Current Affairs March 01 | జాతీయం
జాతీయం
బైక్ ట్యాక్సీలపై నిషేధం
బైక్ ట్యాక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ఫిబ్రవరి 20న ప్రకటించింది. మోటారు వాహనాల చట్టం-1988 ప్రకారం ప్రైవేట్ రిజిస్ట్రేషన్ ఉన్న బైకులను ట్యాక్సీలుగా ఉపయోగించడం నిషేధమని పేర్కొంది. నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని వెల్లడించింది.
ఒకటికి ఆరు
ఆరేండ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించేలా నిబంధనలు రూపొందించాలని అన్ని రాష్ర్టాలకు కేంద్రం ఫిబ్రవరి 22న ఆదేశాలు జారీ చేసింది. కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం 3-8 ఏండ్లలోపు పిల్లలందరికీ పునాది (ప్రాథమిక) స్థాయిలో ఐదేండ్లు నేర్చుకునే అవకాశం ఉండాలి. మూడేండ్ల పాఠశాల పూర్వ విద్యతో పాటు 1, 2 తరగతుల కాలం ఈ ఐదేండ్ల పరిధిలోకి వస్తుంది.
బండికూట్
దేశంలో మొదటిసారిగా మ్యాన్హోళ్లను క్లీన్ చేసే బండికూట్ అనే రోబోటిక్ స్కావెంజర్ను కేరళ ప్రభుత్వం ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఆ రాష్ట్ర ఆలయ నగరి గురువాయుర్లో వాటర్ రిసోర్స్ మినిస్టర్ రోషి ఆగస్టిన్ ఈ బండికూట్ను ఆవిష్కరించారు. ఈ రోబోట్ స్కావెంజర్ను కేరళకు చెందిన జన్రోబోటిక్స్ రూపొందించింది. కేరళ స్టార్టప్ మిషన్ (కేఎస్యూఎం) నిర్వహించిన ‘హడిల్ గ్లోబల్-2022’ కాన్క్లేవ్లో ఈ బండికూట్ కేరళ ప్రైడ్ అవార్డు గెలుచుకుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?