Biology | న్యూరాన్స్ అధిక ప్రజ్ఞా శక్తి సామర్థ్యానికి కేందమైన మెదడు భాగం?
బయాలజీ ( మార్చి 12 తరువాయి )
51. మానవ మూత్రపిండంలో వ్యర్థాల వడపోత జరిగే ప్రదేశం?
1) సమీపసంవలిత నాళం
2) హెన్లీ శిక్యం
3) రీనల్ గుళిక
4) దూరస్థసంవలిత నాళం
52. ఏ జీవులలో O2 ప్రత్యక్షంగా కణాల్లోకి వెళ్తుంది?
1) కీటకాలు 2) తేళ్లు
3) వానపాములు 4) సాలెపురుగు
53. జతపరచండి.
ఎ. న్యూరాన్ 1. ఊపిరితిత్తుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు
బి. నెఫ్రాన్ 2. మూత్రపిండాల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు
సి. వాయుగోణి 3. నాడీవ్యవస్థ నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు
డి. Amino Acids 4. ప్రొటీన్స్ నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు
1) ఎ-3, బి-1, సి-2, డి-4
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-2, బి-3, సి-4, డి-1
54. అవాయుశ్వాసక్రియలో అంత్యుత్పన్నం కానిది?
1) Co2 2) Lactic Acid
3) Ethanol 4) H2O
55. కింది వాటిలో వేరు రూపాంతరం కానిది?
1) డాలియా 2) క్యారెట్
3) అల్లం 4) టర్నిప్
56. మానవుడిలో ఊపిరితిత్తుల సంకోచ, సడలికలకు తోడ్పడేది?
1) గ్రసని 2) వాయునాళం
3) పక్కటెముక 4) విభాజక పటలం
57. ఏ నాడి క్లోమరసం ఉత్పత్తి, హృదయ స్పందన, రక్తనాళాలు, శ్వాసనాళికల చలనాన్ని నియంత్రిస్తుంది?
1) 9వ కపాల నాడి 2) 12వ కపాల నాడి
3) 10వ కపాల నాడి 4) 11వ కపాల నాడి
58. మానవుని మొత్తం ఊపిరితిత్తుల సామర్థ్యం?
1) 2.5 లీ. 2) 3.5 లీ.
3) 5 లీ. 4) 6.5 లీ.
59. ఊపిరితిత్తుల్లో మిగిలిన గాలి ఘనపరిమాణం?
1) 5 లీ. 2) 1.5 లీ.
3) 2.5 లీ. 4) 3 లీ.
60. శ్వాసవ్యవస్థలో బయటి ఇన్ఫెక్షన్కి గురయ్యే భాగం?
1) గ్రసని 2) శబ్దిని
3) శ్వాసనాళం 4) ఊపిరితిత్తి
61. పెద్దవారిలో సగటు శ్వాసక్రియ రేటు?
1) 10/ని. 2) 18/ని.
3) 20/ని. 4) 25/ని.
62. శ్వాసనాళాల్లో శ్లేష్మం పోగవడం, మ్యూకస్ పొర వాపునకు గురవ్వడం అనే అంశాలు X-ray పరీక్షల్లో తెలిస్తే ఆ వ్యక్తి ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?
1) న్యుమోనియా 2) ఫ్లోరోసిస్
3) టీబీ 4) ఆస్తమా
63. పెద్దవారిలో హీమోగ్లోబిన్ సాధారణ స్థాయి?
1) 10 gm/100 ml
2) 14 gm/100 ml
3) 18 gm/100 ml
4) 22 gm/100ml
64. జతపరచండి.
ఎ. కీటకాలు 1. చర్మం
బి. వానపాము 2. పుస్తకాకార ఊపిరితిత్తులు
సి. తేలు 3. మొప్పలు
డి. చేపలు 4. వాయునాళాలు
1) ఎ-4, బి-1, సి-3, డి-2
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-1, బి-4, సి-2, డి-3
4) ఎ-1, బి-2, సి-3, డి-4
65. బ్లడ్ ప్రెషర్ని నియంత్రించే అంతస్రావిక గ్రంథి?
1) థైరాయిడ్ 2) పిట్యూటరీ
3) అడ్రినల్ 4) పారాథైరాయిడ్
66. మొక్కల పత్రాల నుంచి ఇతర భాగాలకు పిండిపదార్థాల సరఫరా, భూమి నుంచి నీరు, ఖనిజ లవణాల సరఫరాలో పాల్గొనే భాగాలు వరుసగా?
1) పోషక కణజాలం, లాటిస్ ఫెరస్ కణజాలం
2) దారువు, పోషక కణజాలం
3) దారువు, లాటిన్ ఫెరస్ కణజాలం
4) పోషక కణజాలం, దారువు
67. పత్రరంధాలను ఆవరిస్తూ ఉండే రక్షకకణాలను నియంత్రించి పత్రరంధ్రాలు తెరుచుకోవడంలో తోడ్పడేవి?
1) Ca 2) K
3) Mg 4) Na
68. జతపరచండి.
ఎ. మెగ్నీషియం 1. ప్రొటీన్ల తయారీ, మొక్కల్లో పెరుగుదల & అభివృద్ధి
బి. నత్రజని 2. పాల ఉత్పత్తి, ఎముకల నిర్మాణం, కండర సంకోచం
సి. కోబాల్ట్ 3. క్యాన్సర్ చికిత్స, బి12 విటమిన్ తయారీ
డి. కాల్షియం 4. పత్రహరితంలో కేంద్ర అణువు
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-1, బి-4, సి-2, డి-3
4) ఎ-1, బి-2, సి-4, డి-3
69. RBC జీవితకాలం?
1) 2 నెలలు 2) 3 నెలలు
3) 4 నెలలు 4) 5 నెలలు
70. ఆర్బీసీ విచ్ఛిత్తి తర్వాత ఏర్పడిన Fe?
1) పైత్యరసంగా మారుతుంది
2) క్లోమరసంగా మారుతుంది
3) యూరిన్ ద్వారా బయటకు వెళ్తుంది
4) కాలేయంలో నిల్వ ఉంటుంది
71. కంటిలోని కటకానికి ఆహార సరఫరా చేసేది?
1) దృక్ ద్రవం 2) Aquous Humour
3) Vitereous Humour
4) Schlemm Humour
72. కంటిలోని ఏ భాగం కెమెరా వలె పనిచేస్తుంది?
1) కనుపాప 2) కటకం
3) శుక్లపటలం 4) కనురెప్ప
73. పరితారికలో వర్ణద్రవ్యం లేకుంటే ఆ వ్యక్తి కంటి రంగు?
1) బ్రౌన్ 2) గ్రీన్
3) బ్లాక్ 4) బ్లూ
74. కంటిలోని ఏ భాగం కెమెరాలోని డయాఫ్రమ్ / షట్టర్ వలె పరిచేస్తుంది?
1) కార్నియా 2) కంటిరెప్ప
3) కనుపాప 4) సరితారిక/ఐరిస్
75. మానవుని దంత విన్యాసం?
1) ఏకవారదంతి 2) ద్వివారదంతి
3) త్రివారదంతి 4) బహువారదంతి
76. మానవుడిలో మొదటి పాలదంతం?
1) కుంతకం 2) రదనిక
3) అగ్రచర్వణకం 4) చర్వణకం
77. మానవునిలో మొదటి శాశ్వత దంతం?
1) మొదటి చర్వణకం
2) మూడవ చర్వణకం
3) మొదటి అగ్రచర్వణకం
4) మూడవ అగ్రచర్వణకం
78. మానవుని 32 దంతాల్లో అతిచిన్నది?
1) మొదటి అగ్రచర్వణకం
2) మొదటి చర్వణకం
3) మూడవ అగ్రచర్వణకం
4) మూడవ చర్వణకం
79. మానవుని శాశ్వత దంతవిన్యాసం?
1) కుంతకాలు-4, రదనికలు-4, అగ్రచర్వణకాలు-6, చర్వణకాలు-6
2) కుంతకాలు-6, రదనికలు-2, అగ్రచర్వణకాలు-8, చర్వణకాలు-4
3) కుంతకాలు-8, రదనికలు-4, అగ్రచర్వణకాలు-6, చర్వణకాలు-2
4) కుంతకాలు-8, రదనికలు-4, అగ్రచర్వణకాలు-8, చర్వణకాలు-12
80. మానవుని అతిపెద్ద దంతం?
1) 3వ అగ్రచర్వణకం
2) 1వ చర్వణకం
3) 3వ చర్వణకం 4) 2వ అగ్రచర్వణకం
81. ఏనుగుదంతాలు, అడవిపందిలో పొడవైన దంతాలు, పాము కోర పళ్ల రూపాంతరం (వరుసలో)?
1) కుంతకం, రదనిక, అగ్రచర్వణకం
2) కుంతకం, కుంతకం, రదనిక
3) కుంతకం, రదనిక, రదనిక
4) కుంతకం, అగ్రచర్వణకం, రదనిక
82. దంతాన్ని కప్పుతూ ఉండే ఎనామిల్కి సంబంధించినది గుర్తించండి.
1) ఎనామిల్ లోని కణాలు నిర్జీవం
2) ఇది శరీరంలోని గట్టి పదార్థం
3) ఇది చాలా నెమ్మదిగా తిరిగి ఏర్పడుతుంది
4) పైవేవీకావు
83. ఎనామిల్ తరిగి, తిరిగి ఏర్పడే జంతువులు?
1) పాములు 2) ఎలుక
3) అడవిపంది 4) కుందేలు
84. కుక్కలో దంతాల సంఖ్య?
1) 36 2) 40
3) 42 4) 44
85. మానవునిలో ప్రతి ఎముక మరో ఎముకతో కలుస్తుంది. కానీ ఏ ఎముక కలవదు?
1) హాయాయిడ్ ఎముక
2) టిబియా 3) అరచేయి వేళ్లు
4) అరికాలి వేళ్లు
86. కింది వాటిలో ఏ ఎముకలో ఆర్బీసీ ఏర్పడుతుంది?
1) తొడ ఎముక 2) దండచేయి
3) రేడియ 4) పక్కటెముకలు
87. పిల్లవాని ఎముకలు యాక్సిడెంట్లో విరిగాయి. అయితే అతని ఎముకలు తొందరగా అతికాయి కారణం?
1) అవి మృదులాస్థి నిర్మితం
2) వాటిలో లిగమెంట్స్ ఎక్కువ
3) ఖనిజ లవణాలు తక్కువగా ఉండి తంతుకణజాలం ఎక్కువ
4) ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండి తంతుకణజాలం తక్కువ
88. జతపరచండి.
ఎ. చెవి ఎముకలు 1. 60
బి. వెన్నె ముక 2. 60
సి. చేతులు 3. 24
డి. కాళ్లు 4. 6
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-1, బి-2, సి-4, డి-3
3) ఎ-4, బి-2, సి-1, డి-3
4) ఎ-4, బి-3, సి-1, డి-2
89. శరీరంలో అతిచిన్న ఎముక, కండరం, అతిపెద్ద ఎముక, కండరం వరుస క్రమంలో?
1) స్టెపిడియస్, స్టేపిస్, పిరుదు కండరం, ఫీమర్
2) పిరుదు ఎముక, ఫీమర్, స్టేపిస్, స్టెపీడియస్
3) స్టేపిన్, స్టెపీడియస్, ఫీమర్, కంటి కండరం
4) స్టేపిస్, స్టెపీడియస్, ఫీమర్, గ్లుటామాక్జిమస్
90. రెండు ఎముకలను కలుపుతూ సాగే, సులువైన కదలికకు తోడ్పడేది?
1) మృదులాస్థి 2) లిగమెంట్
3) టెండాన్ 4) సైనోవియల్ ద్రవం
91. ఎముకను, కండరాన్ని కలిపే గట్టి తంతుకణజాల సాగలేని తంతువు?
1) కార్టిలేజ్ 2) లిగమెంట్
3) టెండాన్ 4) సైనోవియల్ ద్రవం
92. కింది వాటిలో ఏది పేరుకుపోవడం వల్ల కండర అలసట కలుగుతుంది?
1) పైరూవిక్ ఆమ్లం 2) లాక్టిక్ ఆమ్లం
3) ఎసిటిక్ ఆమ్లం 4) ఇథనాల్
93. నియంత్రిత కండరాల నియంత్రణ, శరీర సమతాస్థితికి కారణమై, మత్తుమందులు ఇచ్చినప్పుడు, ఆల్కహాల్ వల్ల పనిచేయని మెదడు భాగం?
1) మస్తిష్కం 2) వెన్నుపాము
3) అనుమస్తిష్కం 4) మజ్జాముఖం
94. బయాప్సీ అంటే?
1) చనిపోయిన శరీర ఎముకలను పరిశీలించడం
2) చనిపోయిన శరీరం నుంచి కణజాలం తీసి పరిశీలించడం
3) దేహంలోని అనుమానిత భాగం నుంచి తీసిన కణజాల పరిశీలన
4) అంతర్గత భాగాల పరీక్ష
95. వేసవి (లేదా) పొడి పరిస్థితుల్లో సుప్తావస్థలో ఉండటం?
1) ఈస్టివేషన్
2) హైబర్నేషన్
3) రివర్స్ హైబర్నేషన్
4) పాపిల్లేషన్
96. ఈస్టివేషన్లో పాల్గొనే జీవి?
1) ఊపిరితిత్తి చేప 2) సిల్వర్ చేప
3) బల్లి 4) వానపాము
97. న్యూరాన్స్ ఎంతకాలం ఆక్సిజన్, ఆహారం సరఫరా కాకపోతే చనిపోతాయి?
1) 10-20 సెకన్లు 2) 1-2 సెకన్లు
3) 3-4 నిమిషాలు 4) 6-8 నిమిషాలు
98. మెదడులోని ఏ భాగంలోని న్యూరాన్స్ అధిక ప్రజ్ఞాశక్తి సామర్థ్యానికి కేంద్రం?
1) ఎరుపు పదార్థం 2) పసుపు పదార్థం
3) తెలుపు పదార్థం 4) బూడిద పదార్థం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు