Indian Polity | కమిటీల ప్రణాళికలు.. పంచాయతీలకు రూపకల్పన
స్థానిక ప్రభుత్వాలు
- ప్రాచీన భారతదేశంలో ప్రతి గ్రామం చిన్న చిన్న రిపబ్లిక్‌లుగా ఉండేవి. చోళులు స్థానిక గ్రామీణ సంస్థలను, మౌర్యులు పట్టణ ప్రభుత్వాలను అభివృద్ధి చేశారు. మధ్యయుగ భారత్‌లో కొత్వాల్ అనే అధికారి మూలంగా స్థానిక సంస్థలు వాటి లక్షణాలు కోల్పోయాయి.
లార్డ్ మేయో
- అధికార వికేంద్రీకరణలో భాగంగా 1870లో స్థానిక ప్రభుత్వాలను భారత్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టాడు.
లార్డ్ రిప్పన్
- 1882, 1884 చట్టాల ప్రకారం భారత్‌లో స్థానిక ప్రభుత్వాలను అభివృద్ధి చేశారు. 1882 స్థానిక ప్రభుత్వాల చట్టాన్ని మాగ్నాకార్టా స్థానిక ప్రభుత్వ చట్టంగా అభివర్ణించారు.
- 1882 చట్టాన్ని అనుసరించి గ్రామ సముదాయంలో గ్రామ పంచాయతీ, తాలూకా స్థాయిలో తాలూగా బోర్డులు, జిల్లా స్థాయిలో జిల్లా బోర్డులు ఏర్పాటు చేశారు.
- స్థానిక సంస్థల పితామహుడిగా లార్డ్రిప్పన్ను పేర్కొంటారు.
రాయల్ కమిషన్ -1907
- బ్రిటిష్ ప్రభుత్వం భారత్‌లో స్థానిక ప్రభుత్వాల పని తీరును సమీక్షించేందుకు చార్లెస్ హబ్హౌజ్ అధ్యక్షతన రాయల్ కమిషన్ ఏర్పాటైంది.
- 1907లో కమిషన్ ఏర్పాటు కాగా 1909లో నివేదికను అందించింది. గ్రామాలు, తాలూకాలు, జిల్లా స్థానిక సంస్థల్లో, ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ప్రాతినిథ్యం ఎక్కువగా ఉండాలని.. అంటే ప్రత్యక్ష ఎన్నికలు ప్రవేశపెట్టమని సిఫారసు చేసింది.
భారత కౌన్సిల్ చట్టం -1909
- రాయల్ కమిషన్ సూచనల మేరకు ఈ చట్టం స్థానిక ప్రభుత్వాల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టింది.
- 1919లో మాంటేగ్-ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు ‘స్థానిక ప్రభుత్వాలు’ అనే అంశాన్ని రాష్ట్ర జాబితాలో చేర్చింది.
- 1919 నాటికి భారత్‌లో జిల్లా బోర్డుల సంఖ్య 207 (జిల్లాల సంఖ్య), తాలూకా బోర్డుల సంఖ్య-584
- 1934లో తాలూకా బోర్డులు రద్దు అయ్యాయి. జిల్లా బోర్డులు కొనసాగాయి.
భారత ప్రభుత్వ చట్టం -1935
- 1935 చట్టం స్థానిక సంస్థలకు పూర్తి స్వాతంత్య్రాన్ని అందించింది. 1959లో భారత్‌లో ప్రవేశపెట్టిన మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు 1935 చట్టం మూలాధారమైంది.
- గ్రామ స్వరాజ్ పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని గాంధీ పేర్కొన్నాడు.
- 4వ భాగం నిర్దేశిక నియమాల్లో 40వ నిబంధన గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంటుంది.
- రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో రాష్ట్ర జాబితాలో స్థానిక ప్రభుత్వాలను గురించి పేర్కొంటుంది.
- 73-1993 ప్రకారం 9వ భాగాన్ని ప్రవేశపెట్టి 243, 243 (ఎ)-243(ఒ) వరకు 16 నిబంధనలతో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు.
- 74-1993 ప్రకారం 9(ఎ) భాగాన్ని చేర్చి 243(పి)-243(2జి) వరకు 18 నిబంధనలతో పట్టణ ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటు.
- 73-1993 ప్రకారం 11వ షెడ్యూల్ ఏర్పాటు చేసి, దీనిలో 29 అంశాలతో కూడిన పంచాయతీరాజ్ వ్యవస్థ అధికారాలు, విధులు పేర్కొన్నారు.
- 74-1993 ప్రకారం 12వ షెడ్యూల్‌ను ఏర్పాటు చేసి అందులో 18 అంశాలతో కూడిన పట్టణ ప్రభుత్వ అధికారాలు, విధులు పేర్కొన్నారు.
సామాజిక అభివృద్ధి పథకం (CDP- Community Development Programme) - ప్రణాళిక సంఘం సూచనల మేరకు సీడీపీ ఏర్పాటు.
- 1952 అక్టోబర్ 2న దేశంలో 55 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సీడీపీ ప్రారంభం.
ఉద్దేశం: - విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, రవాణా, నీటి పారుదల, సాంఘిక సంక్షేమం
- సీడీపీ ద్వారా భారతదేశాన్ని బ్లాకులుగా/సమితులుగా విభజించారు. ఈ బ్లాకు స్థాయిలో ప్రధాన కార్యనిర్వహణాధికారి బీడీవో (బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్) ఉంటారు. తర్వాత ఈ పథకాన్ని 55 ప్రాంతాల నుంచి- 5011 బ్లాకులకు విస్తరించారు.
- సీడీపీకి అనుబంధంగా 1953 అక్టోబర్ 2న NESS (National Extension serlice scheme) ను ప్రవేశపెట్టారు.
బల్వంతరాయ్ మెహతా కమిటీ – 1957
- CDP, NESS లు అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నాయా.. లేదా పరిశీలించేందుకు ఎన్డీసీ ఈ కమిటీని నియమించింది. 1957 జనవరి 16న కమిటీ ఏర్పాటు చేశారు. 1957 నవంబర్ 24న నివేదిక అందించగా ఎన్డీసీ 1958 జనవరిలో ఆమోదం
తెలిపింది. - మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలాధారం ‘1935 భారత ప్రభుత్వ చట్టం’
ప్రధాన సిఫారసులు - దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
- కింది స్థాయిలో అంటే గ్రామ సముదాయంలో గ్రామ పంచాయతీ
- మధ్య స్థాయిలో అంటే బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి
- పై స్థాయిలో అంటే జిల్లా సముదాయంలో జిల్లా పరిషత్‌లు
- దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్‌లో గల నాగూర్ జిల్లాలోని సికార్ గ్రామం. 1959 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నెహ్రూ దీన్ని ప్రారంభించాడు.
- మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో 1959 నవంబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ వ్యవస్థ ప్రారంభించిన రెండో జిల్లా శ్రీకాకుళం.
అశోక్ మెహతా కమిటీ – 1977
- జనతా ప్రభుత్వం (మొరార్జి దేశాయ్) 1977 డిసెంబర్లో 18 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 1978 ఆగస్టులో ఈ కమిటీ నివేదికలో 132 సిఫారసులు చేసింది.
ప్రధాన సిఫారసులు - మూడంచెల పంచాయతీరాజ్ స్థానంలో రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టడం
- కింది స్థాయిలో అంటే మండల స్థాయిలో మండల పరిషత్‌ల ఏర్పాటు
- పై స్థాయిలో అంటే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్‌ల ఏర్పాటు. ఈ రెండంచెల్లో ముఖ్యమైనది మండల పరిషత్.
- మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం కర్ణాటక. 1985 అక్టోబర్ 2న రామకృష్ణా హెగ్టే అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి ఈ వ్యవస్థను ప్రారంభించారు. మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టిన 2వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఏపీలో 1986 జనవరి 13న ఎన్టీఆర్ ప్రారంభించారు. ఏపీలో రెవెన్యూ మండలాలను 1985లోనే ప్రవేశపెట్టారు.
- భారతదేశంలో బల్వంతరాయ్ మెహతా కమిటీ మొదటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కాగా అశోక్‌మెహతా కమిటీ 2వ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీగా గుర్తింపు పొందింది.
దంత్ వాలా కమిటీ 1977-78
- బ్లాక్‌స్థాయి ప్రణాళికీకరణపై ఒక నివేదికను సమర్పించటానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
సిఫారసులు - జిల్లా ప్రణాళిక వికేంద్రీకరణలో జిల్లా కలెక్టర్ ప్రధాన పాత్ర పోషించాలి.
- జిల్లా స్థాయిలోనే ప్రణాళిక వికేంద్రీకరణ రూపకల్పన జరగాలి.
సీహెచ్.హనుమంతరావు కమిటీ -1984
- 1984లో జిల్లా ప్రణాళికలపై హనుమంతరావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు.
సిఫారసులు: - ప్రత్యేక జిల్లా ప్రణాళిక సంఘాన్ని జిల్లా కలెక్టర్ (లేదా) మంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేయాలి.
- జిల్లా స్థాయిలోనూ అన్ని అభివృద్ధి, ప్రణాళిక కార్యకలాపాల్లో జిల్లా కలెక్టర్
సమన్వయకర్తగా పని చేయాలి.
జీవీకే రావు కమిటీ -1985
- ప్రణాళిక సంఘం జీవీకే రావు అధ్యక్షతన గ్రామీణాభివృద్ధిపై పాలనాపరమైన ఏర్పాట్ల కోసం ఈ కమిటీని నియమించారు.
సిఫారసులు
- ప్రణాళిక విధాన రూపకల్పన అమలుకు జిల్లా ప్రధాన యూనిట్‌గా ఉండాలి.
- బీడీవో అనే పదవిని రద్దు చేయాలి.
- జిల్లా అభివృద్ధి అధికారి (డీడీవో)ను ఏర్పాటు చేయాలి. అతడు జిల్లా పరిషత్‌కు ప్రధాన కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తాడు. జిల్లా స్థాయిలోని అన్ని విభాగాల అభివృద్ధికి ఇన్చార్జిగా వ్యవహరిస్తాడు.
- గడువు కాలం ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలో ఎన్నికలను నిర్వహించాలి.
ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ -1986
- ప్రజాస్వామ్యం, అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించటం కోసం రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఎల్.ఎం. సింఘ్వి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు.
సిఫారసులు - పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగపరమైన హోదా కల్పించారు.
- గ్రామసభకు ప్రాధాన్యత కల్పించాలి.
- పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల వివరాలు, సంస్థలు రద్దు, పనితీరు మొదలగు వాటిని విచారించేందుకు ఒక జ్యుడీషియల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి.
- కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం 2004 మే 27.
- కేంద్ర పంచాయతీరాజ్ శాఖ స్థానిక సంస్థల ప్రతినిధులకు శిక్షణ ఇవ్వటం కోసం ‘IGNOU’ తో ఒప్పందం కుదుర్చుకుంది.
- భారతదేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థల పని విధానంపై శిక్షణ ఇవ్వటానికి ఏర్పాటు చేసిన సంస్థ.. NIRD- హైదరాబాద్
- పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పరచి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా గ్రామసభలను తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొనడంతో పాటు 2009-10 సంవత్సరాన్ని గ్రామసభల సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
- 2011 నుంచి పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుతున్నాం.
- 1985లో పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ, ప్రత్యేక మంత్రిత్వశాఖగా ఇది ఏర్పడింది.
- 1687-భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ మద్రాసు.
- 1726- బొంబాయి, కోల్‌కతా నగరంలో మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు
- ఏపీలో మొదటిది భీమునిపట్నం (1861).
22 రాష్ర్టాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు, చట్టం అమల్లోకి వచ్చిన వివరాలు
1993లో చట్టం అమల్లోకి వచ్చిన రాష్ర్టాలు
గోవా – 1993, కర్ణాటక – మే 10
బీహార్ – ఆగస్టు 23 సిక్కిం- అక్టోబర్ 11
ఒడిశా- నవంబర్ 1
త్రిపుర- నవంబర్ 16
జమ్ము కశ్మీర్ – 1989
1994లో చట్టం అమల్లోకి వచ్చిన రాష్ర్టాలు
అరుణాచల్‌ప్రదేశ్- 1994, అసోం- 1994
మధ్యప్రదేశ్- జనవరి 25
గుజరాత్- ఏప్రిల్ 15
రాజస్థాన్- ఏప్రిల్ 18
ఆంధ్రప్రదేశ్- ఏప్రిల్ 21
పశ్చిమబెంగాల్- ఏప్రిల్ 21
తమిళనాడు- ఏప్రిల్ 22
హర్యానా- ఏప్రిల్ 22
ఉత్తరప్రదేశ్- ఏప్రిల్ 22
హిమాచల్‌ప్రదేశ్- ఏప్రిల్ 22
మహారాష్ట్ర- ఏప్రిల్ 22
పంజాబ్- ఏప్రిల్ 23
కేరళ- ఏప్రిల్ 23
మణిపూర్- ఏప్రిల్ 23
కేంద్ర ఎన్నికల సంఘం
- రాజ్యాంగంలోని 15వ భాగం, ప్రకరణలు 324 నుంచి 329 వరకు దీని గురించి ప్రస్తావించారు.
- ఇందులో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఇతర కమిషనర్లు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. వీరి పదవీకాలం 6 సంవత్సరాలు. పదవీ విరమణ 65 సంవత్సరాలు.
- ప్రధాన ఎన్నికల కమిషనర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మాదిరిగానే తొలగించబడతారు. కమిషనర్లను మాత్రం ప్రధాన ఎన్నికల కమిషనర్ సలహా మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు. వీరి జీతభత్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉంటాయి.
- దేశంలో అన్ని ఎన్నికలను (స్థానిక సంస్థల ఎన్నికలు మినహా) కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది. రాజకీయ పార్టీని గుర్తించి వాటికి ఎన్నిక చిహ్నాలను, పార్టీ చిహ్నాలను కేటాయిస్తుంది.
- ఎన్నికలకు సంబంధించి అన్ని వివాదాలను అలాగే పార్టీల మధ్య వచ్చే వివాదాలను కూడా ఎన్నికల సంఘం పరిష్కరిస్తుంది. అందుకే దీన్ని ‘క్వాసీ జ్యుడీషియల్ బాడీ’ (అర్ధ న్యాయ సంస్థ) అంటారు.
- ప్రకరణ 325 ప్రకారం ప్రతి ఒక్కరికి ఓటర్లుగా నమోదు చేసుకొనే హక్కు ఉంటుంది.
- ప్రకరణ 326 ప్రకారం సార్వత్రిక వయోజన ఓటు హక్కును గుర్తిస్తారు.
- ఓటరుగా నమోదు చేసుకోవడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రారంభంలో ఇది 21 సంవత్సరాలు ఉండేది. 1989లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు తగ్గించారు.
కె.శ్రీనివాస రావు,
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్,
వికారాబాద్
Previous article
CPPRI Recruitment | ఉత్తర్‌ప్రదేశ్ సీపీపీఆర్ఐలో 34 పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు