భారత పరిశోధనశాలల పితామహుడు ఎవరు?
జనరల్సైన్స్
1. సాంకేతిక విద్యను ప్రోత్సహించడానికి దేశంలో మొదట ఏర్పాటు చేసిన ఐఐటీ?
ఎ) ఐఐటీ, ఖరగ్పూర్
బి) ఐఐటీ, ఢిల్లీ
సి) ఐఐటీ, చెన్నై
డి) ఐఐటీ, గువహతీ
2. శాస్త్ర సాంకేతిక విభాగం కేంద్రం ఉన్న ప్రాంతం?
ఎ) కోల్కతా బి) ముంబై
సి) న్యూఢిల్లీ డి) హైదరాబాద్
3. S & T కార్యకలాపాలను జనజీవన స్రవంతిలోకి తీసుకెళ్లే స్వతంత్ర సంస్థ?
ఎ. విజ్ఞాన భారతి బి. విజ్ఞాన్ ప్రసార్
సి. విజ్ఞాన్ అనుసంధాన్
డి. విజ్ఞాన్ కృప
ఎ) ఎ, బి బి) ఎ, బి, సి
సి) బి డి) పైవన్నీ
4. ‘ఓరల్ పోలియో వ్యాక్సిన్’ ను తయారు చేసే ప్రభుత్వ సంస్థ?
ఎ) DSIR బి) CSIR
సి) BIBCOL డి) పైవేవీ కావు
5. కింది వాటిలో CSIR గురించి సరైనవి గుర్తించండి.
ఎ. భారతదేశంలో పరిశోధన, అభివృద్ధికి సంబంధించి అతిపెద్ద స్వతంత్ర సంస్థ
బి. దీన్ని 1946లో స్థాపించారు
సి. స్థాపకుడు – శాంతిస్వరూప్ భట్నాగర్
డి. ప్రాథమిక జీవశాస్ర్తాలపై పరిశోధనలు చేసే సంస్థ
ఎ) ఎ, బి, సి బి) బి, సి, డి
సి) ఎ, సి, డి డి) ఎ, సి
6. జతపరచండి.
1. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ ఎ. భువనేశ్వర్
2. నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్ బి. గురుగ్రామ్
3. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్
సి. న్యూఢిల్లీ
4. నేషనల్ బ్రెయిన్ రిసెర్చ్ సెంటర్
డి. పుణె
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
సి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
డి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
7. ‘డ్రీమ్-2047’ పత్రికను ప్రచురించే స్వతంత్ర సంస్థ?
ఎ) విజ్ఞాన్ ప్రసార్ బి) విజ్ఞాన్ విధాత
సి) విధాన్ భారతి డి) పైవేవీ కావు
8. జతపరచండి.
1. సైన్స్ విధాన తీర్మానం
ఎ. 2013
2. సాంకేతిక విధానం బి. 1983
3. సాంకేతిక విధాన తీర్మానం సి. 2003
4. శాస్త్ర సాంకేతిక – నవకల్పన విధానం డి. 1958
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
9. టెక్నాలజీ మిషన్స్ రూపకల్పనకు తోడ్పడిన శాస్త్రవేత్త?
ఎ) శ్యాం పిట్రోడా బి) సీ ఎన్ ఆర్ రావు
సి) గిరీష్ సాని డి) మొఘిలియన్
10. S & Tలో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యతనిచ్చిన సాంకేతిక విధానం?
ఎ) సాంకేతిక విధానం
బి) సాంకేతిక విధాన తీర్మానం
సి) శాస్త్ర సాంకేతిక, నవకల్పనల విధానం
డి) పైవేవీ కావు
11. జతపరచండి.
1. విక్రమ్ సారాభాయ్
ఎ. భారత పరిశోధనాశాలల
పితామహుడు
2. హోమిభాభా బి. క్షిపణి పితామహుడు
3. అబ్దుల్ కలాం సి. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు
4. శాంతిస్వరూప్ భట్నాగర్
డి. భారత అణుశక్తి
పితామహుడు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
డి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
12. భారత ప్రభుత్వం నుంచి ఇండియన్ సైన్స్ అవార్డ్ పొందిన మొదటి వ్యక్తి?
ఎ) వెంకట్రామన్ రామకృష్ణన్
బి) సి ఎన్ ఆర్ రావు
సి) అబ్దుల్ కలాం డి) హోమిభాభా
13. జతపరచండి.
1. అబ్దుల్ కలాం ఎ. మెటీరియల్ సైన్స్
2. వెంకట్రామన్ రామకృష్ణన్ బి. ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ ఏర్పాటు
3. విక్రమ్ సారాభాయ్ సి. రైబోజోమ్లపై పరిశోధన
4. సి ఎన్ ఆర్ రావు డి. బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధి
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
డి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
14. కింది వాటిలో శాంతి స్వరూప్ భట్నాకర్ గురించి సరైనది గుర్తించండి.
ఎ. పోఖ్రాన్-2 అణు పరీక్షల్లో కీలక పాత్ర
బి. భారత పరిశోధనశాలల పితామహుడు
సి. CSIR మొదటి వ్యవస్థాపక డైరెక్టర్
డి. నక్షత్రాల పరిణామాలపై విశ్లేషణ
ఎ) ఎ బి) ఎ, బి, సి
సి) బి, సి డి) పైవన్నీ
15. ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్’గా ప్రసిద్ధి చెందినవారు?
ఎ) సీ ఎన్ ఆర్ రావు
బి) ఎం జీ కే మీనన్
సి) హోమి భాభా
డి) ఉడిపి రామచంద్రరావు
16. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చ్ స్థాపించినవారు?
ఎ) సి ఎన్ ఆర్ రావు
బి) ప్రపుల్ల చంద్రరాయ్
సి) రాజా రామన్న
డి) అబ్దుల్ కలామ్
17. మొదటిసారి విదేశీ శాస్త్రవేత్తలు పాల్గొన్న సైన్స్ కాంగ్రెస్ ప్రాంతం, సంవత్సరాన్ని గుర్తించండి.
ఎ) ఢిల్లీ – 1939 బి) ఢిల్లీ – 1934
సి) కలకత్తా – 1938 డి) కలకత్తా -1939
18. 103వ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది. దీనికి అధ్యక్షుడు ఎవరు?
ఎ) మైసూర్ – అశోక్ కుమార్ సక్సేనా
బి) మైసూర్ – నారాయణ రావు
సి) ముంబై – ఎస్ బీ నిమ్సే
డి) ముంబై – సీ ఎన్ ఆర్ రావు
19. 2015లో భౌతిక శాస్త్రం, ఆరోగ్యం, వైద్యానికి నోబెల్ బహుమతి పొందినవారు?
ఎ) టోమస్ లిండాల్, సాటోషి ఓమురా
బి) అజిజ్ సాంకర్, టకాకీ కజిజా
సి) ఆర్థర్ బి. మెక్డోనాల్డ్, విలియం
కాంప్జెల్
డి) యోయోటూ, టోమస్ లిండాల్
20. ‘ఇండియన్ న్యూటన్’ అని ఎవరిని అంటారు?
ఎ) ఆర్యభట్ట బి) బ్రహ్మగుప్తుడు
సి) సుశృతుడు డి) పై ఎవరూ కాదు
21. సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన పుస్తకం?
ఎ) రోమశ సంహిత బి) సుశృత సంహిత
సి) జయ సంహిత డి) వశిష్ట సంహిత
22. కింది వాటిలో భూసమస్థితి ఉపగ్రహం గురించి సరైనది గుర్తించండి.
1. దీన్నే భూస్థిర ఉపగ్రహం అని కూడా అంటారు
2. భూమి నుంచి 36000 కి.మీ.ల ఎత్తులో వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుంది
3. ఇది భూమి వేగానికి సమాన వేగంలో అక్షాంశం వెంబడి పడమర నుంచి తూర్పు వైపు తిరుగుతుంది. అందువల్ల స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది
ఎ) 1 బి) 2, 3
సి) 1, 3 డి) పైవన్నీ
23. జతపరచండి.
ఎ. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ 1. అహ్మదాబాద్
బి. స్పేస్ అప్లికేషన్ సెంటర్ 2. బెంగళూరు
సి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 3. తిరువనంతపురం
డి. ఇస్రో శాటిలైట్ సెంటర్ 4. హైదరాబాద్
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-1, బి-3, సి-2, డి-4
సి) ఎ-3, బి-1, సి-4, డి-2
డి) ఎ-4, బి-2, సి-1, డి-3
24. కింది వాటిలో IRNSS-IB గురించి సరైనది గుర్తించండి.
1. దీని విస్తృత రూపం – Indian Regional Navigation Satellite System – IB
2. దీన్ని PSLV- C24 ద్వారా అంతరిక్షంలోకి పంపారు
3. IRNSS ఉపగ్రహ శ్రేణి రెండవది
4. దీన్ని విపత్తు నిర్వహణ, జీపీఎస్,
వాహనాలను ట్రాకింగ్ చేయడంలో
ఉపయోగిస్తారు
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 2, 4 డి) 3, 4
25. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1. భూ సమస్థితి ఉపగ్రహ వాహకనౌకలను ఇన్శాట్ రకానికి చెందిన ఉపగ్రహాలు
పంపడానికి ఉపయోగిస్తారు
2. అన్ని జీఎస్ఎల్వీలను తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం నుంచి పంపుతారు
3. జీఎస్ఎల్వీ అనేది 3 అంచెల
వాహకనౌక
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1 డి) 3
26. జతపరచండి.
ఎ. గ్లోనాస్ 1. చైనా
బి. గెలీలియో 2. రష్యా
సి. జీపీఎస్ 3. యూరోపియన్
యూనియన్
డి. బీడు 4. అమెరికా
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-2, బి-1, సి-3, డి-4
సి) ఎ-3, బి-4, సి-1, డి-2
డి) ఎ-2, బి-3, సి-4, డి-1
27. గగన్ గురించి సరైనది గుర్తించండి.
1. గగన్-జీపీఎస్ Aided GEO Aug mented Navigation
2. ఇది భారతీయ రైల్వే తయారు చేసిన
ఉపగ్రహ ఆధారిత విస్తరణ వ్యవస్థ
3. భారత గగనతలంలో ట్రాఫిక్
క్రమబద్ధీకరణ దీని ముఖ్య ఉద్దేశం
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) పైవేవీ కావు
28. కింది వాటిలో చంద్రయాన్-2 గురించి సరికానిది గుర్తించండి.
1. ఇది ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)ల సంయుక్త ప్రయోగం
2. లూనార్ ఆర్బిటర్, లూనార్ రోవర్లను కలిగి ఉంటుంది
3. దీన్ని జీఎస్ఎల్వీ ఎమ్కే-2ని ఉపయోగించి పంపాలనుకున్నారు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1 డి) పైవేవీ కావు
29. కింది వాటిలో ఆదిత్య మిషన్ గురించి సరైనది గుర్తించండి.
1. సూర్యుని అధ్యయనంలో ఉపయోగించే వాహకనౌక- ఆదిత్య1
2. సూర్యుని కరోనా నుంచి విడుదలయ్యే కణాలను గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు
3. కరోనా అనేది సూర్యుని అంతర్భాగం నుంచి విడుదలయ్యే ప్లాస్మాలాంటి పదార్థం
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) పైవేవీ కావు
– విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?