సాలార్ జంగ్ రెవెన్యూ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేశాడు?
డిసెంబర్ 14వ తేదీ తరువాయి..
80. కింది వాటిని జతపర్చండి?
1. ఉస్మానియా మెడికల్ హైస్కూల్ ఎ. 1846
2. ఎర్రగడ్డ మెంటల్
హెల్త్ హాస్పిటల్ బి. 1908
3. నిజామియా
జనరల్ హాస్పిటల్ సి. 1938డి. 1927
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-బి, 2-సి, 3-డి
3) 1-సి, 2-డి, 3-ఎ
4) 1-బి, 2-డి, 3-సి
81. కింది కట్టడాలు, వాటి శైలిని జతపర్చండి?
1. ఉస్మానియా యూనివర్సిటీ ఎ. మొఘల్-ఇండో
2. హైకోర్టు బి. ఇండో-సార్సెనిక్
3. అసెంబ్లీ సి. సార్సెనిక్-రాజస్థానీ
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-సి, 2-బి, 3-ఎ
3) 1-బి, 2-ఎ, 3-సి
4) 1-బి, 2-సి, 3-ఎ
82. సాలార్ జంగ్ 1861లో స్టాంప్ పేపర్ కార్యాలయాన్ని స్థాపించాడు. కాగా ఇది కింది ఎవరి ఆధ్వర్యంలో పనిచేసింది (మొదటగా)?
1) పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్
2) మున్షిఖానా
3) రెవెన్యూ బోర్డ్ 4) ఏదీకాదు
83. సాలార్ జంగ్ శ్రేణుల ఆధారంగా నిర్ణయించిన కింది జీతభత్యాలను సరిగా జతపర్చండి?
1. ఎస్పీ మొదటి శ్రేణి
ఎ. 200 హోలిసిక్కాలు
2. ఎస్పీ మూడో శ్రేణి
బి. 180 హోలిసిక్కాలు
3. ఇన్స్పెక్టర్ మొదటి శ్రేణి
సి. 90 హోలిసిక్కాలు
4. ఇన్స్పెక్టర్ మూడో శ్రేణి
డి. 170 హోలిసిక్కాలు
ఇ. 110 హోలిసిక్కాలు
ఎఫ్. 140 హోలిసిక్కాలు
1) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-సి
2) 1-ఎ, 2-డి, 3-ఇ, 4-సి
3) 1-ఎ, 2-ఎఫ్, 3-ఇ, 4-సి
4) 1-ఎ, 2-ఎఫ్, 3-బి, 4-సి
84. సాలార్ జంగ్‌ను ఏ సంవత్సరంలో ప్రధాని పదవి నుంచి తొలగించాలని కుట్ర జరిగింది?
ఎ. 1858 బి. 1859
సి. 1860 డి. 1867
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
85. సాలార్ జంగ్‌ను ప్రధాన మంత్రి పదవి నుంచి తొలగించడానికి కుట్ర జరిగిన సమయంలో అతడికి బాసటగా నిలిచి పదవిలో కొనసాగడానికి సహాయపడింది ఎవరు?
ఎ. రాజారాం భక్షి బి. కల్నల్ డేవిడ్ సన్
సి. యూల్ దొర
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
86. హైదరాబాద్ రాజ్యంలో సాలార్ జంగ్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి బ్రిటిష్ వారు ప్రయత్నించడానికి కారణమైన సంఘటన?
1) హోలిసిక్కా అనే నూతన నాణేల ముద్రణ
2) విద్యా సంస్కరణలు
3) అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగడం
4) బీరార్‌ను తిరిగి పొందే ప్రయత్నం
87. సాలార్ జంగ్ ఏర్పాటు చేసిన ‘అదాల్-ఇ-పాదుషాహీ’ అనే ఉన్నత న్యాయస్థానానికి సంబంధించి సరైనవి గుర్తించండి?
ఎ. జిల్లా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ఇక్కడ అప్పీలు చేయవచ్చు
బి. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఐదుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు
సి. ఈ న్యాయస్థానం మరణదండన, యావజ్జీవ కారాగార శిక్షలు కూడా విధిస్తుంది
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) ఎ 4) బి, సి
88. సాలార్ జంగ్ భూమి శిస్తు విధానాలకు అనుసరించిన పద్ధతులు/విధానాలకు సంబంధించి సరైనవి గుర్తించండి?
ఎ. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి శిస్తు నిర్ణయించే పద్ధతిని ప్రవేశపెట్టాడు
బి. భూమి విస్తీర్ణాన్ని, సాగు పరిమాణాన్ని బట్టి శిస్తు నిర్ణయించే పద్ధతి ప్రవేశపెట్టాడు
సి. భూమి శిస్తును ధన రూపంలో గాని, ధాన్య రూపంలో గాని చెల్లించవచ్చని నిర్ణయించాడు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
89. సాలార్ జంగ్ ఏర్పరచిన ఐదు ప్రాంతీయ రెవెన్యూ మండలాలు, వాటి ప్రాంతాలను సరిగా జతపర్చండి?
1. ఉత్తర మండలం ఎ. గుల్బర్గా, షోలాపూర్, రాయచూర్
2. దక్షిణ మండలం బి. వరంగల్, నల్లగొండ, ఖమ్మం
3. పశ్చిమ మండలం సి. నిజామాబాద్, కరీనంగర్
4. తూర్పు మండలం డి. బీదర్, నాందేడ్
5. వాయవ్య మండలం ఇ. ఔరంగాబాద్, దాని పరిసర ప్రాంతాలు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి, 5-ఇ
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-ఇ, 5-బి
90. సాలార్ జంగ్ 1864లో ఏర్పాటు చేసిన రెవెన్యూ బోర్డుకు సంబంధించి సరైనది గుర్తించండి?
ఎ. ఇందులో ఒక అధ్యక్షుడు, నలుగురు సభ్యులు ఉన్నారు
బి. వ్యవసాయం, ఎగుమతి, దిగుమతి సుంకాలు, రహదారులు, స్థానిక సంస్థలకు సంబంధించిన పన్నులన్నింటిపై అజమాయిషీ అధికారాలు ఉన్నాయి
సి. రూ.300 వరకు శిస్తు మాఫీ చేసే అధికారం బోర్డుకు ఉంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
91. సాలార్ జంగ్ బ్రిటిష్ అనుకూల చర్యల వల్ల కలిగిన ప్రయోజనాల్లో సరైనవి?
ఎ. రాయచూర్, ఉస్మానాబాద్‌లను తిరిగి పొందడానికి
బి. నిజాం బకాయి పడిన రూ.50 లక్షల రద్దు
సి. బీరార్‌ను తిరిగి పొందడం
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
92. కింది ఏ రకమైన ఆర్థిక చర్యల వల్ల నిజాం రాజ్యంలో ఆర్థిక లోటు తగ్గింది/తీరింది?
ఎ. హెచ్చు జీతాలు ఉన్న ఉద్యోగులను తగ్గించడం/తొలగించడం
బి. భూమి శిస్తు పెంపు
సి. సైన్యాన్ని తగ్గించడం
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
93. కింది వాటిలో సరైనది/వి గుర్తించండి.
ఎ. సదర్-ఉల్-మహల్‌కు సంబంధించిన మంత్రుల సంఖ్య- 5
బి. సదర్-ఉల్-మిహం కు సంబంధిచిన మంత్రుల సంఖ్య- 7
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
94. హైదరాబాద్ సంస్థానాన్ని అసఫ్‌జాహీ వంశస్తులు సుమారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు?
1) 224 2) 242 3) 243 4) 220
95. నవాబ్ తురాబ్ అలీఖాన్‌కు సాలార్ జంగ్ అనే బిరుదు ఇచ్చింది?
1) అఫ్జలుద్దౌలా 2) నాసిరుద్దౌలా
3) మీర్ మహబూబ్ అలీఖాన్
4) బ్రిటిష్ వారు
96. కింది ఎవరి మరణానంతరం నవాబ్ తురాబ్ అలీఖాన్ ప్రధాని పదవిని చేపట్టాడు?
1) నవాబ్ సర్వర్-ఉల్-ముల్క్
2) సిరాజ్-ఉల్-ముల్క్
3) సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి
4) ఎవరూ కాదు
97. సాలార్ జంగ్ కాలం నాటి కింది వాటిని జతపర్చండి.
1. జిల్లా కలెక్టర్ ఎ. అవ్వల్ తాలూక్దార్
2. సబ్ కలెక్ట్ర్ బి. దోయం తాలూక్దార్
3. తహసీల్దార్ సి. సోయం తాలూక్దార్
డి. సదర్ తాలూక్దార్
1) 1-డి, 2-బి, 3-సి
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-బి, 2-సి, 3-డి
4) 1-డి, 2-ఎ, 3-సి
98. న్యాయస్థానాలకు సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ. దారుల్-ఖాజి-కోట్రి: మతసంబంధ కేసుల పరిష్కారానికి
బి. మహికాయ-ఇ-అదాలత్: ముస్లిం న్యాయ చట్టాల కోసం
1) ఎ 2) బి
3) ఎ, బి సరైనవి 4) ఎ, బి సరికావు
99. కింది వాటిని జతపర్చండి?
1. పోస్టల్ వ్యవస్థ ఏర్పాటు ఎ. 1861
2. మొదటిసారి పారిశ్రామిక వస్తు ప్రదర్శన (నుమాయిష్)
బి. 1862
3. భౌగోళిక సర్వే శాఖ సి. 1856
4. ప్రజాపనుల గిడ్డంగి శాఖ డి. 1875
ఇ. 1869
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-బి, 2-సి, 3-ఇ, 4-డి
100. 1925లో రూ.35 లక్షల మూలధన పెట్టుబడితో కింది ఏ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమను స్థాపించారు?
1) షాబాద్ 2) రామగుండం
3) నల్లగొండ 4) ఏదీకాదు
101. కింది వాటిలో సరైనది?
ఎ. ముల్కీ అనేది ఉర్దూ భాషా పదం
బి. ముల్కీ-నాన్ ముల్కీ సమస్యకు 600 సంవత్సరాల చరిత్ర ఉంది
సి. ఈ సమస్యకు కుతుబ్ షాహీ కాలంలో బీజం పడింది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
102. కింది వాటిలో సరైనది?
ఎ. బహమనీ సుల్తానుల కాలంలో ఇరాన్, ఇరాక్, టర్కీ మొదలైన దేశాల నుంచి దక్షిణ ప్రాంతంలో (దక్కన్) స్థిరపడిన వారిని ‘దక్కనీ’లు అంటారు
బి. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఖిల్జీ, తుగ్లక్ సైన్యాలతో పాటుగా దక్షిణ ప్రాంతానికి వచ్చి స్థిరపడిన వారిని ‘అఫాకీ’లు అంటారు
1) ఎ 2) బి
3) ఎ, బి సరైనవి 4) ఎ, బి సరికాదు
103. బహమనీ సుల్తానుల కాలంలో దక్కనీలకు, అఫాకీలకు తీవ్ర ఘర్షణలు జరిగి అనేక మంది మరణించిన సంఘటన కింది ఏ పట్టణంలో జరిగింది?
1) గుల్బర్గా 2) బీదర్
3) ఔరంగాబాద్ 4) ఏదీకాదు
104. ఏ బహమనీ సుల్తాన్ కాలంలో దక్కనీలకు, అఫాకీలకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి?
1) మొదటి అహ్మద్ షా
2) రెండో అహ్మద్ షా
3) మూడో అహ్మద్ షా
4) ఎవరూ కాదు
105. కింది ఎవరి కాలంలో ముల్కీ-నాన్ ముల్కీ సమస్య అంతగా లేదు?
1) బహమనీలు 2) కుతుబ్ షాహీ
3) అసఫ్‌జాహీ 4) ఎవరూ కాదు
106. 5వ నిజాం అఫ్జల్ ఉద్దౌలా కాలంలో ముల్కీ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు?
ఎ. సిపాయిల తిరుగుబాటు అనంతరం ఉత్తర భారతం నుంచి పదవులు కోల్పోయిన వారు నిజాం రాజ్యంలోకి వలస వచ్చి ఉన్నత పదవులు పొందడం
బి. సాలార్జంగ్ సంస్కరణల్లో భాగంగా ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన విద్యావంతులు, మేధావులు నిజాం రాజ్యంలో అధిక సంఖ్యలో ఉద్యోగాలు పొందడం
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
107. నిజాం రాజ్య పరిపాలనలో మొదటిసారిగా ఏ సంవత్సరంలో స్థానికులకే అవకాశాలివ్వాలి అని ఉత్తర్వులు వెలువడ్డాయి?
1) 1869 2) 1868
3) 1870 4) 1871
108. మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో ముల్కీ సమస్య తలెత్తడానికి గల కారణాలు?
ఎ. 1824లో పారశీ భాషా స్థానంలో ఉర్దూ అధికార భాషగా మార్చడం
బి. ఇంగ్లిష్ తప్పనిసరి భాషగా ప్రవేశపెట్టడం
సి. ముల్కీలను అధిక సంఖ్యలో ఉద్యోగాల నుంచి తొలగించడం
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
109. 1886 ఉద్యోగుల సాధారణ జాబితా ప్రకారం ముల్కీ ఉద్యోగులు, వారి జీతాల శాతానికి సంబంధించి సరైనది?
1) ముల్కీ ఉద్యోగులు 58 శాతం, వారి జీతాల వ్యయం 42 శాతం
2) ముల్కీ ఉద్యోగులు 52 శాతం, వారి జీతాల వ్యయం 48 శాతం
3) ముల్కీ ఉద్యోగులు 52 శాతం, వారి జీతాల వ్యయం 42 శాతం
4) ముల్కీ ఉద్యోగులు 58 శాతం, వారి జీతాల వ్యయం 48 శాతం
110. నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ విడుదల చేసిన 1888 గెజిట్ ప్రకారం కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. తొలిసారిగా ఈ గెజిట్‌లో ‘ముల్కీ’ అనే పదం వాడారు
బి. కనీసం 12 సంవత్సరాలు రాజ్యంలో స్థిరపడిన వారిని ముల్కీలుగా గుర్తించాలి
సి. నాన్ ముల్కీలు ఉద్యోగాలు పొందాలంటే ‘నిజాం రాజు’ ప్రత్యేక అనుమతి తీసుకోవాలి
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
111. ఉద్యోగుల సాధారణ జాబితా ప్రకారం (1894) నిజాం రాజ్యంలోని మొత్తం గెజిటెడ్ ఉద్యోగాల్లో ముల్కీల శాతం ఎంత?
1) 35 శాతం 2) 67 శాతం
3) 33 శాతం 4) 65 శాతం
112. ఉర్దూ భాషకు కూడా ముల్కీ, నాన్ ముల్కీ రంగు పూసి, ఉత్తరాది ఉర్దూ అని భాషాపరంగా ముల్కీ, నాన్ ముల్కీ సమస్యకు కారణమైన అధికారి?
1) కిషన్ పెర్షాద్ 2) కాసన్ వాకర్
3) అక్బర్ హైదరీ 4) ఎవరూ కాదు
113. ‘వీరికి ఎంత ప్రతిభ ఉన్నా తరతరాలుగా నిజాం సేవలో విధేయులుగా ఉన్న స్థానికులతో వీరిని పోల్చలేం’ అని నాన్ ముల్కీల గురించి వ్యాఖ్యానించింది?
1) సాలార్ జంగ్-1 2) సాలార్ జంగ్-2
3) సాలార్ జంగ్-3 4) ఎవరూకాదు
114. నాన్ ముల్కీల ప్రాధాన్యాన్ని తగ్గించడానికి సాలార్ జంగ్-1 తీసుకున్న చర్యల్లో సరైనవి?
ఎ. నాన్ ముల్కీ అధికారులకు జాగీర్లు, బిరుదుల నిరాకరణ
బి. సైనిక పదవుల్లో నాన్ ముల్కీలకు అప్రాధాన్యం
సి. రాజ్య అధికార భాష పర్షియన్‌ను తొలగించి ఉర్దూ ప్రవేశపెట్టడం
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, సి
గందె శ్రీనివాస్: విషయ నిపుణులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు