Science & Technology | థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే వ్యాధులు?
1. కింది వాటిలో అమోనోటెలిక్ జీవి?
1) అస్థిచేపలు 2) కీటకాలు
3) పక్షులు 4) వానపాము
2. హరితగ్రంథులు అనే విసర్జకాయవాలు గల జంతువు?
1) రొయ్యలు 2) ప్లనేరియా
3) జలగ 4) అమీబా
3. జీవితాంతం నీరు తాగని జీవి?
1) బొద్దింక 2) పీతలు
3) లెపిస్మా 4) ప్లనేరియా
4. జతపరచండి.
1. అమీబా ఎ. నెఫ్రీడియా
2. బద్దెపురుగు బి. మాల్ఫీజియన్ నాళికలు
3. జలగ సి. జ్వాలాకణాలు
4. కీటకాలు డి. సంకోచరిక్తికలు
1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
2) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
5. జతపరచండి.
1. సాలెపురుగు ఎ. గ్వానా
2. సముద్ర పక్షులు బి. TMO
3. టీలియాస్టిచేపలు సి. గ్వానిన్
4. మృదులాస్థి చేపలు డి. యూరియా
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
6. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. కాల్షియం పాస్ఫేట్, కాల్షియం ఆక్జలేట్, యూరిక్ ఆమ్ల స్ఫటికాలను కిడ్నీ స్టోన్స్ అంటారు
బి. డయాలసిస్ యంత్రాన్ని తయారు చేసింది – విలియం కోల్ఫ్
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
7. ఆల్బూమిన్యూరియా అంటే?
1) మూత్రం ద్వారా ప్రోటీన్ల నష్టం
2) మూత్రం ద్వారా రక్తం నష్టం
3) మూత్రం ద్వారా రాళ్లు నష్టం
4) మూత్రం ద్వారా గ్లూకోజ్ నష్టం
8. మూత్రవిసర్జన తర్వాత వాసనకు కారణం?
1) అమ్మోనియా 2) యూరియా
3) యూరిక్ ఆమ్లం 4) క్రియాటినిన్
9. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. హార్మోన్స్ అతి తక్కువ గాఢతలో వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి
బి. శరీరంలో కేవలం హార్మోన్ల ద్వారానే సమన్వయం జరుగుతుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
10. కింది వాటిలో అమైనో ఆమ్ల హార్మోన్ ఏది?
1) ఇన్సులిన్ 2) గ్లూకగాన్
3) మెలటోనిన్ 4) ఆల్డోస్టిరాన్
11. పీయూష గ్రంథి ఆధీనంలో లేని గ్రంథి?
1) పారాథైరాయిడ్
2) అడ్రినల్ గ్రంథి
3) థైరాయిడ్ గ్రంథి
4) బీజకోశాలు
12. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. అంతస్రావక గ్రంథుల్లో అతిచిన్నది పీయూషగ్రంథి
బి. పీయూషగ్రంథి అన్ని అంతస్రావ గ్రంథులను తన ఆధీనంలో ఉంచుకుంటుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
13. మెలనిన్ ఎక్కువై చర్మం నలుపు రంగులోకి మారడాన్ని ఏమంటారు?
1) ఆల్బునిజం
2) మెలనిజం
3) టానింగ్ 4) ఆటవిజం
14. మిక్సోఎడిమా, క్రెటినిజం ఏ హార్మోన్ లోపం వల్ల కలిగే వ్యాధులు?
1) థైరాక్సిన్ 2) కాల్సిటోనిన్
3) పారాథార్మోన్ 4) ఆడ్రినలిన్
15. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. ఆల్డోస్టిరాన్ అనేది ఒక గ్లూకోకార్టికాయిడ్
బి. లైంగిక కార్టికాయిడ్స్ స్త్రీలలో ఎక్కువయితే మగవారి వలె మీసాలు రావడాన్ని ‘విరిలిజం’ అంటారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
16. జతపరచండి.
1. ఆల్డోస్టిరాన్ ఎ. క్రెటినిజం
2. పారాథార్మోన్ బి. కుషింగ్ వ్యాధి
3. కార్టిసాల్ సి. టెటాని
4. థైరాక్సిన్ డి. ఎడిసన్స్ వ్యాధి
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
17. జతపరచండి.
1. థైరాక్సిన్ ఎ. టానింగ్
2. పారాథార్మోన్ బి. గ్రేవ్స్ వ్యాధి
3. లైంగిక కార్టికాయిడ్స్ సి. ఆస్టియోపోరోసిస్
4. MSH డి. విరిలిజం
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
18. కింది వాటిలో ప్రెగ్నెన్సీ హార్మోన్ ఏది.. దాన్ని స్రవించే గ్రంథి వరుసగా?
1) ప్రోజెస్టిరాన్, స్త్రీ బీజకోశాలు
2) hcg, జరాయువు
3) ఈస్ట్రోజన్, స్త్రీ బీజకోశాలు
4) hcg, అడ్రినల్ గ్రంథి
19. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. శరీరం వెలుపల, లోపల జరిగే మార్పులకు కేంద్రం నాడీ వ్యవస్థ
బి. నాడీ వ్యవస్థ ద్వారా జరిగే సమన్వయం నెమ్మదిగా ఉంటుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
20. మస్తిష్క మేరుద్రవం విధి?
1) మెదడులోని కణాలకు ఆహారం సరఫరా
2) మెదడులోని నాడీ కణాలకు ఆక్సిజన్ సరఫరా
3) మెదడును అగాధాల నుంచి రక్షించడం
4) పైవన్నీ
21. గైరి, సల్సీ వంటి భాగాలు దేనిలో కనబడతాయి?
1) మస్తిష్కం 2) మధ్యమెదడు
3) వెనుకమెదడు 4) చిన్న మెదడు
22. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. మస్తిష్కమునే పెద్దమెదడు అంటారు
బి. అనుమస్తిష్కమునే చిన్న మెదడు అంటారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
23. ద్వారగోర్థము, హైపోథలామస్ అనే నిర్మాణాలు దేనిలో భాగాలు?
1) మస్తిష్కం 2) మధ్యమెదడు
3) వెనుకమెదడు 4) అనుమస్తిష్కం
24. అధికంగా ఆల్కహాల్ సేవించినప్పుడు మెదడులోని ఏ భాగం సక్రమంగా పనిచేయదు?
1) అనుమస్తిష్కం 2) మజ్జాముఖం
3) మస్తిష్కం 4) మధ్యమెదడు
25. అనియంత్రిత కండరాలకు సమాచారాన్ని అందించే మెదడులోని భాగం ఏది?
1) అనుమస్తిష్కం 2) హైపోథలామస్
3) ద్వారగోర్థం 4) మజ్జాముఖం
26. అసంకల్పత ప్రతీకార చర్యను చూపే నాడీవ్యవస్థలోని నిర్మాణం ఏది?
1) మెదడు 2) వెన్నుపాము
3) కపాలనాడులు 4) వెన్నునాడులు
27. కింది ఏ నాడులకు పోలియా వైరస్ ఇన్ఫెక్షన్ కలిగించడం వల్ల పిల్లల్లో పోలియో వ్యాధి వస్తుంది?
1) కపాల నాడులు 2) జ్ఞాననాడులు
3) చాలక నాడులు 4) మిశ్రమ నాడులు
28. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. అలైంగిక ప్రత్యుత్పత్తి వల్ల జీవపరిణామం జరుగుతుంది
బి. అలైంగింక ప్రత్యుత్పత్తి అభివృద్ధి చెందని జీవుల్లో జరుగుతుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
29. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ‘క్లోన్స్’ ఏర్పడతాయి
బి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో సమ విభజన జరుగుతుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
30. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. ఈస్ట్‌లో కోరకీభవనం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది
బి. పేరామీషియంలో ద్విదావిచ్చిత్తి ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
31. శుక్రకణాలు పరిపక్వం చెందే భాగం ఏది?
1) శుక్రవాహిక 2) శుక్రాశయం
3) ఎపిడిడైమిస్ 4) స్క్రోటమ్
32. ముష్కాల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు ఏవి?
1) శుక్రనాళాలు 2) శుక్రవాహికలు
3) ఎపిడిడైమిస్ 4) ఏదీకాదు
33. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. ముష్కాలను తొలగించడాన్ని ఆర్కిడెక్టామీ అంటారు
బి. పురుషుల్లో హార్మోన్ల అసమతుల్యం వల్ల క్షీరగ్రంథులు ఏర్పడడాన్ని గైనకోమాస్టియా అంటారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
34. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. యుక్తవయస్సులో రుతుచక్రం ప్రారంభం కావడాన్ని మోనార్క్ అంటారు
బి. 45-55 సంవత్సరాల మధ్య రుతుచక్రం ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
35. జతపరచండి.
1. మానవుడు ఎ. గుడ్లతిత్తి
2. చేపలు, కప్పలు బి. శుక్రగ్రాహిక
3. వానపాము సి. ఫాలోపియన్ నాళం
4. దోమ డి. నీరు
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
36. కింది వాటిలో గర్భాశయపుగోడ నుంచి పెరుగుతున్న పిండానికి ఆహారం, ఆక్సిజన్ ఏది అందిస్తుంది?
1) జరాయువు 2) ఉల్భం
3) పరాయువు 4) బొడ్డుతాడు
37. శుక్రకణం జీవితకాలం?
1) 2 రోజులు 2) 3 రోజులు
3) 24 గంటలు 4) 4 రోజులు
38. దూరపు వస్తువులను మాత్రమే చూడగలగడాన్ని ఏమంటారు?
1) మయోపీయా
2) హైపర్‌మెట్రోపియా
3) హైపోమెట్రోపియా
4) నిక్టోలోపియా
39. కార్నియా పంపు తిరగడాన్ని ఏమంటారు?
1) ఆస్టిగ్మాటిజమ్ 2) స్ట్రాబిస్మస్
3) ప్రెస్బయోపియా 4) కాటరాక్ట్
40. అతి పెద్ద అవయవం ఏది?
1) జీర్ణవ్యవస్థ
2) రక్తప్రసరణ వ్యవస్థ
3) చర్మం 4) శ్వాసవ్యవస్థ
41. స్వేదగ్రంథులు అతి తక్కువగా ఉండే ప్రాంతం?
1) అరచేయి 2) అరికాలు
3) పెదవులు 4) పైవన్నీ
42. రక్త సరఫరా జరగని చర్మభాగం నలుపురంగులోకి మారడం కింది ఏ వ్యాధిలో కనిపిస్తుంది?
1) విటిలిగో 2) గాంగ్రిన్
3) సొరియాసిస్ 4) తట్టు
43. కవలల్లో కూడా వేలిముద్రలు ఒకే విధంగా ఉండవు కారణం?
1) బాహ్యచర్మంలో ఎత్తులు ఉండడం
2) అంతఃశ్చర్మంలో ఎత్తులు ఉండడం
3) బాహ్యచర్మంలో ఎత్తు, పల్లాల ఉండడం
4) అంతఃశ్చర్మంలో ఎత్తుపల్లాలు ఉండడం
44. నాసిరిసెప్టార్స్, పాసినియన్ కణాల విధులు వరుసగా?
1) ఉష్ణం, పీడనం 2) ఉష్ణం, బాధ
3) పీడనం, బాధ 4) బాధ, పీడనం
45. బాహ్యచర్మం పలుచగా ఉన్నచోట క్షోభ్యత?
1) ఎక్కువ 2) తక్కువ
3) మార్పులేదు 4) స్పందన ఉండదు
46. టానింగ్ వల్ల ఏం జరుగుతుంది?
1) యూవీ కిరణాల నుంచి రక్షణ
2) చర్మానికి తెలుపురంగు రావడం
3) యూవీ కిరణాల వల్ల చర్మక్యాన్సర్
4) మెలనోసైట్ కణాల ఉత్పత్తి తగ్గడం
47. చెవిలో సమతాస్థితిలో పాల్గొనే నిర్మాణాలు?
1) యుస్టేషియన్ నాళం, కర్ణావర్తం
2) కర్ణావర్తం, పేటిక
3) పేటిక, అర్ధవర్తుల కుల్యలు
4) యుస్టేషియన్ నాళం, పేటిక
48. యుస్టేషియన్ నాళం?
1) మధ్యచెవి, లోపలి చెవితో కలుపును
2) బాహ్యచెవిని, ఆస్యకుహరంతో కలుపును
3) మధ్యచెవిని, నోటికుహరంతో కలుపును
4) లోపలిచెవిని, నోటికుహరంతో కలుపును
49. కంటిని కదల్చడానికి ఉపయోగించే కండరాలు?
1) 4 2) 6
3) 8 4) 10
50. రాడ్లు, కోన్ల నిష్పత్తి?
1) 15:1 2) 16:1
3) 1:15 4) 1:16
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు