Science & Technology | కుంకుమపువ్వులో ఆర్థికంగా ఉపయోగపడే భాగం?
1. వృక్ష, జంతుజీవుల్లో గల వైవిధ్యాన్ని ఏమంటారు?
1) ఫానా 2) ఫ్లోరా
3) బయోటా 4) ఏదీకాదు
2. కింది వాటిలో ఏ జీవుల్లో పత్రహరితం లోపించి, శోషణ ద్వారా ఆహారం సేకరిస్తాయి?
1) బ్యాక్టీరియా 2) శిలీంధ్రాలు
3) శైవలాలు 4) ఆవృత బీజాలు
3. కింది వాటిలో థాలోఫైటాకు చెందినవి?
1) శైవలాలు 2) శిలీంధ్రాలు
3) లైకెన్లు 4) పైవన్నీ
4. కింది వాటిలో బ్రయోఫైట్ కానిది?
1) లివర్వర్ట్ 2) హార్న్వర్ట్
3) సయనోబ్యాక్టీరియా
4) మాస్మొక్కలు
5. కింది వాటిలో టెరిడోఫైటాకు చెందినది?
1) మార్కాన్షియా 2) రిక్సియా
3) ఫ్యునేరియా 4) ఫెర్న్
6. కింది వాటిలో నాలుగు గదుల హృదయం కనిపించనిది?
1) పక్షులు 2) మొసళ్లు
3) క్షీరదాలు 4) సరీసృపాలు
7. కింది వాటిలో నీలి ఆకుపచ్చ శైవలం ఏది?
1) సయనోబ్యాక్టీరియా 2) ఎసిటోబాక్టర్ 3) అజటో బాక్టర్ 4) పైవన్నీ
8. జీవకోటికి అవసరమైన ఆక్సిజన్ మొక్కల్లో జరిగే కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కింది ఏ పదార్థం నుంచి విడుదలవుతాయి?
1) CO2 2) H2O
3) ఖనిజమూలకాల ఆక్సైడ్లు
4) కార్బోనేట్స్
9. విటమిన్ బి12 లభించే పదార్థాలు?
1) పుట్టగొడుగులు, గింజలు, కాయలు
2) పాల ఉత్పత్తులు, కిణ్వన ఉత్పత్తులు
3) రొట్టె, బియ్యం, చిక్కుడు
4) పైవన్నీ
10. కింది వాటిలో ఏ క్షీరదం నడిచేటప్పుడు పూర్వాంగాలు, చరమాంగాలు ఒకేసారి కదులుతాయి?
1) నీల్గాయ్ 2) జిరాఫీ
3) జింక 4) ఒంటె
11. ఇండియన్ హెర్బల్ డాక్టర్ అని ఏ మొక్కను అంటారు?
1) తులసి 2) వేప
3) నీలగిరి 4) అశ్వగంధ
12. ‘కింగ్ ఆఫ్ ఉడ్’ అని, ప్రాక్దేశపు వృక్షరాజు అని పిలిచే, దృఢమైన కలపనిచ్చే మొక్క?
1) ఇండియన్ రోజ్ఉడ్ 2) టేకు
3) సాలిక్స్ 4) ఎర్రచందనం
13. ‘కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే ఫలం?
1) ఉసిరి 2) జామ
3) మామిడి 4) సిట్రస్ ఫలాలు
14. దేశంలో, తెలంగాణలో జాతీయవృక్షమైన అతిపెద్ద మర్రి ఫైకస్ బెంగాలెన్సిస్ అనే ఆవృత బీజ మొక్క కనపడే ప్రదేశం?
1) న్యూఢిల్లీ, మహబూబ్‌నగర్
2) అడయార్, అనంతపూర్
3) కలకత్తా, మహబూబ్‌నగర్
4) కలకత్తా, అనంతపూర్
15. కింది వాటిలో హాలోఫైట్ కానిది?
1) సుంద్రి 2) అవిసీనియా
3) రైజ్ఫోరా 4) స్ప్రూస్
16. వేరుపంటలుగా పిలిచే మొక్కలు?
1) క్యారెట్, బీట్రూట్
2) బీట్రూట్, ముల్లంగి
3) క్యారెట్, ముల్లంగి 4) పైవన్నీ
17. టమాటా, వంకాయ, మిరప శాస్త్రీయనామాలు వరుసగా?
1) లైకోపెర్సికం ఎస్కులెంటం, సొలానం మెలాంజినా, కాప్సికం ప్రూటిసెన్స్
2) కాప్సికం ప్రూటిసెన్స్, లైకోపెర్సికం ఎస్కులెంటం, సొలానం మెలాంజినా
3) లైకోపెర్సికం ఎస్కులెంటం, కాప్సికం ప్రూటిసెన్స్, సొలానం మెలాంజినా
4) సొలానం మెలాంజినా, లైకోపెర్సికం, ఎస్కులెంటం, కాప్సికం ప్రూటిసెన్స్
18. నత్రజని లోపించిన నేలలో పెరిగే కీటకాహార మొక్క కానిది ?
1) డ్రాసిరా, యుట్రిక్లేరియా
2) నెపంథిస్, డయోనియా
3) యుట్రిక్లేరియా, నెపంథిస్
4) సిల్లా, డయాంథస్
19. పత్రాల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపే పిల్ల మొక్కలను ఏర్పరిచే మొక్క?
1) నెపంథిస్ 2) చెరకు
3) మందార 4) బ్రయోఫిల్లం
20. అతిపెద్ద, చిన్న పత్రం గల మొక్కలు వరుసగా?
1) లెమ్నా, ఉల్ఫియా
2) ఉల్ఫియా, రఫ్లీషియా
3) విక్టోరియా అమెజోనికా, ఉల్ఫియా
4) విక్టోరియా అమెజోనికా, లెమ్నా
21. అతి చిన్న, పెద్ద పుష్పాలు గల మొక్కలు వరుసగా?
1) లెమ్నా, రఫ్లీషియా
2) ఉల్ఫియా, విక్టోరియా
3) లెమ్నా, విక్టోరియా
4) ఉల్ఫియా, రఫ్లీషియా
22. అతిపెద్ద శాఖీయ మొగ్గ, అతిపెద్ద పుష్పవిన్యాసాలు వరుసగా?
1) క్యాలీఫ్లవర్, రఫ్లీషియా
2) క్యాబేజీ, రఫ్లీషియా
3) క్యాబేజీ, అమార్ఫోఫాలస్
4) క్యాలీఫ్లవర్, క్యాబేజీ
23. కుంకుమపువ్వులో ఆర్థికంగా ఉపయోగపడే భాగం?
1) పూమొగ్గలు 2) రక్షక పత్రాలు
3) కీలాగ్రం 4) అండాశయం
24. బీర్లో ఆల్కహాల్ శాతం?
1) 50-60 2) 12-15
3) 3-6 4) 30-35
25. ఒక మొక్కను అడ్డంగా కోసినప్పుడు దానిలో 50 వార్షిక (లేదా) వృద్ధి వలయాలు ఉంటే, ఆ మొక్క వయస్సు ఎంత?
1) 50 సంవత్సరాలు
2) 100 సంవత్సరాలు
3) 25 సంవత్సరాలు
4) 75 సంవత్సరాలు
26. వార్షిక వలయాల అధ్యయనం?
1) డెండ్రోక్రోనాలజీ 2) ఆగ్రోస్టాలజీ
3) ఆంథాలజీ 4) డెండ్రాలజీ
27. ప్రపంచంలో అతి ఎక్కువగా స్మగ్లింగ్‌కు గురయ్యే, సంగీత పరికరాల తయారీకి తోడ్పడే చిత్తూరు, కడప, బళ్లారీ ప్రాంతాల్లో పెరిగే కలప?
1) టేకు 2) ఎర్రచందనం
3) చందనం 4) రోజ్‌వుడ్
28. పుష్పాలు, ఫలాల అధ్యయనం వరుసగా?
1) ఆంథాలజీ, డెండ్రాలజీ
2) పోమాలజీ, ఆంథాలజీ
3) డెండ్రాలజీ, పోమాలజీ
4) ఆంథాలజీ, పోమాలజీ
29. అత్యధిక ఉష్ణోగ్రత, అల్ప లవణీయతను తట్టుకునే లక్షణం?
1) స్టీనోథర్మల్, యూరీహాలైన్
2) యూరీథర్మల్, యూరీహాలైన్
3) యూరీథర్మల్, స్టీనోహాలైన్
4) స్టీనోథర్మల్, స్టీనోహాలైన్
30. క్రికెట్ బ్యాట్స్, హాకీస్టిక్స్ తయారీకి ఉపయోగపడే కలప వరుసగా?
1) మడకలప, సాలిక్స్
2) సాలిక్స్, మోరస్
3) మోరస్, విల్లో
4) డాల్బర్జియా, మోరస్
31. బంగాళదుంప అనేది?
1) వేరు 2) కణుపు
3) కాండం 4) పత్రమార్పు
32. ఎడారి మొక్కల్లో పత్రాలు ఏ ప్రక్రియను నివారించడానికి కంటకాలుగా మారుతుంది?
1) బాష్పోత్సేకం 2) బిందుస్రావం
3) ద్రవోద్గమం 4) ద్రవాభిసరణ
33. బిందుస్రావం పత్రం చివరకు ఉండే ఏ రంధ్రాల ద్వారా ప్రాతఃకాలంలో జరుగుతుంది?
1) పత్రరంధ్రాలు 2) వాయురంధ్రాలు
3) జలరంధ్రాలు 4) అవభాసిని
34. దారువు, పోషక కణజాలమును కలిపి ఏమంటారు?
1) వల్కలం 2) నాళికాపుంజము
3) దవ్వ 4) పరిచక్రం
35. విభాజ్య కణజాలం అధికంగా కనపడే ప్రాంతాలు?
1) కాండం కొన 2) వేరుకొన
3) మొగ్గ 4) పైవన్నీ
36. ఫలాలను వేగవంతంగా పక్వం చెందించడానికి తోడ్పడే కృత్రిమ రసాయనం?
1) కాల్షియం హైడ్రాక్సైడ్
2) కాల్షియం కార్బైడ్
3) జిబ్బరెల్లిన్స్ 4) అబ్‌సైసిక్ ఆమ్లం
37. సమవిభజనలో కండె పరికర ఏర్పాటును అడ్డుకొనే కాల్చిసిన్ అనే రసాయనం ఏ మొక్క నుంచి ఉత్పత్తి అవుతుంది?
1) కాల్చికం ఆటమ్నేల్
2) హిమటోైక్లెలాన్
3) ఇండిగోఫెరా
4) మేలస్ డోమెస్టికా
38. బట్టలకు నీలిరంగుగా ఉపయోగ పడే బ్లూడై లభించే మొక్క?
1) కాల్చికం ఆటమ్నేల్
2) హిమటో ైక్లెలాన్
3) ఇండిగోఫెరా
4) మేలస్ డోమెస్టికా
39. ఏ మొక్క పరాగరేణువుల వల్ల Hay Fever అనే ఎలర్జీ కలుగుతుంది?
1) పార్థీనియం 2) ఐకార్నియా
3) పిస్టియా 4) పైవన్నీ
40. లాధిరిస్ వల్ల కలిగే ‘లాధిరిజం’ అనే వ్యాధి ఏ వ్యవస్థకు సంబంధించినది?
1) నాడీవ్యవస్థ
2) రక్తప్రసరణ వ్యవస్థ
3) శ్వాసవ్యవస్థ
4) అంతస్రావక వ్యవస్థ
41. ఎలర్జీని కలిగించే మొక్కల్లో ఉండే రసాయనాలు?
1) హిస్టామిన్ 2) ఆైక్టెల్కోలిన్
3) ఎసిటైల్ కోలిన్ 4) 1, 2
42. కింది వాటిలో మొక్కల్లో ఉత్పత్తయ్యే హానికర సయనోజెనిక్ గ్లూకోసైడ్స్?
1) అమైగ్దాలిన్ 2) ధియోబ్రోమిన్
3) లినామరిన్ 4) పైవన్నీ
43. ఆవరణ సంబంధమైన హానికర మొక్క?
1) పిస్టియా 2) ఐకార్నియా
3) యుట్రిక్లేరియా 4) ఉల్ఫియా
44. నరాల సంబంధిత వ్యాధి అయిన ‘సియాటికా’ను నివారించడానికి నక్స్‌వామికా అనే మొక్క విత్తనాల నుంచి తీసే ఆల్కలాయిడ్?
1) రిసర్ఫిన్ 2) ఆట్రోపిన్
3) బ్రూసిన్ 4) ధియోబ్రోమిన్
45. బంగాళదుంప అధికంగా తినడం వల్ల కలిగే లక్షణం?
1) పక్షవాతం
2) అతిసార (డయేరియా)
3) న్యుమోనియా
4) బ్రాంఖైటీస్
46. కిరణజన్య సంయోగక్రియ రేటు ఏ రంగు కాంతిలో పడిపోతుంది?
1) ఎరుపు 2) నీలం
3) ఊదా 4) ఆకుపచ్చ
47. కిరణజన్య సంయోగక్రియపై ప్రభావం చూపే కారకాలు?
1) కాంతి 2) పత్రహరితం
3) నీరు 4) పైవన్నీ
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు