SSC Social Studies Model Paper | పదోతరగతి సాంఘికశాస్త్రం మాదిరి ప్రశ్న పత్రం
సాంఘికశాస్త్రం (తెలుగు మీడియం),
సమయం: 3.00 గంటలు
గరిష్ఠ మార్కులు: 80
భాగం-A, సమయం:2.30 గంటలు,
గరిష్ఠ మార్కులు: 60
విభాగం-I 6×2=12 మార్కులు
1. తూర్పు, పశ్చిమ కనుమల మధ్యనున్న ఏవేని రెండు భేదాలను తెలపండి?
2. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏది?
3. యుద్ధాల నివారణ ఆవశ్యకతపై ఏవేని రెండు నినాదాలు రాయండి?
4. వలసల నివారణకు చేపట్టవలసిన చర్యలను సూచించండి?
5. తెలంగాణ అవుట్లైన్ పటం గీసి మీ జిల్లాను గుర్తించండి?
6. కింది పట్టికను పరిశీలించి ఎ, బి ప్రశ్నలకు సమాధానాలు రాయండి
ఎ. ఏ రంగంలో ఉపాధి అవకాశాల్లో ఎక్కువ పెరుగుదల నమోదైంది?
బి. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాల
క్షీణతకు కారణాలు ఏవి?
విభాగం-II 6×4=24 మార్కులు
7. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల మధ్య గల భేదాలు రాయండి?
8. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మలిదశలో చేపట్టిన వివిధ ఉద్యమాలను వివరించండి?
9. ఓటు హక్కు ప్రాధాన్యం తెలిపే కరపత్రం తయారు చేయండి?
10. కింది పేరాను చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించండి.
నీళ్లు అన్నవి ప్రవహించే ఉమ్మడి వనరు అని గుర్తించే చట్టాలు, నియమాలు అవసరం, తాగునీటికి మొదటి స్థానం ఇవ్వడంతో పాటు పొందడం అనేది మానవ హక్కు కూడా. భూగర్భ జలాల వినియోగంపై పంచాయతీరాజ్ సంస్థలకు నియంత్రణ ఉండాలి.
11. కింది రేఖా చిత్రాన్ని పరిశీలించి విశ్లేషించండి.
12. భారతదేశ పటాన్ని పరిశీలించి ఎ, బి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
బి) గంగానది పరివాహక ప్రాంతంలో అధిక జన సాంద్రతకు గల కారణాలు ఏవి?
విభాగం-III 4X6=24 మార్కులు
13. ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడానికి అమెరికా, జర్మనీలు తీసుకున్న చర్యలను వివరించండి?
14. భారతదేశంపై ప్రపంచీకరణ అనుకూల, ప్రతికూల ప్రభావాలను చర్చించండి?
15. కింది ‘పై’ డయాగ్రామ్లను పరిశీలించి విశ్లేషించండి.
16. ఆహార భద్రతా చట్టం-2013 సమర్థవంతంగా అమలు పరచటానికి సూచనలు ఇవ్వండి?
17. కింద ఇవ్వబడిన పేరాను చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించండి.
దేశ విభజన సమయంలో జరిగిన ఘోరాల తర్వాత రాజకీయ రంగం నుంచి మతాన్ని దూరంగా ఉంచడానికి కొంత ప్రయత్నం జరిగింది. అయితే ఆ తర్వాత కాలం మత ధోరణి ఉన్న కొత్త రాజకీయ సమీకరణను చవిచూసింది. రాజకీయ ఉద్దేశాలకు మతాన్ని వాడుకోవడం, ప్రభుత్వ పక్షపాత ధోరణి కారణంగా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీసి దేశ ఐక్యత, సమగ్రతలనే ప్రశ్నార్థకంగా మార్చింది.
18. మీకీయబడిన ప్రపంచ పటంలో కింది ప్రదేశాలను గుర్తించండి.
ఎ) ఇజ్రాయెల్
బి) వర్సెయిల్స్ ఒప్పందం జరిగిన దేశం
సి) పోర్చుగల్
డి) సూయజ్ కాలువ
ఇ) జపాన్
ఎఫ్) మధ్యదరా సముద్రం
భాగం-బి 20 మార్కులు
సమయం : 30 నిమిషాలు
1. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం? (బి)
ఎ) శేషాచలం కొండలు
బి) అరోమాకొండలు
సి) పాలకొండలు డి) వెలికొండలు
2. V ఆకారపు లోయలు ఈ నదుల ప్రవాహాల్లో కనబడతాయి? (ఎ)
ఎ) సింధూ, బ్రహ్మపుత్ర
బి) గంగా, యమున
సి) కృష్ణా, గోదావరి
డి) కావేరి, పెన్నా
3. జనాభా మార్పు అనగా? (బి)
ఎ) గత ఐదేళ్లలో ప్రజల సంఖ్యలో వచ్చిన మార్పు
బి) గత పదేళ్లలో ప్రజల సంఖ్యలో వచ్చిన మార్పు
సి) గత 20 ఏళ్లలో ప్రజల సంఖ్యలో వచ్చిన మార్పు
డి) గత 30 ఏళ్లలో ప్రజల్లో వచ్చిన మార్పు
4. 2015 సంవత్సరం నాటికి సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న రాష్ట్రం? (డి)
ఎ) కేరళ బి) పంజాబ్
సి) తెలంగాణ డి) సిక్కిం
5. తొలి రష్యన్ విప్లవానికి గల మరోపేరు? (ఎ)
ఎ) మార్చి విప్లవం
బి) ఫిబ్రవరి విప్లవం
సి) పారిశ్రామిక విప్లవం
డి) రక్తరహిత విప్లవం
6. రెండో ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం? (సి)
ఎ) సైనికవాదం
బి) రహస్య ఒప్పందాలు
సి) హిట్లర్ పోలెండ్పై దండెత్తడం
డి) జాతీయవాదం
7. అమెరికా మిత్ర రాజ్యాల పక్షాన యుద్ధంలో చేరడానికి గల కారణం? (సి)
ఎ) వర్సెయిల్స్ సంధి ఒప్పందం
బి) అమెరికా సామ్రాజ్య కాంక్ష
సి) జర్మనీ సైన్యాలు అమెరికా నౌకను ముంచివేయడం
డి) అమెరికా ప్రజల ఒత్తిడి
8. చైనాలో ‘మే’ నాలుగు ఉద్యమ ఆశయాల్లో లేని అంశం? (డి)
ఎ) జాతీయవాదం
బి) ప్రజాస్వామ్యం
సి) ఆధునిక విజ్ఞాన శాస్త్రం
డి) వ్యవసాయిక విప్లవం
9. ముస్లింలీగ్ పార్టీ ఆరంభంలో వీరి ప్రయోజనాల ప్రాతినిథ్యం కోసం పని చేసింది?
ఎ) ముస్లిం భూ స్వాముల ప్రయోజనాలు
బి) పెషావర్, సింధు, లాహోర్ ముస్లింల ప్రయోజనాలు
సి) అల్ప సంఖ్యాక వర్గాలకు నియోజకవర్గాల సాధన
డి) భారత జాతీయ కాంగ్రెస్ ప్రయోజనాలు
10. 61వ రాజ్యాంగ సవరణకు ఉన్న ప్రత్యేకత ? (ఎ)
ఎ) ఓటింగ్ వయస్సు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గింపు
బి) స్థానిక సంస్థలకు విస్తృతాధికారాలు
సి) ప్రజాప్రతినిధులు పార్టీలు మారితే పదవిని కోల్పోవడం
11. బ్రిటన్కు వలస దేశం కానిది? (డి)
ఎ) భారతదేశం బి) మయన్మార్
సి) నైజీరియా డి) వియత్నాం
12. కింది వాటిలో తూర్పు వైపు ప్రవహించని నది? (సి)
ఎ) గోదావరి బి) మహానది
సి) తపతీ డి) పెన్నానది
13. కింది సంఘటనలను క్రమానుగతంలో పేర్కొనండి. (బి)
1. పెద్దమనుషుల ఒప్పందం
2. జై ఆంధ్ర ఉద్యమం
3. తెలంగాణ ఉద్యమం
4. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం
ఎ) 4, 3, 1, 2 బి) 1, 3, 2, 4
సి) 2, 3, 4, 1 డి) 3, 2, 1, 4
14. ఎన్నికల కమిషన్ విధుల్లో లేనిది? (సి)
ఎ) ఓటర్ల జాబితా తయారీ
బి) రాజకీయ పార్టీలకు గుర్తుల కేటాయింపు
సి) ప్రధానమంత్రి ఎన్నిక నిర్వహణ
డి) రాష్ట్రపతి ఎన్నిక నిర్వహణ
15. కింది వాటిలో సరైన జతలను ఎన్నుకోండి. (బి)
1. కృహత్బందీ ఎ) అధిక సంతానం నిషేధించడం
2. చెరాయిబందీ బి) చెట్ల నరికివేతను నిషేధించడం
3. నషాబందీ సి) పశువుల్ని స్వేచ్ఛగా మేపకుండా నిషేధించడం
4. నస్ బందీ డి) మత్తు పానీయాలను నిషేధించడం
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
డి) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
16. సరైన జతను గుర్తించండి. (బి)
ఎ) కోరమాండల్ తీరం – మహారాష్ట్ర
బి) కెనరాతీరం – కర్ణాటక
సి) మలబార్ తీరం- గోవా
డి) కొంకణ్ తీరం – తమిళనాడు
17. కింది వాక్యాల్లో సరికాని దాన్ని గుర్తించండి. (డి)
ఎ) రాచెల్కార్సన్ సైలెంట్ స్ప్రింగ్ పుస్తకం రాశారు
బి) ఎండోసల్ఫాన్ జీడిమామిడి తోటల్లో పురుగుల నివారణ కోసం పిచికారీ చేశారు
సి) కాసర్గాథ్లో గాలి, నీరు కలుషితం కావడంతో 5,000 మంది మరణించారు
డి) నేటికి ఎండోసల్ఫాన్ డి.డి.టి పిచికారీ పురుగుల నివారణకు సమర్థంగా పని చేస్తుంది
18. ైక్లెమోగ్రాఫ్లు ఒక భౌగోళిక ప్రదేశం కింది స్థితిని తెలుపుతాయి. (సి)
ఎ) సగటు వ్యవసాయ ఉత్పత్తిని
బి) గనుల లభ్యతను
సి) ఉష్ణోగ్రత, వర్షపాతం డి) పవనాలు
19. నీతిఆయోగ్ చైర్పర్సన్? (ఎ)
ఎ) ప్రధానమంత్రి బి) రాష్ట్రపతి
సి) లోక్సభ స్పీకర్
డి) ప్రధాన న్యాయమూర్తి
20. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి? (బి)
ఎ) వై.వి. చంద్రచూడ్
బి) డి.వై. చంద్రచూడ్
సి) ఎన్.వి. రమణ
డి) బాలకృష్ణ
డాక్టర్. రాచర్ల గణపతి
పాఠ్యపుస్తకాల రచయిత & విషయ నిపుణులు
హనుమకొండ
9963221590
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?