ఖనిజ వృద్ధి.. సంపద సృష్టి
- ఖనిజ వనరుల అధ్యయనాన్ని మినరాలజీ అంటారు.
- తెలంగాణ వైవిధ్య భౌగోళికత కలిగి, నిర్దిష్ట ఖనిజ పరిశ్రమలు, విలువైన విస్తృతమైన ఖనిజాలు కలిగి ఉంది.
- జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న కొద్దీ ఖనిజాల వినియోగం కూడా పెరుగుతుంది.
- తెలంగాణలో ముఖ్యంగా బొగ్గు, ముడి ఇనుము, సున్నపురాయి, డోలమైట్,
మాంగనీస్, కార్ట్, ఫెల్డ్స్ఫార్, బెరటీస్, యురేనియం, సాధారణ ఇసుక నిక్షేపాలను రాష్ట్రం కలిగి ఉంది.
ఖనిజాల వర్గీకరణ - ఖనిజాలను ప్రధానంగా 4 రకాలుగా
వర్గీకరించవచ్చు. అవి
1) లోహ ఖనిజాలు : రాగి, వెండి, బంగారం, ఇనుము, ప్లాటినం, మాంగనీసు, అల్యూమినియం మొదలైనవి.
2) అలోహ ఖనిజాలు : ముగ్గురాయి, సున్నపురాయి, అస్బెస్టాస్, మైకా, గ్రాఫైట్, వజ్రం మొదలైనవి.
3) అణు ఖనిజాలు: థోరియం, యురేనియం మొదలైనవి.
4) ఇంధన ఖనిజాలు: బొగ్గు, పెట్రోలియం,
సహజవాయువు మొదలైనవి.
1. రాగి
- తెలంగాణలో రాగి నిక్షేపాలు మైలారం ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి.
- ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాగి నిక్షేపాలు గుర్తించారు.
- దేశంలో రాగి నిక్షేపాలు ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రం : రాజస్థాన్
- దేశంలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం : కర్ణాటక
2. మాంగనీస్
- భారతదేశంలో మాంగనీస్ నిల్వలు అధికంగా గల రాష్ట్రం : ఒడిశా
- భారతదేశంలో మాంగనీస్‌ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం : మధ్యప్రదేశ్
- తెలంగాణ మాంగనీస్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లాలు : ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్.
- మాంగనీస్ ప్రధానంగా ఉక్కు, బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు.
3. ఇనుము
- ఇనుప ఖనిజం 4 రూపాల్లో లభిస్తుంది. అవి
ఇనుప ఖనిజ ధాతువు ఫెర్రస్ శాతం
మాగ్నటైట్ 72
హెమటైట్ 70
లిమోటైట్ 60
సెడిరైట్ 50 - దేశంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో అధిక మొత్తం హెమటైట్ రూపంలో ఇనుము లభిస్తుంది.
- భారతదేశంలో 1904లో కనుగొన్న మొదటి ఇనుప గని సింగ్భమ్ (జార్ఖండ్)
- భారతదేశంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు అధికంగా గల రాష్ట్రం జార్ఖండ్
- భారతదేశంలో అధికంగా ఇనుము ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం : కర్ణాటక
- తెలంగాణలో ఆదిలాబాద్ కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, కొత్తగూడెం, బయ్యారంలో ఇనుము విస్తరించి ఉంది.
- తెలంగాణలో ఇనుప ఖనిజాల నిల్వ ఎక్కువగా ఉన్న ప్రాంతం- బయ్యారం, కొత్తగూడెం, ఖమ్మం
బంగారం
- బంగారంలో తెలుపు, పసుపు, ఆకుపచ్చ బంగారం అనే గ్రూపులు ఉంటాయి.
- వీటిలో ఆకుపచ్చ బంగారంలో అధిక శాతం బంగారం ఉంటుంది.
- తెలంగాణలో కిన్నెరసాని, గోదావరి నదులు కలిసే ప్రాంతంలో విస్తరించి ఉంది.
- ములుగు జిల్లాలోని మంగపేట
- వనపర్తి జిల్లాలోని ఆత్మకూర్ బ్లాక్
- జోగులాంబ జిల్లాలోని గద్వాల శిలాబెల్ట్
- భారతదేశంలో బంగారం నిక్షేపాలు (లోహం రూపంలో) అధికంగా గల రాష్ట్రం కర్ణాటక ముగ్గురాయి (బెరటీస్)
- తెలంగాణలో ఖమ్మం జిల్లాలో బెరటీస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి.
- రంగులు, రబ్బరు వస్తువులు, పేపర్స్రసాయనాల పరిశ్రమల్లో ముగ్గురాయిని వాడతారు. ముగ్గురాయి విస్తరించిన జిల్లాలు మహబూబ్‌నగర్, ఖమ్మం.సున్నపురాయి (లైమ్‌స్టోన్)
- భారతదేశంలో సున్నపురాయి నిల్వల అధికంగా ఉన్న రాష్ట్రం కర్ణాటక.
- తెలంగాణలో బొగ్గునిల్వల తర్వాత అధిక విస్తీర్ణంలో విస్తరించిన ఖనిజం లైమ్‌స్టోన్.
- రాష్ట్రంలో సున్నపురాయిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లాలు సూర్యాపేట నల్లగొండ.
- సున్నపురాయి విస్తరించిన జిల్లాలువికారాబాద్, అదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి,
సూర్యాపేట
మైకా
- ప్రపంచంలో మైకాను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం -భారతదేశం
- దేశంలో మైకాను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం జార్ఖండ్
- కల్లూరు, వావిలాల, కన్నూరు ప్రాంతాల్లో ఇది విస్తరించి ఉంది.
గ్రాఫైట్
- భారతదేశంలో గ్రాఫైట్ నిల్వలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్
- భారతదేశంలో ప్రస్తుతం అధికంగా గ్రాఫైట్‌ను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తమిళనాడు
- గ్రాఫైట్‌ను పెన్సిళ్లు, రంగులు, పూసల తయారీలో ఉపయోగిస్తారు.
- గ్రాఫైట్‌ను నల్లపూసలని కూడా పిలుస్తారు.
- తెలంగాణ విస్తరించిన ప్రాంతాలు ఉమ్మడి ఖమ్మంలోని ఇపాలపాడు, చిగురుమామిడి, సిద్ధారం, బోలపల్లె.
గ్రానైట్
- భారతదేశంలో గ్రానైట్ వనరులు అధికంగా గల రాష్ర్టాలు కర్ణాటక, రాజస్థాన్
- గ్రానైట్ బ్లాక్ గ్రానైట్‌గా కలర్ గ్రానైట్గాలభిస్తుంది.
- తెలంగాణలో గ్రానైట్‌ను అధికంగా ఉత్పత్తి చేసే జిల్లాలు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల
- తెలంగాణలో నల్ల గ్రానైట్‌ను అధికంగా ఉత్పత్తి చేసే జిల్లా ఖమ్మం
- నల్లగ్రానైట్ విస్తరించిన జిల్లాలు కరీంనగర్, కామారెడ్డి, వరంగల్, హనుమకొండ,
మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నల్లగొండ,
సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్
వజ్రాలు
- భారదేశంలో వజ్రాలు అధికంగా లభించే ప్రాంతం మధ్యప్రదేశ్‌లోని పన్నా ప్రాంతం.
- తెలంగాణలోని మహబూబ్నగర్వికారాబాద్ జిల్లాలోని కోయిలకొండ-దేవరకద్ర ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు
బయటపడ్డాయి. - కొల్లాపూర్, అచ్చంపేటలోని బొల్లారం, సోమశిల ప్రాంతాల్లో కృష్ణానది చుట్టుపక్కల వజ్రాల నిక్షేపాలున్నాయి.
- బొగ్గులో ఉండే కార్బన్ శాతం ఆధారంగా బొగ్గును 4 రకాలుగా వర్గీకరించవచ్చు.
బొగ్గు కార్బన్ శాతం
ఆంథ్రసైట్ 92-95
బిట్యూమినన్ 50-80
లిగ్నైట్ 30-50
పీట్ < 30 - అత్యంత శ్రేష్ఠమైన బొగ్గు ఆంథ్రసైట్. అతి తక్కువ శ్రేష్ఠమైన బొగ్గు పీట్.
- భారతదేశంలో అధికంగా లభించే బొగ్గు బిట్యూమినస్
- తెలంగాణలో లభించే బొగ్గు సెమీ బిట్యూమినస్
- భారతదేశంలో అతిపెద్ద బొగ్గుగని జార్ఖండ్‌లోని ఝరియా గని
- భారతదేశంలో అతిపురాతన బొగ్గుగని రాణిగంజ్ (1774)
- తెలంగాణ రాష్ట్రంలో ప్రాణహిత, గోదావరి లోయ ప్రాంతంలో అధిక బొగ్గు నిల్వలున్నాయి.
- తెలంగాణలో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్న జిల్లాలు మంచిర్యాల, పెద్దపల్లి
- తెలంగాణలో బొగ్గు లభించే జిల్లాలు మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాది కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఖమ్మం
- తెలంగాణలో అత్యధిక బొగ్గును ఉత్పత్తి చేసే జిల్లా భద్రాద్రి కొత్తగూడెం
- దేశం మొత్తం బొగ్గు నిల్వల్లో 20 శాతం వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి.
సింగరేణి కాలరీస్కంపెనీ లిమిటెడ్
- దీని కేంద్ర కార్యాలయం – కొత్తగూడెంలో ఉంది.
- తెలంగాణలో బొగ్గును ఉత్పత్తి చేసే కంపెనీ ఎస్సీసీఎల్.
- 1871లో ఇల్లందు సింగరేణిలలో జీఎస్ఐకి చెందిన కింగ్ తవ్వకాలు జరిపాడు.
- 1886లో దీనికి హైదరాబాద్ దక్కన్ అనే పేరు పెట్టారు.
- 1930 డిసెంబర్ 23న హైదరాబాద్ దక్కన్ పేరును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చారు.
- ఎస్సీసీఎల్లో ఉన్న భూగర్భ నిల్వలు సుమారుగా 8781 మిలియన్ టన్నులు ఉన్నాయి.
- ప్రస్తుతం ఈ కంపెనీ 42 గనులు,18 ఉపరితల గనులు, 27 భూగర్భ గనులను నిర్వహిస్తూ 48,942 మందికి ఉపాధి కల్పిస్తుంది.
- ఎస్సీసీఎల్ 2006లో మినీరత్నహోదా పొందింది.
- దేశంలో ప్రతిష్ఠాత్మక గోల్డెన్ పికాక్
అవార్డును ఎస్సీసీఎల్ పొందింది. - రాష్ట్రంలో మొత్తం ఖనిజ ఆధారిత యూనిట్లు -1904
- రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక మైనింగ్ విధానాన్ని 2014లో ప్రవేశ పెట్టింది.
- దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ర్టాల్లో కంటే తెలంగాణ అధిక బొగ్గు నిక్షేపాలను కలిగి ఉంది. దేశంలోనే బొగ్గు నిక్షేపాల వాటా 7.04 శాతం నిరూపితమైన డిపాజిట్లను కలిగి ఉంది.
- రాష్ట్రంలో దాదాపు 75 శాతం రిజర్వులు మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలున్నాయి.
ప్రాక్టీస్ బిట్స్
1. సరైన వాటిని జత పరచండి.
ఎ) ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్లు
1. నిర్మల్
బి) తెలంగాణ స్పిన్నింగ్ మిల్లు 2) భువనగిరి
సి) సూర్యవంశి స్పిన్నింగ్ మిల్లు 3) సదాశివపేట్
డి) నటరాజ్ స్పిన్నింగ్ మిల్లు 4) బాలానగర్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-2, బి-4, సి-1, డి-3
2. పేపర్ ఇండస్ట్రీలలో సరికాని జతను గుర్తించండి?
1. రేయాన్స్ పరిశ్రమ కమలాపూర్
(హనుమకొండ)
2. చార్మినార్ పేపర్ మిల్లు ముత్తంగి (సంగారెడ్డి)
3. నాగార్జున పేపర్‌మిల్లు- పటాన్చెరు
(సంగారెడ్డి)
4. భద్రాచలం పేపర్‌బోర్డు- సారపాక (ఖమ్మం)
3. తెలంగాణలోని సుల్తాన్‌పూర్‌లో మహిళా పారిశ్రామిక పార్క్ ఏ జిల్లాలో కలదు?
1) మహబూబ్‌నగర్ 2) సంగారెడ్డి
3) మెదక్ 4) రాజన్న సిరిసిల్ల
4. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏ సంవత్సరంలో మినీరత్న హోదా పొందింది?
1) 2006 2) 2007
3) 2008 4) 2010
5. కొవిడ్-19 పరీక్షకు ఉపయోగించే మొదటి ఆర్టీ పీసీఆర్ టెస్ట్ కిట్స్‌ను ధృవీకరించిన సంస్థ?
1) ఐడీపీఎల్
2) శాంతా బయోటెక్
3) ఐసీఎంఆర్ 4) ఎన్ఐఎంజెడ్
6. ప్రస్తుతం హైదరాబాద్ దాని చుట్టు పక్కల ఉన్న బయోటెక్ కంపెనీలు ప్రపంచంలోని టీకాల ఉత్పత్తిలో ఎన్నో వంతు ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి?
1) 1/2వ వంతు 2) 1/ 4 వ వంతు
3) 1/3 వ వంతు 4) పైవేవీకాదు
7. రాష్ట్రంలో ఔషధ, రసాయనిక పదార్థ్థాల ఉత్పత్తుల్లో అత్యధిక వాటా కలిగిన జిల్లా
1) నల్లగొండ 2) రంగారెడ్డి
3) మహబూబ్‌నగర్ 4) మెదక్
8. రాష్ట్రంలో జౌళి లేదా వస్త్ర, పత్తి పరిశ్రమ ఉత్పత్తుల్లో అత్యధిక వాటా కలిగిన జిల్లా?
1) నల్లగొండ మహబూబ్‌నగర్
3) రంగారెడ్డి 4) మెదక్
9. రాష్ట్రంలో అలోహ ఖనిజాల ఉత్పత్తుల్లో అత్యధిక వాటా కలిగిన జిల్లా?
1) రంగారెడ్డి 2) ఆదిలాబాద్
3) సంగారెడ్డి 4) నల్లగొండ
10. రాష్ట్రంలో యంత్రాలు, పరికరాల ఉత్పత్తిలో అత్యధిక వాటా కలిగిన జిల్లా?
1) రంగారెడ్డి
2) మహబూబ్‌నగర్
3) మేడ్చల్ మల్కాజిగిరి 4) మెదక్
11. రాష్ట్రంలో ఆహార ఉత్పత్తుల్లో అత్యధిక వాటా కలిగిన జిల్లా?
1) మహబూబ్‌నగర్ 2) రంగారెడ్డి
3) మెదక్ 4) నల్లగొండ
12. 2020-21 ఆదాయ సేకరణ పరంగా అగ్రస్థానంలో ఉన్న జిల్లా?
1) కరీంనగర్ 2) సిద్దిపేట
3) సూర్యాపేట
4) మహబూబ్‌నగర్
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 8187826293
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు