Current Affairs March 01 | క్రీడలు
క్రీడలు
రంజీ విజేత సౌరాష్ట్ర
ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీని సౌరాష్ట్ర జట్టు గెలుచుకుంది. ఫిబ్రవరి 19న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టు 9 వికెట్ల తేడాతో బెంగాల్‌పై విజయం సాధించింది. బెంగాల్ నిర్దేశించిన 12 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర 2.4 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. గత 10 సీజన్లలో ఐదుసార్లు ఫైనల్స్‌కు చేరిన సౌరాష్ట్ర రెండోసారి విజేతగా నిలిచింది.
స్వియాటెక్
ఖతార్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను పోలెండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ గెలుచుకుంది. ఫిబ్రవరి 18న దోహాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అమెరికా క్రీడాకారిణి జెస్సికా పెగ్యులాను ఓడించింది. ఈ టోర్నీని గెలవడం వరుసగా ఇది రెండోసారి. ఈ ఏడాది స్వియాటెక్ గెలుచుకున్న తొలి టోర్నీ. మొత్తంగా 12 డబ్ల్యూటీఏ టైటిళ్లను గెలుచుకుంది.
ఫెమ్కె బోల్
ఇండోర్ అథ్లెటిక్స్ 400 మీ. హార్డిల్స్‌లో ఫెమ్కె బోల్ సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఫిబ్రవరి 20న నెదర్లాండ్స్‌లోని అపెల్డోర్న్లో జరిగిన పోటీలో డచ్ క్రీడాకారిణి ఫెమ్కె బోల్ 49.26 సెకన్లలో చేరుకుని ఈ రికార్డు సాధించింది. 1982లో చెక్ అథ్లెట్ జర్మిల అక్రతొచివలోవ నెలకొల్పిన 49.59 సెకన్ల రికార్డును ఫెమ్కె తిరగరాసింది. కాగా ఔట్‌డోర్‌లో జర్మనీ అథ్లెట్ మారిట కోచ్ 1985లో నెలకొల్పిన 47.60 సెకన్ల రికార్డు ఇంకా చెక్కుచెదరలేదు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?