఆడకపోవటం ఫలిత నియమం
సి) ఉపాధ్యాయుడు విద్యార్థి పరిణితికి అనుగుణమైన పాఠ్యాంశాన్ని ఎంచుకొనుట సంసిద్ధతా నియమం
డి) మొదటి మూడు పాఠాలు బోధనోపకరణాలతో బోధించటం వల్ల పిల్లవాడు పాఠాన్ని విని బోధనోపకరణాలు ఉపయోగించక పోయేసరికి పాఠాలు వినటాన్ని మానివేయటమే విరమణ
1) ఎ, బి, సి, డి 2) 4
సి) 1, 3 డి) ఏదీకాదు
8. కింది వాటిని జతపరచండి?
ఎ) ఇతరుల ప్రవర్తననను ఆదర్శంగా తీసుకోవడం 1) ప్రవర్తనా వాదం
బి) సరళంగా, యాంత్రికంగా అభ్యసనం 2) నిర్మాణాత్మక వాదం
సి) ప్రస్తుత పాఠ్యపుస్తకాల రూపకల్పన 3) గెస్టాల్డ్ వాదం
డి) అభ్యసనంలో మానసిక అంశాల ప్రాధాన్యం 4) పరిశీలనా వాదం
5) మానవతావాదం
1) ఎ-2, బి-3, సి-4, డి-5
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-5
4) ఎ-3, బి-4, సి-2, డి-1
9. కింది వాటిని జతపరచండి.
ఎ) పాత విషయాలకు, కొత్త విషయాలు కలవడం 1) ప్రత్యక్షం
బి) అవధానం, ఆలోచనల సముదాయం 2) అవధానం
సి) ఒక అంశంపై దృష్టితోపాటు మనసుని లగ్నం చేయడం 3) ఏకాగ్రత
డి) ఒక అంశంపై దృష్టిని కేంద్రీకరించడం 4) ప్రత్యక్ష పునర్ వ్యవస్థీకరణం
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-2, బి-3, సి-4, డి-1
10. వివిధ జీవుల ఆహారపు అలవాట్లకు సంబం ధించి తెలియని విషయాలు తెలుసుకొనుటలో మనీషాకు స్నేహితురాలు సహాయపడితే సిరికి సామాజిక మాధ్యమాలు తోడ్పడినవి. అయినా సిరి, మనీషాలు తెలియని విషయాలు తెలుసుకొని జెడ్పీడీని పూర్తి చేసుకోవడానికి సహాయపడినది వైగాట్సీ (vygotsky) ప్రకారం?
ఎ) MKP & MKP
బి) MKP & సామాజిక స్కఫోల్డింగ్
సి) సామాజిక స్కఫోల్డింగ్ & MKP
డి) సారువా
11. కింది వివరణలను గమనిచండి.
ఎ) ఆహారానికి (UCS), లాలాజలం స్రవించడం (UCR)ను నిబంధనం అంటారు
బి) పావ్లోవ్ ప్రయోగం ==> U.C.S-U.C.R ==> C.S-C.R
సి) వాట్సన్ ప్రయోగం ==> C.S-C.R ==> U.C.S-U.S.R
సరైన వివిరణలను ఎంపిక చేయండి?
1) బి, సి 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) ఎ, సి
12. కింది ప్రవచనాలను గమనించండి.
ఎ) శిశువు ఎలా నేర్చుకున్నాడో, ఎంత నేర్చుకున్నాడో తెలిపేదే నిర్మాణాత్మక వాదం
బి) శిశువు ఎంత నేర్చుకున్నాడో, ఏమి నేర్చుకున్నాడో తెలిపేదే నిర్మాణాత్మక వాదం
సి) శిశువు ఎలా నేర్చుకున్నాడో తెలిపేదే నిర్మాణాత్మక వాదం
కింది ప్రవచనాల్లో సరైనది?
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి డి) సి మాత్రమే
13. కిందివాటిలో సరైనది ఏది?
1) యత్నదోష సిద్ధాంతం, అంతరదృష్టి అభ్యసనం రెండింటిలో ఆలోచనకు అధిక
ప్రాధాన్యం ఉంటుంది
2) యత్నదోష, అంతరదృష్టి రెండింటిలో అభ్యసనకు ప్రాధాన్యం ఉంటుంది
3) యత్నదోషలో ఆలోచనకు, అంతర దృష్టిలో అభ్యసనకు ప్రాధాన్యం ఉంటుంది
4) యత్నదోషలో అభ్యసనకు, అంతరదృష్టిలో ఆలోచనకు ప్రాధాన్యం ఉంటుంది
14. శిశువు మొదటిసారి ఒక పక్షిని చూసినపుడు ఆ అనుభవం స్వచ్ఛమైన రూపంలో స్మృతి పథంగా నిక్షిప్తమవుతుంది. తర్వాత శిశువు వివిధ రకాలైన పక్షులను చూసినపుడు ఆ అనుభవాలు మొదటిసారిగా ఏర్పడ్డ స్మృతి పథంలో ప్రతిచర్య జరిపి అధి ఒక స్మృతి పథ వ్యవస్థగా రూపు దిద్దుకుంటుంది అని తెలిపిన సిద్ధాంతం?
1) సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం
2) ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతం
3) సాంఘిక అభ్యసన సిద్ధాంతం
4) యత్నదోష అభ్యసన సిద్ధాంతం
15. కింది వాటిలో తప్పు ఉన్న అంశాన్ని గుర్తించండి?
1) యత్నదోష అభ్యసన సిద్ధాంతం – థారన్డైక్ – అమెరికా
2) సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం- స్కిన్నర్ -అమెరికా
3) కార్యసాధక నిబంధన సిద్ధాంతం- స్కిన్నర్- అమెరికా
4) ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతం – కోఫ్ కా-జర్మనీ
16. వైగాట్సీ విశ్వాసం ప్రకారం
1) భాషా సముపార్జన, సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జనకు దారి తీస్తుంది
2) సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జన భాషా వికాసానికి వీలు కల్పిస్తుంది
3) భాషల సముపార్జనలో సామాజికమైన అన్యోన్య చర్యలు ఏ రకమైన పాత్రను నిర్వహించవు
4) భాషా సముపార్జనకు మూర్తిమత్వ వికాసానికి ఎలాంటి పాత్రలేదు
17. స్కిన్నర్ పునర్బలన నియమానికి సంబంధించి సరికానిది?
ఎ) ఉపాధ్యాయుడు విద్యార్థి ప్రాజెక్ట్ నిర్వహించేటప్పుడు ప్రతి 3 నిమిషాలకు పునర్బలనం ఇవ్వటం- స్థిర అంతర పునర్బలనం
బి) ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధించేముందు పాఠం మధ్యలో పాఠం చివరలో పునర్బలనం ఇవ్వడం- స్థిర కాలవ్యవధి
పునర్బలనం
సి) ఉపాధ్యాయుడు కాలాన్ని ప్రతిస్పందనలను లోనికి తీసుకొని పునర్బలనం ఇవ్వటం – చరశీల పునర్బలనం
డి) నిర్ణీత ప్రతిస్పందనల తర్వాత పునర్బలనం ఇవ్వటం – స్థిర నిష్పత్తి పునర్బలనం
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి
3) బి, సి 4) ఎ, సి, డి
18. సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా పావ్లోవ్ సిద్ధాంతంలో గల కింది అంశాలను జతపరచండి?
ఎ) ఆహారం 1) నిబంధిత ప్రతిస్పందన
బి) ఆహారానికి లాలాజలం స్రవించడం 2) నిర్నిబంధిత ప్రతిస్పందన
సి) గంట శబ్దం 3) నిర్నిబంధిత ఉద్దీపన
డి) గంట శబ్దానికి లాలాజలం ఊరడం 4) నిబంధిత ఉద్దీపన
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1
19. వైకారియస్ అభ్యసనంలో అభ్యాసకుడు?
1) వ్యక్తిని నేరుగా పరిశీలించి అనుకరణ ద్వారా ప్రవర్తనను నేర్చుకుంటాడు
2) యత్నదోషం ద్వారా ప్రవర్తనను నేర్చుకొంటాడు
3) నిబంధనం ద్వారా ప్రవర్తనను నేర్చుకొంటాడు
4) సమస్య పరిష్కారం ద్వారా ప్రవర్తనను నేర్చుకొంటాడు
20. అభ్యసన నియమాలకు సంబంధించి సరికానిది?
1) కార్యసాధక నిబంధనా సిద్ధాంతం థారన్ డైక్ ఫలిత నియమంపై ఆధారపడుతుంది.
2) ఒక ఉద్దీపనను పోలిన మరే ఇతర ఉద్దీపనలకు ప్రతిస్పందించక పోవడం విచక్షణ
3) హఠాత్తుగా మెరుపులాంటి ఆలోచనలు రావడం, భాగాలుగా కంటే మొత్తం మిన్న అని నమ్మే సిద్ధాంతం – అంతరదృష్టి
అభ్యసనం
4) తినగ తినగ వేము తియ్యనుండు అనే సామెత పరిశీలన అభ్యసనానికి చెందుతుంది
21. కార్యక్రమయుత అభ్యసనంలో సోపానాలను వరుస క్రమంలో అమర్చండి?
ఎ) తక్షణ పునర్బలన సూత్రం
బి) స్వీయ మూల్యాంకన సూత్రం
సి) చురుకైన ప్రతిస్పందన సూత్రం
డి) స్వీయగమన సూత్రం
ఇ) చిన్ని సోపానాల సూత్రం
1) ఇ, సి, ఎ, బి, డి
2) ఇ, సి, ఎ, డి, బి
3) ఇ, సి, డి, ఎ, బి
4) సి, ఇ, ఎ, డి, బి
22. కింది అంశాలను గమనించండి?
ఎ) C.S కు C.R రావడం
బి) U.C.S-U.C.R—> C.S.-C.R
సి) C.S, U.C.S ల మధ్య బంధం
డి) U.C.R, C.R గా మారడం అనే అంశాలను అర్థపరంగా వరుస క్రమంలో అమర్చడం
1) శాస్త్రీయ నిబంధనం, సంసర్గం, శాస్త్రీయ నిబంధన సూత్రం, నిబంధనం
2) శాస్త్రీయ నిబంధన సూత్రం, నిబంధనం, సంసర్గం, శాస్త్రీయ నిబంధనం
3) సంసర్గం, నిబంధనం, శాస్త్రీయ నిబంధనం, శాస్త్రీయ నిబంధనా సూత్రం
4) నిబంధనం, శాస్త్రీయ నిబంధన సూత్రం, సంసర్గం, శాస్త్రీయ నిబంధనం
23. కిందివాటిలో కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి సంబంధం లేని అంశాన్ని గుర్తించండి?
1) ప్రతిస్పందనకు, పునర్బలన ఉద్దీపనకు జతపరచడం ఉంటుంది
2) పునర్బలనం ప్రతిస్పందనతో కూడి ఉంటుంది
3) దీనిలో కాల నియంత్రణకు ప్రాధాన్యం ఉంటుంది
4) ప్రతిస్పందన ఏర్పడినపుడే పునర్బలనం ఇవ్వబడును
24. క్షేత్ర పర్యటనకు వెళ్లిన విద్యార్థుల్లో ఇద్దరు తప్పిపోయారు. వీరిలో ఒకరు బావిలో ఉండగా ఇంతలో రెండో విద్యార్థి పక్కన గల తాడును ఒక చివర చెట్టుకు కట్టి రెండో చివర బావిలోనికి విసిరి ఆ పిల్లవాడిని రక్షించాడు. అయిన ఇక్కడ జరిగిన అభ్యసనం?
1) అంతరదృష్టి అభ్యసనం
2) యత్నదోష అభ్యసనం
3) శాస్త్రీయ నిబంధనం
4) కార్యసాధక నిబంధనం
25. కిందివాటిలో అంతరదృష్టి అభ్యసనానికి చెందినది?
ఎ) పిల్లవాడు ఉపాధ్యాయునిలాగా ఆలోచించటం
బి) పిల్లవాడు ఉపాధ్యాయుని చిత్రాన్ని గీయటం
సి) పిల్లవాడు సృజనాత్మకతతో నూతన ఆవిష్కరణ చేయటం
డి) పిల్లవాడు పాము పేరు వినగానే పారిపోవటం
1) ఎ, సి 2) సి
3) ఎ, బి 4) ఎ, బి, డి
సమాధానాలు
1-4 2-3 3-4 4-2
5-1 6-2 7-4 8-2
9-2 10-3 11-1 12-4
13-4 14-2 15-2 16-1
17-3 18-3 19-1 20-4
21-2 22-4 23-3 24-1
25-2
శివపల్లి
టీఎస్& ఏపీ సైకాలజీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు