ఒకట్ల స్థానంలో ఏడు ఉన్న వందలోపు ప్రధాన సంఖ్యలు ?
1. కింది వాటిలో సరిఅయినది ఏది ?
ఎ.(విభాజకం x భాగఫలం)+ శేషం
= విభాజ్యం
బి.(విభాజ్యం x విభాజకం) + శేషం
= భాగఫలం
సి.(విభాజ్యం x భాగఫలం) + శేషం
= విభాజకం
డి.(విభాజకం x శేషం) + భాగఫలం
= విభాజ్యం
2. పది లక్షలను ఆంగ్ల సంఖ్యామానంలో ఏమంటారు ?
ఎ. ట్రిలియన్ బి.మిలియన్
సి.బిలియన్ డి.ఏదీకాదు
3. దశాంశ సంఖ్యామానంలో నాలుగంకెల సంఖ్యలెన్ని ?
ఎ.9999 బి.8999
సి.9000 డి.9998
4. “నాలుగు మిలియన్ల మూడువేల మూడు” ను సంజ్ఞామానంలో రాయగా ?
ఎ.403000 బి.4003003 సి.403030 డి.4030003
5. మూడంకెల అతి పెద్ద సంఖ్య అతిసమీప ఉత్తర గామికి అతి సమీప పూర్వగామి ?
ఎ.999 బి.100
సి.991 డి.చెప్పలేం
6. ఒక వేయి వేలు ఆంగ్ల సంఖ్యామానంలో ఎంతకు సమానం ?
ఎ. పదిలక్షలు బి. ట్రిలియన్
సి. బిలియన్ డి. మిలియన్
7. స్థాన విలువల విధానాన్ని ఉపయోగించిన శాస్త్రవేత్త ?
ఎ. శ్రీనివాస రామానుజన్
బి. భాస్కరాచార్యుడు సి. ఆర్యభట్ట డి. శకుంతల
8. సున్నాకు సంజ్ఞ ఉందని తెలిపిన శాస్త్రవేత్త ?
ఎ. శ్రీనివాస రామానుజన్
బి. భాస్కరాచార్యుడు
సి. ఆర్యభట్ట డి. శకుంతల
9. కింది వాటిలో రామానుజన్ సంఖ్య ?
ఎ. 1629 బి. 6174
సి. 6714 డి. 1729
10. కింది వాటిలో క్రాపేకర్ స్థిరాంకం ?
ఎ.1629 బి.6174
సి.6714 డి.1729
11. మెట్రిక్ సంఖ్యావిధానంలో ఏ అంకెలను ఉపయోగిస్తాం ?
ఎ. 0,1లను మాత్రమే
బి.1నుంచి 9 వరకు మాత్రమే
సి. 0నుంచి 9 వరకు అంకెలను
డి.ఏదికాదు
12. భాస్కరాచార్యుడి స్థాన విలువల విధానాన్ని అనుసరించినవారు ?
ఎ. అరబ్బులు బి. రోమన్లు
సి. జపనీయులు డి. ఏదికాదు
13. 786342 సంఖ్యలో 6 అంకె స్థాన విలువకు, ముఖ విలువకు తేడా ?
ఎ. 5994 బి. 6342
సి. 342 డి. ఏదికాదు
14. ఒక అంకెస్థానం నుంచి వెంటనే ఎడమవైపున గల స్థానానికి జరిగి దాని విలువ ఎన్నిరెట్లవుతుంది ?
ఎ. రెట్టింపు బి. పదిరెట్లు
సి. వందరెట్లు డి. విలువ మారదు
15. ఒకటి నుంచి వంద వరకు గల సహజ సంఖ్యల మొత్తం ?
ఎ. 5005 బి. 4050
సి.5050 డి. 101
16. ఒకటి నుంచి వంద వరకు గల సరిసంఖ్యల మొత్తం ?
ఎ. 2500 బి. 2550
సి. 10000 డి. 5625
17. 51 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యల మొత్తం?
ఎ. 2550 బి. 2500
సి. 3775 డి.ఏదీకాదు
18. మొదటి 20 సరిసంఖ్యల మొత్తం ?
ఎ. 420 బి. 410
సి. 400 డి. 430
19. కింది వాటిలో ప్రధాన సంఖ్య కానిది ?
ఎ. 61 బి. 71 సి. 81 డి. 41
20. కింది వాటిలో ప్రధాన సంఖ్య ?
ఎ. 161 బి. 437 సి. 221 డి. 373
21. మూడంకెల కనిష్ట ప్రధాన సంఖ్య ?
ఎ.103 బి. 107
సి. 109 డి.ఏదీకాదు
22. 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ?
ఎ. 20 బి. 25 సి. 15 డి. 50
23. ఒకట్ల స్థానంలో ఏడు ఉన్న వందలోపు ప్రధాన సంఖ్యలు ?
ఎ. 7 బి. 6 సి. 5 డి. 4
24. సరిప్రధాన సంఖ్య ?
ఎ. 2 బి. 4 సి. 1 డి. ఏదీకాదు
25. గుణిజానికి సంబంధించి సరి కానిది ?
ఎ. ఒక సహజ సంఖ్య గుణిజాలను కనుకొనేందుకు ఆ సహజ సంఖ్యను ప్రతి సహజ సంఖ్యతో గుణించగా వచ్చిన లబ్ధాలన్నింటిని రాయాలి.
బి. ప్రతి సంఖ్య దానికదే గుణిజం అవుతుంది.
సి. ప్రతి సంఖ్య ఒకటికి గుణిజం అవుతుంది.
డి. ఒక సహజ సంఖ్య గుణిజాలు పరిమితం.
26. కింది వాటిలో సరికానిది ?
ఎ. ప్రతి సంఖ్యకు ఒకటి కారణాంకం
అవుతుంది
బి. ప్రతి సంఖ్యకు ఒకటి అతి చిన్న
కారణాంకం అవుతుంది
సి. ఒక సంఖ్య కారణాంకం అదే సంఖ్యకంటే తక్కువగా ఉంటుంది
డి. ప్రతి సంఖ్య దానికదే కారణాంకం అవుతుంది, దానికదే అతిపెద్ధ కారణాంకం అవుతుంది
27. 1). ఒకటి దానికదే కారణాంకాలుగా గల సంఖ్యలను ప్రధాన సంఖ్య అంటారు.
2).రెండు ఏకైక సరిప్రధాన సంఖ్య
3).రెండు ప్రధానాంకాల మధ్య భేదం ఒకటి అయితే వాటిని కవల ప్రధానాంకాలు అంటారు.
ఎ. 1,2 సత్యం బి. 1,2,3 సత్యం
సి. 2,3సత్యం డి. 1,3 సత్యం
28. కింది వాటిలో సరికానిది ?
ఎ. a , b లుపూర్ణ సంఖ్యలై, b శూన్యేతరం అయితే a/b రూపంలో ఉన్న సంఖ్యను అకరణీయ సంఖ్య అంటారు.
బి. ఏ పూర్ణాంకం a కైనా ax0 =0xa = 0 (ఈ ధర్మాన్ని పూర్ణాంకాలలో గుణకార సున్నాధర్మం అంటాం) అలాగే a x b = 0 అయితే a = 0 లేదా b = 0
సి. సహజ సంఖ్యాసమితి సంకలనం దృష్ట్యా సంకలన తత్సమ మూలకం సున్నాను కలిగి ఉండదు
డి. పూర్ణ సంఖ్యల సమితి గుణకారం దృష్ట్యా విలోమ ధర్మాన్ని పాటిస్తుంది.
29. సముద్ర మట్టానికి అడుగున గల విలువలను ఏ సంఖ్యలతో సూచిస్తారు ?
ఎ. ధన బి. రుణ
సి. శూన్య డి. ఏదీకాదు
30. చిన్న బేసి ప్రధాన సంఖ్య ?
ఎ. 5 బి. 2 సి. 3 డి. 1
31. కనిష్ట బేసి సంయుక్త సంఖ్య ?
ఎ .6 బి. 9 సి. 4 డి. 2
32. ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య కాని సంఖ్య ?
ఎ. 1 బి. 2 సి. 3 డి. 4
33. కింది వాటిలో పరిపూర్ణ సంఖ్య ?
ఎ. 4 బి. 2 సి. 6 డి. 8
34. మూడంకెల పరిపూర్ణ సంఖ్య ?
ఎ. 469 బి. 486
సి. 496 డి. 468
35. కవల ప్రధానాంకాల సమితి ?
ఎ. పరిమిత సమితి బి. అపరిమిత సమితి
సి. ఉపసమితి డి. నిర్ధారించబడలేదు
36. ఒక సంఖ్య గరిష్ట, కనిష్ట కారణాంకాల భేదం 12, ఆ సంఖ్య ఏది ?
ఎ. 13 బి. 14 సి. 12 డి. 24
37. ఒక కోటికి లక్షలు ఎన్ని ?
ఎ. 10 బి. 100
సి. 1000 డి. 10000
38. రుణపూర్ణ సంఖ్యలలో పెద్దది ఏది ?
ఎ.0 బి.-1
సి.నిర్వచింపబడదు డి.1
39. 12కు కారణాంకాలు ఏవి ?
ఎ. 2,3 బి. 1,2,3
సి. 1,2,3,4,6,12 డి. 1,2,3,4,6
40. రుణ సంఖ్యలను పూర్ణాంకాలకు కలుపగా ఏర్పడే సంఖ్యలు ?
ఎ. పూర్ణాంకాలు బి. సహజ సంఖ్యలు
సి .పూర్ణసంఖ్యలు డి. సంకీర్ణ సంఖ్యలు
41. కింది వాటిలో ఏది నిజం ?
ఎ.సహజ సంఖ్యాసమితిలో గుణాకారం దృష్ట్యా విలోమ మూలకం వ్యవస్థితం కాదు.
బి.సహజ సంఖ్యాసమితిలో గుణాకారం దృష్ట్యా సహచర ధర్మం పాటించ బడుతుంది.
సి. సహజ సంఖ్యాసమితిలో గుణకారం దృష్ట్యా సత్సమ మూలకం వ్యవస్థితం
డి. పైవన్నీ
42. వాస్తవ సంఖ్యాసమితి అంటే ?
ఎ. అకరణీయసంఖ్యలు
బి. కరణీయ సంఖ్యలు
సి. అకరణీయ + కరణీయసంఖ్యలు
డి. ఏదీకాదు
43. ఒక భాగహార సమస్యలోని విభాజ్యం 1261 విభాజకం భాగఫలంలో సగం, శేషం 11 అయితే విభాజకం ఎంత ?
ఎ. 50 బి. 25 సి. 75 డి. 142
44. ఒకటి నుంచి 60 వరకు గల సహజ సంఖ్యల్లో మూడు గుణిజాల మొత్తం ?
ఎ. 3600 బి. 630
సి. 210 డి. 61
45. ఒకటి నుంచి వంద వరకు గల సహజ సంఖ్యల్లో రెండు చేత లేదా మూడు చేత భాగించబడే సంఖ్యల మొత్తం ?
ఎ. 816 బి. 2550
సి. 1683 డి. 3417
46. మహాసముద్రంలోని సున్నాల సంఖ్య ?
ఎ. 52 బి. 53
సి. 140 డి. 141
47. కింది వాటిలో పరిపూర్ణ సంఖ్య కానిది ?
ఎ. 28 బి. 496
సి. 8128 డి. 424
48.100 నుంచి 200 మధ్యగల ప్రధాన సంఖ్యల సంఖ్య ?
ఎ. 20 బి. 25 సి. 21 డి.16
49. 200 నుంచి 300 మధ్యగల ప్రధాన సంఖ్యల సంఖ్య ?
ఎ. 20 బి. 25 సి. 21 డి. 16
50. 300 నుంచి 400 మధ్యగల ప్రధాన సంఖ్యల సంఖ్య ?
ఎ. 15 బి. 16 సి. 17 డి.2 1
51. ప్రధాన సంఖ్యల సమితి అపరిమిత సమితి అని మొట్ట మొదటి సారిగా నిర్థారించిన శాస్త్రవేత్త ?
ఎ.యూక్లీడ్ బి.ఎరటోస్థనిస్ సి.ఫెర్మా డి.యూలార్
52. 100లోపు కవల ప్రధానాంకాల జతలు ?
ఎ.4 బి.6 సి.8 డి.16
53. కింది వాటిలో కవల ప్రధానాంకాల జత ?
ఎ.17,19 బి.59,61
సి.29,31 డి.పై వన్నీయు
54. కింది వాటిలో ఏ రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం రెండు కలదు ?
ఎ.15,17 బి.17,19
సి.27,29 డి.పై వన్నీయు
55. కింది వాటిలో ఏవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు ?
ఎ.2013,2014 బి.8,15
సి.3,97 డి.పై వన్నీ
56. కింది వాటిలో ఏది నిజం ?
ఎ. ఒకటి కంటే పెద్దదైన సహాజ సంఖ్యకు ఒకటి, అదే సంఖ్యమాత్రమే కారణాంకాలుగాఉంటే ఆ సంఖ్యను ప్రధాన సంఖ్య అంటారు
బి. ఒక సంఖ్య కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అయితే ఆ సంఖ్యను పరిపూర్ణ సంఖ్య అంటారు.
సి. రెండు సంఖ్యలకు ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంఅయితే వాటిని సాపేక్ష ప్రధానసంఖ్యలంటారు
డి. పైవన్నీ
57. 48 కారణాంకాల సంఖ్య ?
ఎ. 8 బి. 10 సి. 24 డి. 60
58. 7 అనే సహజ సంఖ్యకు సమీప ఉత్తరగామి ?
ఎ. 8 బి. 6 సి. -8 డి. -6
59. పూర్ణాంకాల సమితిలో సమీప పూర్వగామి కలిగి ఉండని సంఖ్య ?
ఎ.1 బి. -1 సి. 0 డి. ఏదీకాదు
60. -9 సమీప ఉత్తగామి ?
ఎ.-10 బి. -8 సి. 8 డి.10
61. రెండు అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకణీయ సంఖ్యలుంటాయి అనేది ?
ఎ. సాంద్రత ధర్మం బి. పరావర్తన ధర్మం
సి. వర్గత్రయ విభజన ధర్మం
డి. ఏదీకాదు
62. 2014 కారణాంకాలను ఆరోహణ క్రమంలో రాస్తే అందులో అతి పెద్ద కారణాంకం ?
ఎ.1 బి. 2014 సి. 0 డి.చెప్పలేం
63. కింది వాటిలో పరిపూర్ణ సంఖ్యకు మరొక పేరు ?
ఎ. శుద్ధ సంఖ్య బి. సంయుక్త సంఖ్య
సి. స్నేహ సంఖ్య డి. అదృష్ట్య సంఖ్య
64. 10 ఆధారంగా కలిగిన మానాన్ని ఏమంటారు ?
ఎ. దశాంశ మానం బి. మెట్రిక్ విధానం
సి. కామాలపద్ధతి డి. పైవన్నీ
65. అనుపయోగ సూత్రం అను గ్రంథంలో జీవరాసుల సంఖ్యలో స్థానాల సంఖ్య ?
ఎ. 27 స్థానాలు బి. 97 స్థానాలు
సి. 29 స్థానాలు డి. 96 స్థానాలు
66. -5కు తరువాత గల పూర్ణ సంఖ్య ?
ఎ. -6 బి. -4 సి. 6 డి. 4
67. 2/3కు గుణాకార విలోమం ?
ఎ.-2/3 బి.3/2 సి.-3/2 డి.1
68. రెండు సరిసంఖ్యల మొత్తం ?
ఎ. సరిసంఖ్య
బి.బేసి సంఖ్య
సి. కొన్ని సందర్భాలలో ఏ, బి
డి. ఏదీకాదు
69. -10, 2మధ్యగల పూర్ణ సంఖ్యలెన్ని ?
ఎ. 10 బి. 12 సి.9 డి. 11
70. ఒక భాగహరం లెక్కలో శేషం 0. రుత్విక్ అనే విద్యార్థి 21 బదులుగా పొరపాటుగా 12 భాగించే సంఖ్యగా తీసుకొన్నాడు. అందు వల్ల అతనికి 35 భాగఫలంగా వచ్చింది. సరైన భాగఫలం లేది ?
ఎ. 20 బి. 0
సి. 12 డి. 13
71. ఒక సంఖ్యను 5తో భాగిస్తే 3 శేషం వచ్చింది. ఆ సంఖ్య వర్గాన్ని 5తో భాగిస్తే వచ్చే శేషం ఎంత ?
ఎ. 0 బి. 1 సి. 2 డి. 4
72. ఒక ధన బిన్నానికి దాని విలోమానికి తేడా 9/20 అయితే ఆ భిన్నం ?
ఎ.4/5 బి.5/4 సి.20/9 డి.1
73. రెండు వరుస సరిసంఖ్యల వర్గాల మధ్య భేదానికి కింది వాటిలో ఏ సంఖ్య భాజకం ?
ఎ.7 బి.6 సి.3 డి.4
74. రెండు వరుస భేసి సంఖ్యల వర్గాల భేదానికి కింది వాటిలో ఏది భాజకం ?
ఎ.8 బి.7 సి.6 డి.4
75. ఒక సంఖ్యను 4, 5తో వరుసగా భాగిస్తే 1,4 వరుస శేషాలుగా వచ్చాయి. దానినే 5,4తో వరుసగా భాగిస్తే వచ్చే వరుస శేషాలు ?
ఎ.1,2 బి. 2,3 సి. 3,2 డి. 2,1
బీవీ రమణ
డైరెక్టర్, ఏకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
- Tags
- Divider
- Part fruit
- Trillion
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు