ఆగ్నేయం ఉత్తరం అయితే, ఈశాన్యం పడమరగా మారితే, పడమర ఏమవుతుంది?
- గ్రూప్ -4 స్పెషల్
దిశలు (దిక్కులు) – పరీక్ష
1. రామ్ దక్షిణ మద్రాసుకు నడుస్తున్నాడు. 3 కి.మీ. నడిచిన తర్వాత ఎడమవైపునకు తిరిగాడు. తర్వాత 2 కి.మీ. నడిచిన తర్వాత కుడి వైపునకు తిరిగాడు. అయితే అతడు ఇప్పుడు ఏ దిక్కుకు వెళ్తున్నాడు?
1) ఉత్తరం 2) దక్షిణం
3) తూర్పు 4) పశ్చిమం
2. ఒక వ్యక్తి ఉత్తరానికి 5 మైళ్లు నడిచి, తర్వాత కుడివైపునకు తిరిగి రెండున్నర మైళ్లు నడిచాడు. మళ్లీ కుడివైపునకు తిరిగి 1 1/2 మైళ్లు నడిచాడు. అయితే అతడు ఇప్పుడు ఏ దిక్కుకు నడుస్తున్నాడు?
1) తూర్పు 2) పడమర
3) ఉత్తరం 4) దక్షిణం
3. మోహన్ ఏదో ఒక దిక్కు నుంచి కదిలాడు. మొదట ఎడమవైపునకు తిరిగి, తర్వాత కుడివైపునకు మళ్లీ ఎడమవైపునకు తిరిగి తూర్పుదిశగా వెళ్లాడు. అయితే అతడు ఏ దిక్కు నుంచి నడవటం ప్రారంభించాడు?
1) తూర్పు 2) పడమర
3) ఉత్తరం 4) దక్షిణం
4. ఒక వ్యక్తి ఉత్తర దిశగా 3 మైళ్లు నడిచి, ఎడమవైపునకు తిరిగి 4 మైళ్లు నడిస్తే, మొదట తను బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉంటాడు?
1) 5 మైళ్లు 2) 4 మైళ్లు
3) 3 మైళ్లు 4) 2 మైళ్లు
5. సురేందర్ తూర్పు దిక్కుగా నడవటం మొదలు పెట్టి, కొంత దూరం తర్వాత ఎడమవైపునకు తిరిగి, మళ్లీ ఎడమవైపునకు తిరిగి, చివరగా తూర్పు వైపునకు నడిచాడు. అయితే అతడు ఇప్పుడు ఏ దిశగా వెళ్తున్నాడు?
1) తూర్పు 2) పడమర
3) ఉత్తరం 4) దక్షిణం
6. నీతు ఉదయాన్నే సూర్యునికి అభిముఖంగా నడవటం మొదలు పెట్టింది. కొంతసేపు తర్వాత ఆమె తన కుడి పక్కకు తిరిగింది. తర్వాత ఆమె ఎడమవైపునకు తిరిగి కుడివైపునకు తిరిగింది. అయితే ఆమె చివరగా తిరిగిన దిశ ఏది?
1) ఉత్తరం 2) దక్షిణం
3) తూర్పు 4) పశ్చిమం
7. వెంకట్ ఉత్తరం వైపుగా నడవటం మొదలు పెట్టి, కుడివైపునకు తిరిగి, మళ్లీ కుడివైపునకు, తర్వాత ఎడమవైపునకు తిరిగాడు. అయితే అతడు ఇప్పుడు ఏ దిక్కుగా వెళ్తున్నాడు?
1) తూర్పు 2) పశ్చిమం
3) ఉత్తరం 4) దక్షిణం
8. ఒక వ్యక్తి సాయంత్రం సూర్యునికి అభిముఖంగా ఉన్నాడు. అతను తన ప్రయాణాన్ని తనకు కుడివైపుగా మొదలు పెట్టి 10 కి.మీ. ప్రయాణించి, తనకు ఎడమ పక్కకు తిరిగాడు. అతడు 5 కి.మీ. నడిచి మళ్లీ తనకు ఎడమవైపునకు తిరిగి మళ్లీ 10 కి.మీ. ప్రయాణించాడు. అయితే అతను మొదటి నుంచి ఇంతవరకు ఎంత దూరం ప్రయాణించాడు?
1) 20 కి.మీ. 2) 15 కి.మీ.
3) 10 కి.మీ. 4) 5 కి.మీ.
9. రాము ఉత్తరం వైపుగా 3.5 కి.మీ. ప్రయాణించాడు. అతడు ఎడమవైపునకు తిరిగి 1.5 కి.మీ. ప్రయాణం చేసి, మళ్లీ ఎడమవైపునకు తిరిగి 3.5 కి.మీ. ప్రయాణించాడు. అయితే అతడు మొదట బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు?
1) 3.5 కి.మీ. 2) 1.5 కి.మీ.
3) 6 కి.మీ. 4) 3 కి.మీ.
10. ఒక ఉదయం విశాల్, ఉదయ్ ఒకరికొకరు అభిముఖంగా అడ్డరోడ్డు వద్ద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. విశాల్ నీడ ఉదయ్ ఎడమవైపునకు పడితే, ఉదయ్ ఏ దిక్కుకు అభిముఖంగా ఉన్నాడు?
1) తూర్పు 2) పశ్చిమం
3) ఉత్తరం 4) దక్షిణం
11. Z కు ఉత్తరం వైపున ఉన్న Xకు తూర్పున Y ఉంది. అయితే Zకు దక్షిణాన P ఉంటే P, Yకి ఏ దిక్కున ఉంది?
1) ఉత్తరం 2) దక్షిణం
3) ఆగ్నేయం 4) ఏదీకాదు
12. ఒకవేళ ఆగ్నేయం ఉత్తరం అయితే, ఈశాన్యం పడమరగా మారితే, పడమర ఏమవుతుంది?
1) ఈశాన్యం 2) వాయవ్యం
3) ఆగ్నేయం 4) నైరుతి
13. ఒక వ్యక్తి 5 కి.మీ. దక్షిణం వైపునకు నడిచి, అప్పుడు కుడివైపునకు తిరిగాడు. 3 కి.మీ. నడిచిన తర్వాత ఎడమవైపునకు తిరిగి 5 కి.మీ. నడిచాడు. ప్రస్తుతం అతడు తను బయలుదేరిన స్థానం నుంచి ఏ దిక్కున ఉన్నాడు?
1) పడమర 2) దక్షిణం
3) ఈశాన్యం 4) నైరుతి
14. రాహుల్ తన గడియారాన్ని సాయంత్రం 6 గంటల సమయాన్ని సూచించే విధంగా ఉంటే, గంటల ముల్లు ఉత్తర దిక్కును చూపిస్తూ ఉండే విధంగా పెట్టాడు. అయితే 9:15 నిమిషాల సమయంలో నిమిషాల ముల్లు ఏ దిక్కునకు ఉంటుంది?
1) ఆగ్నేయం 2) దక్షిణం
3) ఉత్తరం 4) పశ్చిమం
15. రసిక్ ఉత్తరం వైపునకు 20 మీ. నడిచాడు. అప్పుడు కుడివైపునకు తిరిగి 30 మీ. నడిచాడు. అప్పుడు కుడివైపునకు తిరిగి 35 మీ. నడిచాడు. మళ్లీ ఎడమవైపునకు తిరిగి 15 మీ. నడిచాడు. చివరగా ఎడమవైపునకు తిరిగి 15 మీ. నడిచాడు. అతడు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఏ దిక్కున ఉన్నాడు?
1) 15 మీ. పడమర 2) 30 మీ. తూర్పు
3) 30 మీ. పడమర 4) 45 మీ. తూర్పు
16. ప్రధాన రోడ్డుకు రెండు వ్యతిరేక స్థలాల నుంచి రెండు కార్లు బయలుదేరి 150 కి.మీ. వెళ్లాయి. మొదటి కారు 25 కి.మీ. తర్వాత కుడివైపునకు తిరిగి 15 కి.మీ. వెళ్లింది. మళ్లీ ఎడమవైపునకు తిరిగి మరో 25 కి.మీ. వెళ్లి అక్కడి నుంచి మెయిన్‌రోడ్ చేరుకొనే దిక్కువైపునకు వెళ్లింది. అదే సమయంలో రెండవ కారు కొద్దిగా పాడవడం వల్ల మెయిన్ రోడ్ నుంచి కేవలం 35 కి.మీ. మాత్రమే ప్రయాణించింది. అయితే ఆ స్థానంలో రెండు కార్ల మధ్య దూరమెంత?
1) 65 కి.మీ.
2) 75 కి.మీ.
3) 80 కి.మీ.
4) 85 కి.మీ.
17. X వద్ద మొదలు పెట్టి జయంత్ పడమర వైపు 15 కి.మీ. నడిచాడు. అతడు ఎడమ పక్కకు తిరిగి 20 మీ. నడిచాడు. మళ్లీ ఎడమవైపునకు తిరిగి 15 మీ. నడిచాడు. తర్వాత అతడు తన కుడి వైపునకు తిరిగి 12 మీ. నడిచాడు. అయితే జయంత్ ఇప్పుడు X నుంచి ఏ దిశగా, ఎంత దూరంలో ఉన్నాడు?
1) 32 మీ. దక్షిణం 2) 47 మీ. తూర్పు
3) 42 మీ. ఉత్తరం 4) 27 మీ. దక్షిణం
18. ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు రేఖ, హేమ ఒకరికొకరు అభిముఖంగా కూర్చొని మాట్లాడుతున్నారు. అయితే హేమ నీడ కచ్చితంగా హేమ కుడివైపునకు పడితే, రేఖ ఏ దిక్కుకు అభిముఖంగా ఉంది?
1) ఉత్తరం 2) దక్షిణం
3) తూర్పు
4) సరిపడ సమాచారం లేదు
19. ఒక బాలుడు తన సైకిల్‌పై ఉత్తరం వైపునకు పయనించాడు. ఎడమవైపునకు తిరిగి 1 కి.మీ. పయణించి, మళ్లీ ఎడమవైపునకు తిరిగి 2 కి.మీ. పయణించాడు. అయితే అతడు బయలుదేరిన స్థానం నుంచి 1 కి.మీ. పడమరగా వచ్చినట్లు గుర్తించాడు. అయితే అతడు మొదట ఉత్తరం వైపునకు ఎంత దూరం సైకిల్‌పై ప్రయాణించాడు?
1) 1 కి.మీ. 2) 2 కి.మీ.
3) 3 కి.మీ. 4) 5 కి.మీ.
20. K,Lకు నైరుతి దిశగా 40 మీ. దూరంలో ఉన్నాడు. అయితే M,Lకు ఆగ్నేయంగా 40 మీ. దూరంలోఉంటే, M, Kకు ఏ దిక్కుగా ఉన్నాడు?
1) తూర్పు 2) పశ్చిమం
3) ఈశాన్యం 4) దక్షిణం
21. ఒక వ్యక్తి ఉత్తరానికి 2 కి.మీ. నడిచాడు. అప్పుడు తూర్పునకు తిరిగి, 10 కి.మీ. నడిచాడు. తర్వాత అతడు ఉత్తరానికి తిరిగి 3 కి.మీ. నడిచాడు. మళ్లీ అతడు తూర్పునకు తిరిగి 2 కి.మీ. నడిచాడు. అయితే అతడు మొదట బయలుదేరిన ప్రాంతానికి ఎంత దూరంలో ఉన్నాడు?
1) 10 కి.మీ. 2) 13 కి.మీ.
3) 15 కి.మీ. 4) ఏదీకాదు
22. ఒక గది పొడవు, వెడల్పులు వరుసగా 8 మీ., 6 మీ. ఒక పిల్లి గది నాలుగు గోడల నుంచి తిరిగి చివరగా కర్ణం ఆకారంలో మూలగా ఎలుకను పట్టుకోవడానికి పరిగెత్తింది. అయితే పిల్లి ఎంత దూరం పరిగెత్తింది?
1) 10 2) 14 3) 38 4) 48
23. ఒక ఉదయం సుజాత సూర్యుని వైపునకు నడిచింది. కొంతదూరం వెళ్లిన తర్వాత ఆమె కుడివైపునకు తిరిగి మళ్లీ కుడివైపునకు తిరిగి కొంతదూరం వెళ్లి మళ్లీ కుడివైపునకు తిరిగింది. అయితే ఆమె ఇప్పుడు ఏ దిక్కుకు అభిముఖంగా ఉంది?
1) ఉత్తరం 2) దక్షిణం
3) ఈశాన్యం 4) ఆగ్నేయం
24. కొంతమంది బాలురు మూడు వరుసలుగా ఉత్తరానికి అభిముఖంగా కూర్చున్నారు. అందులో A మధ్య వరుసలో ఉన్నాడు. Aకు కుడివైపునకు P అదే వరుసలో ఉన్నాడు. Q సరిగ్గా Pకు వెనుకగా, అదేవిధంగా R, Aకు ఉత్తరంగా ఉన్నాడు. అయితే Q ఏ దిక్కున ఉన్నాడు?
1) దక్షిణం 2) నైరుతి
3) ఈశాన్యం 4) ఆగ్నేయం
25. ఒక రోజున విమల్ సూర్యోదయం తర్వాత నడవటం ప్రారంభించాడు. అదే సమయంలో అతడు తనకు వ్యతిరేక దిశలో వస్తున్న స్టీఫెన్‌ను కలిశాడు. అయితే స్టీఫెన్ నీడ తనకు కుడివైపున పడటం విమల్ గమనించాడు. అయితే విమల్ ఏ దిక్కుకు అభిముఖంగా ఉన్నాడు?
1) తూర్పు 2) పశ్చిమం
3) దక్షిణం
4) సరిపడా సమాచారం లేదు
26. గోపాల్ తన ఇంటి నుంచి ఉత్తరంవైపునకు బయలుదేరాడు. 25 మీ. దూరం నడిచాక. అతడు కుడివైపునకు తిరిగి 10 మీ. నడిచాడు. మళ్లీ అతడు కుడివైపునకు తిరిగి 15 మీ. నడిచాడు. దీని తర్వాత అతడు కుడివైపునకు 135 డిగ్రీలకు తిరిగి 30 మీ. వెళ్లాలి. అయితే అతడు ఏ దిశగా వెళ్లాలి?
1) పశ్చిమం 2) దక్షిణం
3) నైరుతి 4) ఆగ్నేయం
27. X దక్షిణానికి నేరుగా నడవడం మొదలుపెట్టాడు. 5 మీ. నడిచిన తర్వాత అతడు ఎడమవైపునకు తిరిగి 3 మీ. నడిచాడు. తర్వాత అతడు కుడివైపునకు తిరిగి 5 మీ. నడిచాడు. ఇప్పుడు X ఏ దిక్కుకు అభిముఖంగా ఉన్నాడు?
1) ఈశాన్యం 2) దక్షిణం
3) ఉత్తరం 4) నైరుతి
28. హేమంత్ యూనివర్సిటీకి వెళ్లడానికి ఇంటి దగ్గర నుంచి తూర్పు వైపు నుంచి బయలుదేరి అడ్డరోడ్డుకు వచ్చాడు. ఈ రోడ్డుకు చివర ఎడమవైపు ఒక థియేటర్, రోడ్డుకు తిన్నగా ఆసుపత్రి ఉన్నాయి. అయితే యూనివర్సిటీ ఏ దిక్కుగా ఉంది?
1) ఉత్తరం 2) దక్షిణం
3) తూర్పు 4) పశ్చిమం
29. ఒక వ్యక్తి 6 కి.మీ. నడిచిన తర్వాత కుడివైపునకు తిరిగి మళ్లీ 2 కి.మీ. నడిచాడు. తర్వాత ఎడమవైపునకు తిరిగి 10 కి.మీ. నడిచాడు. చివరగా ఉత్తరం వైపుగా వెళ్లాడు. తన ఆ ప్రయాణాన్ని ఎక్కడ మొదలుపెట్టాడు?
1) ఉత్తరం 2) దక్షిణం
3) తూర్పు 4) పశ్చిమం
30. రవి ఇంటి వద్ద నుంచి సైకిల్ మీద దక్షిణానికి 10 కి.మీ. ప్రయాణించాడు. తర్వాత కుడివైపునకు తిరిగి 5 కి.మీ. సైకిల్ తొక్కుతూ మళ్లీ కుడివైపునకు తిరిగి 10 కి.మీ. వెళ్లాడు. తర్వాత అతడు ఎడమవైపునకు తిరిగి 10 కి.మీ. సైకిల్‌పై ప్రయాణించాడు. అయితే అతడు నేరుగా తన ఇంటికి చేరడానికి ఎన్ని కి.మీ. సైకిల్‌పై ప్రయాణించాలి?
1) 10 కి.మీ. 2) 15 కి.మీ.
3) 20 కి.మీ. 4) 25 కి.మీ.
31. రీనా A నుంచి Bకి తూర్పుగా 10 అడుగులు నడిచింది. ఆమె కుడివైపునకు తిరిగి 3 అడుగులు నడిచింది. మళ్లీ ఆమె కుడివైపునకు తిరిగి 14 అడుగులు నడిచింది. అయితే ఆమె A నుంచి ఎంత దూరంలో ఉంది?
1) 4 అడుగులు 2) 5 అడుగులు
3) 24 అడుగులు 4) 27 అడుగులు
32. ఒక రోజున సూర్యోదయం తర్వాత నివేదిత, నిహారిక ఒకరికొకరు అభిముఖంగా డాల్ఫిన్ క్రాసింగ్ వద్ద మాట్లాడుకుంటున్నారు. నిహారిక నీడ నివేదితకు కుడివైపునకు పడితే, నిహారిక ఏ దిక్కునకు అభిముఖంగా ఉంది?
1) ఉత్తరం 2) దక్షిణం
3) తూర్పు
4) సరిపడ సమాచారం లేదు
33. ఒకవేళ AxB అంటే A,B కి దక్షిణంవైపునకు ఉంది అని, A+B అంటే A, Bకి ఉత్తరంవైపునకు ఉంది అని, A%B అంటే A, Bకి తూర్పునకు ఉంది అని, A-B అంటే A, B కి పశ్చిమాన ఉంది అని అనుకొంటే, అప్పుడు P%Q+R-Sలో S, Q కి ఏ దిక్కున ఉన్నట్లు?
1) నైరుతి 2) ఆగ్నేయం
3) ఈశాన్యం 4) వాయవ్యం
34. సూర్యోదయం తర్వాత, సురేష్ ఒక స్తంభానికి అభిముఖంగా నిలుచున్నాడు. ఈ స్థంభం నీడ సరిగ్గా అతని కుడివైపునకు పడింది. అతడు ఏ దిక్కుకు అభిముఖంగా ఉన్నాడు?
1) తూర్పు 2) దక్షిణం
3) పశ్చిమం
4) సరిపడా సమాచారం లేదు
35. ఒక పిల్లాడు తన తండ్రిని చూడటానికి తూర్పునకు 90 మీ. వెళ్లాడు. అతడు అప్పుడు కుడివైపునకు తిరిగి 20 మీ. వెళ్లాడు. తర్వాత కుడివైపునకు తిరిగి 30 మీ. వెళ్లి అతడి బాబాయి ఇల్ల్లు చేరుకున్నాడు. అతడి తండ్రి అక్కడ లేడు. అక్కడి నుంచి అతడు తనకు ఉత్తరంగా 100 మీ. వెళ్లి తండ్రిని కలుసుకున్నాడు. అయితే అతడు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో అతడి తండ్రిని కలుసుకున్నాడు?
1) 80 మీ. 2) 100 మీ.
3) 140 మీ. 4) 260 మీ.
36. A, B, C, D అనే నలుగురు స్నేహితులు ఒకే ప్రదేశంలో నివసిస్తున్నారు. B ఇల్లు A ఇంటికి తూర్పువైపు, C ఇంటికి ఉత్తరం వైపునకు ఉంది. C ఇల్లు D ఇంటికి పశ్చిమం వైపునకు ఉంది. A ఏ దిక్కువైపునకు D ఇల్లు ఉంది?
1) ఆగ్నేయం 2) ఈశాన్యం
3) తూర్పు
4) సరిపడా సమాచారం లేదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు