Eagle mission-4 అని పిలిచే ఆపరేషన్?
క్షిపణులు
(జనవరి 20 తరువాయి)
55. భారతదేశం అకుల తరగతికి చెందిన అణు సామర్థ్యం కలిగిన జలాంతర్గామి INS చక్ర ను ఏ దేశం నుంచి పొందింది?
ఎ) ఉక్రెయిన్ బి) రష్యా
సి) దక్షిణ కొరియా డి) ఇజ్రాయెల్
56. 2008లో ముంబై దాడులు ఎదుర్కొనడానికి చేపట్టిన మిలిటరీ ఆపరేషన్?
ఎ) Operation Cyclone
బి) Operation Cactus
సి) Operation Goodwill
డి) Operation Surya Hope
57. శ్రీలంకలోని LTTE కి వ్యతిరేకంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్?
ఎ) Operation Pawan
బి) Operation All Out
సి) Operation Viraat
డి) Operation Trishool
58. కింది వాటిలో సరికాని జత?
ఎ) Operation Pawan-1987
బి) Operation Viraat-1987
సి) Operation Trishool- 1988
డి) Operation Checkmate-1988
59. కింది వాటిలో నేపాల్‌లో భూకంపం సందర్భంగా భారత సైన్యం చేపట్టిన సహాయ కార్యక్రమం?
ఎ) Operation Black – Tornedo
బి) Operation Maitri
సి) Operation Rajiv
డి) Operation Surya Hope
60. Eagle mission-4 అని పిలిచే ఆపరేషన్?
ఎ) Operation Poomalai
బి) Operation Safed Sagar
సి) Operation Rahat
డి) Operation Maitri
61. జతపరచండి.
ఎ. భూతలం-భూతలం
1. బ్రహ్మోస్
బి. గగనతలం-భూతలం
2. ఆకాశ్
సి. భూతలం-గగనతలం
3. అస్త్ర
డి. గగనతలం-గగనతలం
4. పృధ్వీ
ఎ) ఎ-4, బి-1, సి-2, డి-3
బి) ఎ-2, బి-1, సి-4, డి-3
సి) ఎ-4, బి-1, సి-3, డి-2
డి) ఎ-2, బి-1, సి-3, డి-4
62. కింది వాటిని వాటి పరిధి ఆధారంగా జతపరచండి.
ఎ. టాక్టికల్ బాలిస్టిక్ క్షిపణి
1. 300-3500 కి.మీ.
బి. థియేటర్ బాలిస్టిక్ క్షిపణి 2. 3500-5500 కి.మీ
సి. ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి 3. 5500 కి.మీ. కంటే ఎక్కువ
డి. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 4. 150-300 కి.మీ.
ఎ) ఎ-4, బి-2, సి-1, డి-3
బి) ఎ-1, బి-2, సి-4, డి-3
సి) ఎ-4, బి-1, సి-2, డి-3
డి) ఎ-1, బి-4, సి-2, డి-3
63. కింది క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలను వాటి ప్రారంభ సంవత్సరాలతో జతపరచండి.
ఎ. ప్రాజెక్ట్ ఇండిగో 1. 1970
బి. ప్రాజెక్ట్ డెవిల్ 2. 1980
సి. IGMDP 3. 1960
ఎ) ఎ-2, బి-1, సి-3
బి) ఎ-1, బి-2, సి-3
సి) ఎ-3, బి-1, సి-2
డి) ఎ-1, బి-3, సి-2
64. జతపరచండి.
ఎ. అగ్ని-1 1. BVRAAM
బి. అగ్ని-3 2. ICBM
సి. అగ్ని-5 3. IRBM
డి. అస్త్ర 4. SRBM
ఎ) ఎ-2, బి-3, సి-4, డి-1
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-3, బి-2, సి-4, డి-1
డి) ఎ-3, బి-4, సి-2, డి-1
65. భారత సైనిక విభాగాలను వాటి నినాదాలతో జతపరచండి.
ఎ. భారత వైమానిక దళం
1. Service before Self
బి. భారత నావికాదళం
2. Touch the sky with glory
సి. భారత సైనిక దళం
3. May the lord of water be
auspicious unto us
ఎ) ఎ-3, బి-1, సి-2
బి) ఎ-3, బి-2, సి-1
సి) ఎ-2, బి-3, సి-1
డి) ఎ-2, బి-1, సి-3
66. సంస్థలను వాటి ప్రధాన స్థావరాలతో జతపరచండి.
ఎ. National Defence Academy 1. గయ
బి. Indian Military Academy 2. పుణె
సి. Officers Training Academy 3. సిమ్లా
డి. Armny Training Command 4. డెహ్రడూన్
ఎ) ఎ-2, బి-3, సి-1, డి-4
బి) ఎ-2, బి-1, సి-4, డి-3
సి) ఎ-2, బి-1, సి-3, డి-4
డి) ఎ-2, బి-4, సి-1, డి-3
67. కింది సైనిక విన్యాసాలను భారత్ ఏ దేశంతో కలిసి సంయుక్తంగా జరుపుతుందో జతపరచండి.
ఎ. వరుణ్ 1. సింగపూర్
బి. సింబెక్స్ 2. అమెరికా
సి. మలబార్ 3. రష్యా
డి. ఇంద్ర 4. ఫ్రాన్స్
ఎ) ఎ-3, బి-1, సి-4, డి-2
బి) ఎ-3, బి-1, సి-2, డి-4
సి) ఎ-4, బి-1, సి-2, డి-3
డి) ఎ-2, బి-1, సి-4, డి-3
68. సంస్థలను వాటి ప్రధాన కార్యాలయాలతో జతపరచండి.
ఎ. Hindusthan Aeronautics 1. హైదరాబాద్
బి. Bharat Dynamics 2. బెంగళూరు
సి. Mazagon Dock Ltd 3. కలకత్తా
డి. Garden Reach Ship Builders
and Engineers 4. ముంబై
ఎ) ఎ-3, బి-2, సి-4, డి-1
బి) ఎ-3, బి-1, సి-4, డి-2
సి) ఎ-2, బి-3, సి-4, డి-1
డి) ఎ-2, బి-1, సి-4, డి-3
69. భారత సైన్యం నిర్వహించిన మిలటరీ ఆపరేషన్లను వాటిని చేపట్టిన సంవత్సరంతో జతపరచండి.
ఎ. Operation Vijay 1. 2015
బి. Operation Maitri 2. 1961
సి. Operation Surya Hope 3. 2016
డి. India Surgical Strike 4. 2013
ఎ) ఎ-2, బి-1, సి-4, డి-3
బి) ఎ-4, బి-1, సి-2, డి-3
సి) ఎ-1, బి-2, సి-4, డి-3
డి) ఎ-1, బి-4, సి-2, డి-3
70. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు వేటిని కలిగి ఉంటాయి?
1- శక్తిని అందించి, నియంత్రణ చేయగల ప్రయాణ పథం
2- బహిర్గత నియంత్రణలు లేని స్వేచ్ఛా ప్రయాణ పథం
3- పునఃప్రవేశ దశ
ఎ) 1, 2 బి) 1, 3
సి) 2, 3 డి) 1, 2, 3
71. థియేటర్ బాలిస్టిక్ క్షిపణి వినియోగంలో ప్రధాన ఉద్దేశాలను గుర్తించండి.
1- వీటిలో మధ్యశ్రేణి క్షిపణులను
మోహరిస్తారు
2- ఒక ప్రాంతీయ పరిధిలో సైనిక
కార్యక్రమాలు నిర్వహిస్తారు
3- అగ్ని-5, Minuteman (USA)లో థియేటర్ బాలిస్టిక్ క్షిపణులు దీనికి
ఉదాహరణలు
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 3
72. కింది సంస్థల్లో వేటిని కలపడం వల్ల 1958లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థను ఏర్పరిచారు?
1- Technical Development Establishment
2- Directorate of Technical Development and Production
3- Defence Science Organisation
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 1, 3 డి) 2, 3
73. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి కింది వాటిలో సరైనది గుర్తించండి.
1- ఇది భూతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే క్రూయిజ్ క్షిపణి
2- ఇది సూపర్ సోనిక్ వేగంతో
ప్రయాణిస్తుంది
3- భారత్, రష్యాలు దీన్ని సంయుక్తంగా రూపొందిస్తున్నాయి
4- సూపర్సోనిక్ వేగాన్ని కలిగి ఉండే మరో బ్రహ్మోస్-2 క్షిపణి
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి) 2, 3, 4
74. పృథ్వీ క్షిపణికి సంబంధించి కింది వాటిలో సరైనవి?
1- IGMDP కార్యక్రమంలో రూపొందించిన మొదటి క్షిపణి పృథ్వీ
2- ఇది భూతలం నుంచి భూతలానికి
ప్రయోగించగల మధ్యశ్రేణి క్షిపణి
3- 350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల, ద్రవ ఇంధనంతో నడిచే ఒకే అంచెగలది
4- దీన్ని భారత త్రివిధ దళాలు వినియోగించుకునేలా రూపొందించారు
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 3, 4
75. ఇంద్రకు సంబంధించి కింది వాటిలో సరైనవి?
1- ఇది 2003 నుంచి చేపడుతున్న
ద్వైవార్షిక సంయుక్త సైనిక విన్యాసాలు
2- వీటిని భారత్, రష్యాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి
ఎ) 1, 2 బి) 1
సి) 2 డి) పైవేవీ కాదు
76. సాగరిక క్షిపణికి సంబంధించి సరైనవి గుర్తించండి.
1- అణు సామర్థ్యం కలిగిన జలాంతర్గాముల నుంచి ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణి
2- దీని పరిధి 750 కిలోమీటర్లు
3- దీన్ని హైదరాబాద్‌లోని DRDO
అభివృద్ధి చేస్తుంది
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
77. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
1- భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో జరిగే ఫ్లీట్ రివ్యూ తొలిసారి 1954 అక్టోబర్ 10న
నిర్వహించారు
2- దీన్నే స్నేహానికి వారధులు అనే పేరుతో నిర్వహించారు
ఎ) 1, 2 బి) 2
సి) 1 డి) పైవేవీ కావు
78. నాగ్ క్షిపణికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
1- దీని భూతల క్యారియర్‌ను ‘నామిక్’గా వ్యవహరిస్తారు
2- హెలికాప్టర్ ద్వారా ప్రయోగించగల నాగ్ క్షిపణిని ‘హెలినా’ పేరుతో అభివృద్ధి
పరుస్తున్నారు
3- ఇది కాంకర్స్ (రష్యా), మిలాన్
(యూరోపియన్ యూనియన్) క్షిపణులను పోలి ఉంటుంది
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 1, 3 డి) 2, 3
79. ఆకాశ్ క్షిపణికి సంబంధించి సరైనది గుర్తించండి.
1- ఇది సూపర్ సోనిక్ వేగంతో
ప్రయాణించే భూతలం నుంచి
గగనతలానికి ప్రయాణించే మధ్యశ్రేణి క్షిపణి
2- దీనిలో రామ్‌జెట్ ప్రొపల్షన్ సిస్టం అమర్చారు
3- ఇది 25 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు
ఎ) 1, 2 బి) 1, 3
సి) 2, 3 డి) 1, 2, 3
80. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1- బ్రిటిష్ నావికాదళానికి చెందిన centaur తరగతికి చెందిన Aircraft Carrier INS విరాట్
2- INS విరాట్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన INS విక్రాంత్‌తో భర్తీ
చేయనున్నారు
ఎ) 1, 2 బి) 1
సి) 2 డి) పైవేవీ కావు
తెలుసుకుందాం
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
దీన్ని ప్రారంభంలో శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్‌గా వ్యవహరించేవారు. 2002 నుంచి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంగా వ్యవహరిస్తున్నారు. 1971, అక్టోబర్ 1లో ఏర్పాటైన ఈ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి తొలి ఉపగ్రహం రోహిణి-1A 1979 ఆగస్టు 10న నింగికేగింది. భారత అంతరిక్ష కార్యక్రమం పలు అరుదైన మైలురాళ్లు సాధించడంలో ఈ కేంద్రం ప్రముఖ పాత్ర వహించింది. ప్రపంచంలోనే రెండో అత్యున్నత ఉపగ్రహ ప్రయోగ కేంద్రంగా పేరుగాంచిన ఈ కేంద్రంలో రెండు ప్రయోగ వేదికలు ప్రస్తుతం పనిచేస్తుండగా మూడోది ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు