Biology | అన్నదాతకు ఆదాయ వనరు.. చౌకగా పోషకాహారం
పశు సంపద
పశు సంపద, డెయిరీ అభివృద్ధి, మత్స్య సంపద రంగాలు దేశ జాతీయ ఆర్థిక, సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఈ రంగం ముఖ్యంగా కుటుంబ ఆదాయాలను పెంచుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ రీతిలో ఉద్యోగాలు కల్పిస్తుంది. ముఖ్యంగా భూమిలేని వ్యవసాయ కార్మికులకు పని కల్పిస్తుంది. చిన్న సన్నకారు రైతులకు, మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. అదేవిధంగా లక్షలాది మంది ప్రజలకు అతి తక్కువ ధరలకే పోషక పదార్థాలను అందిస్తుంది.
భారతదేశ జాతీయ ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశు సంపద ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పశువుల పేడను ఇంధన వనరుగా కూడా ఉపయోగిస్తున్నారు. బయోగ్యాస్ తయారీకి, పొలాల్లో ఎరువుగాను ఉపయోగిస్తున్నారు. చిన్న సన్నకారు రైతాంగానికి పశు సంపద ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంది.
ఆవులు
- మొత్తం పాడిలో 43 శాతం ఆవులున్నాయి. ఇవి అధికంగా పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. న్యూజిలాండ్, డెన్మార్క్, హాలెండ్ లాంటి దేశాల్లో ఆవులు ఒక రోజుకు 30-40 లీటర్ల పాలు ఇస్తుంటే, ఇండియాలో 1 లీటర్ పాలు మాత్రమే ఇస్తున్నాయి. అందువల్ల భారతదేశ ఆవులను టీ కప్ కౌవ్ అంటారు.
ఆవుల రకాలు
- పాలు ఎక్కువగా ఇచ్చే ఆవుల రకాలు అనేకం ఉన్నాయి. పాలు ఎక్కువ మొత్తంలో ఇచ్చే జాతి ఆవులు, వాటి సంతతి ఎద్దులు వ్యవసాయానికి అంతగా పనికి రావు
వివిధ రాష్ర్టాల్లో పాలిచ్చే ఆవుల జాతులు
గిర్: సౌరాష్ట్ర, గుజరాత్లో ఈ జాతి ఆవులున్నాయి. ఇవి బాగా పెద్దవిగా ఉంటాయి. ఎక్కువ మొత్తంలో పాలిస్తాయి.
రెడ్ సింధి: గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర
సహివాల్: పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్
దేవుని: ఆంధ్రప్రదేశ్
తక్కువ పాలిచ్చే జాతులు
- ఈ జాతుల్లో ఆవులు తక్కువ పాలిస్తాయి. ఎద్దులు, ఆవులు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి.
నెగోరి: జోధ్‌పూర్ (రాజస్థాన్), హర్యానా, ఉత్తరప్రదేశ్
బచేరి: బీహార్
మాల్వి: మధ్యప్రదేశ్
ఖల్లారీ: మహారాష్ట్ర
సిరి: డార్జిలింగ్ (పశ్చిమ బెంగాల్), సిక్కిం
హల్లికర్: దక్షిణ కర్ణాటక
ఉభయ జాతులు
- ఈ జాతుల్లో ఆవులు పాలకు, ఎద్దులు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి.
తార్పార్కర్: గుజరాత్, రాజస్థాన్
కంక్రెజ్: గుజరాత్
హర్యానా: హర్యానా, ఢిల్లీ
మేవతి: ఉత్తరప్రదేశ్, రాజస్థాన్
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ (ప్రకాశం, గుంటూరు, నెల్లూరు)
దాంగ్రి: మహారాష్ట్ర
కృష్ణ లోయ: దక్షిణ మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక
సంకర జాతి ఆవులు
కరణ్ స్విన్: అమెరికన్ బ్రౌన్ స్విస్‌తో ఇండియన్ సహవాల్, రెడ్ సింధి కలయిక వల్ల
ఉద్భవించిన జాతి ఆవులు
కరణ్ ఫ్రీస్: తార్ పార్కర్‌తో హాలిస్టిన్ ఫ్రీసిన్ కలయిక వల్ల ఉద్భవించిన సంకరజాతి ఆవులు
దిగుమతి రకాలు
జెర్సీ, హాలిస్టిన్-ఫ్రీసిన్: ఈ జాతి ఆవులు అత్యధిక పాలు ఇచ్చే రకాలు. ఇవి రోజుకు 50 లీటర్ల పాలు ఇవ్వగలుగుతాయి.
బ్రీడింగ్ సెంటర్లు
- పశువుల గర్భధారణ కోసం 7 కేంద్రీయ పశువుల బ్రీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రాజస్థాన్‌లోని సురటేఘల్, ఒడిశాలోని చిప్లిమార్, సునాబేడా, గుజరాత్‌లోని థామేరివ్,కర్ణాటకలోని హెసరగుట్ట, తమిళనాడులోని ఆలామడి, ఉత్తరప్రదేశ్‌లోని ఆదేశనగర్లో ఏర్పాటు చేశారు.
ఫుట్ అండ్ మౌత్ డిసీజ్
- కేంద్రీయ వీర్య ఉత్పత్తి, శిక్షణ సంస్థను కర్ణాటకలోని హీసరగుట్ట వద్ద ఏర్పాటు చేశారు. పశువులను ఫుట్ అండ్ మౌత్ వ్యాధి నుంచి రక్షించడానికి ఫుట్ అండ్ మౌత్ డిసీస్ కంట్రోల్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు.
- 2020-21 నాటికి 27.8 లక్షల పశువులకు వ్యాక్సినేషన్ వేయడం జరిగింది.
- మొట్టమొదటిసారి FMD వ్యాక్సినేషన్ 11 రాష్ట్రాల్లో 2020కి పూర్తయింది. రెండో FMDని 2021-22లో తిరిగి ప్రారంభించారు.
బర్రెలు
ముర్రా: హర్యానా, పంజాబ్ బదావరి: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్
జఫర్బంది, సూరతి: గుజరాత్ నీలిరావి: పంజాబ్
నాగపురి (ఎల్లిక్ పూరి): మహారాష్ట్ర మేహసనా: గుజరాత్, మధ్యప్రదేశ్
- బర్రెలు అధికంగా గల రాష్ర్టాలు: ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్
- బర్రె పాలు అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ర్టాలు: ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్
గొర్రెలు
- గొర్రెలు ఎక్కువగా గల దేశాల్లో ఆస్ట్రేలియా, రష్యా, చైనా, అర్జెంటీనా, న్యూజిలాండ్ తర్వాత మన దేశం ఆరోస్థానంలో ఉంది. దేశంలో అత్యధిక ఉన్నిని రాజస్థాన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఉన్ని మార్వారి రకానికి చెందినది. జమ్ముకశ్మీర్, గుజరాత్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మంచి రకానికి చెందిన గొర్రెలు కలు, కంగ్రా, చంబాలు కశ్మీర్లో పెరుగుతున్నాయి.
- కశ్మీర్ లోయ, బదర్వా, బహర్వార్, రాంపూర్ జాతుల గొర్రెలను జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లో పెంచుతున్నారు.
- జైసల్మేర్, మల్బూరి, పూగల్, ముగ్రా జాతులను రాజస్థాన్, హర్యానాల్లో పెంచుతున్నారు.
- డక్కాని, నెల్లూరు, మాంధ్య జాతులు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్నాయి.
- దేశంలో గొర్రెలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాలు- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
మేకలు
- మేకలు భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిని పూర్ మ్యాన్ కౌ అంటారు. ఇవి రాజస్థాన్‌లో ఎక్కువగా ఉన్నాయి.
- 90 దేశీ మేకలు దక్కన్ పీఠభూమి ప్రాంతంలో, హిమాలయ లేదా అంగోరా కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో కనిపిస్తాయి.
- మొహర్ హెయిర్ ఇచ్చే పాష్మీనా జాతి మేకలు కశ్మీర్, కులు ప్రాంతాల్లో కనిపిస్తాయి. కశ్మీర్ లోయలో పెరిగే మేకలను పాష్మీనా జాతి మేకలు అంటారు.
- అధికంగా మేకలు గల రాష్ట్రాలు- రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్
- మేక పాలు ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న రాష్ర్టాలు- ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్
శ్వేత విప్లవం
- అభివృద్ధి పథకాల ద్వారా దేశంలో పాల ఉత్పత్తిని పెంచడాన్ని శ్వేత విప్లవం అంటారు. 1970లో జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (NDDB)ని స్థాపించారు.
- శ్వేత విప్లవం ముఖ్య ఉద్దేశం గ్రామీణ పాల ఉత్పత్తిదారులను పట్టణ వినియోగదారులతో కలపడం.
- భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు 1970 పాల వెల్లువ-1 (Operation Flood) పథకాన్ని గుజరాత్‌లోని ఆనంద్‌లో వి.కురియన్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. కురియన్ను భారతదేశ శ్వేత విప్లవ పితామహుడిగా పిలుస్తారు.
- ఈ పథకం 1981లో ముగిసింది.
- 6వ పంచవర్ష ప్రణాళికలో పాల వెల్లువ పథకం-2ను 21 రాష్ర్టాల్లో ప్రారంభించారు. 7వ ప్రణాళికలో పాల వెల్లువ-3 పథకాన్ని ప్రారంభించారు.
- ప్రపంచ పాల ఉత్పత్తిలో ఇండియా మొదటిస్థానంలో, అమెరికా రెండో స్థానంలో ఉంది. ఇండియా ప్రపంచ పాల ఉత్పత్తిలో 23 శాతాన్ని కలిగి ఉంది.
- 2020-21లో పాల ఉత్పత్తి 209.96 మిలియన్ టన్నులు.
- 2019-20లో పాల ఉత్పత్తి 198.4 మిలియన్ టన్నులు.
- తలసరి సరాసరి ఒక రోజుకు పాల లభ్యత 2020-21లో 427 గ్రాములు.
పౌల్ట్రీ-2020-21
- ప్రపంచ గుడ్ల ఉత్పత్తిలో ఇండియా మూడో స్థానంలో ఉంది.
- 2020-21లో దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం గుడ్లు 122.11 బిలియన్లు. తలసరి గుడ్ల లభ్యత 91గా ఉంది.
- 2019-20 దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం గుడ్లు 114.83 బిలియన్లు. తలసరి గుడ్ల లభ్యత 86గా ఉంది.
- ప్రపంచ కోడి మాంసం ఉత్పత్తిలో 3 శాతం ఇండియాలో అవుతుంది.
- 20 వ పశు గణన ప్రకారం దేశం మొత్తం మీద 851.81 మిలియన్ల కోళ్లు కలవు. భారతదేశంలో అధికంగా కోళ్లు గల రాష్ర్టాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.
- ప్రపంచ మాంసపు ఉత్పత్తిలో ఇండియా 8వ స్థానంలో ఉంది.
- మాంసం ఉత్పత్తి 8.80 మిలియన్ టన్నులు
- తలసరి లభ్యత ఒకరికి సంవత్సరానికి 6.52 కిలోగ్రాములు.
అటవీ ఉత్పత్తులు
ఎబోని కలప: దీన్ని పియానో కిట్స్ తయారీలో ఉపయోగిస్తారు.
రెజిన్: దీన్ని కృత్రిమ జిగుర్లు, దారాల తయారీకి ఉపయోగిస్తారు.
టేకు: ఆకురాల్చు అడవుల్లో ముఖ్యమైన అటవీ ఉత్పత్తి. దీన్ని గృహోపకరణాల తయారీలో ఉపయోగిస్తారు. టేకు ఉత్పత్తిలో ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం మధ్యప్రదేశ్.
ఎర్ర చందనం: ప్రపంచంలో అత్యంత విలువైన కలప ఇది. దీన్ని జంత్ర వాయిద్యాల
(తీగలతో ఉండే వాయిద్యాలు వీణ, తంబూర) తయారీలో ఉపయోగిస్తారు. ఈ చెట్టు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో పెరుగుతాయి.
సాల్: రైల్వే స్వీపర్ల తయారీ, అసోంలో బోట్ల తయారీకి ఉపయోగిస్తారు. హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ర్టాల్లో విస్తరించి ఉన్నాయి.
హల్దా: దువ్వెనల తయారీలో, రూళ్ల కర్రల తయారీలో ఉపయోగిస్తారు.
కేన్: కుర్చీలు, బల్లలు, ఊయల, చేతి కర్రల తయారీలో ఉపయోగిస్తారు. ఇది కర్ణాటక, కేరళ, ఈశాన్య రాష్ర్టాలు, అండమాన్- నికోబార్ దీవుల్లో లభ్యమవుతుంది.
వెదురు: కాగితం తయారీలోనూ, ఇంటి నిర్మాణంలో, పోలీసు లాఠీలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది అత్యంత వేగంగా పెరిగే మొక్క. సెప్టెంబర్ 18న ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తారు.
లక్క: ఆకురాల్చు అరణ్యాల్లో ముఖ్యమైన జంతు సంబంధ ఉత్పత్తి లక్క. దీన్ని లాక్సిఫర్ లక్కా అనే కీటకం నుంచి తయారుచేస్తారు. లక్కను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ర్టాలు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్. దీన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. లక్కను ఎక్కువగా విద్యుత్ నిరోధకంగా, సీల్స్ (పరిపాలన రంగం) వేయడానికి ఉపయోగిస్తారు.
ఫర్: భారత్‌లో దీన్ని సిల్వర్ఫర్ అంటారు. దీన్ని అగ్గిపుల్లల తయారీలో, ప్యాకింగ్ పెట్టెల తయారీలో ఉపయోగిస్తారు.
ప్లైన్: కర్పూర తైలం తయారీలో ఉపయోగిస్తారు.
బిర్చ్:ప్లైవుడ్ తయారీలో ఉపయోగిస్తారు. సబ్బులు, షాంపూల తయారీలో, క్యాబినెట్ల తయారీలో వినియోగిస్తారు. పశ్చిమ హిమాలయాల్లో పెరుగుతుంది.
విల్లోస్: క్రికెట్ బ్యాట్ల తయారీలో ఉపయోగిస్తారు.
వేప: ఆకులు, కాయలను ఔషధంగా ఉపయోగిస్తారు. కలపను గృహ నిర్మాణంలో ఉపయోగిస్తారు. క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది.
తునికి ఆకులు: బీడీల తయారీలో ఉపయోగిస్తారు.
జీవికే పబ్లికేషన్స్
హైదరాబాద్ 8187826293
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు