Telangana History March 21 | సంస్కరణలకు ఆద్యులు.. ఆనకట్టల నిర్మాతలు
నాసిరుద్దౌలా
- ఇతడు 4వ నిజాం, 4వ అసఫ్‌జా రాజ్యానికి వచ్చాడు. ఇతడు విలియం బెంటింక్ అనుమతితో చార్లెస్ మెట్కాఫ్ సంస్కరణలు రద్దు చేశాడు.
- ఇతడి కాలంలో అనేక మంది జమీందార్లు తిరుగుబాటు చేశారు. ముఖ్యంగా మునగాల జమీందారు జగన్నాథరావు, అమ్మల పాలెం జమీందారు వెంకట నరసింహారావు తిరుగుబాటు చేయగా రస్సెల్ సైన్యం అణిచి వేసింది.
- ఇతడు హైదరాబాద్ సంస్థానంలో 1846లో ఉరిశిక్షను రద్దు చేశాడు.
- ఇతని కాలంలో ముఖ్యంగా రెండు సంఘటనలు జరిగాయి. అవి.
వాహబి ఉద్యమం
- వాహబి ఉద్యమం అంటే ముస్లింలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు
- భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొదట తిరుగుబాటు చేసిన ఫకీర్లు
2. సన్యాసులు మోర్లు రాజస్థాన్
3. కొలులు 4. బిల్లులు
5. జమీందారులు 6. వాహబిలు - ఈ వాహబి ఉద్యమాన్ని భారతదేశంలో ప్రారంభించింది. సర్సయ్యద్ అహ్మద్‌ఖాన్, ముస్లింలా విద్య కోసం కృషి చేసిన మొదటి వ్యక్తి.
- ఆంగ్లో ఓరియంటెడ్ ముస్లిం కళాశాల స్థాపించాడు (1875).
- ఆర్యసమాజం, దివ్యజ్ఞాన సమాజం -1875
- గోబ్యాక్ టు (ముస్లిం/ మహమ్మదీయులు) సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్
- హైదరాబాద్‌లో వాహబి ఉద్యమానికి నాయకత్వం వహించిన నాసిరుద్దౌలా తమ్ముడు బారిజ్ద్దౌలా (1854)ను గోల్కొండ కోటలో బంధించి అక్కడే ఉరితీశారు.
- ఈ వాహబి ఉద్యమానికి కడప, కర్నూల్లో నాయకత్వం వహించింది గులాం రసూల్‌ఖాన్
- గూలం రసూల్‌ఖాన్‌ను తిరుచునాపల్లి జైలుకు పంపారు.
- హైదరాబాద్‌లో మొదటి పాఠశాల సెయింట్ జార్జ్ గ్రామర్ హైస్కూల్
- చందులాల్ తర్వాత ప్రధానమంత్రి ‘సిరాజ్ ఉల్-ముల్క్’
- ఇతని కాలంలోనే శాంతి భద్రతలు క్షీణించాయి.
బేరార్ ఒప్పందం
- నిజాం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తీసుకున్న 60 లక్షల రూ 1850 డిసెంబర్ 31లోగా చెల్లించమని బ్రిటిష్‌వారు నిజాంకు షరతు పెట్టారు.
- నిజాం తన ఆస్తులను తన శరీరంపై నగలను అమ్మగా అప్పు మాత్రమే తీర్చగలిగాడు.
- మిగిలిన 50 శాతం శాతాన్ని 1853లోపు తీర్చమని డల్హౌసీ నాసిరుద్దౌలా మధ్య బేరార్ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం నిజాం బ్రిటిష్ వారికి 1. బీరార్ 2. రాయ్‌చూర్ 3. ఉస్మానాబాద్ 4. ఉదయపూర్‌ను ఇచ్చాడు.
- ఈ అవమానాన్ని భరించలేక సిరాజ్ మరణించాడు
- ఆ సమయంలో 24 సం.రాల వయస్సు కలిగిన సాలార్జంగ్-1 నాసిరుద్దౌలా కాలంలోనే సిపాయిల తిరుగుబాటు జరిగింది.
- ఈ తిరుగుబాటు ప్రారంభమైన వారం రోజులకే నాసిరుద్దౌలా మరణించాడు.
అఫ్జల్ ఉద్దౌలా
- ఇతడే 5వ అసఫ్‌జా, 5వ నిజాంగా ప్రసిద్ధి గాంచెను. ఇతని పేరుమీదనే హైదరాబాద్‌లో అఫ్జల్‌గంజ్, అఫ్జల్‌గంజ్ మసీదు, అఫ్జల్‌గంజ్ బ్రిడ్జ్ నిర్మించారు.
- హైద్రాబాద్‌లోని శీతల విడిది అయినా బొల్లారం రెసిడెన్సీని ఇతడి కాలంలోనే నిర్మించారు. బొల్లారం నిర్మాత శామ్యూల్
- ఇతడు తన ప్రధానమంత్రి అయిన సాలార్జంగ్-1తో కలసి సిపాయిల తిరుగుబాటును అణిచి వేశారు.
- ఈ తిరుగుబాటును అణిచివేసిన తర్వాత అఫ్జలుద్దౌలాకు స్టార్ ఆఫ్ ఇండియా అని బిరుదునిచ్చాడు. స్టార్ ఆఫ్ ఇండియా, అంటే విశ్వాస పాత్రుడు.
- ఇతని కాలంలోనే 1869లో తపాలాశాఖ, కస్టమ్స్ శాఖ, అటవీశాఖను ఏర్పాటు చేశారు.
- ఇతని కాలంలోనే 1869లో హైదరాబాద్‌లో మొట్టమొదటి తపాలా బిల్లును ప్రవేశపెట్టగా 1870లో అమల్లోకి వచ్చింది. భారత్‌లో 1861లో తపాలాశాఖ ఏర్పాటైంది.
మీర్ మహబూబ్ అలీఖాన్
- ఇతడు 9వ రాజు, 6వ నిజాం, 6వ అసఫ్‌జా. ఇతని బిరుదులు లిటిల్ పేలో, రంగ్రంగేలి రాజా, మహ్మద్ పాషా
- ఇతడి సంరక్షకులు సాలార్జంగ్-1, అమీర్-ఇ-కబీర్, బహద్దూర్ నరేంద్ర
- ఇతడి మొదటి ప్రధాని సాలార్జంగ్-1, సాలార్జంగ్-2 (మీర్ లాయఖ్ అలీఖాన్)
- ఇతడు రెండేళ్లకే (1869)లో రాజు అయ్యాడు. 1866లో జన్మించాడు. జనరంజక పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
సంస్కరణలు
- ఇతనికి 18 ఏళ్లు నిండిన వెంటనే 1884లో లార్డ్ రిప్పన్ పట్టాభిషేకం చేశాడు. ఈ విధంగా హైదరాబాద్ సంస్థానాన్ని మొదట సందర్శించిన అధికారి లార్డ్ రిప్పన్
- స్థానిక సంస్థల పితామహుడు లార్డ్ రిప్పన్
- లార్డ్ రిప్పన్ కాలంలోనే 1884లోని స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి.
- మీర్ మహబూబ్ అలీఖాన్ రాజైన వెంటనే 19 మంది సభ్యులతో కూడిన లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు.
- ఇతడి కాలంలోనే మొదటి సాలార్జంగ్ అన్ని సంస్కరణలను పూర్తీగా అమలు చేశాడు. ఇతని కాలంలోనే ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కోయజాతి వారు తిరుగుబాటు చేశారు.
చందా రైల్వే సంఘటన (1883)
- 1870లో సాలార్జంగ్ -1 చందారైల్వే ఒప్పందంపై సంతకం చేశాడు.
- ఆంగ్లేయులు మహారాష్ట్రలోని చంద్రపురం విజయవాడ వరకు నిర్మిస్తున్న రైలు మార్గం, హైదరాబాద్ సంస్థానం గుండా వెళ్లటానికి నిజాం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
- ఈ అనుమతిని వ్యతిరేకిస్తూ అఘోరనాథ ఛటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యుం, ఔసంగి ఓసాంగ్ అనే వ్యక్తులు ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనితో నిజాం ప్రభుత్వం వీరిని మూడేళ్లు దేశ బహిష్కరణ చేసింది.
- తర్వాత 1865లో అఘోరనాథ చటోపాధ్యాయను నిజాం కాలేజీకి మొదటి ప్రిన్సిపాల్‌గా నియమించారు. అఘోరనాథ ఛటోపాధ్యాయ ‘యంగ్ మ్యాన్ ఇంప్రూవ్మెంట్ అసోసియేషన్’ అనే సంస్థను స్థాపించాడు.
- హైదరాబాద్ రాష్ట్రంలోని కాంగ్రెస్ అధ్యక్షుడు ముల్లా అబ్దుల్ ఖయ్యుం.
విద్యారంగం
- 1881లో తొలి బాలికల పాఠశాల అయిన గొర్లియా గర్ల్స్ హై స్కూల్‌ను స్థాపించాడు.
- 1881లో మహబూబియా పాఠశాల, 1883లో ముస్ల్లిం బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను, 1884లో నాంపల్లి బాలికల పాఠశాలను స్థాపించాడు.
- 1885లో హైదరాబాద్ మెడికల్ కళాశాలను, వరంగల్ ఇంజినీరింగ్ కళాశాలను స్థాపించాడు. ఇతని కాలంలోనే ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.
- ఇతని దగ్గర పనిచేసిన పేస్కార్- వికార్ ఉల్ -ఉమ్రా ప్యాలెస్‌ను (1884-1993) మధ్య నిర్మించాడు. 1895లో ఫలక్నామా ప్యాలెస్‌ను నిజాంకు బహూకరించాడు.
- 1876లో చంచల్‌గూడ జైలు నిర్మించాడు
- ఇతని భార్య సర్దార్ బేగం. ఇమె కోసం సర్దార్ మహల్ కట్టించాడు. ఇది యూరోపియన్ శైలిలో నిర్మించిన కట్టడం. ఇది ప్రస్తుతం ఒక మ్యూజియంగా కొనసాగుతుంది.
- 1874లో ‘సతి’ అనే దురాచారాన్ని రూపు మాపాడు.
మూసీనది వరద
- 1908 సెప్టెంబర్ 28న రెండు రోజులు పాటు కురిసిన బీకరమైన వర్షం వల్ల మూసినదికి వరదలు వచ్చాయి. ఈ వరదల వల్ల 1500 మంది చనిపోయారు. ఆస్తినష్టం జరిగింది. వారం రోజులపాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
- ప్రజలకు భూమిశిస్తు రద్దు చేశాడు. ఆహారాన్ని సరఫరా చేశాడు. మళ్లీ భవిష్యత్తులో ఈ నదికి వరదలు రాకుండా ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో ప్లాన్ గీయించాడు.
- ప్రభుత్వ ఉద్యోగులుగా నీతి, వ్యక్తి సామర్థ్యాలు గల వారిని నియమించారు.
- 1905 ఆగస్టు 25 తన 40వ జన్మదినం సందర్భంగా నిజాం హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్లో టౌన్‌హాల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. దాన్ని పూర్తి చేసింది 7వ నిజాం.
- విక్టోరియా మహారాణి మీర్ మహబూబ్ అలీఖాన్‌కు స్టార్ ఆఫ్ కమాండర్ అని బిరుదునిచ్చింది. దీనితో ఆమెపై ప్రేమతో విక్టోరియా మెమోరియల్ అనాథ శరాణాలయం (1905), విక్టోరియా జనన ఆసుపత్రి, విక్టోరియా కుమారుడు వెల్స్రాజు భారతదేశానికి వచ్చిన సందర్భంగా నిర్మించాడు.
మీర్ ఉస్మాన్ అలిఖాన్
- ఇతని పూర్తి పేరు నవాబ్ మీర్ ఉస్మాన్ అలిఖాన్ బహుదూర్ (1911-1948).
- ఇతడు పుట్టింది 1886 ఏప్రిల్ 6న. మరణించింది 1967 ఫిబ్రవరి 24.
- ఇతడు 7వ అసఫ్‌జా బిరుదుతో సింహాసనాన్ని అధిష్టించాడు.
- ఇతని కాలంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది.
పాలన సంస్కరణలు - నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ (1914-1919) ఎలాంటి దివాన్ లేకుండా పరిపాలించాడు.
- ఇతడు 7 మంది సభ్యులతో ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక మంత్రిమండలిని నియమించుకున్నాడు.
- శాసన వ్యవస్థ నుంచి న్యాయవ్యవస్థను వేరు చేసిన ఘనత ఇతడికే దక్కుతుంది. భారతదేశం మొత్తంలో శాసన వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేసిన సంస్థానం హైదరాబాద్ సంస్థానం మాత్రమే.
- నిజాం తన రాజ్యాన్ని కింది విధంగా విభజించాడు.
రాజ్యం -> సుభాలు ->జిల్లాలు -> తాలుకాలు -> గ్రామాలు
నీటి పారుదల వ్యవస్థ
- 1919లో మూసీనది పైన తన పేరుమీద ఉస్మాన్‌సాగర్ ఆనకట్ట/ గండిపేట ఆనకట్టను కట్టించాడు.
- 1927 మూసీనది ఉపనది అయిన నీసా నదిపైన హిమాయత్ అలీఖాన్ పేరుమీద హిమాయత్‌సాగర్ ఆనకట్ట కట్టించాడు. ఈ రెండు ఆనకట్టలు హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందిస్తున్నాయి.
- 1922లో పోచారం రిజర్వాయర్‌ను, నిజాంబాద్ జిల్లాలో నిర్మించి రూ.34 లక్షల ఖర్చుతో నిర్మించి 13వేల ఎకరాల భూమికి సాగు నీటిని అందించాడు.
- నిజాంసాగర్ ఆనకట్ట (1927-31) మధ్య నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను నిజామాబాద్ జిల్లాలోని అచ్చంపేట గ్రామంలో మంజీరనదిపై కట్టించారు. ఇది నిజాం నిర్మించిన ఆనకట్టలో పెద్దది, గొప్పది
- నిజాంసాగర్ ప్రాజెక్ట్ 2,75,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది.
- పాలేరు ప్రాజెక్టును, ఖమ్మం జిల్లాలో పాలేరు నదిపై నాయికొండ అనే గ్రామంలో (1924 -29) మధ్య నిర్మించారు. ఖమ్మం జిల్లాలో నిర్మించిన ప్రాజెక్టులు 1) వైరాప్రాజెక్ట్
2) సింగభూపాలం రిజర్వాయర్ - మానేరు రిజర్వాయర్‌ను కరీంనగర్ జిల్లా సిరిసిల్లా తాలూకాలో నిర్మించారు. ఇది 18 గ్రామాల్లో 2,31,000 ఎకరాలకు నీరును అందిస్తుంది.
- ఈప్రాజెక్ట్ నుంచి దాదాపుగా 107.6 k.w. విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
- పరిశ్రమలు
- మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1914లో పురావస్తు శాఖను, 1930లో పబ్లిక్ గార్డెన్ మ్యూజియంను ఏర్పాటు చేశారు.
- ప్రస్తుతం ఈ మ్యూజియంను టీఎస్ ఆర్కియాలజీ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్స్ మ్యూజియం. ( 2015లో పేరు పెట్టారు)
- అజంతా, ఎల్లోరా గుహల పరిరక్షణ కోసం కమిటీని నియమించాడు.
- నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 1937లో నిజాం పంచదార మిల్లు స్థాపించాడు.
- వరంగల్‌లో 1934లో అజామ్జాహి మిల్లును స్థాపించారు.
- సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్‌మిల్లును (1939)లో ఆదిలాబాద్‌లో నిర్మించారు.
- సనత్‌నగర్‌లో ఆలీవ్ మోటర్ వెహికల్ ఫ్యాక్టరీని స్థాపించాడు.
- 1921-22లో హైదరాబాద్‌లో థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను స్థాపించాడు.
విద్యా సంస్కరణలు - ఉస్మానియా విశ్వ విద్యాలయాలనికి సంబంధించి మొదటి ఫర్మానాను 1917లో రెండోవది 1918 చివరి ఫర్మానాను 1919 ఆగస్టు 7న విడుదల చేసారు.
- మొదటి వీసీ మౌలీ వాహబ్ ఉమర్ రెహమాన్
- ఇది దక్షిణ భారతదేశంలో 3వది, దేశంలో 7వ యూనివర్సిటీ.
- దేశంలో మొదటి విశ్వవిద్యాలయం మద్రాస్ యూనివర్సిటీ (1857)
- ఆర్ట్స్ కళాశాలను 1938లో స్థాపించాడు.
బ్యాంకింగ్
- హైద్రాబాద్‌లో మొదటి బ్యాంకు బ్యాంకు ఆఫ్ బెంగాల్ శాఖను 1869లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.
- ఈ బ్యాంకులే 1927 నాటికి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారి ప్రస్తుతం హైదరాబాద్ బ్యాంకుగా పనిచేస్తున్నాయి.
- మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1900లో పారిస్‌లో జరిగిన ఎగ్జిబిషన్, 1903లో ఢిల్లీ ఎగ్జిబిషన్, 1935లో ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేట్ ఫంక్షన్లో వస్తువులను ప్రదర్శించారు.
- మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరమత సహనం కలిగిన రాజు. ఇతడు భద్రాచలం, తిరుపతి దేవాలయాలకు నిధులు కేటాయించాడు.
- అజంతా, ఎల్లోరా, వేయి స్తంభాల గుడి, రామప్పగుడి రక్షణ కోసం చర్యలు తీసుకున్నాడు. ఇతని సహాయం పొందిన దేవాలయాలు మాదన్నపేట, శంకర్‌బాగ్, గోల్నాక, గౌరిపూర దేవాలయాలకు సహయం చేశాడు.
- ఇతడు 1919లో ముల్కీ నిబంధనలపైన ఫర్మానాను విడుదల చేశాడు.
- ముల్కీ-స్థానికులు ఉన్నంత వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికేతరులకు ఎలాంటి అవకాశం ఇవ్వరని అర్థం.
ఆంజనేయులు
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
Previous article
AIIMS Kalyani | ఎయిమ్స్ కళ్యాణిలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు