మాల్ఫీజియన్ నాళికలు విసర్జకావయవాలుగా ఉన్న జీవులు?
జంతువైవిధ్యం
1. కింది జంతువుల్లో క్షీరదం కానిది?
ఎ) మేక బి) మొసలి
సి) గబ్బిలం డి) కంగారూ
2. సముద్ర తీరంలో ఉంటూ, సముద్ర జీవులను ఆహారంగా గ్రహిస్తూ, ఈదే శక్తి ఉన్న ఎగరలేని పక్షి?
ఎ) నిప్పు కోడి బి) కివి
సి) సీ గల్ డి) పెంగ్విన్
3. కింది సకశేరుక సమూహాల్లో ఉష్ణరక్త జీవులను గుర్తించండి.
ఎ. మత్స్యాలు బి. ఉభయచరాలు
సి. పక్షులు డి. క్షీరదాలు
ఇ. సరీసృపాలు
ఎ) ఎ, సి బి) సి, డి
సి) బి, సి డి) డి, ఇ
4. చేపల శ్వాసాంగాలు?
ఎ) వాయునాళాలు బి) చర్మం
సి) గ్రసని డి) మొప్పలు
5. తిమింగలం అనేది?
ఎ) పెద్ద చేప
బి) సముద్రజీవనం గడిపే సరీసృపం
సి) క్షీరదం
డి) ఉభయచరం
6. గుడ్లుపెట్టే క్షీరదం?
ఎ) గబ్బిలం బి) కంగారూ
సి) ఎఖిడ్నా డి) పంది
7. ఎగిరే శక్తి ఉన్న క్షీరదం?
ఎ) ఎఖిడ్నా బి) తిమింగలం
సి) గబ్బిలం డి) పావురం
8. స్నానపు స్పంజికగా పేర్కొనే జీవి?
ఎ) సైకాన్ బి) యూస్పాంజియా
సి) యూప్లెక్టెల్లా డి) స్పాంజిల్లా
9. జపాన్లో ఏ స్పంజికను వివాహ సమయంలో కానుకగా ఇస్తారు?
ఎ) యూప్లెక్టెల్లా బి) యుస్పాంజియా
సి) క్లయోనా డి) సైకాన్
10. ‘దివ్యమైన సరీసృపాలు’ అని హక్స్లే వేటిని పేర్కొన్నాడు?
ఎ) మొసళ్లు బి) సర్పాలు
సి) గబ్బిలాలు డి) పక్షులు
11.మాల్ఫీజియన్ నాళికలు విసర్జకావయవాలుగా ఉన్న జీవులు?
ఎ) జీవావరణ వ్యవస్థ
బి) జీవసముదాయం
సి) ఈకోటోన్ డి) నిషీ
12. జన్యునిధుల ఉపయోగం?
ఎ) పర్యావరణ సమతుల్యతకు
బి) జీవవైవిధ్య సంరక్షణకు
సి) జన్యుపరమైన వ్యాధుల నివారణకు
డి) కాలుష్య నివారణకు
13. మాల్ఫీజియన్ నాళికలు విసర్జకావయవాలుగా ఉన్న జీవులు?
ఎ) పాలికీట్లు బి) కీటకాలు
సి) ఉభయచరాలు డి) మొలస్కన్లు
14. గొంగళి పురుగు అనేది?
ఎ) కీటకాల సరూపశాబకం
బి) కీటకాల లార్వా
సి) కీటకాల ప్యూపాదశ
డి) అనెలిడాకు చెందిన జీవి
15. జంతుసామ్రాజ్యంలో అతిపెద్ద వర్గం?
ఎ) ఆర్థ్రోపొడా బి) మొలస్కా
సి) కార్డేటా డి) మత్స్యాలు
16. ద్వినామ నామీకరణను ప్రతిపాదించిన వారు?
ఎ) లామార్క్ బి) విట్టేకర్
సి) లిన్నేయస్ డి) డివ్రీస్
17. జతపరచండి.
ఎ. ప్రోటోథీరియన్లు
1. అనెలిడా-ఆర్థ్రోపొడా
బి. పెరిపేటస్
2. అనెలిడా-మొలస్కా
సి. ప్రోటిరోస్పాంజియా
3. సరీసృపాలు-క్షీరదాలు
డి. నియోపిలైనా
4. ప్రోటోజోవా-పోరిఫెరా
ఎ) ఎ-3, బి-1, సి-2, డి-4
బి) ఎ-3, బి-4, సి-1, డి-2
సి) ఎ-3, బి-1, సి-4, డి-2
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
18. అతిపెద్ద సజీవ పక్షి?
ఎ) ఫ్లెమింగో బి) నిప్పుకోడి
సి) కివి డి) నెమలి
19. హోమో సెపియన్స్లో సెపియన్స్ అనే పదం దేన్ని సూచిస్తుంది?
ఎ) ప్రజాతి బి) క్రమం
సి) కుటుంబం డి) జాతి
20. జ్వాలా కణాలున్న జీవులు?
ఎ) సీలెంటిరేట్లు బి) స్పంజికలు
సి) బల్లపరుపు పురుగులు
డి) కీటకాలు
21. అతుకులు కలిగిన కాళ్లు ఏ వర్గ జీవుల లక్షణం?
ఎ) పొరిఫెరా బి) ప్లాటీహెల్మింథిస్
సి) అనెలిడా డి) ఆర్థ్రోపొడా
22. పూర్తిగా సముద్రజీవనం చేసే జీవులు మాత్రమే ఉన్న వర్గం?
ఎ) కార్డేటా బి) మొలస్కా
సి) అనెలిడా డి) ఎఖైనోడర్మేటా
23. క్షీరదాల ముఖ్యలక్షణాలు?
ఎ) ఈకలు, ముక్కు
బి) రోమాలు, పాలగ్రంథులు
సి) పొలుసులు, తోక
డి) కాళ్లు, తోక
24. కింది వాటిలో చేప కానిది?
ఎ) జెల్లీ చేప బి) ఎగిరే చేప
సి) విద్యుత్ చేప డి) రాగండి
25. నత్తలు, ఆల్చిప్పలు ఏ వర్గ జీవులు?
ఎ) అనెలిడా బి) ఆర్థ్రోపొడా
సి) కార్డేటా డి) మొలస్కా
జవాబులు
1.బి 2.డి 3.బి 4.డి
5.సి 6.సి 7.సి 8.బి
9.ఎ 10.డి 11. సి 12.బి
13.బి 14.బి 15.ఎ 16.సి
17.సి 18.బి 19.డి 20.సి
21.డి 22.డి 23.బి 24.ఎ
25.డి
జంతు కణజాలాలు
1. ఏ కణజాలానికి పునరుత్పత్తి శక్తి ఉండదు?
ఎ) ఉపకళాకణజాలం
బి) కండర కణజాలం
సి) సంయోజక కణజాలం
డి) నాడీకణజాలం
2. మానవుడిలో ఏ అవయవం పునరుత్పత్తి
చేసుకోగలదు?
ఎ) చేయి బి) గుండె
సి) ఊపిరితిత్తి డి) కాలేయం
3. ఊపిరితిత్తులలోని వాయుగోణులను ఆవరించి ఉండే ఉపకళ?
ఎ) శల్కల బి) ఘనాకార
సి) స్తంభాకార డి) ట్రాన్సిషనల్
4. గాబ్లెట్ కణాలు ఏ ఉపకళలో ఉంటాయి?
ఎ) ఘనాకార బి) స్తంభాకార
సి) శల్కల డి) ట్రాన్సిషనల్
5. పక్కపక్క ఎముకలను కలిపేది?
ఎ) లిగమెంట్ బి) టెండాన్
సి) కండరం డి) ఉపకళ
6. కండరాన్ని ఎముకలతో సంధించేది?
ఎ) టెండాన్ బి) లిగమెంట్
సి) ఉపకళ
డి) కణసంధాన చక్రికలు
7. రక్తం ఏ రకమైన కణజాలం?
ఎ) ఉపకళ కణజాలం
బి) కండర కణజాలం
సి) సంయోజక కణజాలం
డి) నాడీకణజాలం
8. మానవదేహంలోని నియంత్రిత కండరాలు?
ఎ) హృదయ కండరాలు
బి) అరేఖిత కండరాలు
సి) నునుపు కండరాలు
డి) రేఖిత కండరాలు
9. నిస్సల్ రేణువులు దేనిలో ఉంటాయి?
ఎ) కండరకణం బి) రక్తం
సి) ఉపకళ డి) నాడీకణం
10. కణసంధాన చక్రికలు ఉన్న కండరాలు?
ఎ) అరేఖిత బి) రేఖిత
సి) నునుపు డి) హృదయ
సమాధానాలు
1.డి 2.డి 3.ఎ 4.బి
5.ఎ 6.ఎ 7.సి 8.డి
9.డి 10.డి

గమనం
1. దేహంలోని కదలికలకు కారణం?
ఎ) కీళ్లు బి) కళ్లు
సి) కాలేయం డి) టెండాన్లు
2. దేహంలోని ఎముకల గూడు, దానికి అనుబంధంగా ఉండే మృదులాస్థులు కలిసి దేన్ని ఏర్పరుస్తాయి?
ఎ) అస్థిపంజరం బి) కండర వ్యవస్థ
సి) చలన వ్యవస్థ డి) పైవేవీ కావు
3. బంతి గిన్నె కీలు ఎక్కడ ఉంటుంది?
ఎ) మోకాలు బి) మెడ
సి) మోచేయి డి) భుజం
4. మోచేతిలో ఉండే కీలు?
ఎ) బంతిగిన్నె కీలు బి) జారుడు కీలు
సి) మడతబందు కీలు
డి) బొంగరపు కీలు
5. పక్షులలోని ఉడ్డయక కండరాలు దేనికి
తోడ్పడతాయి?
ఎ) నడవడం బి) పరిగెత్తడం
సి) ఈదడం డి) ఎగరడం
6. బొద్దింకల్లోని కాళ్ల సంఖ్య?
ఎ) రెండు జతలు బి) మూడు జతలు
సి) నాలుగు జతలు డి) ఆరు జతలు
7. చలన సమయంలో చేప దేహాన్ని సమతాస్థితిలో ఉంచడానికి తోడ్పడే నిర్మాణాలు?
ఎ) ఎముకలు బి) మొప్పలు
సి) పొలుసులు డి) వాజాలు
8. తుంటి వద్ద కీలు ఏ రకం?
ఎ) మడతబందు కీలు
బి) జారుడు కీలు
సి) బొంగరపు కీలు డి) బంతిగిన్నె కీలు
9. ఎగిరే శక్తి ఉన్న అకశేరుకాలు ఏ వర్గంలో ఉంటాయి?
ఎ) అనెలిడా బి) ఆర్థ్రోపొడా
సి) మొలస్కా డి) హెల్మింథిస్
10. నత్త చలనాంగం?
ఎ) కర్పరం బి) పాదం
సి) కాళ్లు డి) మొప్పలు
సమాధానాలు
1.ఎ 2.ఎ 3.డి 4.సి
5.డి 6.బి 7.డి 8.డి
9.బి 10.బి
వ్యాధులు
1. ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా నిర్మూలించిన వ్యాధి?
ఎ) మశూచి బి) కలరా
సి) పోలియో డి) క్షయ
2. ప్లాస్మోడియం వల్ల కలిగే మలేరియా దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది?
ఎ) గాలి బి) స్పర్శ
సి) ఆహారంపై వాలే ఈగలు
డి) దోమ కాటు
3. కింది వాటిలో భిన్నమైంది?
ఎ) మశూచి బి) తట్టు
సి) కలరా డి) క్షయ
4. మశూచి – వైరస్ ; మలేరియా – ?
ఎ) శిలీంధ్రం బి) ప్రొటోజోవా
సి) బ్యాక్టీరియా డి) వైరస్
5. కింద తెలిపిన వ్యాధుల్లో శిలీంధ్రం వల్ల కలిగేది?
ఎ) పసుపుపచ్చ ఈనెల వ్యాధి
బి) టొబాకో మొజాయిక్
సి) గోధుమ కుంకుమ తెగులు
డి) వడలడం
6. సిట్రస్ కాంకర్ వేటి వల్ల కలుగుతుంది?
ఎ) పశువుల్లోని వైరస్ వల్ల
బి) మొక్కల్లోని బ్యాక్టీరియా వల్ల
సి) మానవుల్లో బ్యాక్టీరియా వల్ల
డి) మొక్కల్లో వైరస్ వల్ల
7. ఆంత్రాక్స్ కారకం?
ఎ) వైరస్ బి) బ్యాక్టీరియా
సి) ప్రొటోజోవా డి) శిలీంధ్రం
8. పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి కారకం?
ఎ) బ్యాక్టీరియా బి) వైరస్
సి) ప్రియాన్ డి) శిలీంధ్రం
9. పశువులకు సోకే వ్యాధి (Mad Cow) కారకం?
ఎ) ప్రియాన్ బి) వైరస్
సి) శిలీంధ్రం డి) బ్యాక్టీరియా
10. కలరా సోకిన వ్యక్తి మరణానికి ముఖ్య కారణం?
ఎ) బ్యాక్టీరియా విడుదల చేసే టాక్సిన్స్
బి) పౌష్టికాహార లోపం వల్ల
సి) శరీరం నుంచి అతిగా లవణాలు, నీరు కోల్పోవడం వల్ల
డి) రక్త విరేచనాల వల్ల
11. సాధారణంగా జలుబు ఏ వైరస్ వల్ల కలుగుతుంది?
ఎ) వెరిసెల్లా బి) వేరియోలా
సి) ఆర్థ్రోమిక్సో డి) రైనో
12. ఆర్థ్రోమిక్సోవైరస్ ఏ వ్యాధిని కలిగిస్తుంది?
ఎ) పోలియోమైలిటిస్
బి) ఇన్ఫ్లూయెంజా
సి) తట్టు డి) గవదబిళ్లలు
13. హైడ్రోఫోబియా/జలభీతి ఏ వ్యాధి ముఖ్య లక్షణం?
ఎ) మొదడు వాపు వ్యాధి
బి) పోలియోమలైటిస్
సి) రేబిస్ డి) ఎయిడ్స్
14. బ్రేక్ బోన్ ఫీవర్ అని ఏ వ్యాధిని పిలుస్తారు?
ఎ) డెంగీ బి) చికున్ గున్యా
సి) స్వైన్ ఫ్లూ డి) బర్డ్ ఫ్లూ
15. షింగల్స్ అని ఏ వ్యాధిని పిలుస్తారు?
ఎ) హెర్పిస్ సింప్లెక్స్ బి) ఎయిడ్స్
సి) సార్స్ డి) మెదడు వాపు వ్యాధి
సమాధానాలు
1.ఎ 2.డి 3.డి 4.బి 5.సి
6.బి 7.బి 8.బి 9.ఎ 10.సి
11.డి 12.బి 13.సి 14.బి 15.ఎ
తెలుగు అకాడమీ సౌజన్యంతో
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






