పరిశ్రమల విస్తరణ.. ఉపాధి కల్పన(Economy study meterial)
రసాయన ఎరువుల పరిశ్రమ
దేశంలో ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు మొత్తం 4 యూనిట్లు కలవు.
1. తాల్చేరు 2. సింద్రి
3. రామగుండం 4. గోరఖ్‌పూర్
- రామగుండంలో 1980లో స్థాపించారు. ఇది అన్నపూర్ణ పేరుతో యూరియాను ఉత్పత్తి చేసింది. 1999లో మూతపడింది. ఇది ముడి పదార్థంగా బొగ్గును ఉపయోగించి
ఎరువులను తయారు చేసే మొదటి ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీని గతేడాది నవంబర్‌లో తిరిగి ప్రారంభించారు.
యురేనియం
- యురేనియం ముడి ఖనిజం పిచ్‌బ్లెండ్
- భారతదేశంలో యురేనియం నిల్వలు ఆశించినంత స్థాయిలో లేవు
- దేశం యూరేనియంను రష్యా, కజకిస్థాన్, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటుంది.
- ప్రపంచ యురేనియం ఉత్పత్తిలో భారతదేశ యురేనియం ఉత్పత్తి 2 శాతం మాత్రమే.
- దేశంలో మొదటిగా యురేనియం నిల్వలు గుర్తించిన ప్రాంతం జాదుగూడ (జార్ఖండ్-1951)
1967 నుంచి యురేనియం వెలికి తీశారు. - యూసీఐఎల్ ప్రధాన కార్యాలయం జార్ఖండ్‌లోని సిగ్భం జిల్లా జాదుగూడలో ఉంది. దీనిని 1967లో స్థాపించారు.
- తెలంగాణ రాష్ట్రంలో యురేనియం విస్తరిం చిన ప్రాంతాలు లంబాపూర్, కుప్పనూర్, పెద్దగట్టు, వనపర్తి, పెద్దూర్, కొత్తూరు.
- కోరండం, గార్నెట్, గెలినా, జిర్కోనియం, కయోనైట్లు ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
డోలమైట్
- దీన్ని ఎక్కువగా ఫెర్రో అల్లాయ్స్. ఇనుము, కాస్కోటెక్స్ తయారీలో ఉపయోగిస్తారు.
క్వార్ట్
విస్తరించిన జిల్లాలు : నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, హనుమకొండ, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, మేడ్చల్- మల్కాజిగిరి
ఫెల్డ్ స్ఫార్
విస్తరించిన జిల్లాలు: ఖమ్మం, భద్రాది కొత్తగూడెం, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి
బంకమట్టి విస్తరించిన జిల్లాలు : మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్
లాటరైట్ విస్తరించి ఉన్న జిల్లాలు : ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, వికారాబాద్, రంగారెడ్డి.
రోడ్ మెటల్ విస్తరించి ఉన్న జిల్లాలు : నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్- మల్కాజిగిరి, సంగారెడ్డి.
స్టోన్ మెటల్ విస్తరించి ఉన్న జిల్లాలు: ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, హనుమకొండ, వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, సిద్దిపేట, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, వికారాబాద్.
రాష్ట్ర ఎలక్ట్రానిక్ విధానం 2016
రాష్ట్ర ఎలక్ట్రానిక్ విధానం కింద గత రెండు సంవత్సరాల్లో 20,000 మందికిపైగా ఉపాధి కల్పన సామర్థ్యంలో రూ. 7,500 కోట్ల విలువైన పెట్టుబడి పెట్టింది.
- రాష్ట్రంలో హైదరాబాద్‌లో 2 ఎలక్ట్రానిక్ క్లస్టర్లు కలవు
1) మహేశ్వరం సైన్స్‌పార్క్ 2) రావిరాల వద్ద ఈసీటీ
- ఇవి 912 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. 30 యూనిట్లు స్థాపించారు.
- ESDM (Electronic System Design Manufacturing) హైదరాబాద్ కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.
- దివిటిపల్లి (మహబూబ్‌నగర్), చందనపల్లి (రంగారెడ్డి)లో ఎలక్ట్రికల్ వెహికల్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ తయారీని ప్రోత్సహిస్తుంది.
ఎలక్ట్రిక్ వాహన, శక్తి సామర్థ్య విధానం 2020-30
రాష్ట్ర ప్రభుత్వం రవాణా వ్యయం తగ్గడానికి, కాలుష్య నివారణకు, రాష్ర్టాన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మార్చడానికి ఎలక్ట్రిక్ వాహన, శక్తి సామర్థ్య విధానం 2020-30 తీసుకొని వచ్చింది.
- రాష్ట్ర ప్రభుత్వం మొదటి 2 లక్షల ఎలక్ట్రిక్ రెండు చక్రాల వాహనాలకు
- 20,000 ఎలక్ట్రిక్ మూడు చక్రాలవాహనాలకు
- 5000 ఎలక్ట్రిక్ క్యాబ్ లేదా ట్యాక్సీలకు
- 1000 ఎలక్ట్రిక్ వస్తువులు సరఫరా చేసే వాహనాలకు
- 5000 ఎలక్ట్రిక్ ప్రైవేట్ కారులు
- 500 ఎలక్ట్రిక్ బస్సులు, ట్రాక్టర్లకు రాష్ట్ర పరిధిలో కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకుంటే వీటికి రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ రుసుములను తొలగించింది.
ఇతర పరిశ్రమలు
ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)
l టీవీలు కంప్యూటర్ల తయారీ
l మేడ్చల్ మల్కాజిగిరిలో ఉంది (1967 ఏప్రిల్ 11)
హిందుస్థాన్ మెషీన్ టూల్స్ లిమిటెడ్ (హెచ్ఎంటీ)
l ఇది గడియారాలు, బల్బులు, బోర్వెల్ విడిభాగాలు తయారు చేస్తుంది.
l భారత్‌లోని మొత్తం యూనిట్లు -6
l తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో ఒక యూనిట్ ఉంది.
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)
l దేశంలో మొత్తం యూనిట్లు-6
l తెలంగాణలో 1963లో సంగారెడ్డి జిల్లాలో స్థాపించారు.
l ఈ సంస్థ టర్బైన్లు, జనరేటర్లు, సర్క్యూట్స్ తయారు చేస్తుంది.
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)
l దేశంలో మొత్తం యూనిట్లు
l తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో 1965లో స్థాపించారు.
l ఇది విమానాలకు సంబంధించిన ఎలక్ట్రిక్ పరికరాలను తయారు చేస్తుంది.
మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI)
l దీనిని 1973లో రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశారు. ఇక్కడ మిశ్రమ లోహాలు తయారు చేస్తారు.
హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్)
l దేశంలో యూనిట్లు : 2 అవి 1) రంగారెడ్డి (తెలంగాణ) 2) రూప్ నారాయణపూర్
(పశ్చిమబెంగాల్)
భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)
l సంగారెడ్డి జిల్లాలో ఉంది. రాకెట్ల తయారీకి ప్రసిద్ధి చెందింది.
ప్రాగాటూల్స్
l సంగారెడ్డి జిల్లాలో ఉంది. రక్షణ విభాగం. ప్రత్యేక భాగాలు తయారు చేయబడతాయి.
ఆల్విన్
l రంగారెడ్డి జిల్లాలో ఉంది. వాచ్‌లు, రిఫిజిరేటర్లు, బస్సు బాడీలు, బ్యాలెట్ బాక్సులు తయారవుతాయి.
ఎలక్ట్రానిక్స్ శాఖ
l హైదరాబాద్‌లో ఉంది. రిఫ్రిజిరేటర్లు, ఉక్కు ఫర్నిచర్, గ్యాస్ సిలెండర్ తయారీలో ప్రసిద్ధి
న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ)
l హైదరాబాద్‌లో ఉంది. యురేనియంను శుభ్రపరుస్తుంది.
భారజల ప్లాంట్
l భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఏర్పాటు చేశారు. డ్యూటీరియం ఆక్సైడ్ (D2O)ను తయారు చేస్తుంది.
మైనింగ్:
l మైనింగ్‌కు అనువైన ఖనిజాలు రాష్ట్రంలో ఉన్నాయి.
l మైనింగ్, క్వారియింగ్ కార్యకలాపాల కోసం 88809 హెక్టార్ల భూమిని లీజుకు
తీసుకున్నారు.
l రాష్ట్రంలో 1904 మినరల్ పరిశ్రమలు ఉన్నాయి.
l రాష్ట్రంలో అత్యధిక మినరల్ పరిశ్రమలు గల జిల్లాలు
1) జోగులాంబ గద్వాల(723)
2) ఖమ్మం (463)
3) వికారాబాద్ (234)
4) కుమ్రం భీం ఆసిఫాబాద్ (183)
l 2014-15 నుంచి 2019-20 మధ్య అత్యధిక రాష్ట్ర జనరల్ మినరల్ రాబడి 2019-20లో రూ. 4848.85 కోట్లు వచ్చింది.
l 2021 నవంబర్ నాటికి ఇసుకను వెలికితీస్తే 70 ఇసుక బేరింగ్ ప్రాంతాల్లో పని చేయడానికి సిద్ధంగా ఉంది. మరో 100 ఇసుక బేరింగ్ ప్రాంతాలు 2021-22 చివరి నాటికి
పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 2020-21లో ఇసుక తవ్వకాల వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.783.75 కోట్లు వచ్చాయి.
l 2020-22 నవంబర్ వరకు రాష్ట్ర ఖజానాకు రూ.546 కోట్లు ఈ వచ్చే ఆదాయంలో దాదాపు మూడింతలు మినరల్ ఫౌండేషన్‌కు వెళ్తుంది. ఇది ప్రత్యేకంగా స్థానిక జనాభాకు
ప్రయోజనం చేకూర్చడానికి ఉపయోగించారు. ఈ నిధుల ద్వారా స్థానిక ప్రజలకు మౌళిక సదుపాయాలను పాఠశాలలు, ఆరోగ్య సౌకర్యాలు, మరుగుదొడ్ల
సౌకర్యాలను కల్పిస్తుంది.
జిల్లాలు – లభించే ఖనిజాలు
- ఆదిలాబాద్ – మాంగనీస్, సున్నపురాయి, స్టోన్ మెటల్, లాటరైట్
- మంచిర్యాల – సున్పపురాయి, వెట్క్లే, స్టోన్మెటల్, బొగ్గు, సాధారణ ఇసుక, స్టోవింగ్ శాండ్, రోడ్మెటల్, క్వార్ట్
- నిర్మల్ – రోడ్మెటల్, క్వార్ట్
- కుమ్రంభీం ఆసిఫాబాద్ -సున్నపురాయి, స్టోన్మెటల్, వైట్‌క్లే, లాటరైట్
- జగిత్యాల – కలర్గ్రానైట్, స్టోన్మెటల్
- పెద్దపల్లి – బొగ్గు, స్టోవింగ్ శాండ్, సున్నపురాయి, రోడ్మెటల్, కలర్గ్రానైట్,
లాటరైట్
రాజన్న సిరిసిల్ల – కలర్గ్రానైట్, స్టోన్మెటల్, క్వార్ట్, - నిజామాబాద్ – రోడ్మెటల్, క్వార్ట్, కలర్ గ్రానైట్, గ్రావెల్
- కామారెడ్డి – రోడ్మెటల్, క్వార్ట్ ఫెల్డ్స్ఫార్, లాటరైట్, బ్లాక్ గ్రానైట్
- హనుమకొండ – కలర్గ్రానైట్, బ్లాక్ గ్రానైట్, స్టోన్ మెటల్, క్వార్ట్, ఐరన్‌ఓర్
- వరంగల్ – లాటరైట్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, స్టోన్మెటల్
- జయశంకర్ – బొగ్గు, ఐరన్‌ఓర్, రోడ్
- జనగామ – రోడ్మెటల్, బ్లాక్ గ్రానైట్
- మహబూబ్‌నగర్ – బ్లాక్‌గ్రానైట్, లాటరైట్, స్టోన్మెటల్, ఐరన్‌ఓర్, స్టోవింగ్శాండ్, మార్బుల్, బెరైటీస్
- ఖమ్మం- డోలమైట్, బెరైటీస్, మైకా, కోరండం, గార్నెట్, కలర్ గ్రానైట్, క్రోమైట్, మార్బుల్, క్వార్ట్, ఫెల్డ్స్ఫార్, స్టోన్మెటల్.
- భద్రాద్రి కొత్తగూడెం – బొగ్గు, రాగి, తగరం, గార్నెట్, రోడ్ మెటల్, క్వార్ట్, ఫెల్డ్స్ఫార్, మార్బుల్
- మెదక్ – రోడ్మెటల్, క్వార్ట్ ఫెల్డ్స్ఫార్, కలర్గ్రానైట్.
- సంగారెడ్డి – క్వార్ట్, ఫెల్డ్స్ఫార్, గ్రానైట్, రోడ్మెటల్.
- సిద్దిపేట – కలర్గ్రానైట్, స్టోన్మెటల్, క్వార్ట్
- మహబూబ్‌నగర్ – బ్లాక్‌గ్రానైట్, కలర్ గ్రానైట్, క్వార్ట్, ఫీల్డ్ స్ఫార్, రోడ్మెటల్
- వనపర్తి – క్వార్ట్, ఫెల్డ్స్ఫార్, బ్లాక్‌గ్రానైట్, రోడ్ మెటల్, సాధారణ ఇసుక
- నాగర్ కర్నూల్ – స్టోన్మెటల్, క్వార్ట్, ఫెల్డ్స్ఫార్, బ్లాక్ గ్రానైట్
- జోగులాంబ గద్వాల్ – లాటరైట్, కలర్ గ్రానైట్, క్వార్ట్.
- నల్లగొండ – కార్ట్, ఫెల్డ్స్ఫార్, కలర్ గ్రానైట్, బ్లాక్‌గ్రానైట్, సున్నపురాయి, బ్లాక్గ్రానై, రోడ్మెటల్, లైమ్‌స్టోన్, లైమ్‌స్టోన్ శ్లాబ్స్.
- సూర్యాపేట – సున్నపురాయి, స్టోన్మెటల్, బ్లాక్‌గ్రానైట్, కలర్గ్రానైట్, సున్నపురాయి, స్లాట్స్
- యాదాద్రి భువనగిరి – రోడ్మెటల్, కలర్గ్రానైట్, సాధారణ ఇసుక,
- వికారాబాద్ – పుల్లర్స్ ఎర్త్, క్వార్ట్, స్టోన్మెంటల్, లాటరైట్, సున్నపురాయి, బ్లాక్‌గ్రానైట్
- మేడ్చల్ – మల్కాజిగిరి – రోడ్మెటల్, బ్లాక్ కలర్, గ్రానైట్, క్వార్ట్, ఫెల్డ్స్ఫార్, ఎమెథెస్ట్
- రంగారెడ్డి – రోడ్మెటల్, లాటరైట్, ఫీల్డ్స్ఫార్, క్వార్ట్, బ్లాక్ గ్రానైట్, పుల్లర్స్ ఎర్త్.
- గనులు, ఖనిజాల ద్వారా అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న జిల్లాలు- కరీంనగర్, సూర్యాపేట
- గనులు ఖనిజాల ద్వారా అత్యల్ప ఆదాయం ఆర్జిస్తున్న జిల్లా – కుమ్రంభీం అసిఫాబాద్, జోగులాంబ గద్వాల.
ప్రాక్టీస్ బిట్స్
1.2019 నవంబర్ 1న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను కె. తారక రామారావు ఎక్కడ ప్రారంభించారు?
1) మంగళపల్లి రంగారెడ్డి జిల్లా
2) దందు మల్కాపురం
యాదాద్రి భువనగిరి
3) బాట సింగారం – రంగారెడ్డి
4) నందిగామ – సంగారెడ్డి
2. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలకు
అనుకూల ప్రాంతాలు కాని జత ఏది?
1. నిమ్మ నల్లగొండ
2) సీతాఫలాలు మహబూబ్‌నగర్
3) ఎండు అల్లం సంగారెడ్డి
4) మామిడి, పచ్చళ్లు జనగామ
3. దేశంలో రాష్ర్టాల పరంగా సులభతర వాణిజ్య విధానం-2019 తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
1) 1 2) 2 3) 3 4) 4
4. తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తు ఎగుమతులు అధికంగా ఏ దేశంలోకి ప్రవేశిస్తున్నాయి?
ఎ) చైనా బి) రష్యా
సి) సింగపూర్ డి) అమెరికా
సమాధానాలు
1-2, 2-4,3-3,4-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు