Telangana History | అస్తిత్వ పోరాటాలు.. పట్టు సడలని నాయకులు
నిజాం కాలం నాటి పోరాట యోధులు
రావి నారాయణరెడ్డి: ఇతడు యాదాద్రి భువనగిరిజిల్లాలోని బొల్లెపల్లిలో 1908, జూన్ 4న జన్మించారు. రాజ్యాంగ సంస్కరణలపై నియమించిన అయ్యంగార్ కమిటీని వ్యతిరేకించారు. నవ్యసాహితీ సంస్థను స్థాపించారు. తెలంగాణ మైత్రి మెమోరియల్ ట్రస్ట్‌వారు బంజారాహిల్స్ (హైదరాబాద్)లో రావి నారాయణరెడ్డి మెమోరియల్ ఆడిటోరియం నిర్మించారు.
ఆరుట్ల రామచంద్రారెడ్డి: యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో 1910లో జన్మించారు. హరిపురలో జరిగిన ఐఎన్‌సీ సమావేశానికి హాజరయ్యారు. మరిపడిగె, నీర్మాల గ్రామస్థుల సమస్యలు తీర్చారు. ఐలమ్మ భూమిని విసునూర్ రామచంద్రారెడ్డి ఆక్రమించటానికి ప్రయత్నించగా ఆరుట్ల రామచంద్రారెడ్డి ఐలమ్మ తరఫున ప్రతిఘటన చేశారు. ఈయన తరఫున ఆరుట్ల లక్ష్మి, నరసింహారెడ్డి, కోదండ రామారావు, వఫాఖని అనే లాయర్లు వాదించారు.
భీంరెడ్డి నర్సింహారెడ్డి : జిన్నారెడ్డి ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇతనిపై ఆర్యసమాజం, ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు ప్రభావం చూపాయి.
చిట్యాల ఐలమ్మ: ఈమె ఉమ్మడి వరంగల్ జిల్లాలోని క్రిష్ణాపురంలో 1919లో జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వీరవనిత ఐలమ్మ 4 ఎకరాల భూమిలో పంటను ఆక్రమించటానికి రామచంద్రారెడ్డి అనే జమిందారు ప్రయత్నించారు. ఇతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పంటను తిరిగి పొందింది.
దొడ్డి కొమురయ్య: విసునూరు రామచంద్రారెడ్డిపై ఐలమ్మ సాధించిన విజయం స్ఫూర్తిగా తీసుకున్నాడు. జనగామ జిల్లా కడివెండి గ్రామంలో వెట్టి, అక్రమ నిర్బంధ వసూళ్లు ఇంకెంత మాత్రం సాగవని ప్రకటించగా 1946లో రామచంద్రారెడ్డి ఇతనిపై కాల్పులు జరిపించారు.
కుమ్రంభీం: ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ గ్రామం లో 1901, అక్టోబర్ 22న కుమ్రంభీం జన్మించారు. ఇతను అల్లూరి సీతారామరాజును చూసి ప్రభావితుడయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్‌ను 2 జిల్లాలుగా ఏర్పాటు చేసి కొత్త జిల్లాకు కుమ్రంభీం జిల్లాగా నామకరణం చేసింది.
నండూరి ప్రసాదరావు: 1912 సెప్టెంబర్ 12న కృష్ణా జిల్లాలోని గన్నవరం గ్రామంలో ప్రసాదరావు జన్మించారు. భారత కమ్యూనిస్ట్ ఉద్యమం నిర్మించిన వారిలో ఈయన ముఖ్యమైన వ్యక్తి. పుచ్చలపల్లి సుందరయ్య ప్రభావంతో కమ్యూనిస్ట్‌గా మారారు. మునగాలలో రైతు ఉద్యమం నిర్వహించారు.
మల్లు స్వరాజ్యం: ఈమె 1931లో సూర్యాపేటలో జన్మించారు. స్వాతంత్రోద్యమం కాలంనాటి స్వరాజ్ నినాదం వల్ల ప్రభావితురాలైన ఈమెకు స్వరాజ్యం పేరు పెట్టారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. జమీందారీ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొనటం వల్ల నిజాం ప్రభుత్వం ఈమె తలపై రూ.10,000 నజరానా ప్రకటించింది.
కల్వకుంట్ల చంద్రసేన్ గుప్త (కె.సి.గుప్తా): 1919లో హైదరాబాద్‌లో జన్మించారు. మాడ్రిన్ బుక్‌డిపో స్థాపించిన రాజకీయ, సాహిత్య పుస్తకాలు విక్రయించేవారు. ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీ స్థాపించి తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ పుస్తకాలు ప్రచురించారు. రైతులపై, సుభాష్ చంద్రబోస్‌పై ఇతను ప్రచురించిన పుస్తకాలు నిషేధించారు.
స్వామి రామానంద తీర్థ: ఇతని అసలు పేరు వెంకటరావు ఖేడ్గెకర్. స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి రామతీర్థ వల్ల ప్రభావితుడయ్యారు. స్వామి రామాతీర్థ శిష్యుడిగా మారి తన పేరును స్వామి రామానంద తీర్థగా మార్చుకున్నారు.
స్వామి రామానంద తీర్థ వ్యాసం – పెట్టుబడి-శ్రమ
- నినాదం- ‘దౌర్జన్యాన్ని ఎదురించడం అంటే దేవున్ని పూజించినట్లు లెండి ఎదురించండి’
మాడపాటి హనుమంతరావు: ఇతని స్వస్థలం కృష్ణా జిల్లా. ఆంధ్ర మహాసభను రాజకీయ, సాంఘిక ఉద్యమంగా నడపడానికి కృషి చేశాడు. ఆంధ్ర మహిళ సభ స్థాపించి మహిళల్లో జాగృతి సాధించారు. ఇతనికి ‘ఆంధ్ర పితామహ’ అనే బిరుదు ఉంది. తెలంగాణలో ‘హృదయ శల్యము’ మొదటి కథానిక.
బూర్గుల రామకృష్ణారావు: 1899 మార్చి 13న నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో జన్మించారు. ఇతని గ్రామం బూర్గుల. కేరళ, ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పని చేశారు. ఇతడి పేరు మీద బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేద కళాశాలను ఏర్పాటు చేశారు. ఇతడి బయోగ్రఫీని వాజ్‌పేయి విడుదల చేశారు. ఉమర్ ఖయ్యూం, పండిత రాజ పంచామృతం, సారస్వత వ్యాస ముక్తావళి, కృష్ణ రాజ శతకం వంటి రచనలు చేశారు.
మందుముల నరసింగరావు: 1896 మార్చి 17న తలకొండపల్లి (రంగారెడ్డి)లో జన్మించారు. రయ్యత్ పత్రిక (ఉర్దూ) స్థాపించారు. ‘50 సంవత్సరాల హైదరాబాద్’ అనే పుస్తకం రాశారు.
కొండా వెంకట రంగారెడ్డి: ఇతడి స్వస్థలం పెద్ద మంగళారం (రంగారెడ్డి జిల్లా). 1890 డిసెంబర్ 12న జన్మించారు. ఇతను ఇందిరా సేవాసదన్ సభ్యుడు. ఎ.వి. కాలేజ్ అనే విద్యాసంస్థ స్థాపించారు. ‘మై ఆటోగ్రఫీ బై కె.వి. రంగారెడ్డి’ ఇతని జీవిత చరిత్రను తెలుపుతుంది.
కొండా లక్ష్మణ్ బాపూజీ: కొండా లక్ష్మణ్ వాంకిడి (ఆసిఫాబాద్)లో 1915 సెప్టెంబర్ 27న జన్మించారు. గాంధీజీ ప్రభావంతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1952లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1957లో చిన్నకొండూర్ (భువనగిరి) నుంచి గెలుపొందారు. మండల్ కమిషన్ సిఫారసులను రాజీవ్‌గాంధీ వ్యతిరేకించినందుకు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం వదులుకున్నారు. రెడ్డి ఉమెన్స్ స్కూల్ స్థాపించాడు. బాల్య, వితంతు వివాహాల నిషేధానికి కృషి చేశారు.
మీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ (మీర్ అహ్మద్ అలీ): 1877 జూలై 11న జన్మించారు. ఇతను హైదరాబాద్ రాష్ట్ర మొదటి చీఫ్ ఇంజినీర్. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్, నిజాం సాగర్లను నిర్మించారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులైన వైరా, పాలేరు, ఫతేనగర్ నిర్మించారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ, హైదరాబాద్ హౌస్‌లను అద్భుతంగా కట్టించారు. నిజామాబాద్‌లోని డ్యాంకు అలీసాగర్గా నామకరణం చేశారు. తెలంగాణ ప్రభుత్వం జూలై 11ని తెలంగాణ ఇంజినీర్స్ డే గా నిర్వహించుకోవాలని ప్రకటించింది.
నవాబ్ అలీయావర్ జంగ్: హైదరాబాద్‌లో 1906లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా పని చేశారు. అర్జెంటీనా, ఈజిప్ట్, ఫ్రాన్స్, అమెరికా దేశాలకు రాయబారిగా పని చేశారు. 1971లో మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేశారు. పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు పొందారు.
వామపక్ష ఉద్యమం
కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ
- 1934లో ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాశ్ నారాయణ, అచ్యుత పట్వర్థన్‌లు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని స్థాపించి కార్మిక, కర్షకులను సోషలిజం వైపు మళ్లించారు.
కమ్యూనిస్ట్ ఉద్యమం - భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతల్లో ఎం.ఎన్ రాయ్ ముఖ్యుడు. ఈయన అసలు పేరు నరేన్ భట్టాచారి. ఈయన రష్యన్ బోల్షివిక్ అయిన మైఖేల్ బోరోదిన్తో పరిచయం పెంచుకున్నాడు.
- 1920లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సదస్సుకు హాజరయ్యారు. ఇందులో వలస దేశాల్లో కమ్యూనిస్ట్‌లు అనుసరించాల్సిన వైఖరి మీద లెనిన్, రాయ్‌ల మధ్య వివాదం ఉత్పన్నమైంది. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
- బూర్జువా వర్గం నాయకత్వంలో జరిగే జాతీయోద్యమాలకు విశాల ప్రాతిపదికన మద్దతునివ్వాలని లెనిన్, కాదని రాయ్ వాదించుకున్నారు.
- 1920లో తాష్కెంట్ (రష్యా)లో భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపితమైంది. స్థాపకులు ఎం.ఎన్. రాయ్, అబానీ ముఖర్జీ, మహ్మద్ అలీ, మహ్మద్ షఫీజ్. రాయ్ 1922లో తన రాజకీయ కార్యాలయాన్ని బెర్లిన్‌కు మార్చాడు.
- రాయ్‌తో భారతదేశంలోని కొందరు కమ్యూనిస్ట్ అభిమానులు సంబంధాలు పెట్టుకున్నారు. వారిలో నళినీ గుప్తా, షౌకత్ ఉస్మానీ, ఎస్.ఎ. డాంగే, ముజఫర్ అహ్మద్, సింగారవేలు ముఖ్యులు.
- 1922లో బొంబాయి నుంచి డాంగే సారథ్యంలో వెలువడిన సోషలిస్ట్ అనే వార పత్రిక దేశంలో ప్రచురితమైన మొట్టమొదటి కమ్యూనిస్ట్ పత్రిక.
- 1925లో కాన్పూరులో భారత కమ్యూనిస్ట్ సదస్సు జరిగింది. ఇదే కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవానికి నాందిగా చెప్పవచ్చు. 1926లో ఇంగ్లండ్ నుంచి వచ్చిన ఫిలిప్ స్ప్రాట్ దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ప్రచారం చేశాడు.
- 1929-34 మధ్య ఏఐటీయూసీ నాయకత్వం చేజిక్కించుకుంది. ఇది పార్టీ సాధించిన విజయం.
- 1934 ఏప్రిల్ 3న జౌళి కార్మికులచే సమ్మె చేయించి ప్రభుత్వ ఆగ్రహానికి గురై, నిషేధం ఎదుర్కొంది. నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 1934-41 మధ్య నిషేధం కొనసాగింది.
- పార్టీపై నిషేధం ఉన్న దశలో కమ్యూనిస్ట్‌లు కాంగ్రెస్‌లోకి, జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలోని కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలోకి, సుభాష్‌చంద్రబోస్ నాయకత్వంలో Left Consolidation Committee లోకి ఆహ్వానించబడ్డారు. కానీ 1940 నాటికి ఈ రెండు సంస్థల నుంచి బహిష్కరించబడ్డారు.
- రెండో ప్రపంచ యుద్ధం కమ్యూనిస్టులకు చిక్కులు తెచ్చింది. రష్యా విధేయులైన వీరు బ్రిటన్, రష్యాలు ఒకే కూటమిలో ఉండడంతో రష్యా కోరిక మేరకు బ్రిటన్ను సమర్థిస్తూ దేశంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించారు.
- ఫలితంగా 1945లో కేంద్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవలేకపోయింది. అయినప్పటికి స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో సామ్యవాదాన్ని ప్రచారం చేసిన ఘనత ఈ పార్టీకే దక్కింది.
తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమకారులు
ప్రొ.కొత్తపల్లి జయశంకర్
- హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో 1934 ఆగస్టు 6న జన్మించారు.
- తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తల్లడిల్లుతున్న తెలంగాణ, తెలంగాణ రాష్ట్రంపై విస్తృత అంగీకారం-నిజనిజాలు వంటి రచనలు చేశారు.
- తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు ఉంది. ఇతని స్వీయ చరిత్ర అయిన ‘వొడవని ముచ్చట్లు’ కొంపల్లి వెంకట్‌గౌడ్ రచించాడు.
కేశవరావ్ జాదవ్
- ఇతడు తనని తాను ‘మిస్టర్ తెలంగాణ’ అని పేర్కొంటాడు. ప్రొ. కేశవరావ్ జాదవ్ తండ్రి శంకర్రావ్ జాదవ్ తన పేరు చివర ‘హైద్రాబాది’ అని రాసుకునేవారు. సాయుధ పోరాటం చేసిన కూర రాజన్న, గద్దర్లకు ఇతడు గురువు.
ప్రొ. కోదండరాం
- ఇతడి స్వస్థలం మంచిర్యాల. 1955లో జన్మించారు. అసలు పేరు కోదండరామిరెడ్డి. సమాజంలోని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తన పేరు పక్కన ఉన్న ‘రెడ్డి’ పదం వదిలివేశాడు.
- కోదండరాం కన్వీనర్‌గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 2009 డిసెంబర్ 24న తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన
1. పల్లె పల్లె పట్టాలపైకి (2011 మార్చి 1)
2. మిలియన్ మార్చ్ (2011 మార్చి 10)
3. తెలంగాణ మార్చ్ (2012 సెప్టెంబర్ 30
4. సడక్ బంద్ (2013 మార్చి 21)
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
- సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామం లో 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. 1985లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985-2004 మధ్య నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.
- 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.
- 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ అనుకూల ప్రకటన చేయడంలో ముఖ్య కారకుడయ్యారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
గద్దర్
- గద్దర్ 1949లో తూప్రాన్‌లో జన్మించారు. అసలు పేరు గుమ్మడి విఠల్‌రావ్. విఠల్ తన పాటల పుస్తకానికి ‘గదర్’ అని నామకరణం చేయగా అదే తన పేరుగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది.
- 1969 తెలంగాణ తొలి ఉద్యమంలో బుర్రకథల ద్వారా ప్రజలకు చైతన్యం కలిగించారు. బి. నరసింహారావుచే ఏర్పాటు చేయబడిన ‘కళా ప్రేమికుల సంఘం’లో గద్దర్ ప్రదర్శన చేశాడు.
- కళాప్రేమికుల సంఘాన్ని జననాట్య మండలిగా 1972లో మార్చారు. తన విప్లవ భావజాలాలను ఒగ్గుకథ, వీధి బాగోతం, ఎల్లమ్మ కథల ద్వారా తెలియజేస్తూ రైతుల్లో, కూలీల్లో కొత్త శక్తి నింపేవారు.
- 2010లో తెలంగాణ ప్రజాఫ్రంట్ స్థాపించారు. తెలంగాణ ప్రజల అక్షరాస్యుల-నిరక్షరాస్యుల మధ్య వారధిగా పాటలు మలిచిన మేధావి గద్దర్ అని పేర్కొన్నది- కంచె ఐలయ్య
ప్రొ. ఘంటా చక్రపాణి
- 1965లో కరీంనగర్లో జన్మించారు. నమస్తే తెలంగాణలో ఘంటాపథం పేరుతో కాలమ్స్ రాశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా, రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా పని చేశారు. మేముసైతం, సమాజ శాస్త్ర మూల సూత్రాలు, బొగ్గిపొరలో అగ్గిబావుట వంటి రచనలు చేశారు.
శ్రీకాంతాచారి
- యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఇతడి స్వస్థలం. 1986 ఆగస్టు 15న జన్మించారు. 2009 నవంబర్ 29న హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. డిసెంబర్ 3న ప్రాణాలు కోల్పోయారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడయ్యారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు