విరచిస్తా నేడే నవశకం..!
- ఒకరు సాధించారంటే మీరు సాధించగలరు
కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోయింది. 2022లో ఒక్కొక్క రోజు వడివడిగా గడిచిపోయి 365 రోజులు పూర్తయ్యాయి. చదువుకునే విద్యార్థులకు, ఉద్యోగం కోసం శ్రమించే అభ్యర్థులకు నేటి నుంచి ప్రారంభమయ్యే కొత్త ఏడాది నవశకంగా మిగలాలంటే ఏం చేయాలి? విజేతగా నిలవాలంటే ఏం చేయాలి అనే అంశాలపై సివిల్స్‌లో సక్సెస్ సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన విజేతల సలహాలు, సూచనలు మీ కోసం…
సివిల్స్‌లో రెండుసార్లు విజేతగా నిలవడమే కాకుండా వందలాది మంది అభ్యర్థులకు మార్గదర్శనం చేస్తూ, ఎంతోమందిని సివిల్ సర్వెంట్స్‌గా తీర్చిదిద్దుతున్న మల్లవరపు బాలలత కొత్త సంవత్సరంలో అభ్యర్థులకు ఇచ్చే సూచనలు, సలహాలు ఆమె మాటల్లో…
చరిత్ర పుటల్లో 2022 చేరిపోయింది. కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యింది. అయితే విద్యార్థులు, పోటీపరీక్షదారులు గతేడాది ఏం సాధించాం? ఈ ఏడాది లక్ష్యం ఏమిటి అనేది ప్రధానంగా ఆలోచించుకోవాలి. కింది విషయాలను అవగతం చేసుకుంటే ఈ ఏడాది మీ జీవితానికి నవశకంగా మిగిలిపోతుంది.
మార్పు అనేది అంత తేలిక కాదు కానీ అసాధ్యమేమి కాదు. మార్పు అనేది మనిషి వల్లే సాధ్యం అవుతుంది.
చిన్న స్థాయి నుంచి ప్రపంచస్థాయికి ఎదగవచ్చు దీనికి ఉదాహరణలు కోకొల్లలు. స్టీవ్ జాబ్స్, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పీవీ సింధు, సీఎం కేసీఆర్ ఇలా ఎందరో ఇది కాదు అనుకున్న దాన్ని సాధించి చూపించారు.
- మార్పుకు సంకల్ప బలం దృఢంగా ఉండాలి.
- పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలంటే పెద్ద పెద్ద సంస్థల్లో చదివిన వారికే వస్తాయి అనుకుంటారు. కానీ ఈ ఏడాది సివిల్స్ సాధించిన వారిని పరిశీలిస్తే సామాన్యులే ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులను సాధించారు. అంగవైకల్యం, ఆర్థిక స్థితులు, కుటుంబ నేపథ్యాలు ఇవి ఏవీ విజయానికి అడ్డంకులు కావు అనేది గుర్తుంచుకోవాలి.
- ఈ ఏడాది సివిల్స్ సాధించిన స్మరణ్ రాజ్ పరిస్థితి పరిశీలిస్తే తలకు సర్జరీ అయి పరీక్ష రాయలేని స్థితిలో తల్లి స్రైబ్గా పరీక్ష రాసి సివిల్స్ విజేతగా నిలిచారు. అదేవిధంగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన శరత్ నాయక్ ఇలా ఎందరో సామాన్య స్థితి నుంచి వచ్చిన వారేనన్న విషయం గుర్తుంచుకోండి.
- ప్రపంచంలో ఒకరికి ఒకటి సాధ్యమైందంటే అది తప్పక మీకు కూడా సాధ్యమేనన్నది మరవకండి. దీనికి కావాల్సిందల్లా సస్టెయినబుల్ ఎక్సలెన్సీ అంటే సుస్థిరమైన ప్రతిభ.
- పోటీని తప్పు పట్టవద్దు. లోటు పాట్లను తప్పు పట్టండి.
- నేటి యువతలో కంటిన్యూయిస్ ఫోకస్డ్ లెర్నింగ్ లోపిస్తుంది
- అనవసరమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, అవసరమైన వాటికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే విజయాలను సాధిం చలేకపోతున్నారు.
- అవసరమైన వాటిపైనే దృష్టిపెడితే మీరు ఏదైనా సాధించగలరు
- 2023లో 365 రోజులకు సంపూర్ణ వార్షిక ప్రణాళిక వేసుకుని మైక్రో ప్లాన్ తయారుచేసుకుని దాన్ని కచ్చితంగా అమలు చేయండి. అదే నీ చరిత్రను నీవే రాసుకుంటావు.
-మల్లవరపు బాలలత సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ,హైదరాబాద్
లక్ష్య సాధనకు ఏదీ అడ్డంకి కాదు
మారుమూల తండా నుంచి వచ్చి మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించిన వెటర్నరీ డాక్టర్ శరత్ నాయక్. కొత్త సంవత్సరంలో విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఇచ్చిన సూచనలు ఆయన మాటల్లో…
- మొదటగా అభ్యర్థులు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే ఎంత దూరం అయినా వెళ్లగలరు. అంటే ఎంత స్థాయినైనా చేరుకోగలరు
- రెండో విషయం తక్కువగా అంచనా వేసుకోకూడదు
- గోల్ అంటే లక్ష్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అది చిన్నదైనా పెద్దదైనా ఎఫోర్ట్ మాత్రం పూర్తి స్థాయిలో పెట్టాలి.
- నేను సివిల్స్‌కు ప్రిపేర్ అయిన సమయంలో పరీక్షకు ఏది అవసరం అనేదాన్ని గుర్తించి దానిపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాను. రోజుకు 10 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేశాను. మిగిలిన అన్ని విషయాలను పక్కన బెట్టి కేవలం గమ్యం చేరుకోవడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేశాను.
- ఎవరైనా లక్ష్యం ఏర్పర్చుకుని దానిపైనే పూర్తి దృష్టి పెడితే తప్పక విజేతలు అవుతారు.
- శరత్ నాయక్,జగిత్యాల జిల్లా,(ట్రెయినీ కలెక్టర్, త్రిపుర క్యాడర్)
విజయానికి సప్తపది
రాష్ట్రంలో నోటిఫికేషన్ల జాతర కొనసాగుతున్నది. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ ఇప్పటికే గ్రూప్-4తో పాటు ఇతర శాఖలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వగా తాజాగా గ్రూప్-2 నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ప్రిపరేషన్ సమయంలో ఒడిదొడుకులను ఎలా అధిగమించాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచనలు, సలహాలు ఆయన మాటల్లోనే..
1.లక్ష్యం: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు లక్ష్యాన్ని చూసి వెనుకంజ వేయొద్దు. అది చిన్నదైనా, పెద్దదైనా నిత్యం దానివైపే పరుగెత్తాలి. ఎంత పెద్ద కొండైనా కొన్ని అడుగులు ముందుకేస్తే అది కాస్త చిన్నదైపోతుంది. లక్ష్యాన్ని పెద్దదిగా చూడకుండా చిన్న చిన్నగా విభజించుకోవాలి.
2.సమయం: సమయం చాలా కీలకమని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించుకోవాలో నిర్ణయించుకోవాలి. ఎన్ని గంటలు చదివామన్నది కాకుండా ఎంత ఏకాగ్రతతో చదువుతున్నామన్నది ముఖ్యమని గుర్తిస్తే ఎక్కువ మార్కులు సాధించొచ్చు. పరీక్షా సమయంలో తడబాటు ఉండొద్దు. ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎంపిక చేస్తే విజయం విజయం వరిస్తుంది.
3.ప్రణాళిక: ఉద్యోగాన్వేషణలో ప్రణాళిక కీ రోల్ పోషిస్తుంది. ప్రణాళిక లేకుండా చదవడమంటే గమ్యం లేని ప్రయాణం చేయడం వంటిదే. అలా కాకుండా రోజూవారి, ప్రతి వారానికి, నెలవారీ ప్రణాళికలు వేసుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి.
4.సిలబస్: సిలబస్ విజయానికి దిక్సూచి లాంటిది. పరీక్ష ఏదైనా దానిని ఎల్లప్పుడూ పక్కనే పెట్టుకోవాలి. ఏం చదివామో, ఇంకా ఏం చదవాలో తెలిసిపోతుంది. ఇలా చేస్తే సమయాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు.
5.ఒడిదొడుకులు: ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి. వాటిని చూసి భయపడొద్దు. కుటుంబ, వ్యక్తిగత సమస్యలు ఎప్పుడూ ఉండేవే. వాటికి కాస్త విరామమివ్వాలి. గడిచిపోయిన సమయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ప్రస్తుతం మనకున్న సమయంలో సబ్జెక్టుపై ఎంత పట్టు సాధిస్తున్నామనేది పరీక్షించుకోవాలి.
6.ధైర్యం: కొంతమంది అభ్యర్థులు పోటీని చూసి భయపడుతుంటారు. ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నా మనకు కావాల్సింది ఒక ఉద్యోగమే కాబట్టి దాని వైపే ఆలోచించాలి. మనకు మనమే పోటీ అని అనుకోవాలి. ఇందుకు ధైర్యం, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. నిన్నటితో పోలిస్తే నేటికి ఎంత మెరుగయ్యామో అని ప్రతిరోజు పరీక్షించుకోవాలి.
7.లక్ష్యం చేరుకోకుంటే: సమయాన్ని వృథా చేయకుండా విశ్లేషణతో చదవడం, ప్రాక్టీస్ ప్రశ్నలకు సరైన జవాబులు ఎంపిక చేస్తూ రోజువారీగా సాధన తప్పనిసరిగా చేయాలి. అప్పుడే 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకుంటే అదే జీవితమని బాధపడొద్దు. ఇతర జీవిత మార్గాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి.
-అనుదీప్ దురిశెట్టి,జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం
మిగిలిన భాగం
2వ పేజీలో
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?